Shuru
Apke Nagar Ki App…
జి. చెన్నారం గ్రామంలో ముత్యాలమ్మ ఆలయ దారి మరమ్మత్తులపై వివాదం నల్గొండ మండలం జి.చెన్నారంలో ఈనెల 13న బోనాల పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లే దారి బురదమయంగా మారడంతో మట్టి పోసి మరమ్మతులు చేపట్టేందుకు ప్రయత్నించగా కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని సర్పంచ్ సాంబయ్య ఆరోపించారు. పండుగకు హాజరయ్యే భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అధికారులు దారి సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.
జిల్లపల్లి ఇంద్ర
జి. చెన్నారం గ్రామంలో ముత్యాలమ్మ ఆలయ దారి మరమ్మత్తులపై వివాదం నల్గొండ మండలం జి.చెన్నారంలో ఈనెల 13న బోనాల పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లే దారి బురదమయంగా మారడంతో మట్టి పోసి మరమ్మతులు చేపట్టేందుకు ప్రయత్నించగా కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని సర్పంచ్ సాంబయ్య ఆరోపించారు. పండుగకు హాజరయ్యే భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అధికారులు దారి సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.
More news from Telangana and nearby areas
- జి. చెన్నారం గ్రామంలో ముత్యాలమ్మ ఆలయ దారి మరమ్మత్తులపై వివాదం నల్గొండ మండలం జి.చెన్నారంలో ఈనెల 13న బోనాల పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లే దారి బురదమయంగా మారడంతో మట్టి పోసి మరమ్మతులు చేపట్టేందుకు ప్రయత్నించగా కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని సర్పంచ్ సాంబయ్య ఆరోపించారు. పండుగకు హాజరయ్యే భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అధికారులు దారి సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.2
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్ రూ.61,874, బ్రేక్ దర్శనాలతో రూ.1,21,800, వీఐపీ దర్శనాలతో రూ.2,60,550, కార్ పార్కింగ్ రూ.3,45,500, ప్రసాద విక్రయాలతో రూ.6,17,400, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.16,16,870 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లపై వరంగల్ సిపి శ్వేతతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ హనుమకొండ జిల్లా పరకాలలో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే సభకు పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం పరకాలలో సీఎం పర్యటన నేపథ్యంలో ప్రతిపాదిత హెలిప్యాడ్, సభా వేదిక, వాహనాల పార్కింగ్, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.ప్రతిపాదిత హెలిప్యాడ్ కోసం లలితా కన్వెన్షన్ హాల్ సమీపంలోని స్థలాన్ని, సభా వేదిక, వాహనాల పార్కింగ్ కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అంగడి స్థలాలను పరిశీలించారు. సభకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ, సీఎం పర్యటనలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హెలిప్యాడ్ నుంచి సీఎం ప్రయాణించే మార్గం, ఆసుపత్రి ప్రారంభోత్సవం, సభా వేదిక, ప్రజల రాకపోకలు, పార్కింగ్, రహదారులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ, సీఎం భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ హెలిప్యాడ్, రూట్ మ్యాప్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన భద్రతా ప్రణాళిక అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.అనంతరం సీఎం పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ ప్రణాళికపై కలెక్టర్, పోలీస్ కమిషనర్ అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ రవి, డీఆర్డీవో మేన శ్రీను, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేష్ బాబు, ఈఈ దేవిక, టీడబ్ల్యూఐడీసీ ఈఈ అరుణ్ కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య, పరకాల మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పవన్, ఏసీపీ సతీష్ బాబు, పరకాల సీఐ క్రాంతి కుమార్, కౌన్సిలర్లు శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- రత్నవరంలో బోనాల సందడి.................................... సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలోని హరిహర క్షేత్రంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు తీసుకొచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆటపాటలతో సందడి చేశారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మహిళల బోనాల సమర్పణతో ఆలయ పరిసరాలు భక్తిభావంతో కళకళలాడాయి.1
- అన్నం పెట్టిన వారిని మోసం చేయాలని చూస్తే ఇలాగే ఉంటుంది పోచారం గారు అన్నం పెట్టినవారిని మోసం చెయ్యాలని చూస్తే ఇలానే ఉంటది పోచారం గారు.. మంత్రి పదవి కోసం, డబ్బుల కోసం నేను పార్టీ మారలేదు.. అభివృద్ధికి సహకరిస్తామని సీఎం చెబితేనే పార్టీలో చేరా.! ముఖ్యమంత్రి మాటలు మంత్రులు వినడం లేదు.. సీఎం స్వయానా మంత్రులకు నిధులు మంజూరు చేయమని చెప్పిన మంత్రులు సీఎం మాటలు పట్టించుకోవడం లేదు.. కేసీఆర్ ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకుండే, కానీ తప్పలేదు. నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండా కాదు. ఆరు నెలల్లో పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కండువా కుప్పుకున్నాక సగం నిధులు మాత్రమే మంజూరు చేశారు. బిల్లులు పెండింగ్ లో ఉండటం వల్ల గుత్తేదారులు పనులు ఆపేశారు. నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేల తో సీఎం సమావేశం నిర్వహిస్తే రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించా.. నేను నీకు అమ్ముడుపోయానా ఎమ్మెల్యేగిరిని కొన్నావా అని అడిగాను. మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.. నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం, మంత్రులుభట్టి,పొంగులేటికి చెప్పిన నిధులు మంజూరు కావడం లేదు. రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు సీఎం మాటలువినడం లేదు వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెప్పిన పట్టించుకోవడం లేదు వేం నరేందర్ రెడ్డి కి 50 సార్లు ఫోన్ చేసిన ఫోన్ అటెండ్ చేయడం లేదు. కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. అన్నం పెట్టిన వాళ్లను ఎప్పుడు మర్చిపోలేను. అప్పటి రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారాల్సి వచ్చింది.1
- అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను: పోచారం శ్రీనివాస్ రెడ్డి అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను! మరోసారి రేవంత్ పై ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకుండే, కానీ తప్పలేదు కేసీఆర్ వల్లే అభివృద్ది జరిగింది అని నేనే చెప్తున్నాను అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉంది కొన్ని రాజకీయ పరిణామాల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండా కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదు నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని సీఎం చెబితేనే పార్టీలో చేరాను ఆరు నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెబితేనే జాతీయ కండువా కప్పుకున్న మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు పొంగులేటి, భట్టి సీఎం మాటలు వినడం లేదు మంత్రులు పట్టించుకోవడం లేదంట, నువ్వైనా నిధులు విడుదల చేయమని వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెబితే ఆయన కూడా పట్టించుకోలేదు వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేయడం లేదు నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం నిర్వహిస్తే రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించా నేను నీకు అమ్ముడుపోయానా నా ఎమ్మెల్యే పదవిని కొన్నావా అని అడిగాను - ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి1
- నక్సలైట్ భావజాలం బతికే ఉంటుంది.. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. నక్సలైట్ భావజాలం బతికే ఉంటుంది: ఎమ్మెల్యే కూనంనేని దేశంలో నక్సలైట్లు లేరని సంబరపడుతున్న ప్రధాని మోదీ.. నక్సలైట్ భావజాలం మాత్రం బతికే ఉంటుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర సుజాతనగర్ చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన దృక్పథం కమ్యూనిస్టులకు ఉందన్నారు. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని కోరారు.1