logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి పోటీలు నంద్యాల, ఆగస్టు 11: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP), జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి తెలిపారు. ఆగస్టు 11న బాస్కెట్‌బాల్, యోగా, ఆగస్టు 12న ఆర్చరీ, బ్యాడ్మింటన్, చెస్, బాక్సింగ్, క్యారమ్స్, ఖోఖో, ఆగస్టు 13న బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని కోరారు. క్రీడాకారుల ఎంపికలో భాగంగా KVK స్టేడియం, నంద్యాలలో ఆయా క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు తదుపరి స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. క్రీడలపై ఆసక్తి ఉన్న యువత, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సూచించారు.

4 hrs ago
user_Shaik abdul mazeed
Shaik abdul mazeed
Local News Reporter Nandyal, Andhra Pradesh•
4 hrs ago

నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి పోటీలు నంద్యాల, ఆగస్టు 11: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP), జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి తెలిపారు. ఆగస్టు 11న బాస్కెట్‌బాల్, యోగా, ఆగస్టు 12న ఆర్చరీ, బ్యాడ్మింటన్, చెస్, బాక్సింగ్, క్యారమ్స్, ఖోఖో, ఆగస్టు 13న బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని కోరారు. క్రీడాకారుల ఎంపికలో భాగంగా KVK స్టేడియం, నంద్యాలలో ఆయా క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు తదుపరి స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. క్రీడలపై ఆసక్తి ఉన్న యువత, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సూచించారు.

More news from తెలంగాణ and nearby areas
  • అలంపూర్: ప్రభుత్వ భవనం ఉన్న అద్దె భవనంలో కొనసాగింపు!! ప్రజాధనం వృధా అవుతున్నదని స్థానికుల ఆవేదన అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహం గత ఒక ఏడాది నుంచి ప్రభుత్వ భవనం ఉన్న అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ భవనం శిథిలావస్థకు చేరడంతో దానిని మరమ్మతులు చేయించకుండా అద్దె భవనంలో కొనసాగిస్తుండడంతో ప్రజాధనం వృధా అవుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భవనాన్ని మరమ్మతులు చేయించి అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు.
    1
    అలంపూర్: ప్రభుత్వ భవనం ఉన్న అద్దె భవనంలో కొనసాగింపు!! ప్రజాధనం వృధా అవుతున్నదని స్థానికుల ఆవేదన
అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహం గత ఒక ఏడాది నుంచి ప్రభుత్వ భవనం ఉన్న అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ భవనం శిథిలావస్థకు చేరడంతో దానిని మరమ్మతులు చేయించకుండా అద్దె భవనంలో కొనసాగిస్తుండడంతో ప్రజాధనం వృధా అవుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భవనాన్ని మరమ్మతులు చేయించి అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు.
    user_Zakeer
    Zakeer
    Grocer ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    14 hrs ago
  • మంత్రి లోకేష్ బాబు ఎందుకు రాజీనామా చేయాలంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మంత్రి లోకేష్ బాబు ఎందుకు రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రశ్నించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం వైసిపి పార్టీ డీఎస్సీకి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనను తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పోలవరం, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా మోసం చేశారన్నారు. ఏడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినందుకు మంత్రి రాజీనామా చేయాలా అంటూ ఎద్దేవా చేశారు
    1
    మంత్రి లోకేష్ బాబు ఎందుకు రాజీనామా చేయాలంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి 
మంత్రి లోకేష్ బాబు ఎందుకు రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రశ్నించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం వైసిపి పార్టీ డీఎస్సీకి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనను తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పోలవరం, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా మోసం చేశారన్నారు. ఏడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినందుకు మంత్రి రాజీనామా చేయాలా అంటూ ఎద్దేవా చేశారు
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • కేసీ కెనాల్ పరిధిలో ఖరీఫ్‌కు నీరు ఇస్తారా? ప్రభుత్వం స్పష్టం చేయాలి రాయలసీమ కేసీ కెనాల్ పరిధిలో ఖరీఫ్ సీజన్‌లో సాగునీటిని విడుదల చేస్తారా, లేదా వరి నాట్లకు నీరు అందిస్తారా అనే విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతు సేవా సమితి నాయకులు డిమాండ్ చేశారు.రైతుల సాగు ప్రణాళికలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుగానే నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఏ.వి. రమణ కోరారు. కేసీ కెనాల్ పరిధిలో సాగు చేస్తున్న రైతులు నీటి లభ్యతపై అనిశ్చితితో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.రైతు సేవా సమితి సభ్యులు వెంకట చంద్ర రెడ్డి మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్‌లో నీటి విడుదలపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు. నీటి విడుదలపై నిర్ణయం ఆలస్యం అయితే రైతులు పంటల ఎంపిక, వరి నాట్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.కేసీ కెనాల్ పరిధిలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఖరీఫ్ సీజన్‌కు నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సేవా సమితి నాయకులు డిమాండ్ చేశారు.
    1
    కేసీ కెనాల్ పరిధిలో ఖరీఫ్‌కు నీరు ఇస్తారా? ప్రభుత్వం స్పష్టం చేయాలి
రాయలసీమ కేసీ కెనాల్ పరిధిలో ఖరీఫ్ సీజన్‌లో సాగునీటిని విడుదల చేస్తారా, లేదా వరి నాట్లకు నీరు అందిస్తారా అనే విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతు సేవా సమితి నాయకులు డిమాండ్ చేశారు.రైతుల సాగు ప్రణాళికలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుగానే నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఏ.వి. రమణ కోరారు. కేసీ కెనాల్ పరిధిలో సాగు చేస్తున్న రైతులు నీటి లభ్యతపై అనిశ్చితితో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.రైతు సేవా సమితి సభ్యులు వెంకట చంద్ర రెడ్డి మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్‌లో నీటి విడుదలపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు. నీటి విడుదలపై నిర్ణయం ఆలస్యం అయితే రైతులు పంటల ఎంపిక, వరి నాట్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.కేసీ కెనాల్ పరిధిలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఖరీఫ్ సీజన్‌కు నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సేవా సమితి నాయకులు డిమాండ్ చేశారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • చిరంజీవిని కలసి భావోద్వేగానికి గురైన ‘పొట్టిమామ’..ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యక్షంగా కలుసుకున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ‘పొట్టిమామ’ భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి పాటలకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవి తమకు హీరో మాత్రమే కాదు.. దేవుడితో సమానమని అభిమానాన్ని చాటుకున్నారు.
    1
    చిరంజీవిని కలసి భావోద్వేగానికి గురైన ‘పొట్టిమామ’..ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు
మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యక్షంగా కలుసుకున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ‘పొట్టిమామ’ భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి పాటలకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవి తమకు హీరో మాత్రమే కాదు.. దేవుడితో సమానమని అభిమానాన్ని చాటుకున్నారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ప్రజా సమస్యలు చెప్పుకుందామంటే పీఏలు ఫోన్లు ఎత్తడం లేదు: మంత్రి జూపల్లి సమక్షంలో సర్పంచ్ ఆవేదన వనపర్తి జిల్లా ఎదుల మండలం సింగాయిపల్లి గ్రామంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేకులపల్లి తండా సర్పంచ్ ప్రభాకర్ తన గ్రామానికి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, మంత్రి పీఏలు తన ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
    1
    ప్రజా సమస్యలు చెప్పుకుందామంటే పీఏలు ఫోన్లు ఎత్తడం లేదు: మంత్రి జూపల్లి సమక్షంలో సర్పంచ్ ఆవేదన
వనపర్తి జిల్లా ఎదుల మండలం సింగాయిపల్లి గ్రామంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేకులపల్లి తండా సర్పంచ్ ప్రభాకర్ తన గ్రామానికి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, మంత్రి పీఏలు తన ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
    user_Kethapally shankar
    Kethapally shankar
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    2 hrs ago
  • కలెక్టర్ విజయ సునీత సమాధానంతో ఆందోళన విరమించిన వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ముంపు గ్రామాలలో ఈ నెలాఖరుకు ఖాళీ చేయమని మౌఖికంగా చెప్పడంతో నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంతవరకు నిరసన కొనసాగించారు. కలెక్టర్ నిర్వాసితుల యొక్క సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని న్యాయం చేస్తామని చెప్పడంతో నిరసన విరమించారు
    1
    కలెక్టర్ విజయ సునీత సమాధానంతో ఆందోళన విరమించిన వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు 
మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ముంపు గ్రామాలలో ఈ నెలాఖరుకు ఖాళీ చేయమని మౌఖికంగా చెప్పడంతో నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంతవరకు నిరసన కొనసాగించారు. కలెక్టర్ నిర్వాసితుల యొక్క సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని న్యాయం చేస్తామని చెప్పడంతో నిరసన విరమించారు
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • జడివానకు కూలిన చౌడు మిద్దె.. తృటిలో తప్పిన ప్రమాదం...... మైదుకూరు: కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని 19వ వార్డు, మామిళ్లపల్లె–కొత్తపల్లె గ్రామానికి చెందిన గోశెట్టి పెద్ద రోశయ్య కుటుంబానికి చెందిన చౌడు మిద్దె మంగళవారం తెల్లవారుజామున కూలిపోయింది.గత కొంతకాలంగా కురుస్తున్న జడివానలకు మిద్దె బలహీనపడటంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మిద్దె కూలిన సమయంలో వృద్ధ దంపతులు శ్రీరాములు, శ్రీమతి ఓబుళమ్మ ఇంట్లోనే ఉన్నప్పటికీ అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాల కారణంగా ఇలాంటి పాత ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని అధికారులు పరామర్శించి, తగిన సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
    2
    జడివానకు కూలిన చౌడు మిద్దె.. తృటిలో తప్పిన ప్రమాదం......
మైదుకూరు: కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని 19వ వార్డు, మామిళ్లపల్లె–కొత్తపల్లె గ్రామానికి చెందిన గోశెట్టి పెద్ద రోశయ్య కుటుంబానికి చెందిన చౌడు మిద్దె మంగళవారం తెల్లవారుజామున కూలిపోయింది.గత కొంతకాలంగా కురుస్తున్న జడివానలకు మిద్దె బలహీనపడటంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మిద్దె కూలిన సమయంలో వృద్ధ దంపతులు శ్రీరాములు, శ్రీమతి ఓబుళమ్మ ఇంట్లోనే ఉన్నప్పటికీ అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాల కారణంగా ఇలాంటి పాత ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని అధికారులు పరామర్శించి, తగిన సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి జూపల్లి*_ _*💥💥అభివృద్ధే లక్ష్యంగా ముందుకు*_ _*రహదారుల విస్తరణ, మ‌రమ్మ‌త్తుల‌కు నిధులు*_ _*ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి*_ కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంత‌రం కృషి చేస్తున్నానని, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో పాటు మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేస్తున్నామని *పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు* అన్నారు. నియోజకవర్గంలోని రహదారుల విస్తరణ, మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఏదుల‌ మండల ప‌రిధిలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 36 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు._ _👉నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా రహదారుల విస్తరణ, మరమ్మతుల పనులకు నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. గతంలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే అభివృద్ధిపై దృష్టి సారించలేదని, నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు._ _👉పిల్లలకు విద్యతో పాటు విలువలు, సంస్కారం నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని మంత్రి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు వారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని చెప్పారు. పిల్లల స్నేహాలు, వారి నడవడికపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు. కుటుంబంలో మంచి వాతావరణం కల్పించడం ద్వారా పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని మంత్రి కోరారు._
    3
    కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను  పంపిణీ చేసిన మంత్రి జూపల్లి*_
_*💥💥అభివృద్ధే లక్ష్యంగా ముందుకు*_
_*రహదారుల విస్తరణ, మ‌రమ్మ‌త్తుల‌కు నిధులు*_
_*ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి*_
కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంత‌రం కృషి చేస్తున్నానని, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో పాటు మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేస్తున్నామని  *పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు* అన్నారు. నియోజకవర్గంలోని రహదారుల విస్తరణ, మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఏదుల‌ మండల ప‌రిధిలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 36 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు._
_👉నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా రహదారుల విస్తరణ, మరమ్మతుల పనులకు నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. గతంలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే అభివృద్ధిపై దృష్టి సారించలేదని, నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు._
_👉పిల్లలకు విద్యతో పాటు విలువలు, సంస్కారం నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని మంత్రి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు వారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని చెప్పారు. పిల్లల స్నేహాలు, వారి నడవడికపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు. కుటుంబంలో మంచి వాతావరణం కల్పించడం ద్వారా పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని మంత్రి కోరారు._
    user_A Rajasheker
    A Rajasheker
    Lawyer పాంగల్, వనపర్తి, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.