మెదక్ : ఎల్లుపేట ప్రధానోపాధ్యాయుడి పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి... ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్ ఎల్లుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు పై వచ్చిన ఆర్థిక అవకతవకలు, విధుల పట్ల నిర్లక్ష్యానికి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌టీయూ మెదక్ జిల్లా శాఖ అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ జిల్లా విద్యాధికారి ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లుపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు కాంప్లెక్స్ అసిస్టెంట్ సెక్రటరీ సంతకం లేకుండానే కాంప్లెక్స్ నిధులను డ్రా చేసి దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపించారు. అలాగే టీడీఎస్ పేరిట కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయుల నుంచి ఒక్కొక్కరి వద్ద 200 చొప్పున వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ నెల 20 నుంచి 25 జూలై 2026 వరకు ప్రధానోపాధ్యాయుడు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, పాఠశాల ఇన్‌చార్జి బాధ్యతలను కూడా ఎవరికీ అప్పగించకుండా విధులకు దూరంగా ఉన్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం పాఠశాల పరిపాలనపై ప్రతికూల ప్రభావం చూపిందని అన్నారు. ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాల్సిన బాధ్యత కలిగిన ప్రధానోపాధ్యాయుడు ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడటం, విధుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని తెలిపారు. ఈ ఆరోపణలపై జిల్లా విద్యాశాఖ అధికారులు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ నిర్వహించి, వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి బాధ్యులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో పారదర్శకత, జవాబుదారీతనం నెలకొల్పేందుకు అధికారులు తక్షణమే స్పందించాలని ఎస్‌టీయూ నాయకులు కోరారు.

- ఆసుపత్రిలో ఆర్డీఓ ఆకస్మిక తనిఖీ.. రోగులతో నేరుగా ముచ్చట తూప్రాన్ 50 పడకల సామాజిక ఆసుపత్రిని ఆర్డీఓ బావయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై సూపరింటెండెంట్ డాక్టర్ అమర్ సింగ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వార్డులను పరిశీలించి రోగులతో నేరుగా మాట్లాడి చికిత్స, మందుల లభ్యత, వైద్య సిబ్బంది సేవలపై అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా రోగులకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి రోగితో మానవీయంగా వ్యవహరించి వారికి మనోధైర్యం కల్పించాలని వైద్యులు, సిబ్బందికి ఆర్డీఓ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు.1
- దళితులు బీసీలు గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫారెస్ట్ అధికారులపై కలెక్టర్ ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలి* ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడం ఏంటనీ, గిరిజన రైతులను పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటే భూములు వస్తాయని ప్రోత్సహించింది ఫారెస్ట్ అధికారులేనని దాన్ని ప్రశ్నించిన సిపిఎం నాయకులపై విధులకు ఆటంకం కలిగించారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బీదర్ రైతులకు సంబంధించి భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు వారి శత్రువులుగా చూడడం మానుకోవాలని అన్నారు ఈ పోటు భూముల సమస్య జిల్లా మొత్తం ప్రధానంగా ఫారెస్ట్ ఆనుకొని ఉన్న మండలాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు జిల్లా రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులకు భవనాలకు ఇచ్చిన స్థలాలను స్వాధిపరుచుకోవాలని డిమాండ్ చేశారు రాజంపేట , మాచారెడ్డి ,గాంధారి, లింగంపేట్, మండలాలలోని తండాలు గ్రామాలలో ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లను సైతం ఫారెస్ట్ అధికారులు వేయకుండా అడ్డుకున్నారని, ఇందిరమ్మ ఇండ్లను సైతం ఇవ్వకుండా అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా మారిన ఫారెస్ట్ అధికారులపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు అక్రమార్కులతో చేతులు కలిపి అడవి సంపదను కలపను అమ్ముకుంటూ ఈ వ్యాపారానికి అడ్డుగా గిరిజనులు రైతులు పొట్టకూటికోసం అడవి లో ఉండే మర్రి పండ్లు వీటికోసం తరచూ వెళుతున్న గిరిజనులు అడ్డుగా ఉన్నారని వారిపై అక్రమ కేసులు పెడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు ఇప్పటికైనా తమ తీరును మార్చు కోవాలని అన్నారు లేదా బహిరంగ చర్చకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొత్త నర్సింలు ముదాం అరుణ్ పాల్గొన్నారు1
- అన్నారం ప్రకృతి వనం వెళ్లే కాలనీ రహదారి బురద మా రోడ్డు మరమ్మతులు చేపట్టండి గుమ్మడిదల మున్సిపాలిటీ అన్నారం వార్డులోని ప్రకృతి వనం కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలు, బురదతో ప్రమాదకరంగా మారింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల క్రితం ప్రారంభించిన రోడ్డు పనులు నిలిచిపోయాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు. వెంటనే రహదారి పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.1
- సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ అమ్మవారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలని ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ వ్యవసాయం వ్యాపారం వారి వారి రంగాలలో వృద్ధిని సాధిస్తూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూన్నామని అన్నారు. ఆరెకటిక సంఘం సిరిసిల్ల వారిలోని ఐక్యతను తెలియజేసేలా వైభవంగా అమ్మవారికి బోనాలను సమర్పించడానికి అందరూ కలిసి ఊరేగింపుగా బయలుదేరి వెళ్తున్న ఈ దృశ్యం కనుల పండగ ఉందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న అరేకటిక సంఘం సిరిసిల్ల వారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని ఆ పోచమ్మ తల్లి వారి ఆశీస్సులతో సిరిసిల్ల అరెకటిక సంఘం వారు సమాజంలో ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలవాలని అమ్మవారి ఆశీస్సులు వారిపై వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో అరెకటిక సంఘం రాష్ట్ర నాయకులు గజబింకర్ చందు , సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు గజబింకర్ మహేందర్ , ఉపాధ్యక్షులు గజబింకర్ బాబు ,గజబింకర్ దశరథం , ఇతర కార్యవర్గ సభ్యులు కుల పెద్దలు ఆడపడుచులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.1
- నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ లోకి కొనసాగుతున్న వరద ప్రవాహం, క్రమేసి పెరుగుతున్న నీటి మట్టం ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుండి 74950 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091. అడుగులు,80 టీఎంసీలు ప్రస్తుతం 1068.8అడుగులు, 21.369టీఎంసీలు1
- దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రమాదాలకు గురికావడంతో అధికారులు వెంటనే స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.1
- తూప్రాన్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రెయిన్‌కోట్లు, సేఫ్టీ కిట్లను పంపిణీ తూప్రాన్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రెయిన్‌కోట్లు, సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్‌పర్సన్ బొంది రజనీ, కమిషనర్ రమేష్ కుమార్ కార్మికులకు కిట్లు అందజేశారు. వర్షాకాలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులు సురక్షితంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టినట్లు వారు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో కార్మికుల సేవలు కీలకమని, వారి సంక్షేమానికి మున్సిపాలిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1