logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తూప్రాన్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రెయిన్‌కోట్లు, సేఫ్టీ కిట్లను పంపిణీ తూప్రాన్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రెయిన్‌కోట్లు, సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్‌పర్సన్ బొంది రజనీ, కమిషనర్ రమేష్ కుమార్ కార్మికులకు కిట్లు అందజేశారు. వర్షాకాలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులు సురక్షితంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టినట్లు వారు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో కార్మికుల సేవలు కీలకమని, వారి సంక్షేమానికి మున్సిపాలిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

2 hrs ago
user_Priya
Priya
నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
2 hrs ago

తూప్రాన్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రెయిన్‌కోట్లు, సేఫ్టీ కిట్లను పంపిణీ తూప్రాన్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రెయిన్‌కోట్లు, సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్‌పర్సన్ బొంది రజనీ, కమిషనర్ రమేష్ కుమార్ కార్మికులకు కిట్లు అందజేశారు. వర్షాకాలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులు సురక్షితంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టినట్లు వారు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో కార్మికుల సేవలు కీలకమని, వారి సంక్షేమానికి మున్సిపాలిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    17 hrs ago
  • మల్కాజిగిరి పరిధిలోని ఆర్కేపురం చెరువులో నీరు నింపాలని స్థానికుల డిమాండ్ మల్కాజిగిరి పరిధిలోని ఆర్కేపురం చెరువును గత ఏడున్నర నుంచి ఎనిమిది సంవత్సరాలుగా పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఖాళీగా ఉంచారు. ఇప్పటివరకు చెరువులో కలుపు మొక్కలు తొలగించి, నీటిని నిల్వ చేసే చర్యలు చేపట్టకపోవడంతో చెరువు పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది నీటి ఎద్దడి ప్రారంభమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు చెరువును శుభ్రపరచి నీటిని నింపితే భూగర్భ జలాలు పెరిగి, బోరుబావుల్లో నీటి లభ్యత మెరుగుపడి నీటి సమస్య తగ్గుతుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
    1
    మల్కాజిగిరి పరిధిలోని ఆర్కేపురం చెరువులో నీరు నింపాలని స్థానికుల డిమాండ్

మల్కాజిగిరి పరిధిలోని ఆర్కేపురం చెరువును గత ఏడున్నర నుంచి ఎనిమిది సంవత్సరాలుగా పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఖాళీగా ఉంచారు. ఇప్పటివరకు చెరువులో కలుపు మొక్కలు తొలగించి, నీటిని నిల్వ చేసే చర్యలు చేపట్టకపోవడంతో చెరువు పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది నీటి ఎద్దడి ప్రారంభమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు చెరువును శుభ్రపరచి నీటిని నింపితే భూగర్భ జలాలు పెరిగి, బోరుబావుల్లో నీటి లభ్యత మెరుగుపడి నీటి సమస్య తగ్గుతుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    7 hrs ago
  • మానవ వనరులు,మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం: కలెక్టర్ దీపక్ తివారి. వికారాబాద్ : మానవ వనరులను, మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. శుక్రవారం ముత్యాల మండలం, హకీంపేట్ ఎడ్యుకేషన్ Mhnun కల్చర్ దీపక్ తివారి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఆకస్మికంగా పర్యటించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిష్టాత్మక చేపడుతున్న ఎడ్యుకేషన్ పనులను ప్రతిరోజు పర్యవేక్షిస్తూ పనులను వేగవతం చేయాలని ఎడ్యుకేషన్ హాఫ్ లో చేపట్టే ప్రతి పని వద్ద ఇంచార్జిగా పర్యవేక్షణ నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణం లో చేపడుతున్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలను అమర్చారని అధికారులకు సూచించారు. అనంతరం నర్సింగ్ హాస్టల్ పారామెడికల్ ఫిజియోథెరపీ కళాశాల ఇన్ ఇండియా ఇండికేటర్ స్కూల్ నర్సింగ్ వెటర్నరీ కళాశాల సంబంధించిన నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.
    1
    మానవ వనరులు,మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం: కలెక్టర్ దీపక్ తివారి.
వికారాబాద్ : మానవ వనరులను, మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. శుక్రవారం ముత్యాల మండలం, హకీంపేట్ ఎడ్యుకేషన్ Mhnun కల్చర్ దీపక్ తివారి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఆకస్మికంగా పర్యటించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిష్టాత్మక చేపడుతున్న ఎడ్యుకేషన్ పనులను ప్రతిరోజు పర్యవేక్షిస్తూ పనులను వేగవతం చేయాలని ఎడ్యుకేషన్ హాఫ్ లో చేపట్టే ప్రతి పని వద్ద ఇంచార్జిగా పర్యవేక్షణ నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణం లో చేపడుతున్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలను అమర్చారని అధికారులకు సూచించారు. అనంతరం నర్సింగ్ హాస్టల్ పారామెడికల్ ఫిజియోథెరపీ కళాశాల ఇన్ ఇండియా ఇండికేటర్ స్కూల్ నర్సింగ్ వెటర్నరీ కళాశాల సంబంధించిన నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    5 hrs ago
  • దళితులు బీసీలు గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫారెస్ట్ అధికారులపై కలెక్టర్ ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలి* ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడం ఏంటనీ, గిరిజన రైతులను పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటే భూములు వస్తాయని ప్రోత్సహించింది ఫారెస్ట్ అధికారులేనని దాన్ని ప్రశ్నించిన సిపిఎం నాయకులపై విధులకు ఆటంకం కలిగించారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బీదర్ రైతులకు సంబంధించి భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు వారి శత్రువులుగా చూడడం మానుకోవాలని అన్నారు ఈ పోటు భూముల సమస్య జిల్లా మొత్తం ప్రధానంగా ఫారెస్ట్ ఆనుకొని ఉన్న మండలాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు జిల్లా రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులకు భవనాలకు ఇచ్చిన స్థలాలను స్వాధిపరుచుకోవాలని డిమాండ్ చేశారు రాజంపేట , మాచారెడ్డి ,గాంధారి, లింగంపేట్, మండలాలలోని తండాలు గ్రామాలలో ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లను సైతం ఫారెస్ట్ అధికారులు వేయకుండా అడ్డుకున్నారని, ఇందిరమ్మ ఇండ్లను సైతం ఇవ్వకుండా అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా మారిన ఫారెస్ట్ అధికారులపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు అక్రమార్కులతో చేతులు కలిపి అడవి సంపదను కలపను అమ్ముకుంటూ ఈ వ్యాపారానికి అడ్డుగా గిరిజనులు రైతులు పొట్టకూటికోసం అడవి లో ఉండే మర్రి పండ్లు వీటికోసం తరచూ వెళుతున్న గిరిజనులు అడ్డుగా ఉన్నారని వారిపై అక్రమ కేసులు పెడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు ఇప్పటికైనా తమ తీరును మార్చు కోవాలని అన్నారు లేదా బహిరంగ చర్చకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొత్త నర్సింలు ముదాం అరుణ్ పాల్గొన్నారు
    1
    దళితులు బీసీలు గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫారెస్ట్ అధికారులపై కలెక్టర్ ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలి*
ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడం ఏంటనీ, గిరిజన రైతులను పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటే భూములు వస్తాయని ప్రోత్సహించింది ఫారెస్ట్ అధికారులేనని దాన్ని ప్రశ్నించిన సిపిఎం నాయకులపై విధులకు ఆటంకం కలిగించారనడం 
హాస్యాస్పదంగా ఉందన్నారు
జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బీదర్ రైతులకు సంబంధించి భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు వారి శత్రువులుగా చూడడం మానుకోవాలని అన్నారు ఈ పోటు భూముల సమస్య జిల్లా మొత్తం ప్రధానంగా ఫారెస్ట్ ఆనుకొని ఉన్న మండలాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు 
జిల్లా రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులకు  భవనాలకు ఇచ్చిన స్థలాలను స్వాధిపరుచుకోవాలని డిమాండ్ చేశారు
రాజంపేట , మాచారెడ్డి ,గాంధారి, లింగంపేట్, మండలాలలోని  తండాలు గ్రామాలలో  ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లను సైతం ఫారెస్ట్ అధికారులు వేయకుండా అడ్డుకున్నారని, ఇందిరమ్మ ఇండ్లను సైతం ఇవ్వకుండా అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా మారిన ఫారెస్ట్ అధికారులపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు అక్రమార్కులతో చేతులు కలిపి అడవి సంపదను కలపను అమ్ముకుంటూ ఈ వ్యాపారానికి అడ్డుగా గిరిజనులు రైతులు పొట్టకూటికోసం అడవి లో ఉండే మర్రి పండ్లు వీటికోసం తరచూ వెళుతున్న గిరిజనులు అడ్డుగా ఉన్నారని వారిపై అక్రమ కేసులు పెడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని  అన్నారు ఇప్పటికైనా తమ తీరును మార్చు కోవాలని అన్నారు లేదా బహిరంగ చర్చకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొత్త నర్సింలు ముదాం అరుణ్ పాల్గొన్నారు
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • భువనగిరి: స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల భారీ ర్యాలీ... భువనగిరిలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ టైగర్ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
    1
    భువనగిరి: స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల భారీ ర్యాలీ...
భువనగిరిలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు
రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ టైగర్ ఆర్. కృష్ణయ్య
పిలుపు మేరకు బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలు
పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    6 hrs ago
  • *అధ్వానంగా రత్నాపూర్ రోడ్డు పరిస్థితి * న్యాల్కల్ మండలం రత్నాపూర్ గ్రామ ప్రధాన రహదారి భారీ వర్షాలతో గుంతలమాయమై ప్రజలు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షపు నీరు నిల్వ ఉండడంతో విద్యార్థులు రైతులు వాహనదారులకు రాకపోకల కష్టంగా మారాయి రహదారి దుస్థితితో ప్రమాదాల ముప్పు పెరిగిందని విజయ్ కుమార్ తెలిపారు అధికారులు వెంటనే స్పoదిoచి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు
    1
    *అధ్వానంగా  రత్నాపూర్  రోడ్డు పరిస్థితి 
            *  
న్యాల్కల్ మండలం  రత్నాపూర్ గ్రామ ప్రధాన రహదారి భారీ వర్షాలతో గుంతలమాయమై ప్రజలు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షపు నీరు నిల్వ ఉండడంతో విద్యార్థులు రైతులు వాహనదారులకు రాకపోకల కష్టంగా మారాయి రహదారి దుస్థితితో ప్రమాదాల ముప్పు పెరిగిందని విజయ్ కుమార్ తెలిపారు అధికారులు వెంటనే స్పoదిoచి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు
    user_Reporter MD khaleel
    Reporter MD khaleel
    Local News Reporter జహీరాబాద్, సంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • హైవే ప్రమాదాలపై ఎస్పీ కొత్త పిలుపు.. 'గోల్డెన్ అవర్'లో స్పందిస్తే ప్రాణాలు కాపాడొచ్చు జిల్లాలో హైవేలపై జరిగే రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించేందుకు డాబాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమానులు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే తొలి గంటను 'గోల్డెన్ అవర్'గా పేర్కొంటూ, ఆ సమయంలో క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ప్రమాదాలు కనిపించిన వెంటనే పోలీసులకు, అంబులెన్స్ సేవలకు సమాచారం అందించడంతో పాటు బాధితులకు సహాయం చేయడంలో హోటల్ యాజమానులు ముందుండాలని సూచించారు. పోలీసు-ప్రజల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల మృతులను తగ్గించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు.
    1
    హైవే ప్రమాదాలపై ఎస్పీ కొత్త పిలుపు.. 'గోల్డెన్ అవర్'లో స్పందిస్తే ప్రాణాలు కాపాడొచ్చు
జిల్లాలో హైవేలపై జరిగే రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించేందుకు డాబాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమానులు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే తొలి గంటను 'గోల్డెన్ అవర్'గా పేర్కొంటూ, ఆ సమయంలో క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ప్రమాదాలు కనిపించిన వెంటనే పోలీసులకు, అంబులెన్స్ సేవలకు సమాచారం అందించడంతో పాటు బాధితులకు సహాయం చేయడంలో హోటల్ యాజమానులు ముందుండాలని సూచించారు. పోలీసు-ప్రజల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల మృతులను తగ్గించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    6 hrs ago
  • ఫీజుల బకాయి – బీజేపీ లడాయి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ విద్యార్థుల హక్కుల కోసం భారతీయ జనతా యువ మోర్చా చేపట్టిన “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ నేతృత్వంలో ఈసీఐఎల్ పరిధిలోని డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్ డివిజన్‌లో ఉన్న శ్రీ ఆదర్శ డిగ్రీ కాలేజ్, వసుంధర డిగ్రీ కాలేజీలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యాలతో పాటు విద్యార్థులతో సమావేశమై ఫీజుల బకాయిల సమస్యలు, విద్యారంగంలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అంబటి వెంకటాచలం, జీవీఎన్ రావు, తుమ్మల సంధ్యారెడ్డి, సోమేశ్ నాయుడు, ఉమా శ్రీధర్, ఏనుగు రాజిరెడ్డి, నాగపురి నవీన్, జూపల్లి అరుణ్ కుమార్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులపై ఫీజుల భారం, బకాయిల పేరుతో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు.
    1
    ఫీజుల బకాయి – బీజేపీ లడాయి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్
విద్యార్థుల హక్కుల కోసం భారతీయ జనతా యువ మోర్చా చేపట్టిన “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ నేతృత్వంలో ఈసీఐఎల్ పరిధిలోని డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్ డివిజన్‌లో ఉన్న శ్రీ ఆదర్శ డిగ్రీ కాలేజ్, వసుంధర డిగ్రీ కాలేజీలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యాలతో పాటు విద్యార్థులతో సమావేశమై ఫీజుల బకాయిల సమస్యలు, విద్యారంగంలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
కార్యక్రమంలో అంబటి వెంకటాచలం, జీవీఎన్ రావు, తుమ్మల సంధ్యారెడ్డి, సోమేశ్ నాయుడు, ఉమా శ్రీధర్, ఏనుగు రాజిరెడ్డి, నాగపురి నవీన్, జూపల్లి అరుణ్ కుమార్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులపై ఫీజుల భారం, బకాయిల పేరుతో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    10 hrs ago
  • ఎర్రపహాడ్ గ్రామంలో ఇంటి ముందున్న గుంతలో పడి రెండేళ్ల చిన్నారి మృతి* తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటి సమీపంలో తవ్విన పిల్లర్ గుంతలో పడి రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది. ఘటన వివరాలు: తల్లి పనుల నిమిత్తం బయటకు వెళ్తున్న సమయంలో, చిన్నారి ఆమెకు తెలియకుండా వెనుకనే బయటకు వచ్చింది. ఈ క్రమంలో సమీపంలోనే ఉన్న పిల్లర్ గుంతలో పడిపోయింది. కొంతసేపటికి పాప కనిపించకపోవడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు ఇంటి చుట్టుపక్కల వెతికారు. ప్రయోజనం లేకపోవడంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ను పరిశీలించారు. పాప తల్లి వెనకాలే వచ్చి గుంతలో పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపించడంతో వెంటనే గుంత నుంచి చిన్నారిని బయటకు తీశారు. కానీ, అప్పటికే పాప మృతి చెందింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పసిపాప కళ్లముందే అనంత లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.
    1
    ఎర్రపహాడ్ గ్రామంలో ఇంటి ముందున్న గుంతలో పడి రెండేళ్ల చిన్నారి మృతి*
తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటి సమీపంలో తవ్విన పిల్లర్ గుంతలో పడి రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది.
ఘటన వివరాలు:
తల్లి పనుల నిమిత్తం బయటకు వెళ్తున్న సమయంలో, చిన్నారి ఆమెకు తెలియకుండా వెనుకనే బయటకు వచ్చింది. ఈ క్రమంలో సమీపంలోనే ఉన్న పిల్లర్ గుంతలో పడిపోయింది. కొంతసేపటికి పాప కనిపించకపోవడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు ఇంటి చుట్టుపక్కల వెతికారు. ప్రయోజనం లేకపోవడంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ను పరిశీలించారు.
పాప తల్లి వెనకాలే వచ్చి గుంతలో పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపించడంతో వెంటనే గుంత నుంచి చిన్నారిని బయటకు తీశారు. కానీ, అప్పటికే పాప మృతి చెందింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పసిపాప కళ్లముందే అనంత లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.