Shuru
Apke Nagar Ki App…
హైవే ప్రమాదాలపై ఎస్పీ కొత్త పిలుపు.. 'గోల్డెన్ అవర్'లో స్పందిస్తే ప్రాణాలు కాపాడొచ్చు జిల్లాలో హైవేలపై జరిగే రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించేందుకు డాబాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమానులు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే తొలి గంటను 'గోల్డెన్ అవర్'గా పేర్కొంటూ, ఆ సమయంలో క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ప్రమాదాలు కనిపించిన వెంటనే పోలీసులకు, అంబులెన్స్ సేవలకు సమాచారం అందించడంతో పాటు బాధితులకు సహాయం చేయడంలో హోటల్ యాజమానులు ముందుండాలని సూచించారు. పోలీసు-ప్రజల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల మృతులను తగ్గించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు.
Priya
హైవే ప్రమాదాలపై ఎస్పీ కొత్త పిలుపు.. 'గోల్డెన్ అవర్'లో స్పందిస్తే ప్రాణాలు కాపాడొచ్చు జిల్లాలో హైవేలపై జరిగే రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించేందుకు డాబాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమానులు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే తొలి గంటను 'గోల్డెన్ అవర్'గా పేర్కొంటూ, ఆ సమయంలో క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ప్రమాదాలు కనిపించిన వెంటనే పోలీసులకు, అంబులెన్స్ సేవలకు సమాచారం అందించడంతో పాటు బాధితులకు సహాయం చేయడంలో హోటల్ యాజమానులు ముందుండాలని సూచించారు. పోలీసు-ప్రజల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల మృతులను తగ్గించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఆసుపత్రిలో ఆర్డీఓ ఆకస్మిక తనిఖీ.. రోగులతో నేరుగా ముచ్చట తూప్రాన్ 50 పడకల సామాజిక ఆసుపత్రిని ఆర్డీఓ బావయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై సూపరింటెండెంట్ డాక్టర్ అమర్ సింగ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వార్డులను పరిశీలించి రోగులతో నేరుగా మాట్లాడి చికిత్స, మందుల లభ్యత, వైద్య సిబ్బంది సేవలపై అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా రోగులకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి రోగితో మానవీయంగా వ్యవహరించి వారికి మనోధైర్యం కల్పించాలని వైద్యులు, సిబ్బందికి ఆర్డీఓ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు.1
- అన్నారం ప్రకృతి వనం వెళ్లే కాలనీ రహదారి బురద మా రోడ్డు మరమ్మతులు చేపట్టండి గుమ్మడిదల మున్సిపాలిటీ అన్నారం వార్డులోని ప్రకృతి వనం కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలు, బురదతో ప్రమాదకరంగా మారింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల క్రితం ప్రారంభించిన రోడ్డు పనులు నిలిచిపోయాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు. వెంటనే రహదారి పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.1
- ఏ సంపాదన లేకపోయినా ప్రజాక్షేత్రంలో అంకితభావంతో నిలిచి, ప్రజల గుండెల్లో చెరగని ప్రేమను ఆస్తిగా మలుచుకున్న పెద్ది సుదర్శన్ అన్న నిజమైన ధనవంతుడు!1
- దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రమాదాలకు గురికావడంతో అధికారులు వెంటనే స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.1
- ఫీజు బకాయిలపై బీజేపీ సమరభేరి సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: తాడూరి శ్రీనివాస్1
- సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుండి నర్సంపేట కు బయలుదేరిన పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుండి నర్సంపేటకు బయలుదేరిన పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థీవదేహం హన్మకొండ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం నర్సంపేటకు తరలింపు మధ్యాహ్నం 3 గంటలకు స్వగ్రామంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు1
- మీర్‌పేట్‌లో విషాదం.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన* *భర్త వేధింపులతో నవవధువు ఆత్మహత్య..?* *మీర్‌పేట్‌లో విషాదం.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన* రంగా రెడ్డి జిల్లా: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కూకట్పల్లి కి చెందిన హేమ (27) అల్మాస్గూడ కు చెందిన రాజ్ కుమార్ తో ఏడాది క్రితం వివాహం జరిగింది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, వివాహానికి ముందే రాజ్‌కుమార్‌కు మరో యువతితో ప్రేమ వ్యవహారం ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని తమకు తెలియకుండా దాచిపెట్టి హేమతో వివాహం చేసుకున్నారని ఆరోపించారు. పెళ్లి తర్వాత ఆ విషయం బయటపడటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపారు. మరో మహిళతో ప్రేమలో ఉంటూనే అదనపు కట్నం కోసం తమ కుమార్తెను వేధించేవాడని కూడా కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త వేధింపులు భరించలేక హేమ కొంతకాలం పుట్టింట్లోనే ఉండేదని, పెద్దల సర్దిచెప్పడంతో కొద్ది రోజుల క్రితమే తిరిగి భర్త ఇంటికి వెళ్లిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈరోజు హేమ తన భర్త ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరివేసుకుని మృతి చెందింది. తమ కుమార్తె మరణానికి భర్త వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. హేమ మృతి చెందిన విషయం తెలిసి అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు, ఘటన అనంతరం ఇంట్లో ఉన్న భర్త, అత్త, మామతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లబోమంటూ కుటుంబ సభ్యులు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.1
- తూప్రాన్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రెయిన్‌కోట్లు, సేఫ్టీ కిట్లను పంపిణీ తూప్రాన్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రెయిన్‌కోట్లు, సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్‌పర్సన్ బొంది రజనీ, కమిషనర్ రమేష్ కుమార్ కార్మికులకు కిట్లు అందజేశారు. వర్షాకాలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులు సురక్షితంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టినట్లు వారు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో కార్మికుల సేవలు కీలకమని, వారి సంక్షేమానికి మున్సిపాలిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1