28 న మాదిగల ఆత్మీయ సభను విజయవంతం చేయండి : ఇంజ మహేష్ మాదిగ 28 న మాదిగల ఆత్మీయ సభ ను విజయవంతం చేయండి : ఇంజ మహేష్ మాదిగ యాదాద్రి భువనగిరి జిల్లా, రాజపేట మండలం కేంద్రంలో.. ఇంజ మహేష్ మాదిగ అధ్యక్షతన జరిగినది. మహేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో, రాజపేట మండలంలో గెలుపొందిన, మాదిగ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సన్మాన కార్యక్రమం, ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం, ఆత్మ కమిటీ డైరెక్టర్గా ఎన్నికైన, బడే ఉపేంద్ర, ఎమ్మార్పీఎస్ చల్లూరు గ్రామ శాఖ అధ్యక్షులు స్వామి మాదిగను ఘనంగా సన్మానించారు.28 న జరిగే మాదిగ ఆత్మీయ సభకుఅన్ని పార్టీల్లో ఉండే మాదిగలు హాజరై, విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో, ఎమ్మార్పీఎస్ నాయకులు, రాంగోళ్ల కృష్ణ మాదిగ, దుబ్బాసి శ్రీనివాస్ మాదిగ, సర్పంచుల ఫోరం మండల ఉపాధ్యక్షులు నడిమింటి నరేష్ మాదిగ, ఉప సర్పంచ్లు, శ్రీకాంత్, కర్ణాకర్. కళ్యాణి రాజు, నాయకులు.. చొల్లేటి స్వామి మాదిగ, పట్నం గణేష్ మాదిగ, ఇంజ స్టీవెన్ మాదిగ, అంబేద్కర్ మాదిగ, భూపాల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
28 న మాదిగల ఆత్మీయ సభను విజయవంతం చేయండి : ఇంజ మహేష్ మాదిగ 28 న మాదిగల ఆత్మీయ సభ ను విజయవంతం చేయండి : ఇంజ మహేష్ మాదిగ యాదాద్రి భువనగిరి జిల్లా, రాజపేట మండలం కేంద్రంలో.. ఇంజ మహేష్ మాదిగ అధ్యక్షతన జరిగినది. మహేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో, రాజపేట మండలంలో గెలుపొందిన, మాదిగ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సన్మాన కార్యక్రమం, ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం, ఆత్మ కమిటీ డైరెక్టర్గా ఎన్నికైన, బడే ఉపేంద్ర, ఎమ్మార్పీఎస్ చల్లూరు గ్రామ శాఖ అధ్యక్షులు స్వామి మాదిగను ఘనంగా సన్మానించారు.28 న జరిగే మాదిగ ఆత్మీయ సభకుఅన్ని పార్టీల్లో ఉండే మాదిగలు హాజరై, విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో, ఎమ్మార్పీఎస్ నాయకులు, రాంగోళ్ల కృష్ణ మాదిగ, దుబ్బాసి శ్రీనివాస్ మాదిగ, సర్పంచుల ఫోరం మండల ఉపాధ్యక్షులు నడిమింటి నరేష్ మాదిగ, ఉప సర్పంచ్లు, శ్రీకాంత్, కర్ణాకర్. కళ్యాణి రాజు, నాయకులు.. చొల్లేటి స్వామి మాదిగ, పట్నం గణేష్ మాదిగ, ఇంజ స్టీవెన్ మాదిగ, అంబేద్కర్ మాదిగ, భూపాల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
- తెలంగాణ చరిత్ర దాచేస్తే దాగేది కాదు. త్యాగాలతో కూడుకున్న తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలన్నది మన లక్ష్యం. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర దాచేస్తే దాగేది కాదు. త్యాగాలతో కూడుకున్న తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలన్నది మన లక్ష్యం. త్యాగం చేసిన వారి గొప్పతనం ప్రతి విద్యార్థి, యువకుని గుండెల్లో ఉండాలి. అందుకే ఆ త్యాగాల చరిత్ర ఎగ్జిబిషన్ ని ఈరోజు పెరేడ్ గ్రౌండ్లో దత్తాత్రేయ చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నామని తెలిపారు. దేశమంతా మూడు రంగుల మువ్వన్నెల జెండాను ఆగస్టు 15 సెప్టెంబర్ 1947 న ఎగరవేస్తే.. తెలంగాణలో మాత్రం ఆ జెండా కోసం అనేకమంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత 17 సెప్టెంబర్ 1948 రోజున ఎగురవేసుకున్నాము. - ఈరోజు మనము అనుభవిస్తున్న స్వేచ్ఛ ఊరికే వచ్చింది కాదు. - అది కేవలం జెండా మాత్రమే కాదు, లక్షలాదిమంది భరతమాత ముద్దుబిడ్డలు ప్రాణ త్యాగాలు, కోట్లాదిమంది ప్రజల కష్టం. భరతమాత దాస్యశృంఖలాలు తెంచడానికి ఎంతోమంది నేలకొరిగారు. - భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో కులానికి మతానికి ప్రాంతానికి సంబంధం లేకుండా కొట్లాడారు. - - నిజాం అరాచకాలపై దాశరథి గారి లాంటి వారు పాట రాసినా..యాదిగిరి లాంటివారు పాడినా.. పత్రికలో రాసినా జైల్లో పెట్టారు, హత్య చేసినట్టు చరిత్ర చెబుతుంది.1
- బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్ / హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ శాసనమండలి చైర్మన్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు అంశాలపై మేధావులు, నాయకులు చర్చించారు.1
- నాగసాన్‌పల్లి వద్ద తెగిపడిన 11 కేవీ వైరు తెగిపడటంతో అప్రమత్తమైన విద్యుత్ సిబ్బంది కౌడిపల్లి మండలం నాగసాన్‌పల్లి సమీపంలోని వరి పొలాల్లో 11 కేవీ విద్యుత్ వైరు ప్రమాదవశాత్తు తెగిపడింది. దీంతో పొలాల్లో పనిచేస్తున్న రైతులు, సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, తెగిన వైర్‌కు మరమ్మతులు చేపట్టారు. సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం, ప్రమాదం చోటుచేసుకోకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మరమ్మతులు పూర్తయిన అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అధికారుల సత్వర స్పందనపై రైతులు, స్థానిక గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.1
- బీఆర్ఎస్ భూములపై బీజేపీ దండయాత్ర...ఆ భూముల్లో కాషాయ జెండాలు ఎగరేసి పేదలకు పంచి పెడతాం-కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ ఆధ్వర్యంలో దండ యాత్ర చేస్తామని కరీంనగర్ లో ప్రకటించారు. ఆ భూముల్లో కాషాయ జెండా ఎగరేసి పేదలకు పంచి పెడతామని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని సీఎం ప్రస్తావించడం వెనుక పెద్ద మతలబు ఉందన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని ప్రస్తావించి ఆ పార్టీతో బేరసారాలకు సిద్ధమయ్యారని చెప్పారు. అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తోందని, బీఆర్ఎస్ కు సంబంధించి 8గురు ఎమ్మెల్యేల భూభాగోతం గురించి మాట్లాడటానికి గంట సమయం పట్టిందని మరి 90 మంది ఎమ్మెల్యేల భూభాగోతం గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలని ప్రశ్నించారు. తెలంగాణలో 60 శాతం మంది ప్రజలకు భూముల్లేవని, 25 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడాని గజం జాగా కూడా లేదు...కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వేల ఎకరాల భూములను దోచుకున్నారని ఆరోపించారు. పాదయాత్రలో బీఆర్ఎస్ భూదోపిడీ గురించి మాట్లాడితే కేసీఆర్ నా తలను 6 ముక్కలు చేస్తా అన్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని చెప్పడానికి వెయ్యి రోజులు పట్టిందా..? సీఎంకు బీఆర్ఎస్ నేతలతో డీల్ కుదరలేదా? అని ప్రశ్నించారు. ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకు అసెంబ్లీ వేదికగా వివరాలు బయటపెట్టి డీల్ కోసం బీఆర్ఎస్ నేతలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు.1
- రేవంత్ రెడ్డి కుటుంబానికి 38 భూమి ఉంది: హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- మడికొండలో కొండచిలువ కలకలం.. అధికారుల స్పందన కోరుతున్న ప్రజలు హన్మకొండ జిల్లా, కాజీపేట మండలం మడికొండ హైవేపై డీసీసీ బ్యాంక్ పక్కన వేకువజామున భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. రద్దీ ప్రాంతంలో పాము రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యార. తక్షణమే అటవీశాఖ అధికారులు స్పందించి కొండచిలువను సురక్షిత ప్రాంతానికి తరలించాలని, అలాగే ఇలాంటి ఘటనలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.1
- ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా ఉంది నా పరిస్థితి *భూములు నిషేధిత జాబితాలో తీస్తే డబ్బులు తీసుకున్నాడు అంటారు* ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా ఉంది నా పరిస్థితి *భూములు నిషేధిత జాబితాలో తీస్తే డబ్బులు తీసుకున్నాడు అంటారు* తీయకపోతే అమాయకుల భూమి నిషేధిత జాబితాలో పెట్టారు అంటారు మరి నేను ఏం చేయాలి బాయిలో దూకాలా? – రేవంత్ రెడ్డి1
- మెట్ పల్లిలో కవిత పర్యటనలో జేబుదొంగల చేతివాటం.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో బుధవారం కల్వకుంట్ల కవిత పర్యటన సందర్భంగా జేబుదొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పార్టీ కార్యకర్తల రద్దీలో మమేకమైన దుండగులు ఒకరి జేబులో నుంచి రూ.17 వేలు, మరో ఇద్దరి నుంచి రూ.2 వేల చొప్పున నగదు అపహరించారు. అనుమానితుడిని పట్టుకుని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మహారాష్ట్ర అప్పగించారు. అనుమానితున్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.1
- నర్సాపూర్ పట్టణంలో హమరా ప్రసాద్‌పై మాల మహానాడు యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన నర్సాపూర్ పట్టణంలో హమరా ప్రసాద్‌పై మాల మహానాడు యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్‌పై కల్పిత వ్యాఖ్యలతో పుస్తకం రాశారంటూ ఆ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు దాడిగా నరేశ్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కుమార్ ఆరోపించారు. ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అంబేడ్కర్ ఆశయాలను, దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, రచనలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని అన్నారు. ఇలాంటి చర్యలు సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలోని ప్రధాన కూడలిలో ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, యువజన కార్యకర్తలు, స్థానిక దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.1