logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జనగామలో రోడ్డు ప్రమాదం – కానిస్టేబుల్, హోమ్ గార్డ్‌కు గాయాలు జనగామ జిల్లా: జనగామ మండలం ఓబుల్ కేశవపూర్ క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ లక్ష్మణ్, హోమ్ గార్డ్ శ్రీనివాస్ గాయపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ద్విచక్ర వాహనాన్ని ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

2 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
2 hrs ago

జనగామలో రోడ్డు ప్రమాదం – కానిస్టేబుల్, హోమ్ గార్డ్‌కు గాయాలు జనగామ జిల్లా: జనగామ మండలం ఓబుల్ కేశవపూర్ క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ లక్ష్మణ్, హోమ్ గార్డ్ శ్రీనివాస్ గాయపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ద్విచక్ర వాహనాన్ని ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • జనగామ జిల్లా: జిల్లాలో దళిత మహిళలను ఇబ్బంది పెడుతున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా గతంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఇద్దరు దళిత మహిళలకు ఉపాధి కల్పించగా, ప్రస్తుత కలెక్టర్ వారి జీవనాధారమైన టిక్కెట్లను తొలగించే ప్రయత్నం చేయడం సరైనది కాదని పేర్కొన్నారు. పెద్దగా చదువు లేని మహిళల వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకోవడం అనైతికమని అన్నారు. అన్ని అనుమతులతో చిన్న టిక్కెట్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్న వారిని ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు సూచించారు. ఈ విషయమై కలెక్టర్‌కు వ్యక్తిగతంగా లేఖ రాస్తానని, హైకోర్టు ఉత్తర్వులను గౌరవించాలని ఆయన తెలిపారు.
    1
    జనగామ జిల్లా: జిల్లాలో దళిత మహిళలను ఇబ్బంది పెడుతున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా గతంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఇద్దరు దళిత మహిళలకు ఉపాధి కల్పించగా, ప్రస్తుత కలెక్టర్ వారి జీవనాధారమైన టిక్కెట్లను తొలగించే ప్రయత్నం చేయడం సరైనది కాదని పేర్కొన్నారు.
పెద్దగా చదువు లేని మహిళల వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకోవడం అనైతికమని అన్నారు. అన్ని అనుమతులతో చిన్న టిక్కెట్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్న వారిని ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు సూచించారు. ఈ విషయమై కలెక్టర్‌కు వ్యక్తిగతంగా లేఖ రాస్తానని, హైకోర్టు ఉత్తర్వులను గౌరవించాలని ఆయన తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • #JaiDeshParty * #JaiDeshParty4Audit To Bring People Voice on #Telangana Govt Schemes Through Note
    1
    #JaiDeshParty * #JaiDeshParty4Audit  To Bring  People Voice on #Telangana Govt Schemes Through Note
    user_JaiDesh Party
    JaiDesh Party
    Khazipet, Hanumakonda•
    5 hrs ago
  • దళితులకు రూ.12 లక్షలు ఇవ్వాలి దళితులకు అంబేడ్కర్ అభయహస్తం రూ.12 లక్షలు ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్పీఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ అధ్యక్షతన హనుమకొండ ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ దళితు లకు అంబేడ్కర్ అభయహస్తం పథకం ద్వారా రూ.12 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోం దని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అభివాదం చేస్తున్న నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా వరంగల్ ముందుంటుందని చెప్పారు. మైస ఉపేందర్ మాదిగ, వెజ్ బోర్డ్ మాజీ చైర్మన్ జన్ను జకార్య, వీరేందర్, సుంకె ప్రభాకర్, చెన్నం గోపి, విష్ణు, రాంకుమార్ పాల్గొన్నారు.
    4
    దళితులకు రూ.12 లక్షలు ఇవ్వాలి
దళితులకు అంబేడ్కర్ అభయహస్తం
రూ.12 లక్షలు ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్పీఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ అధ్యక్షతన హనుమకొండ ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ దళితు లకు అంబేడ్కర్ అభయహస్తం పథకం ద్వారా రూ.12 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోం దని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి
అభివాదం చేస్తున్న నాయకులు
మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా వరంగల్ ముందుంటుందని చెప్పారు. మైస ఉపేందర్ మాదిగ, వెజ్ బోర్డ్ మాజీ చైర్మన్ జన్ను జకార్య, వీరేందర్, సుంకె ప్రభాకర్, చెన్నం గోపి, విష్ణు, రాంకుమార్ పాల్గొన్నారు.
    user_Public Reporter Gaddam Kiran
    Public Reporter Gaddam Kiran
    జర్నలిస్ట్ Khazipet, Hanumakonda•
    11 hrs ago
  • చిన్నారులపై నిత్యం ఎక్కడో ఒకచోట వీధి కుక్కల దాడులు జరగుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ 35వ డివిజన్లోని నాలుగు జెండాల ప్రాంతంలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఒంటరిగా వెళ్తున్న బాలికపై వీధి కుక్కలు ఒక్కసారిగా అటాక్ చేశాయి. బాలిక అరుపులు విని స్థానికులు రావడంతో అక్కడి నుంచి పారిపోయాయి. బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి
    1
    చిన్నారులపై నిత్యం ఎక్కడో ఒకచోట వీధి కుక్కల దాడులు జరగుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ 35వ డివిజన్లోని నాలుగు జెండాల ప్రాంతంలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఒంటరిగా వెళ్తున్న బాలికపై వీధి కుక్కలు ఒక్కసారిగా అటాక్ చేశాయి. బాలిక అరుపులు విని స్థానికులు రావడంతో అక్కడి నుంచి పారిపోయాయి. బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • జనగామలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆయన “జీరో వ్యాల్యూ డొల్ల బడ్జెట్”గా అభివర్ణిస్తూ, ప్రజలను మోసం చేసే ప్రయత్నమని ఆరోపించారు. ఈ బడ్జెట్‌లో ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు వాటిని విస్మరించారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పుతున్నారని విమర్శించారు. రైతులకు దొడ్డు వడ్లపై రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు సన్న వడ్ల పేరుతో మాట మార్చారని అన్నారు. రైతుబంధు, కళ్యాణలక్ష్మి, తులం బంగారం, మెగా డీఎస్సీ వంటి హామీలన్నీ అమలు చేయకుండా ప్రభుత్వం వెనక్కి తగ్గిందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లను నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
    1
    జనగామలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆయన “జీరో వ్యాల్యూ డొల్ల బడ్జెట్”గా అభివర్ణిస్తూ, ప్రజలను మోసం చేసే ప్రయత్నమని ఆరోపించారు. ఈ బడ్జెట్‌లో ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు వాటిని విస్మరించారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పుతున్నారని విమర్శించారు. రైతులకు దొడ్డు వడ్లపై రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు సన్న వడ్ల పేరుతో మాట మార్చారని అన్నారు.
రైతుబంధు, కళ్యాణలక్ష్మి, తులం బంగారం, మెగా డీఎస్సీ వంటి హామీలన్నీ అమలు చేయకుండా ప్రభుత్వం వెనక్కి తగ్గిందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లను నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • రేవంత్ రెడ్డి..ముందు FTLలో ఉన్న మీ అన్న ఇల్లు కూలగొట్టు మా ఇంటికి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది రేవంత్ రెడ్డి అమెరికా పోయి కూడా చదువుకుని వస్తున్నాడు కదా ఏం నేర్చుకున్నాడో ఏమో మరి నువ్వు రాహుల్ గాంధీ విగ్రహమే కట్టుకో, సోనియా గాంధీ విగ్రహమే కట్టుకో.. హైదరాబాద్ మొత్తం చాలా ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి మా ఇంటి దగ్గరనే కట్టాలా విగ్రహం? ఎక్కడ జాగా దొరకలేదా? ఖాళీగా ఉన్న స్థలంలో నువ్వు సముద్రమే కట్టుకో, పబ్బులే కట్టుకో, నైట్ లైఫ్ పెట్టుకుని కూరగాయలే అమ్ముకో మాకేం బాధ లేదు ప్రతిపక్షం బలంగా ఉందని వారి సహాయం కోసం వెళ్తే, రాజకీయ కుట్ర అని మమ్మల్ని బద్నాం చేస్తారా? –మూసీ బాధితురాలు
    1
    రేవంత్ రెడ్డి..ముందు FTLలో ఉన్న మీ అన్న ఇల్లు కూలగొట్టు 
మా ఇంటికి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది
రేవంత్ రెడ్డి అమెరికా పోయి కూడా చదువుకుని వస్తున్నాడు కదా ఏం నేర్చుకున్నాడో ఏమో మరి
నువ్వు రాహుల్ గాంధీ విగ్రహమే కట్టుకో, సోనియా గాంధీ విగ్రహమే కట్టుకో.. హైదరాబాద్ మొత్తం చాలా ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి
మా ఇంటి దగ్గరనే కట్టాలా విగ్రహం? ఎక్కడ జాగా దొరకలేదా? 
ఖాళీగా ఉన్న స్థలంలో నువ్వు సముద్రమే కట్టుకో, పబ్బులే కట్టుకో, నైట్ లైఫ్ పెట్టుకుని కూరగాయలే అమ్ముకో మాకేం బాధ లేదు
ప్రతిపక్షం బలంగా ఉందని వారి సహాయం కోసం వెళ్తే, రాజకీయ కుట్ర అని మమ్మల్ని బద్నాం చేస్తారా? –మూసీ బాధితురాలు
    user_Tagore Thakur
    Tagore Thakur
    ఆలేరు, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    26 min ago
  • కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో పార్టీని వీడేందుకు సిద్ధమైన మాజీమంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పెద్దలు నిమగ్నమయ్యారు. మంత్రులు శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డితో భేటీ అయి కాంగ్రెస్ ను వీడొద్దని కోరారు. జగిత్యాల లో ఉన్న జీవన్ రెడ్డి ఇంటికి రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి చేరుకుని గంట పాటు జీవన్ రెడ్డి తో చర్చించారు. ఈనెల 25న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు జీవన్ రెడ్డితో భేటీ అయి చర్చించడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు గంట పాటు జీవన్ రెడ్డితో చర్చించారు. ఈ నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి కావాలంటే తాను ఓడిపోవాలని, పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిండు అంటే రాజీవ్ గాంధీ లేకపోతేనే కదా అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.‌ నర్మగర్భంగా తన ఆవేదనను చెప్పిన జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.‌ మంత్రులు శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఏ విధమైన నిర్ణయం తీసుకోవద్దని జీవన్ రెడ్డి ని కోరామని తెలిపారు. జీవన్ రెడ్డికి పార్టీ అండగా నిలబడే ఆలోచన చేస్తుందని, ఆయనతో చర్చించిన అంశాలను పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ ప్రాంతానికి జీవన్ రెడ్డి ఒక పెద్ద దిక్కులా ఉన్నారని, జీవన్ రెడ్డి గురించి తెలంగాణలో తెలియని వారు ఎవరు ఉండరని అలాంటి వ్యక్తిని పార్టీ వదులుకోదని తెలిపారు. అభివృద్ధి కోసమే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుక గా ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి అని, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు జీవన్ రెడ్డి తో గతం లో మాట్లాడారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల ను జీవన్ రెడ్డి తమ దృష్టికి తీసుకవచ్చారని, ఆయన చెప్పిన విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
    4
    కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో పార్టీని వీడేందుకు సిద్ధమైన మాజీమంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పెద్దలు నిమగ్నమయ్యారు. మంత్రులు శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డితో భేటీ అయి కాంగ్రెస్ ను వీడొద్దని కోరారు. జగిత్యాల లో ఉన్న జీవన్ రెడ్డి ఇంటికి రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి చేరుకుని గంట పాటు జీవన్ రెడ్డి తో చర్చించారు. ఈనెల 25న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు జీవన్ రెడ్డితో భేటీ అయి చర్చించడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు గంట పాటు జీవన్ రెడ్డితో చర్చించారు. ఈ నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి కావాలంటే తాను ఓడిపోవాలని, పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిండు అంటే రాజీవ్ గాంధీ లేకపోతేనే కదా అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.‌ నర్మగర్భంగా తన ఆవేదనను చెప్పిన జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.‌ మంత్రులు శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఏ విధమైన నిర్ణయం తీసుకోవద్దని జీవన్ రెడ్డి ని కోరామని తెలిపారు. జీవన్ రెడ్డికి పార్టీ అండగా నిలబడే ఆలోచన చేస్తుందని, ఆయనతో చర్చించిన అంశాలను పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ ప్రాంతానికి జీవన్ రెడ్డి ఒక పెద్ద దిక్కులా ఉన్నారని, జీవన్ రెడ్డి గురించి తెలంగాణలో తెలియని వారు ఎవరు ఉండరని అలాంటి వ్యక్తిని పార్టీ వదులుకోదని తెలిపారు. అభివృద్ధి కోసమే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుక గా ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి అని, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు జీవన్ రెడ్డి తో గతం లో మాట్లాడారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల ను జీవన్ రెడ్డి తమ దృష్టికి తీసుకవచ్చారని, ఆయన చెప్పిన విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • జనగామ జిల్లా: జనగామ మండలం ఓబుల్ కేశవపూర్ క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ లక్ష్మణ్, హోమ్ గార్డ్ శ్రీనివాస్ గాయపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ద్విచక్ర వాహనాన్ని ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
    1
    జనగామ జిల్లా: జనగామ మండలం ఓబుల్ కేశవపూర్ క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ లక్ష్మణ్, హోమ్ గార్డ్ శ్రీనివాస్ గాయపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ద్విచక్ర వాహనాన్ని ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.