Shuru
Apke Nagar Ki App…
వరంగల్: చిన్నారిపై వీధి కుక్కల దాడి..సీసీ కెమెరాలో రికార్డు చిన్నారులపై నిత్యం ఎక్కడో ఒకచోట వీధి కుక్కల దాడులు జరగుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ 35వ డివిజన్లోని నాలుగు జెండాల ప్రాంతంలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఒంటరిగా వెళ్తున్న బాలికపై వీధి కుక్కలు ఒక్కసారిగా అటాక్ చేశాయి. బాలిక అరుపులు విని స్థానికులు రావడంతో అక్కడి నుంచి పారిపోయాయి. బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి
Chetty:Ramesh
వరంగల్: చిన్నారిపై వీధి కుక్కల దాడి..సీసీ కెమెరాలో రికార్డు చిన్నారులపై నిత్యం ఎక్కడో ఒకచోట వీధి కుక్కల దాడులు జరగుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ 35వ డివిజన్లోని నాలుగు జెండాల ప్రాంతంలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఒంటరిగా వెళ్తున్న బాలికపై వీధి కుక్కలు ఒక్కసారిగా అటాక్ చేశాయి. బాలిక అరుపులు విని స్థానికులు రావడంతో అక్కడి నుంచి పారిపోయాయి. బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి
More news from తెలంగాణ and nearby areas
- జనగామ జిల్లా: జనగామ మండలం ఓబుల్ కేశవపూర్ క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ లక్ష్మణ్, హోమ్ గార్డ్ శ్రీనివాస్ గాయపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ద్విచక్ర వాహనాన్ని ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.1
- రాష్ట్రంలో మెడిసిన్స్ కొనుగోలు సామాన్య ప్రజలకు భారంగా మారిన నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ లోని ముకరంపుర డాక్టర్ స్ట్రీట్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘‘ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రం’’ను ప్రారంభించారు. పేద ప్రజలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో నరేంద్రమోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. దీంతోపాటు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మెడిసిన్స్ కొనుగోలు చేయాలంటే అత్యంత ఖరీదైన వ్యవహారమైందన్నారు. మెడిసిన్ కొనుగోలు చేసే స్థోమత లేక ఎంతో మంది పేదలు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాధలు, ఆర్ధిక కష్టాలు తెలుసు కాబట్టే నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘‘ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు’’ తెరిచి చౌక ధరకే మెడిసిన్స్ అందిస్తున్నారని తెలిపారు. ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలు అంటే ప్రభుత్వం తక్కువ ధరలకు నాణ్యమైన జనరిక్ మందులు అందించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక మెడికల్ స్టోర్లు అని, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనే పథకం కింద నిర్వహించబడుతున్నాయని తెలిపారు. బ్రాండెడ్ మందులపై ఖర్చు తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చౌక ధరలకే మందుల అందుబాటులో ఉంచడం, ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తేవడంతోపాటు ప్రజలను జనరిక్ మెడిసిన్ వాడకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ఈ జన ఔషధీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కరీంనగర్ ప్రజలంతా పీఎం జన ఔషధి కేంద్రాల్లో దొరికే చౌక మందులను వినియోగించుకోవాలని కోరారు.1
- కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు ఈ వీడియోను సమయము అనుకూలంత చేసుకుని తప్పక విని బంధుత్వాలను ఎలా బలపరుచుకోవాలో తెలుసుకుంటారని కోరుకుంటున్నాను ఇట్లు మీ రేషన్ డీలర్ జాటోత్ రమేష్ నాయక్ రాథోడ్ (అల్ ఇండియా రేషన్ డీలర్ సోషల్ మీడియా)1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు చేరి సామూహిక ప్రార్థనలు (నమాజ్) నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కొత్త దుస్తులు ధరించి అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది.1
- Post by Ramprasad islavath1
- సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం చేసే ప్రతి అభివృద్ధి పని, గత ప్రభుత్వం హయంలో నిర్మించినవే అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం సిద్దిపేట పర్యటన సందర్భంగా బహిరంగ లేఖను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విడుదల చేశారు. రేవంత్ రెడ్డి సిద్దిపేట కు చేసిన ద్రోహాన్ని లేఖ లో వివరించినట్లు పేర్కొన్నారు. కనపడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డి నేటికి కూడా రుణమాఫీ పూర్తి చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దిపేట లో రూ.1070 కోట్ల పనులను అర్థాంతరంగా నిలిపి వేశారని, వాటిని వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఏ మొహం పెట్టుకొని రేవంత్ రెడ్డి సిద్దిపేట కి వస్తున్నావు, ఇక్కడ అభివృద్ధి పనులు ఆపినందుకు వస్తున్నావా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధి పనులు గత ప్రభుత్వం హయంలో చేసినవే అన్నారు . శ్రమ ఫలితం మాది శిలాఫలకాలు మీవి అని తెలిపారు. రిబ్బన్ లు కట్ చేయడం రేవంత్ రెడ్డి వంతు అయిందన్నారు. 2021 లోనే నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రూ.300 కోట్లతో గత ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే ఆయిల్ పామ్ సాగు లేదన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం కాదని అది తెలంగాణకి వరం అని అన్నారు.1
- తెలంగాణ ప్రభుత్వం 2026–27 బడ్జెట్‌లో విద్యా రంగానికి భారీ ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. విద్యాశాఖకు సుమారు ₹26,674 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక నిధులు గురుకులాలు, వసతి గృహాల వంటశాలల ఆధునీకరణకు ₹100 కోట్లు ప్రతిపాదన ప్రీ-ప్రైమరీ నుంచి విద్యను బలోపేతం చేయడానికి కొత్త ప్రణాళికలు రాష్ట్రంలోని వేలాది పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విభాగాల విస్తరణ ఇక విద్యార్థుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది: పాఠశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించే నిర్ణయం టెక్నాలజీ ఆధారిత విద్య కోసం పాలిటెక్నిక్, ఐటీఐల్లో కొత్త కోర్సులు మొత్తం మీద, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యా ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ నిధుల విడుదల జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. 👉 ఇది విద్యా రంగంలో పెద్ద మార్పులకు దారితీసే నిర్ణయంగా భావిస్తున్నారు.1
- జనగామ జిల్లా: జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ ఉట్టి డొల్ల, మోసపూరితమైందని ఆయన ఆరోపించారు. ఏ వర్గానికీ ప్రాధాన్యత ఇవ్వలేదని, అన్నదాతలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండానే మళ్లీ అదే కేటాయింపులు చూపడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలపై కూడా నిధుల కేటాయింపు లేదని, ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్టులో కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన దుంపటి వినయ్ కుమార్ మృతదేహం లభించింది. ఇటీవల వివాహమైన వినయ్ కుమార్ ఉగాది రోజున బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోగా ఈరోజు నర్మాల ప్రాజెక్టులో మృతదేహం లభించడం పలు అనుమానాలకు తావిస్తుంది. వినయ్ ఆయన సోదరుడు మహేష్ కవల పిల్లలు కాగ మరో ఇద్దరు కవలలైన యువతులనే ఇటీవల వివాహం చేసుకున్నారు. ఉగాది పండుగ రోజున బయటికి వెళ్లిన వినయ్ తిరిగి రాకపోవడం మృతదేహం నర్మాల ప్రాజెక్టులో తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదవశాత్తు డ్యామ్‌లో పడిపోయి మృతి చెందినట్లు మృతుడి అన్న మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పెళ్లయిన కొద్ది రోజులకే వినయ్ డ్యామ్ లో పడి మృతి చెందడం పెళ్ళంట విషాదం అలుముకుంది.4