Shuru
Apke Nagar Ki App…
రాయలసీమలో పంటలను కాపాడాలి: సీపీఐ యం ఎల్ నేత వెంకటేశ్వర్లు శ్రీశైలం రిజర్వాయర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నీటిమట్టం ప్రస్తుతం 850 అడుగులు ఉందని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నేత వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మల్యాల హంద్రీనీవా, ముచ్చుమరి ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేసి రాయలసీమ రైతుల పంటలను కాపాడాలని కోరారు. ఇప్పటికే ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలు ఎండిపోయాయన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే చర్యలు తీసుకొని నీటిని విడుదల చేయాలని కోరారు.
Why not dinesh... yashaswi
రాయలసీమలో పంటలను కాపాడాలి: సీపీఐ యం ఎల్ నేత వెంకటేశ్వర్లు శ్రీశైలం రిజర్వాయర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నీటిమట్టం ప్రస్తుతం 850 అడుగులు ఉందని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నేత వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మల్యాల హంద్రీనీవా, ముచ్చుమరి ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేసి రాయలసీమ రైతుల పంటలను కాపాడాలని కోరారు. ఇప్పటికే ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలు ఎండిపోయాయన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే చర్యలు తీసుకొని నీటిని విడుదల చేయాలని కోరారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీశైలం జలాశయం కు కొనసాగుతున్న వరద ప్రవాహం.. సంగమేశ్వరంను చుట్టుముట్టిన వరద జలాలు శ్రీశైలం జలాశయం కు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం భారీగా కొనసాగుతుంది. ఆదివారం ఆరు గంటల సమయానికి జూరాల జలాశయం నుంచి శ్రీశైలం జలాశయం కు ఇన్ ఫ్లో 1,74,711 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885.00. అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 846.10. అడుగులు చేరింది. జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, జలాశయ ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 72. 1974 టీఎంసీలుగా నమోదయినట్లు అధికారులు తెలిపారు.1
- ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం అందించండి రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు రామాంజనేయులు (కోడుమూరు షూర్ న్యూస్ ప్రతినిధి) రాష్ట్రంలో వర్షాధారం లేక ఏదో పడిన చిన్న చినుకులకు రైతులు ఆశపడి అప్పు చేసి విత్తనాలను తెచ్చి భూమిలో వితుకున్నారు. వర్షం పూర్తిగా వెనక్కు వెళ్లడంతో భూమిలో విత్తిన విత్తనాలు మొలకెత్తి నాలుగు వేళ ఎత్తు మొక్క పెరిగి నీరు లేక భూమిలో తేమ శాతం ఎండిపోయి చివరకు మొక్కలు ఎండిపోతున్నది. ఈ పరిస్థితిని గమనించిన సిపిఐ పార్టీ అనుబంధ సంస్థ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు జగన్నాథం కోడుమూరు మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఈశ్వరయ్య ఆచారి మాజీ వార్డు మెంబర్ జి.రామాంజనేయులు సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్, బోయ రాజు తదితరులు జీపు జాతను ఏర్పాటు చేసి పట్టణంలో ఉన్న వ్యవసాయ భూమిలోకి వెళ్లి నాయకులు ఎండిన మొక్కలను చూసి రైతుతో కలిసి మీడియా ముందు మాట్లాడుతూ రాష్ట్రంలో కర్నూలు జిల్లా అత్యధికంగా వెనుకబడి ఉన్నది వర్షము లేక రైతులు నెత్తిన బట్ట వేసుకొని కంటతడి పెడుతున్నారు.గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు తొమ్మిది సార్లు పర్యటన చేశారు ఒక్కసారి అయినా రైతు గురించి రైతు పొలాల్లో దిగి పరిశీలించారా.? అని నేను కూటమి ప్రభుత్వం లో పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్న. లేదు ఆయనకి ఎంతసేపు ఉన్నా రైతులను ప్రజలను అడ్డం పెట్టుకొని ముసలి కన్నీరు కారుస్తూ ముందుకు సాగిపోతున్నారే తప్ప ఏమీ లేదు. సిపిఐ పార్టీ గా రైతుల పక్షాన నిలబడి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రతి రైతుకు కూటమి ప్రభుత్వం ఎకరాకు 50,000 వేల రూపాయలు నష్టపరిహారం అందించాలి. లేదంటే ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగిస్తాం అంటూ మీడియా ముందు పత్రిక విలేకరుల ముందు నాయకులు మాట్లాడరు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు రంగస్వామి, చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుగుడే మాధవస్వామి,రైతులు పాల్గొన్నారు2
- మహానివేదన మందిరంలో ప్రెస్ మీట్‌కు అనుమతి లేదన్న మఠాధిపతి కార్యాలయం 1968లో కడప జిల్లా కోర్టు ఇచ్చిన మఠం కాంప్రమైజ్ డిక్రీ ప్రకారం మహానివేదన మందిరంలో మఠాధిపతి కుటుంబ సభ్యులు మాత్రమే నివాసం ఉండాలని నిబంధన ఉందని మఠాధిపతి కార్యాలయం తెలిపింది.ఈ నేపథ్యంలో, మారుతి మహాలక్ష్మి గారు దాఖలు చేసిన హైకోర్టు రిట్ పిటిషన్ WP No. 2625/2026లో, మహానివేదన మందిరం నుంచి తనను ఖాళీ చేయించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా, హైకోర్టు ఆమెకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదని కార్యాలయం పేర్కొంది.దీంతో, మహానివేదన మందిరంలో అక్రమ నివాసం కొనసాగుతోందనే అభిప్రాయంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.ఇదే సమయంలో, మారుతి మహాలక్ష్మి గారు మహానివేదన మందిరంలో పత్రికా సమావేశం నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసిందని పేర్కొంటూ, మఠాధిపతికి పూర్తి హక్కులు కల్పించిన ఆ ప్రాంగణంలో ఎలాంటి ప్రెస్ మీట్ నిర్వహణకు అనుమతి లేదని మఠాధిపతి కార్యాలయం స్పష్టం చేసింది.1
- ఆశ్రమం విధి లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన కార్యక్రమం. బద్వేలు, ఆగస్టు 02:బద్వేలు మున్సిపాలిటీలోని 25వ వార్డు ఆశ్రమం విధి లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన కార్యక్రమంలో భాగంగా రిటైర్డ్ లెక్చలర్ బోవిల పెద్ద సూరారెడ్డిని, అట్లూరు మండల టిడిపి నాయకులు బోవిలా విష్ణువర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన బద్వేల్ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా పలు ప్రభుత్వ పథకాలు, చర్చించారు.1
- కాణిపాకంలో పోటాపోటీ సత్యప్రమాణాలు.. రాజకీయాల్లో కలకలం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ కోనేరులో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత హర్షిత, టీడీపీ నేత, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం వేర్వేరుగా సత్యప్రమాణాలు చేశారు. ఎన్నికలకు ముందు షణ్ముగం వైసీపీ చిత్తూరు అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని హర్షిత స్వామి సాక్షిగా ఆరోపించారు. అయితే తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని షణ్ముగం కూడా అదే కోనేరులో సత్యప్రమాణం చేస్తూ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటన కాణిపాకం, చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరోపణలు, ఖండనలు సంబంధిత వ్యక్తుల వాదనలే; వాటిపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది. కాణిపాకంలో పోటాపోటీ సత్యప్రమాణాలు.. రాజకీయాల్లో కలకలం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ కోనేరులో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత హర్షిత, టీడీపీ నేత, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం వేర్వేరుగా సత్యప్రమాణాలు చేశారు. ఎన్నికలకు ముందు షణ్ముగం వైసీపీ చిత్తూరు అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని హర్షిత స్వామి సాక్షిగా ఆరోపించారు. అయితే తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని షణ్ముగం కూడా అదే కోనేరులో సత్యప్రమాణం చేస్తూ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటన కాణిపాకం, చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరోపణలు, ఖండనలు సంబంధిత వ్యక్తుల వాదనలే; వాటిపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది.1
- గాజులపల్లెలో పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ : ఏవైనా తప్పులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి.తహసిల్దార్ మహానంది మండలం గాజులపల్లెలోని రైతు సేవా కేంద్రంలో రైతులకు ఆదివారం పట్టాదారు పాసుపుస్తకాలను తహశీల్దార్ పి.రమాదేవి పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో 948 రైతులకు పాసు పుస్తకాలు మంజూరయ్యాయాన్నారు. రైతులందరూ ఈ కేవైసీ చేయించుకొని పట్టాదారు పాసుబుక్కులు తీసుకువెళ్లాలన్నారు. ఏవైనా తప్పులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ సుబ్బారావు, వీఆర్వోలు జేజి బాబు, మోహన్, గోపవరం సొసైటీ చైర్మన్ గంగవరపు ఉమామహేశ్వర్ రెడ్డి, రవి స్వామి, శశికళ కొండారెడ్డి, సర్వేర్ సద్దాం, రైతులు పాల్గొన్నారు.3
- తుంగభద్ర ZPH స్కూల్‌లో మాధవరం పోలీసుల అవగాహన కార్యక్రమం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన1
- నాగర్ కర్నూల్ ప్రభుత్వ కళాశాలలో ‘నషా ముక్త్ భారత్’ అవగాహన! నాగర్‌కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో "నషా ముక్త్ భారత్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కే. గీతాంజలి నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన వీడియో సందేశాన్ని విద్యార్థులకు ప్రదర్శించారు. డ్రగ్స్ వల్ల వ్యక్తిగత, సామాజిక జీవితాలు నాశనమవుతాయని ప్రధాని హెచ్చరిస్తూ.. యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కళాశాల అధ్యాపకులు హజీరా, ప్రవీణ, దీపిక, సుధాకర్, హుస్సేన్, బిల్కీస్‌తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పొందారు.1