Shuru
Apke Nagar Ki App…
బోడుప్పల్‌లో అనుమతులు లేని అనధికార పెంట్‌హౌస్ సెంట్రింగ్ తొలగింపు RR: బోడుప్పల్ పరిధిలోని మేడిపల్లి గ్రామం ధరణి కాలనీలో అనుమతులు లేకుండా నిర్మించేందుకు ఏర్పాటు చేసిన అనధికార పెంట్‌హౌస్ సెంట్రింగ్ నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలను చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. భవన నిర్మాణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
Ram Thotapally
బోడుప్పల్‌లో అనుమతులు లేని అనధికార పెంట్‌హౌస్ సెంట్రింగ్ తొలగింపు RR: బోడుప్పల్ పరిధిలోని మేడిపల్లి గ్రామం ధరణి కాలనీలో అనుమతులు లేకుండా నిర్మించేందుకు ఏర్పాటు చేసిన అనధికార పెంట్‌హౌస్ సెంట్రింగ్ నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలను చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. భవన నిర్మాణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
More news from Nalgonda and nearby areas
- పెళ్లి పనుల కోసం వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. తండ్రి, కుమార్తె మృతి HYD: కాటేదాన్‌లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఇస్మాయిల్ ఖాన్, కుమార్తె బుష్రా బేగం మృతి చెందారు. టిప్పర్ లారీ ఢీకొనడంతో టీవీఎస్ ఛాంప్‌పై వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. అక్టోబర్ 2న బుష్రా వివాహం జరగాల్సి ఉండగా, బంధువులను పెళ్లికి ఆహ్వానించి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది.1
- మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభిస్తామని తెలిపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్లు విస్తరిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఓ డిగ్రీ కళాశాల యువతతో ముఖాముఖి కార్యక్రమంలో ట్రాఫిక్ సమస్య ఉందని ఓ విద్యార్థిని అడిగారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రం కావడంతో ప్రజల అవసరాల నిమిత్తం రాకపోకలు ఎక్కువయ్యాయన్నారు. సీఎం తో మాట్లాడి త్వరలో రోడ్లను విస్తరించే పనులను చేపడతామన్నారు. యువతీ యువకులు సహకరించాలని కోరారు.1
- మోదీ జన్మదినం సందర్భంగా పాలడుగులో సేవా కార్యక్రమాలు పురాతన శివాలయాన్ని శుభ్రం చేసిన బీజేపీ నాయకులు – ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాని మోదీ ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు మోత్కూర్,భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ మోత్కూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో పాలడుగు గ్రామంలో సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పురాతన శివాలయ పరిసరాలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు శ్రమదానం చేసి శుభ్రం చేశారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది, పరిశుభ్రతతో పాటు సేవాభావాన్ని ప్రజల్లో పెంపొందించాలనే సందేశాన్ని చాటారు.అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆయురారోగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, దేశానికి మరింతకాలం సేవ చేసే శక్తిని అందించాలని స్వామివారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా సేవా కార్యక్రమాల దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సేవ, పరిశుభ్రత, ప్రజా సంక్షేమం అనే స్ఫూర్తితో గ్రామాల్లో నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.దేశ సేవను ధ్యేయంగా చేసుకుని ముందుకు సాగుతున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి మరియు సమాజ సేవకు నిరంతరం కృషి చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుదే మధుసూదన్ యాదవ్, బీజేపీ మోత్కూర్ మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ బూత్ అధ్యక్షులు ఆళ్ల శివప్రసాద్, ముక్కామల గణేష్, బీజేపీ నాయకులు బరిగల శేఖర్, కందికట్ల అజయ్, ఎడ్ల సునీల్, ముక్కాముల మహేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.4
- శంషాబాద్ లో బుల్లెట్ ట్రైన్ భూసేకరణలో రేవంత్ రెడ్డి సన్నిహితుడి కుంభకోణం:MLA సుధీర్ రెడ్డి శంషాబాద్లో బుల్లెట్ ట్రైన్ భూసేకరణలో రేవంత్ రెడ్డి సన్నిహితుడైన ఒక ఎంపీ కుంభకోణం బహదూర్‌గూడాలో 650 ఎకరాలు బుల్లెట్ ట్రైన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అందులో 300 ఎకరాల భూ యజమానులను, నీకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే ఎక్కువ ఇప్పిస్తా, అందులో సగం నాకు ఇవ్వాలని కొందరు దళారులు దందా చేస్తున్నారు ఆ దళారుల వెనుక ఒక ఎంపీ, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఉన్నాడని మాకు తెలిసింది – బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి1
- రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమలాయపాలెంలో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికీ రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, త్వరలోనే 3, 4వ విడత పంపిణీ మొదలవుతుందని తెలిపారు. ఎల్నినో ఎఫెక్ట్పై కేంద్రాన్ని సాయం కోరామని, కేంద్రం స్పందించకున్నా ప్రభుత్వమే ప్రజలను ఆదుకుంటుందని మంత్రి పొంగులేటి చెప్పారు1
- * గిరిజనుల ఆత్మగౌరవానికి కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి చారిత్రాత్మకం మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్... # గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ . మహబూబాబాద్ జిల్లా , కురవి మండలం పెద్దతండలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్.. మాజీ మంత్రి మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన చారిత్రక నిర్ణయానికి కృతజ్ఞతగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా గ్రామంలో మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా *సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ.. గిరిజనుల ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ భవనాలను నిర్మించడంతో పాటు, గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం, గిరిజన బంధు, పోడు భూములకు హక్కులు కల్పించడం వంటి నిర్ణయాలు చారిత్రాత్మక ఘట్టాలు అన్నారు రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది గిరిజనులు ఉన్నారు, గిరిజనుల జీవితాల్లో సెప్టెంబర్ 17 ఒక మైలురాయిగా నిలిచింది, రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో గిరిజన విద్యార్థులు, నిరుద్యోగ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో మరింత ప్రయోజనం కలిగింది విద్య ద్వారానే వికాసం సాధ్యమని నమ్మిన కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించారు గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు అన్నారు దశాబ్దాలుగా పాలించిన ప్రభుత్వాల పాలన ఒక ఎత్తయితే, కేసీఆర్ పాలన మరో ఎత్తు. గత పాలనల్లో గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు కూడా సరిగా కల్పించిన దాఖలాలు లేవు. తాగునీటి కోసం గిరిజన మహిళలు కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితులు ఉండేవి. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో 3,416 తండాలు గ్రామపంచాయతీలుగా మారాయి. గిరిజన బిడ్డలే స్థానిక పాలకులుగా ఎన్నికై తమ తండాల అభివృద్ధిలో భాగస్వాములయ్యారు* గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, గిరిజనుల ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు ఇవ్వాలి దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధికి ఏం చేసిందో ప్రజలకు వివరించాలి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందిని విమర్శించారు కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా బీఆర్ఎస్‌ను ప్రజల నుంచి దూరం చేయలేరు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సత్యవతి రాథోడ్ అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు....2
- ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాండ్ మేళాల మధ్య ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళా పోలీసుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తిభావంతో గణనాథుడిని సాగనంపారు.4
- కృష్ణా జలాలతో నిండిపోయిన వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలు పెద్దారవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన సుంకేసుల కలనూతల కృష్ణా జలాలతో నిండిపోయాయి. ఆగస్టు 31వ తేదీ సీఎం చేతుల మీదుగా కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేశారు. అప్పటినుండి ఇప్పటివరకు నీటి ప్రవాహం కొనసాగడంతో ముంపు గ్రామాలు నిండిపోయాయి. అధికారులు గ్రామాలను ముందుగానే ఖాళీ చేయించిన విషయం తెలిసినదే. దీంతో మునిగిపోయిన తమ గ్రామాలను చూడడానికి నిర్వాసితులు ఆసక్తి కనపరిచారు.1