Shuru
Apke Nagar Ki App…
పెళ్లి పనుల కోసం వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. తండ్రి, కుమార్తె మృతి HYD: కాటేదాన్‌లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఇస్మాయిల్ ఖాన్, కుమార్తె బుష్రా బేగం మృతి చెందారు. టిప్పర్ లారీ ఢీకొనడంతో టీవీఎస్ ఛాంప్‌పై వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. అక్టోబర్ 2న బుష్రా వివాహం జరగాల్సి ఉండగా, బంధువులను పెళ్లికి ఆహ్వానించి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది.
Ram Thotapally
పెళ్లి పనుల కోసం వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. తండ్రి, కుమార్తె మృతి HYD: కాటేదాన్‌లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఇస్మాయిల్ ఖాన్, కుమార్తె బుష్రా బేగం మృతి చెందారు. టిప్పర్ లారీ ఢీకొనడంతో టీవీఎస్ ఛాంప్‌పై వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. అక్టోబర్ 2న బుష్రా వివాహం జరగాల్సి ఉండగా, బంధువులను పెళ్లికి ఆహ్వానించి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది.
More news from Nalgonda and nearby areas
- పెళ్లి పనుల కోసం వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. తండ్రి, కుమార్తె మృతి HYD: కాటేదాన్‌లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఇస్మాయిల్ ఖాన్, కుమార్తె బుష్రా బేగం మృతి చెందారు. టిప్పర్ లారీ ఢీకొనడంతో టీవీఎస్ ఛాంప్‌పై వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. అక్టోబర్ 2న బుష్రా వివాహం జరగాల్సి ఉండగా, బంధువులను పెళ్లికి ఆహ్వానించి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది.1
- మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభిస్తామని తెలిపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్లు విస్తరిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఓ డిగ్రీ కళాశాల యువతతో ముఖాముఖి కార్యక్రమంలో ట్రాఫిక్ సమస్య ఉందని ఓ విద్యార్థిని అడిగారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రం కావడంతో ప్రజల అవసరాల నిమిత్తం రాకపోకలు ఎక్కువయ్యాయన్నారు. సీఎం తో మాట్లాడి త్వరలో రోడ్లను విస్తరించే పనులను చేపడతామన్నారు. యువతీ యువకులు సహకరించాలని కోరారు.1
- ఆత్మకూరు అంగన్వాడీ కేంద్రం -21, నందు 9వ జాతీయ పోషణ మాసం 2026. 9వ జాతీయ పోషణ మాసం 2026 ఆత్మకూరు:నంద్యాల జిల్లా. ఆత్మకూరు ప్రాజెక్టు, ఎస్పీజీ పాలెం అంగన్వాడి కేంద్రం-21 నందు 9 వ జాతీయ పోషణ మాసం 2026 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ICDS సూపర్ వైజర్a V. కోమలి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా male participation( పురుషుల భాగస్వామ్యం) గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లల తండ్రులు, భర్తలు హాజరైనారు ICDS సూపర్వైజర్ V. కోమలి మాట్లాడుతూ మనకు ఇంట్లోనే ఖర్చు లేకుండా ఈజీగా దొరికే మునగాకులో కాల్షియం విటమిన్స్ B మరియు C లభిస్తుంది మరియు ఇది హైపర్ రిచ్, మలబద్ధకం నివారించి జీర్ణశక్తి మెరుగుపరుచును కీళ్ల నొప్పులు షుగర్ నియంత్రించును వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, మునగాకు పొడి, మునగాకు వడలు, మునగాకు రొట్టెలు, రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, వివిధ రకాల వంటలు వాటి ప్రయోజనాలు, కూరగాయల నుండి ఆకుకూర నుండి లభించు పోషకాల గురించి, అంగన్వాడి కేంద్రంలో అందించు పోషక ఆహారం గురించి క్లుప్తంగా వివరించారు.పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు.ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాల ఎగ్జిబిషన్ పెట్టడంజరిగినది.ఈసమావేశానికి ANM నాగమణి, అంగన్వాడి టీచర్ M. వాణి, P. మూర్తు జాబి, ఆశ వర్కర్ జయమ్మ, అంగన్వాడి ఆయా అనురాధమ్మ పాల్గొన్నారు.1
- రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమలాయపాలెంలో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికీ రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, త్వరలోనే 3, 4వ విడత పంపిణీ మొదలవుతుందని తెలిపారు. ఎల్నినో ఎఫెక్ట్పై కేంద్రాన్ని సాయం కోరామని, కేంద్రం స్పందించకున్నా ప్రభుత్వమే ప్రజలను ఆదుకుంటుందని మంత్రి పొంగులేటి చెప్పారు1
- రేవంత్ రెడ్డి కుటుంబానికి 38 భూమి ఉంది: హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- * గిరిజనుల ఆత్మగౌరవానికి కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి చారిత్రాత్మకం మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్... # గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ . మహబూబాబాద్ జిల్లా , కురవి మండలం పెద్దతండలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్.. మాజీ మంత్రి మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన చారిత్రక నిర్ణయానికి కృతజ్ఞతగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా గ్రామంలో మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా *సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ.. గిరిజనుల ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ భవనాలను నిర్మించడంతో పాటు, గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం, గిరిజన బంధు, పోడు భూములకు హక్కులు కల్పించడం వంటి నిర్ణయాలు చారిత్రాత్మక ఘట్టాలు అన్నారు రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది గిరిజనులు ఉన్నారు, గిరిజనుల జీవితాల్లో సెప్టెంబర్ 17 ఒక మైలురాయిగా నిలిచింది, రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో గిరిజన విద్యార్థులు, నిరుద్యోగ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో మరింత ప్రయోజనం కలిగింది విద్య ద్వారానే వికాసం సాధ్యమని నమ్మిన కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించారు గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు అన్నారు దశాబ్దాలుగా పాలించిన ప్రభుత్వాల పాలన ఒక ఎత్తయితే, కేసీఆర్ పాలన మరో ఎత్తు. గత పాలనల్లో గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు కూడా సరిగా కల్పించిన దాఖలాలు లేవు. తాగునీటి కోసం గిరిజన మహిళలు కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితులు ఉండేవి. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో 3,416 తండాలు గ్రామపంచాయతీలుగా మారాయి. గిరిజన బిడ్డలే స్థానిక పాలకులుగా ఎన్నికై తమ తండాల అభివృద్ధిలో భాగస్వాములయ్యారు* గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, గిరిజనుల ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు ఇవ్వాలి దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధికి ఏం చేసిందో ప్రజలకు వివరించాలి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందిని విమర్శించారు కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా బీఆర్ఎస్‌ను ప్రజల నుంచి దూరం చేయలేరు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సత్యవతి రాథోడ్ అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు....2
- ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాండ్ మేళాల మధ్య ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళా పోలీసుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తిభావంతో గణనాథుడిని సాగనంపారు.4
- కృష్ణా జలాలతో నిండిపోయిన వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలు పెద్దారవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన సుంకేసుల కలనూతల కృష్ణా జలాలతో నిండిపోయాయి. ఆగస్టు 31వ తేదీ సీఎం చేతుల మీదుగా కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేశారు. అప్పటినుండి ఇప్పటివరకు నీటి ప్రవాహం కొనసాగడంతో ముంపు గ్రామాలు నిండిపోయాయి. అధికారులు గ్రామాలను ముందుగానే ఖాళీ చేయించిన విషయం తెలిసినదే. దీంతో మునిగిపోయిన తమ గ్రామాలను చూడడానికి నిర్వాసితులు ఆసక్తి కనపరిచారు.1