logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పాడేరు మండలం ముంచంగిపుట్టు ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారింది. తారు లేచిపోయి కంకర తేలడంతో ప్రయాణం ప్రాణాంతకంగా మారింది. పాడేరుకు వెళ్లాలన్నా, గుత్తులపుట్టు సంతకు వెళ్లాలన్నా గిరిజనులకు ఇదే ఏకైక దిక్కు. ఈ గుంతల మార్గంలో గర్భిణులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఐటీడీఏ అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

3 hrs ago
user_Shyam
Shyam
Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

పాడేరు మండలం ముంచంగిపుట్టు ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారింది. తారు లేచిపోయి కంకర తేలడంతో ప్రయాణం ప్రాణాంతకంగా మారింది. పాడేరుకు వెళ్లాలన్నా, గుత్తులపుట్టు సంతకు వెళ్లాలన్నా గిరిజనులకు ఇదే ఏకైక దిక్కు. ఈ గుంతల మార్గంలో గర్భిణులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఐటీడీఏ అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • “Every mile carries comfort… MGM Vests on the move.” #MGMBanians #MensVest #InnerwearIndia #MadeInIndia #QualityWear #DailyWear #ComfortWear #IndianBrand
    1
    “Every mile carries comfort… MGM Vests on the move.”
#MGMBanians #MensVest #InnerwearIndia #MadeInIndia #QualityWear #DailyWear #ComfortWear #IndianBrand
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ వెంకంపేట పరిసరాల్లో డంపింగ్ యార్డ్ ను తక్షణమే తొలగించాలని వెంకంపేట పాఠశాల విద్యార్థులు స్కూల్ విద్యార్థులు, స్థానిక యువత నిరసన తెలిపారు. పాలకొండ నగరపంచాయితీ పరిధిలో సేకరించిన చెత్తను వెంకంపేటలో డంపింగ్ చేస్తున్న నగరపంచాయితీ తీరును ఆ ప్రాంత వాసులతో కలిసి విద్యార్థులు, యువత ముక్తకంఠంతో ఖండించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా పేద, మధ్యతరగతి వారు నివసిస్తారని అలాంటి చోట చెత్తను డంప్ చేయడం అన్యాయం అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇక్కడ చాలా రోజులపాటు అప్రకటిత డంపింగ్ యార్డును నడిపి మా ప్రాంత వాసుల ఆరోగ్యాలతో నగరపంచాయితీ ఆడుకుందని, అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేసి ఇక్కడ నుండి అప్పటి డంపింగ్ యార్డును తొలగించేలా ఒత్తిడి తెచ్చి అప్పట్లో దీన్ని తరలించేలా చేశామని ప్రస్తుతం మళ్ళీ ఇక్కడే డంపింగ్ యార్డు కోసం నగరపంచాయితీ అధికారులు హడావిడిగా పనులు చేయడం మా ప్రాంతం పై పగపట్టడంలా ఉందని వెంకంపేట వాసులు వాపోతున్నారు. శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ చొరవతో వెంకంపేట పాఠశాల ఎలిమెంటరీ నుండి హై స్కూల్ గా మారుతున్న తరుణంలో ఆ డంపింగ్ యార్డు నిర్మాణం తలపెట్టిన ప్రాంతాన్ని క్రీడామైదానం గా పిల్లలకు కేటాయించి వారికి కానుకగా అందిస్తారని అంతా భావించిన తరుణంలో నగరపంచాయితీ వారు ఇక్కడ డంపింగ్ యార్డు, సీ అండ్ డి యూనిట్ నిర్మాణానికి అర్దరాత్రి పూట గుంతలు తవ్వడం అంటే విద్యార్థులు , స్థానికులకు తీవ్ర అన్యాయం చేయడమే అని విద్యార్థి సంఘాలు తెలియజేసాయి. ఇప్పటికైనా నగరపంచాయితీ కమిషనర్ నిర్ణయాన్ని పునరాలోచించి ఇక్కడనుండి డంపింగ్ యార్డును తొలగించాలని లేనిచో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని స్థానికులు తెలిపారు.
    1
    పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ 
వెంకంపేట పరిసరాల్లో డంపింగ్ యార్డ్ ను తక్షణమే తొలగించాలని వెంకంపేట పాఠశాల విద్యార్థులు స్కూల్ విద్యార్థులు, స్థానిక యువత నిరసన తెలిపారు. పాలకొండ నగరపంచాయితీ పరిధిలో సేకరించిన చెత్తను వెంకంపేటలో డంపింగ్ చేస్తున్న నగరపంచాయితీ తీరును ఆ ప్రాంత వాసులతో కలిసి విద్యార్థులు, యువత ముక్తకంఠంతో ఖండించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా పేద, మధ్యతరగతి వారు నివసిస్తారని అలాంటి చోట చెత్తను డంప్ చేయడం అన్యాయం అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇక్కడ చాలా రోజులపాటు అప్రకటిత డంపింగ్ యార్డును నడిపి మా ప్రాంత వాసుల ఆరోగ్యాలతో నగరపంచాయితీ ఆడుకుందని, అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేసి ఇక్కడ నుండి అప్పటి డంపింగ్ యార్డును తొలగించేలా ఒత్తిడి తెచ్చి అప్పట్లో దీన్ని తరలించేలా చేశామని ప్రస్తుతం మళ్ళీ ఇక్కడే డంపింగ్ యార్డు కోసం నగరపంచాయితీ అధికారులు హడావిడిగా పనులు చేయడం మా ప్రాంతం పై పగపట్టడంలా ఉందని వెంకంపేట వాసులు వాపోతున్నారు. శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ చొరవతో వెంకంపేట పాఠశాల ఎలిమెంటరీ నుండి హై స్కూల్ గా మారుతున్న తరుణంలో ఆ డంపింగ్ యార్డు నిర్మాణం తలపెట్టిన ప్రాంతాన్ని క్రీడామైదానం గా పిల్లలకు కేటాయించి వారికి కానుకగా అందిస్తారని అంతా భావించిన తరుణంలో నగరపంచాయితీ వారు ఇక్కడ డంపింగ్ యార్డు, సీ అండ్ డి యూనిట్ నిర్మాణానికి అర్దరాత్రి పూట గుంతలు తవ్వడం అంటే విద్యార్థులు , స్థానికులకు తీవ్ర అన్యాయం చేయడమే అని విద్యార్థి సంఘాలు తెలియజేసాయి. ఇప్పటికైనా నగరపంచాయితీ కమిషనర్ నిర్ణయాన్ని పునరాలోచించి ఇక్కడనుండి డంపింగ్ యార్డును తొలగించాలని లేనిచో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని స్థానికులు తెలిపారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ​పిఠాపురం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు కేటాయించిన పట్టా భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడాన్ని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇంచార్జ్,రాష్ట్ర పిఎసి సభ్యురాలు వంగా గీతా విశ్వనాధ్ తీవ్రంగా ఖండించారు. ​బుధవారం పిఠాపురం మండలం నరసింగపురం గ్రామంలోని పట్టా భూముల వద్ద బాధితులతో కలిసి ఆమె నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో పిఠాపురం పట్టణ పరిధిలోని పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన స్థలంలో సుమారు 20 ఎకరాల భూమిని తెలంగాణకు చెందిన ఒక ప్రైవేటు పాఠశాలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమని ఆమె పేర్కొన్నారు. పట్టాలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా,ఇప్పటికీ ఆ స్థలాల్లో పేదలకు ఇళ్లు మంజూరు చేయకపోగా, ఉన్న భూమిని లాక్కోవడం పేదల పొట్ట కొట్టడమేనని విమర్శించారు. పట్టాదారులందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని, పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ​ప్రైవేటు పాఠశాలకు భూమిని కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, ​పేదలకు ఇచ్చిన పట్టా భూములను వారికే అప్పగించి,తక్షణమే ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, ​పేదల హక్కులను కాలరాసే ఏ చర్యలనైనా ప్రజల పక్షాన అడ్డుకుంటామని హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, కొత్తేం దత్తుడు, చెల్లూరి లోవరాజు, ఖండవల్లి చిన్న లోవరాజు లబ్ధిదారులు మరియు పట్టాదారులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
    2
    ​పిఠాపురం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు కేటాయించిన పట్టా భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడాన్ని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇంచార్జ్,రాష్ట్ర పిఎసి సభ్యురాలు వంగా గీతా విశ్వనాధ్ తీవ్రంగా ఖండించారు.
​బుధవారం పిఠాపురం మండలం నరసింగపురం గ్రామంలోని పట్టా భూముల వద్ద బాధితులతో కలిసి ఆమె నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో పిఠాపురం పట్టణ పరిధిలోని పేద  ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన స్థలంలో సుమారు 20 ఎకరాల భూమిని తెలంగాణకు చెందిన ఒక ప్రైవేటు పాఠశాలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమని ఆమె పేర్కొన్నారు. పట్టాలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా,ఇప్పటికీ ఆ స్థలాల్లో పేదలకు ఇళ్లు మంజూరు చేయకపోగా, ఉన్న భూమిని లాక్కోవడం పేదల పొట్ట కొట్టడమేనని విమర్శించారు. పట్టాదారులందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని, పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ​ప్రైవేటు పాఠశాలకు భూమిని కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని,
​పేదలకు ఇచ్చిన పట్టా భూములను వారికే అప్పగించి,తక్షణమే ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని,
​పేదల హక్కులను కాలరాసే ఏ చర్యలనైనా ప్రజల పక్షాన అడ్డుకుంటామని హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, కొత్తేం దత్తుడు, చెల్లూరి లోవరాజు, ఖండవల్లి  చిన్న లోవరాజు లబ్ధిదారులు మరియు పట్టాదారులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    20 hrs ago
  • శ్రీకాకుళం,ఏప్రిల్,22: ఉద్దానం ప్రాంతంలో తాగునీటి పైపులైన్లు లీకేజీలు లేకుండా అరికట్టాలని జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ ఆర్డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జడ్పీ సీఈవో వెంకటరామన్ లతో కలసి బుధవారం జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమావేశంలో సభలో ప్రజా సమస్యల పై సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలన్నారు. పంచాయతీ రాజ్ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. భూ గర్భజలాలు సమస్య లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. *డ్వామా* ఉపాధి హామీ ద్వారా చేపడుతున్న పనులను పిడి వివరించగా జాబ్ కొన్ని గ్రామాల్లో జారీ చేయాల్సి ఉందని సభ్యులు తెలుపగా అందరికి జాబ్ కార్డులు జారీ చేసినట్లు పిడి వివరించారు. శత శాతం జాబ్ కార్డులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి కూలీల అకౌంట్ల అప్డేషన్ పై సమీక్షించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల అధికారులు జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కావాలని, ఈ విషయం పై ప్రిన్సిపాల్ సెక్రటరీకి తెలియజేయాలని శాసన సభ్యులు కూన రవి కుమార్, నిమ్మక జయకృష్ణ చెప్పారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు రాష్ట్రంలోనే వేజస్ ఎక్కువగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ సభ్యులకు తెలిపారు. సీతంపేట ఐటిడిఎ పిఓ తో కలసి సమావేశం ఏర్పాటు చేయాలని శాసన సభ్యులు కూన రవి కుమార్, నిమ్మక జయకృష్ణ, మామిడి గోవిందరావులు సూచించారు. వంగర మండలంలో ఉన్న ఉపాధి హామీ సమస్యలను జడ్పీటీసీ ఉత్తరావల్లి సురేష్ బెనర్జీ తెలియజేయగా విజయనగరం జిల్లా డ్వామా పిడికి తెలియజేస్తానని జడ్పీ సీఈవో వెంకటరామన్ చెప్పారు. ఉపాధి హామీ పై వంగర మండలంలో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. *ఆర్డబ్ల్యూఎస్ పై* ఆర్డబ్ల్యుఎస్ ద్వారా చేపడుతున్న పనులు గూర్చి ఎస్ఈ వివరించగా ఉద్దానం తాగునీటి పైపులైన్లలో ఉన్న లీకేజీలు ఉన్నాయని, వాటిని అరికట్టి ఆరోగ్యకరమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ పిరియా విజయ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కి చెప్పారు. హిరమండలం నుండి తాగునీరు ఉద్దానంకు ఇస్తున్నారు కాని హిరమండలం టౌన్ లో తాగునీరు లేదని హిరమండలంనకు తాగునీరు ఇవ్వాలని, హిరమండలం మండల ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయన్నారు. తాగునీరు సరఫరా చేయాలని కోరారు. ఎచ్చెర్ల శాసన సభ్యులు నడికుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ జెజెఎం ద్వారా పనులు చేపడుతున్నారని, పనులు చేయని ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో అలాంటి వారిని రద్దు చేయాలని సూచించారు. నీటికి ఇబ్బంది లేకుండా బోర్లు వేయాలని చెప్పగా బోర్లు వేస్తామని ఎస్ఈ చెప్పారు. జడ్పీటీసీ దువ్వాడ వాణి మాట్లాడుతూ టెక్కలిలో తాగునీటి పైపులకు ఉన్న లీకేజీలు అరికట్టాలని చెప్పగా లీకేజీలు లేకుండా చూస్తామని ఎస్ఈ చెప్పారు. కుషాలపురం, తదితర గ్రామాలకు కొన్ని తాగునీటి పనులు రద్దు జరిగిందని, మున్సిపాలిటీలో లేక, పంచాయతీకి లేకుండా ఉందని, ఆ గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాలని ఎచ్చెర్ల శాసన సభ్యులు నడికుదిటి ఈశ్వరరావు తెలిపారు. భూ గర్భ జలాలు సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్ ఆదేశించారు. సంతబొమ్మాళి మండలంలో తాగునీటి సమస్య గూర్చి జడ్పీటీసీ చెప్పగా శాశ్వత పరిష్కారం కింద తాగునీరు ప్రాజెక్టు చేపడుతున్నట్లు ఎస్ఈ చెప్పారు. టెక్కలిలో వాటర్ ట్యాంక్ లు క్లీనింగ్ చేయాలని జడ్పీటీసీ దువ్వాడ వాణి చెప్పగా అన్ని వాటర్ ట్యాంక్ లు క్లీనింగ్ చేయాలని శాసన సభ్యులు కూన రవి కుమార్ చెప్పారు. వాటర్ ట్యాంక్ లు క్లోరినేషన్ ఎందుకు చేయడం లేదని ఛైర్మన్ విజయ నిలదీశారు. వాటర్ ట్యాంక్ లు క్లోరినేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిపిఓ ను ఆదేశించారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని, వేసవి ప్రణాళికలు తక్షణమే సిద్ధం చేస్తే నిధులు ఉన్న పంచాయతీల్లో అవసరమైన పనులు చేసుకుంటారని, నిధులు లేని పంచాయతీలు జిల్లా అధికారులకు తెలియజేయజేస్తారని శాసన సభ్యులు కూన రవి కుమార్ వివరించారు. మండలాల వారీగా వేసవి ప్రణాళికలు ఉండాలని చెప్పారు. *సాంఘిక సంక్షేమ శాఖ* సాంఘిక సంక్షేమ శాఖ పై ఇన్ చార్జ్ డిడి ఇటీవల పాతపట్నంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకుంటున్న బాలిక మెట్ల పై నుండి జారి పడి మృతి చెందినట్లు పాతపట్నం శాసన సభ్యులు మామిడి గోవిందరావు సభ దృష్టికి తీసుకురాగా, సాంఘిక సంక్షేమ వసతి భవనాల వద్ద పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని జడ్పీటీసీ దువ్వాడ వాణి చెప్పగా, స్లాబ్ లపై రక్షణ గోడలు కొద్దిగా ఎత్తు పెంచాలని శాసన సభ్యులు కూన రవి కుమార్ చెప్పారు. మృతి చెందిన బాలికకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అదేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. *ఉద్యానవన శాఖ* సోంపేట, కంచిలి, పలాస మండలాల్లో టమోటా ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ఎంపిపి కోరగా రైతులకు నష్టపరిహారంగా 25 వేల రూపాయలు వస్తుందని ఉద్యానవన శాఖ ఎడి వివరించారు. దువ్వాడ వాణి వేసిన ప్రశ్న కు సమాధానంగా కలెక్టర్ మాట్లాడుతూ పోర్టు ఉంటే దానికి అనుగుణంగా పరిశ్రమలు రావాలని, అందుకు ప్రభుత్వ భూములైతే అది ప్రభుత్వం చూసుకుంటుందని, ప్రైవేటు ల్యాండ్ అయితే భూ సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. హిరమండలంలో వంశధార కుడి కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు భూములు ఇచ్చారు కాని వాటికి పాసుపుస్తకాలు జారీ చేయలేదని శాసన సభ్యులు మామిడి గోవిందరావు సభ దృష్టికి తీసుకురాగా పాసు పుస్తకాలు జారీకి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. *వ్యవసాయ శాఖ* వంగర మండలంలో మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వంగర మండలం జడ్పీటీసీ సభ్యులు సురేష్ బెనర్జీ చెప్పగా ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ జెడి వివరించారు. శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ జిల్లా సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. *వైద్య ఆరోగ్య శాఖ* పత్రికలో వచ్చిన కథనంపై తాను స్వయంగా వెళ్లి పరిశీలించానని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సికెడి మందులు గత 8 నెలలుగా సరఫరా చేయడం లేదని జిల్లా పరిషత్ ఛైర్మన్ ఇన్ చార్జ్ డిఎంహెచ్ఓ ను అడుగగా ఇండెంటెడ్ పంపినట్లు డిసిహెచ్ఎస్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా కిడ్నీ రోగులు ఎంత మంది ఉన్నారు.. డయాలసిస్ రోగులు గూర్చి శాసన సభ్యులు కూన రవి కుమార్ అడుగగా జిల్లా వ్యాప్తంగా ఉన్న, ఉద్దానం ప్రాంతంలో ఉన్న కిడ్నీ రోగుల గూర్చి వివరించారు. డయాలసిస్, పడకల గూర్చి తెలిపారు. గతంలో మందులకు ప్రతిపాదనలు పంపలేదని చెప్పారు. డిఎంహెచ్ఓ తో మాట్లాడి కిడ్నీ వ్యాధిగ్రస్తుల పై స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని చైర్మన్ సూచించారు. గతంలో పిహెచ్సీ ద్వారా డ్రగ్స్ ఇచ్చింది లేనిది లేదా సి.హెచ్ సీ ద్వారా ఇచ్చారా లేదని కలెక్టర్ డిసిహెచ్ఎస్ నుఅడుగగా పిహెచ్సీల ద్వారా ఇచ్చినట్లు వివరించారు. సోంపేటలో డయాలసిస్ యూనిట్ మరమ్మతులకు గురయ్యిందని తక్షణమే మరమ్మతులు చేయాలని సోంపేట జడ్పీటీసీ కోరారు. మరమ్మతులు చేపడతామని డిసిహెచ్ఎస్ చెప్పారు. జిల్లాలో క్యాన్సర్ వ్యాధి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, క్యాన్సర్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు విస్తారంగా, విస్తృతంగా విస్తరిస్తుందని, రైతులు విరివిగా ఎరువులు వాడుతున్నారని శాసన సభ్యులు కూన రవి కుమార్ చెప్పారు. విషతుల్యమైన ఆహారం తినడం వలన క్యాన్సర్ వ్యాధికి గురవుతన్నట్లు వివరించారు. ఒకానొక సమయంలో హెచ్ఐవి ఉండేదని, ప్రస్తుతం క్యాన్సర్ శర వేగంగా విస్తరిస్తుందన్నారు. దీనిపై రైతులను అవగాహన పరచాలన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచన చేయాలని కోరారు. *ఎపిఈపీడిసియల్* వ్యవసాయ బోర్లుకు నెలకు 30 రూపాయలు బిల్లులు రైతులకు ఇవ్వాలని శాసన సభ్యులు కూన రవి కుమార్ ఎస్ఈ కు సూచించారు. వీధి దీపాలకు సంబంధించి పంచాయతీలకు బిల్లులు జారీ చేయాలన్నారు. కవిటి సోంపేట, పాతపట్నం లో వోల్టేజీ సమస్య ఉందని దీని వలన ఫ్రిజ్, ఎసిలు పాడవుతున్నాయని, దానిని సరి చేయాలని జడ్పీ ఛైర్మన్ పిరియా విజయ, పాతపట్నం శాసన సభ్యులు మామిడి గోవిందరావులు చెప్పగా లో వోల్టేజ్ సమస్యను సరి చేస్తామని ఎస్ఈ తెలిపారు. ఈ సమావేశంలో ఆమదాలవలస శాసన సభ్యులు కూన రవి కుమార్, శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ, మామిడి గోవిందరావు, గొండు శంకర్, నడికుదిటి ఈశ్వరరావు, గౌతు శిరీష, శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్, డిసిఎంఎస్ అధ్యక్షులు అవినాష్, జడ్పీటీసీలు, ఎంపిపిలు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    శ్రీకాకుళం,ఏప్రిల్,22: ఉద్దానం ప్రాంతంలో తాగునీటి పైపులైన్లు లీకేజీలు లేకుండా అరికట్టాలని జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ ఆర్డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జడ్పీ సీఈవో వెంకటరామన్ లతో కలసి బుధవారం జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమావేశంలో సభలో ప్రజా సమస్యల పై సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలన్నారు. పంచాయతీ రాజ్ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. భూ గర్భజలాలు సమస్య లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. 
*డ్వామా* 
ఉపాధి హామీ ద్వారా చేపడుతున్న పనులను పిడి వివరించగా జాబ్ కొన్ని గ్రామాల్లో జారీ చేయాల్సి ఉందని సభ్యులు తెలుపగా అందరికి జాబ్ కార్డులు జారీ చేసినట్లు పిడి వివరించారు. శత శాతం జాబ్ కార్డులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి కూలీల అకౌంట్ల అప్డేషన్ పై సమీక్షించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల అధికారులు జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కావాలని, ఈ విషయం పై ప్రిన్సిపాల్ సెక్రటరీకి తెలియజేయాలని శాసన సభ్యులు కూన రవి కుమార్, నిమ్మక జయకృష్ణ చెప్పారు. 
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు రాష్ట్రంలోనే వేజస్ ఎక్కువగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ సభ్యులకు తెలిపారు. 
సీతంపేట ఐటిడిఎ పిఓ తో కలసి సమావేశం ఏర్పాటు చేయాలని శాసన సభ్యులు కూన రవి కుమార్, నిమ్మక జయకృష్ణ, మామిడి గోవిందరావులు సూచించారు. 
వంగర మండలంలో ఉన్న ఉపాధి హామీ సమస్యలను జడ్పీటీసీ ఉత్తరావల్లి సురేష్ బెనర్జీ తెలియజేయగా విజయనగరం జిల్లా డ్వామా పిడికి తెలియజేస్తానని జడ్పీ సీఈవో వెంకటరామన్ చెప్పారు. ఉపాధి హామీ పై వంగర మండలంలో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. 
*ఆర్డబ్ల్యూఎస్ పై*
ఆర్డబ్ల్యుఎస్ ద్వారా చేపడుతున్న పనులు గూర్చి ఎస్ఈ వివరించగా ఉద్దానం తాగునీటి పైపులైన్లలో ఉన్న లీకేజీలు ఉన్నాయని, వాటిని అరికట్టి ఆరోగ్యకరమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ పిరియా విజయ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కి చెప్పారు. హిరమండలం నుండి తాగునీరు ఉద్దానంకు ఇస్తున్నారు కాని హిరమండలం టౌన్ లో తాగునీరు లేదని హిరమండలంనకు తాగునీరు ఇవ్వాలని, హిరమండలం మండల ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయన్నారు. తాగునీరు సరఫరా చేయాలని కోరారు. 
ఎచ్చెర్ల శాసన సభ్యులు నడికుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ జెజెఎం ద్వారా పనులు చేపడుతున్నారని, పనులు చేయని ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో అలాంటి వారిని రద్దు చేయాలని సూచించారు. నీటికి ఇబ్బంది లేకుండా బోర్లు వేయాలని చెప్పగా బోర్లు వేస్తామని ఎస్ఈ చెప్పారు. 
జడ్పీటీసీ దువ్వాడ వాణి మాట్లాడుతూ టెక్కలిలో తాగునీటి పైపులకు ఉన్న లీకేజీలు అరికట్టాలని చెప్పగా లీకేజీలు లేకుండా చూస్తామని ఎస్ఈ చెప్పారు. కుషాలపురం, తదితర గ్రామాలకు కొన్ని తాగునీటి పనులు రద్దు జరిగిందని, మున్సిపాలిటీలో లేక, పంచాయతీకి లేకుండా ఉందని, ఆ గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాలని ఎచ్చెర్ల శాసన సభ్యులు నడికుదిటి ఈశ్వరరావు తెలిపారు. భూ గర్భ జలాలు సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్ ఆదేశించారు. సంతబొమ్మాళి మండలంలో తాగునీటి సమస్య గూర్చి జడ్పీటీసీ చెప్పగా శాశ్వత పరిష్కారం కింద తాగునీరు ప్రాజెక్టు చేపడుతున్నట్లు ఎస్ఈ చెప్పారు. 
టెక్కలిలో వాటర్ ట్యాంక్ లు క్లీనింగ్ చేయాలని జడ్పీటీసీ దువ్వాడ వాణి చెప్పగా అన్ని వాటర్ ట్యాంక్ లు క్లీనింగ్ చేయాలని శాసన సభ్యులు కూన రవి కుమార్ చెప్పారు. 
వాటర్ ట్యాంక్ లు క్లోరినేషన్ ఎందుకు చేయడం లేదని ఛైర్మన్ విజయ నిలదీశారు. వాటర్ ట్యాంక్ లు క్లోరినేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిపిఓ ను ఆదేశించారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని, వేసవి ప్రణాళికలు తక్షణమే సిద్ధం చేస్తే నిధులు ఉన్న పంచాయతీల్లో అవసరమైన పనులు చేసుకుంటారని, నిధులు లేని పంచాయతీలు జిల్లా అధికారులకు తెలియజేయజేస్తారని శాసన సభ్యులు కూన రవి కుమార్ వివరించారు. మండలాల వారీగా వేసవి ప్రణాళికలు ఉండాలని చెప్పారు. 
*సాంఘిక సంక్షేమ శాఖ*
సాంఘిక సంక్షేమ శాఖ పై ఇన్ చార్జ్ డిడి 
ఇటీవల పాతపట్నంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకుంటున్న బాలిక మెట్ల పై నుండి జారి పడి మృతి చెందినట్లు పాతపట్నం శాసన సభ్యులు మామిడి గోవిందరావు సభ దృష్టికి తీసుకురాగా, సాంఘిక సంక్షేమ వసతి భవనాల వద్ద పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని జడ్పీటీసీ దువ్వాడ వాణి చెప్పగా, స్లాబ్ లపై రక్షణ గోడలు కొద్దిగా ఎత్తు పెంచాలని శాసన సభ్యులు కూన రవి కుమార్ చెప్పారు. మృతి చెందిన బాలికకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అదేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 
*ఉద్యానవన శాఖ*
సోంపేట, కంచిలి, పలాస మండలాల్లో టమోటా ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ఎంపిపి కోరగా రైతులకు నష్టపరిహారంగా 25 వేల రూపాయలు వస్తుందని ఉద్యానవన శాఖ ఎడి వివరించారు. దువ్వాడ వాణి వేసిన ప్రశ్న కు సమాధానంగా కలెక్టర్ మాట్లాడుతూ పోర్టు ఉంటే దానికి అనుగుణంగా పరిశ్రమలు రావాలని, అందుకు ప్రభుత్వ భూములైతే అది ప్రభుత్వం చూసుకుంటుందని, ప్రైవేటు ల్యాండ్ అయితే భూ సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. హిరమండలంలో వంశధార కుడి కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు భూములు ఇచ్చారు కాని వాటికి పాసుపుస్తకాలు జారీ చేయలేదని శాసన సభ్యులు మామిడి గోవిందరావు సభ దృష్టికి తీసుకురాగా పాసు పుస్తకాలు జారీకి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. 
*వ్యవసాయ శాఖ*
వంగర మండలంలో మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వంగర మండలం జడ్పీటీసీ సభ్యులు సురేష్ బెనర్జీ చెప్పగా ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ జెడి వివరించారు. శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ జిల్లా సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. 
*వైద్య ఆరోగ్య శాఖ*
పత్రికలో వచ్చిన కథనంపై తాను స్వయంగా వెళ్లి పరిశీలించానని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సికెడి మందులు గత 8 నెలలుగా సరఫరా చేయడం లేదని జిల్లా పరిషత్ ఛైర్మన్ ఇన్ చార్జ్ డిఎంహెచ్ఓ ను అడుగగా ఇండెంటెడ్ పంపినట్లు డిసిహెచ్ఎస్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా కిడ్నీ రోగులు ఎంత మంది ఉన్నారు.. డయాలసిస్ రోగులు గూర్చి శాసన సభ్యులు కూన రవి కుమార్ అడుగగా జిల్లా వ్యాప్తంగా ఉన్న, ఉద్దానం ప్రాంతంలో ఉన్న కిడ్నీ రోగుల గూర్చి వివరించారు. డయాలసిస్, పడకల గూర్చి తెలిపారు. గతంలో మందులకు ప్రతిపాదనలు పంపలేదని చెప్పారు. డిఎంహెచ్ఓ తో మాట్లాడి కిడ్నీ వ్యాధిగ్రస్తుల పై స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని చైర్మన్ సూచించారు. గతంలో పిహెచ్సీ ద్వారా డ్రగ్స్ ఇచ్చింది లేనిది లేదా సి.హెచ్ సీ ద్వారా ఇచ్చారా లేదని కలెక్టర్ డిసిహెచ్ఎస్ నుఅడుగగా పిహెచ్సీల ద్వారా ఇచ్చినట్లు వివరించారు. సోంపేటలో డయాలసిస్ యూనిట్ మరమ్మతులకు గురయ్యిందని తక్షణమే మరమ్మతులు చేయాలని సోంపేట జడ్పీటీసీ కోరారు. మరమ్మతులు చేపడతామని డిసిహెచ్ఎస్ చెప్పారు. జిల్లాలో క్యాన్సర్ వ్యాధి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, క్యాన్సర్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు విస్తారంగా, విస్తృతంగా విస్తరిస్తుందని, రైతులు విరివిగా ఎరువులు వాడుతున్నారని శాసన సభ్యులు కూన రవి కుమార్ చెప్పారు. విషతుల్యమైన ఆహారం తినడం వలన క్యాన్సర్ వ్యాధికి గురవుతన్నట్లు వివరించారు. ఒకానొక సమయంలో హెచ్ఐవి ఉండేదని, ప్రస్తుతం క్యాన్సర్ శర వేగంగా విస్తరిస్తుందన్నారు. దీనిపై రైతులను అవగాహన పరచాలన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచన చేయాలని కోరారు. 
*ఎపిఈపీడిసియల్*
వ్యవసాయ బోర్లుకు నెలకు 30 రూపాయలు బిల్లులు రైతులకు ఇవ్వాలని శాసన సభ్యులు కూన రవి కుమార్ ఎస్ఈ కు సూచించారు. వీధి దీపాలకు సంబంధించి పంచాయతీలకు బిల్లులు జారీ చేయాలన్నారు. కవిటి సోంపేట, పాతపట్నం లో వోల్టేజీ సమస్య ఉందని దీని వలన ఫ్రిజ్, ఎసిలు పాడవుతున్నాయని, దానిని సరి చేయాలని జడ్పీ ఛైర్మన్ పిరియా విజయ, పాతపట్నం శాసన సభ్యులు మామిడి గోవిందరావులు చెప్పగా లో వోల్టేజ్ సమస్యను సరి చేస్తామని ఎస్ఈ తెలిపారు. 
ఈ సమావేశంలో ఆమదాలవలస శాసన సభ్యులు కూన రవి కుమార్, శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ, మామిడి గోవిందరావు, గొండు శంకర్, నడికుదిటి ఈశ్వరరావు, గౌతు శిరీష, శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్, డిసిఎంఎస్ అధ్యక్షులు అవినాష్, జడ్పీటీసీలు, ఎంపిపిలు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • మీ చిన్నప్పుడు నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాను గాని ఎప్పుడూ ఇలా గ్రాడ్యుకేషన్ డేట్ జరగలేదు కాకపోతే ఫస్ట్ టైం అది టిడిపి హయంలో ఇలా జరుగుతుంది లోకేష్ గారు పిల్లల్ని చాలా మోటివేట్ చేస్తున్నారు
    1
    మీ చిన్నప్పుడు నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాను గాని ఎప్పుడూ ఇలా గ్రాడ్యుకేషన్ డేట్ జరగలేదు కాకపోతే ఫస్ట్ టైం అది టిడిపి హయంలో ఇలా జరుగుతుంది లోకేష్ గారు పిల్లల్ని చాలా మోటివేట్ చేస్తున్నారు
    user_Meenakshi
    Meenakshi
    రాజమండ్రి గ్రామీణ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • మెలియాపుట్టి, ఏప్రిల్ 23: మెలియాపుట్టి మండలంలోని స్థానిక షిరిడి సాయి ఆలయంలో షిరిడి సాయిబాబా తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రాంతం మొత్తం భక్తి శ్రద్ధలతో మారుమోగింది. ఈ కార్యక్రమానికి ఆలయ ప్రధాన దాతలు కాళ్ల రామారావు–పార్వతి దంపతులు ఆధ్వర్యం వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సాయిబాబాకు అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా, భక్తులు పాల్గొని ప్రత్యేక దర్శనం పొందారు. అనంతరం సాయిబాబా విగ్రహానికి పుష్పాలంకరణ చేసి మహా మంగళహారతి నిర్వహించారు.వేడుకల సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వందలాది మందికి ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ఉత్సవ శోభ మరింత పెరిగింది. సాయంత్రం భజన మండళ్లు భక్తి గీతాలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి. పిల్లలు, యువత పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా దాతలు కాళ్ల రామారావు మాట్లాడుతూ, సాయిబాబా ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఈ వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు ఐక్యంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పార్వతి దంపతులు భక్తులకు సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం మీద ఈ వార్షికోత్సవం భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది.
    1
    మెలియాపుట్టి, ఏప్రిల్ 23: మెలియాపుట్టి మండలంలోని స్థానిక షిరిడి సాయి ఆలయంలో షిరిడి సాయిబాబా తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రాంతం మొత్తం భక్తి శ్రద్ధలతో మారుమోగింది.
ఈ కార్యక్రమానికి ఆలయ ప్రధాన దాతలు కాళ్ల రామారావు–పార్వతి దంపతులు ఆధ్వర్యం వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సాయిబాబాకు అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా, భక్తులు పాల్గొని ప్రత్యేక దర్శనం పొందారు. అనంతరం సాయిబాబా విగ్రహానికి పుష్పాలంకరణ చేసి మహా మంగళహారతి నిర్వహించారు.వేడుకల సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వందలాది మందికి ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ఉత్సవ శోభ మరింత పెరిగింది. సాయంత్రం భజన మండళ్లు భక్తి గీతాలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి. పిల్లలు, యువత పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా దాతలు కాళ్ల రామారావు మాట్లాడుతూ, సాయిబాబా ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఈ వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు ఐక్యంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పార్వతి దంపతులు భక్తులకు సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం మీద ఈ వార్షికోత్సవం భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది.
    user_Veluru lochana babu
    Veluru lochana babu
    మేలియాపుట్టి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    43 min ago
  • తెలుకలవాని చెరువు గట్టుపై డంపింగ్ యార్డు గాని, C&D ప్రొసెసింగ్ కేంద్రం గాని ఏర్పాటు చేయొద్దు అంటు వీవర్స్ కాలనీ సచివాలయ పరిధిలోని పాఠశాల విద్యార్థులు గురువారం మద్యాహ్నం నినాదాలు చేశారు. డంపింగ్ యార్డు వద్దు.. క్రీడామైదానం ముద్దు అంటూ ఎండలో నినదించారు.
    1
    తెలుకలవాని చెరువు గట్టుపై డంపింగ్ యార్డు గాని, C&D ప్రొసెసింగ్ కేంద్రం గాని ఏర్పాటు చేయొద్దు అంటు వీవర్స్ కాలనీ సచివాలయ పరిధిలోని పాఠశాల విద్యార్థులు గురువారం మద్యాహ్నం నినాదాలు చేశారు. డంపింగ్ యార్డు వద్దు.. క్రీడామైదానం ముద్దు అంటూ ఎండలో నినదించారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.