logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తాంసి మండలంలోని వడ్డాడి ప్రాజెక్టును బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ప్రాజెక్టు గేట్లను, పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, వడ్డాడి ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. అలాగే, ఈ ప్రాజెక్టు నుండి వడ్డాడి గ్రామం వరకు ఉన్న రహదారిని మెరుగుపరుస్తూ, నూతనంగా బీటీ రోడ్డు నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ విట్ఠల్, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

12 hrs ago
user_AlluriMahesh
AlluriMahesh
Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
12 hrs ago
14984c7d-e461-4b19-9282-ca92933daafb
23e1816f-4e03-4086-bf7a-6c5afa4eafa7

తాంసి మండలంలోని వడ్డాడి ప్రాజెక్టును బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ప్రాజెక్టు గేట్లను, పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, వడ్డాడి ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. అలాగే, ఈ ప్రాజెక్టు నుండి వడ్డాడి గ్రామం వరకు ఉన్న రహదారిని మెరుగుపరుస్తూ, నూతనంగా బీటీ రోడ్డు నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ విట్ఠల్, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం ఉండంగ్రామంలో భక్తిశ్రద్ధలతో సాగిన మౌలాలి వేడుకలు శనివారం సవారీ ముగింపు ఘట్టంతో అత్యంత వైభవంగా పూర్తయ్యాయి. శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరిస్తూ, హిందూ మరియు ముస్లిం సోదరులు కలిసికట్టుగా ఈ ముగింపు వేడుకల్లో పాల్గొని అద్భుతమైన మతసామరస్యాన్ని ప్రదర్శించారు. ఉత్సవాల చివరి రోజున, ప్రత్యేకంగా అలంకరించిన మౌలాలి సవారీ ఊరేగింపు గ్రామ ప్రధాన వీధుల గుండా వైభవంగా కొనసాగింది. గ్రామం మొత్తం భక్తిభావంతో నిండిపోగా, భక్తుల జయజయధ్వానాల మధ్య సవారీ ముగింపు యాత్ర సాగింది. కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి, ముగింపు దశకు చేరుకున్న పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సవారీ ముగింపు ఊరేగింపులో డప్పు వాయిద్యాల నాదం, యువకులు ప్రదర్శించిన సంప్రదాయ అలాయ్ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ, "ప్రతి ఏటా లాగే ఈసారి కూడా హిందూ, ముస్లింలమంతా కలిసి మౌలాలి సవారీ ముగింపు వేడుకను విజయవంతం చేశాం. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించాం" అని తెలిపారు. ఈ వేడుకలు ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి.
    2
    ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం ఉండంగ్రామంలో భక్తిశ్రద్ధలతో సాగిన మౌలాలి వేడుకలు శనివారం సవారీ ముగింపు ఘట్టంతో అత్యంత వైభవంగా పూర్తయ్యాయి. శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరిస్తూ, హిందూ మరియు ముస్లిం సోదరులు కలిసికట్టుగా ఈ ముగింపు వేడుకల్లో పాల్గొని అద్భుతమైన మతసామరస్యాన్ని ప్రదర్శించారు.

ఉత్సవాల చివరి రోజున, ప్రత్యేకంగా అలంకరించిన మౌలాలి సవారీ ఊరేగింపు గ్రామ ప్రధాన వీధుల గుండా వైభవంగా కొనసాగింది. గ్రామం మొత్తం భక్తిభావంతో నిండిపోగా, భక్తుల జయజయధ్వానాల మధ్య సవారీ ముగింపు యాత్ర సాగింది. కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి, ముగింపు దశకు చేరుకున్న పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సవారీ ముగింపు ఊరేగింపులో డప్పు వాయిద్యాల నాదం, యువకులు ప్రదర్శించిన సంప్రదాయ అలాయ్ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ, "ప్రతి ఏటా లాగే ఈసారి కూడా హిందూ, ముస్లింలమంతా కలిసి మౌలాలి సవారీ ముగింపు వేడుకను విజయవంతం చేశాం. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించాం" అని తెలిపారు. ఈ వేడుకలు ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • ఆదిలాబాద్ పట్టణంలోని 23వ వార్డు తాటిగూడలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నూతనంగా నిర్మించుకున్న గృహాలను రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శనివారం ప్రారంభించారు. ఈ గృహాలను డోమటి లావణ్య, వాంఖడే తానుబాయి – మాధవ్ దంపతులు నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు నూతన గృహాలను పరిశీలించి, లబ్ధిదారులను అభినందించారు. వారికి వస్త్రాలు అందజేసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు శాశ్వత నివాస సౌకర్యం కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూషతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ పట్టణంలోని 23వ వార్డు తాటిగూడలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నూతనంగా నిర్మించుకున్న గృహాలను రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శనివారం ప్రారంభించారు.

ఈ గృహాలను డోమటి లావణ్య, వాంఖడే తానుబాయి – మాధవ్ దంపతులు నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు నూతన గృహాలను పరిశీలించి, లబ్ధిదారులను అభినందించారు. వారికి వస్త్రాలు అందజేసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు శాశ్వత నివాస సౌకర్యం కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూషతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    8 hrs ago
  • ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ, తాను కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అయినప్పటికీ, తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. అధికార పార్టీలో తన మాట ఎవ్వరూ వినడం లేదని, మంత్రుల నుంచి పై స్థాయి నాయకత్వం వరకు తన మాటకు విలువే లేదని ఎమ్మెల్యే బొజ్జు సొంత పార్టీ నాయకత్వంపైనే బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.
    1
    ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ, తాను కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అయినప్పటికీ, తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు.

అధికార పార్టీలో తన మాట ఎవ్వరూ వినడం లేదని, మంత్రుల నుంచి పై స్థాయి నాయకత్వం వరకు తన మాటకు విలువే లేదని ఎమ్మెల్యే బొజ్జు సొంత పార్టీ నాయకత్వంపైనే బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • మంచిర్యాల జిల్లా, జన్నారం మండలంలోని తిమ్మాపూర్ ఎంపీయూపీఎస్ పాఠశాల ఒక ఉపాధ్యాయుడి అమానుష ప్రవర్తనతో వార్తల్లో నిలిచింది. పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఏ. సురేందర్‌పై విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పాఠశాల హెడ్ మాస్టర్ రాథోడ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం, ఈ వేధింపులు మార్చి, ఏప్రిల్ నెలల నుంచే మొదలయ్యాయి. ఉపాధ్యాయుడు ఏ. సురేందర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, వారిని మానసికంగా టార్చర్ పెడుతున్నారని ఆయన వెల్లడించారు. దీనిపై స్థానిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయగా, వారు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని నిలదీసి, హెచ్చరించి వెళ్లినట్లు సమాచారం. పాఠశాల స్థాయిలో కౌన్సెలింగ్‌లు నిర్వహించినా, పై అధికారులకు నివేదికలు సమర్పించినా సురేందర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని హెడ్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదంతం తీవ్రరూపం దాల్చడంతో, జిల్లా ఎన్హెన్ఆర్సీ అధికార ప్రతినిధి కామెర కవిత తిమ్మాపూర్ పాఠశాలను స్వయంగా సందర్శించారు. ఆమె తరగతి గదిలో విద్యార్థినులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి, జరిగిన ఘటనలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు కన్నీటి పర్యంతమవుతూ, సురేందర్ సారు పాఠాలు బోధించడం మానేసి, అసభ్యకరమైన పద్ధతిలో తాకడం (బ్యాడ్ టచ్) వంటి పనులకు పాల్పడుతున్నారని వివరించారు. ఉపాధ్యాయుడు బోధనపై దృష్టి పెట్టకుండా మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తూ, విద్యార్థులను వేధిస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు. సురేందర్ సారు తమ పాఠశాలకు అస్సలు వద్దని, ఆయనను వెంటనే ఇక్కడి నుంచి పంపించి వేరే ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థులందరూ ఏకగ్రీవంగా కోరారు.
    1
    మంచిర్యాల జిల్లా, జన్నారం మండలంలోని తిమ్మాపూర్ ఎంపీయూపీఎస్ పాఠశాల ఒక ఉపాధ్యాయుడి అమానుష ప్రవర్తనతో వార్తల్లో నిలిచింది. పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఏ. సురేందర్‌పై విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

పాఠశాల హెడ్ మాస్టర్ రాథోడ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం, ఈ వేధింపులు మార్చి, ఏప్రిల్ నెలల నుంచే మొదలయ్యాయి. ఉపాధ్యాయుడు ఏ. సురేందర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, వారిని మానసికంగా టార్చర్ పెడుతున్నారని ఆయన వెల్లడించారు. దీనిపై స్థానిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయగా, వారు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని నిలదీసి, హెచ్చరించి వెళ్లినట్లు సమాచారం. పాఠశాల స్థాయిలో కౌన్సెలింగ్‌లు నిర్వహించినా, పై అధికారులకు నివేదికలు సమర్పించినా సురేందర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని హెడ్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఉదంతం తీవ్రరూపం దాల్చడంతో, జిల్లా ఎన్హెన్ఆర్సీ అధికార ప్రతినిధి కామెర కవిత తిమ్మాపూర్ పాఠశాలను స్వయంగా సందర్శించారు. ఆమె తరగతి గదిలో విద్యార్థినులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి, జరిగిన ఘటనలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు కన్నీటి పర్యంతమవుతూ, సురేందర్ సారు పాఠాలు బోధించడం మానేసి, అసభ్యకరమైన పద్ధతిలో తాకడం (బ్యాడ్ టచ్) వంటి పనులకు పాల్పడుతున్నారని వివరించారు. ఉపాధ్యాయుడు బోధనపై దృష్టి పెట్టకుండా మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తూ, విద్యార్థులను వేధిస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు.

సురేందర్ సారు తమ పాఠశాలకు అస్సలు వద్దని, ఆయనను వెంటనే ఇక్కడి నుంచి పంపించి వేరే ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థులందరూ ఏకగ్రీవంగా కోరారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • వారాంతం సందర్భంగా తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద తీవ్రమైన వాహన రద్దీ నెలకొంది. కార్లు, బస్సులు, ఇతర వాహనాలు అధిక సంఖ్యలో చేరడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదిలింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. టీటీడీ అధికారులు భక్తులను ట్రాఫిక్ నిబంధనలను పాటించి, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
    1
    వారాంతం సందర్భంగా తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద తీవ్రమైన వాహన రద్దీ నెలకొంది. కార్లు, బస్సులు, ఇతర వాహనాలు అధిక సంఖ్యలో చేరడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదిలింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. టీటీడీ అధికారులు భక్తులను ట్రాఫిక్ నిబంధనలను పాటించి, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    3 hrs ago
  • హైదరాబాద్‌లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకుల కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో హెలెన్ కెల్లర్ 146వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ శాసన సభ్యులు, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైకల్యం విజయానికి అడ్డంకి కాదని, ఆత్మవిశ్వాసం లేకపోవడమే అసలైన అడ్డంకి అని మంత్రి ఉద్ఘాటించారు. శరీరానికి పరిమితులు ఉండొచ్చు కానీ సంకల్పానికి ఎలాంటి పరిమితులు ఉండవని, హెలెన్ కెల్లర్ జీవితం ప్రపంచానికి శాశ్వత స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. కేవలం 19 నెలల వయసులోనే చూపు, వినికిడి కోల్పోయినా ఆమె తన సంకల్పబలంతో ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. విద్యార్థులను ఉద్దేశించి మంత్రి అడ్లూరి మాట్లాడుతూ, దివ్యాంగులు జాలి కోరేవారు కాదని, అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టించే ప్రతిభావంతులు అని అన్నారు. వారి వైకల్యం వారి గుర్తింపు కాదని, వారి విజయమే అసలైన గుర్తింపు అని స్పష్టం చేశారు. ప్రపంచం లోపాన్ని గుర్తుంచుకోదని, సాధించిన విజయాన్ని మాత్రమే చరిత్ర గుర్తుంచుకుంటుందని ఉద్బోధించారు. దృష్టిలోపాన్ని అధిగమించి సివిల్ సర్వీసుల్లో అత్యున్నత విజయాలు సాధించిన యువతను ఉదాహరణగా పేర్కొంటూ, కుటుంబం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని తెలిపారు. ఈ రోజు బెంచ్‌పై కూర్చున్న విద్యార్థులే రేపు జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్, శాస్త్రవేత్తలు, వైద్యులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు కావాలని ఆకాంక్షించారు. వారి పేరు ముందు 'దివ్యాంగుడు' కాదు, 'విజేత' అని సమాజం పిలిచే రోజు రావాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హెలెన్ కెల్లర్ తన గురువు ఆన్ సలివన్ మార్గదర్శకత్వంలో స్పర్శ ద్వారా విద్యను అభ్యసించి, దృష్టి-శ్రవణ వైకల్యం ఉన్న తొలి డిగ్రీధారిణిగా చరిత్ర సృష్టించిందని, రచయిత్రిగా, వక్తగా, సామాజిక సేవకురాలిగా కోట్లాది మంది దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసించారు. ఆమె చీకటిలో జీవించినా ప్రపంచానికి వెలుగు చూపించిందని, హెలెన్ కెల్లర్ కేవలం ఒక వ్యక్తి కాదని, పట్టుదల అనే పదానికి ప్రత్యక్ష రూపం అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం దివ్యాంగులను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా సమాజ నిర్మాణంలో భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా కట్టుబడి పనిచేస్తోందని మంత్రి అడ్లూరి వెల్లడించారు. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచడం, స్కూటీలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలు, సహాయక పరికరాల పంపిణీ వంటి చర్యలు చేపట్టామని తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా రెండున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో సుమారు 2,000 మంది లబ్ధిదారులకు పారదర్శకంగా సహాయం అందించామని వివరించారు. దివ్యాంగ ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రాంతంలో బదిలీలు పొందేందుకు జీవో నెం. 34 ద్వారా అవకాశం కల్పించడం ఈ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమని పేర్కొన్నారు. దివ్యాంగ విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రాధాన్యమిస్తూ కరీంనగర్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడలో ప్రస్తుతం పదో తరగతి వరకు ఉన్న ప్రత్యేక పాఠశాలలను త్వరలో ఇంటర్మీడియట్ వరకు విస్తరించనున్నామని, దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల వేతనాల్లో ఆలస్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, దివ్యాంగుల పెన్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 4,000 నుంచి రూ. 6,000కు పెంచే దిశగా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దివ్యాంగులకు వారి కోటా ప్రకారం ప్రాధాన్యతనిస్తూ ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాల్లోనూ వారికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నామని మంత్రి తెలియజేశారు. దివ్యాంగుల కష్టాలు తనకు బాగా తెలుసని, తాను కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. మీకు మంత్రిగా కాకుండా, మీ కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని, మీ సమస్యల పరిష్కారం తన బాధ్యత అని హామీ ఇచ్చారు. గత పాలకులు దాదాపు పదేళ్లపాటు దివ్యాంగుల సమస్యలను పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం మాత్రం వారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. వికలాంగుల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి వారి సంక్షేమం కోసం పాటుపడిన జావేద్ అబిద్ విగ్రహాన్ని త్వరలో ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తానని మంత్రి అడ్లూరి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న ప్రతిభావంతులైన పలువురు దివ్యాంగ విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర సహాయక పరికరాలు అందజేశారు. అవరోధాలను అవకాశాలుగా, పరిమితులను విజయాలుగా మార్చుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదామని, తెలంగాణ అభివృద్ధి గాథలో మన విజయాలను స్వర్ణాక్షరాలతో లిఖిద్దామని మంత్రి అడ్లూరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి దివ్యాంగ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ వేడుకల్లో మహిళా, శిశు సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, దివ్యాంగుల శాఖ సంచాలకురాలు శైలజ, కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ప్రభంజన్, వివిధ దివ్యాంగ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    4
    హైదరాబాద్‌లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకుల కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో హెలెన్ కెల్లర్ 146వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ శాసన సభ్యులు, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైకల్యం విజయానికి అడ్డంకి కాదని, ఆత్మవిశ్వాసం లేకపోవడమే అసలైన అడ్డంకి అని మంత్రి ఉద్ఘాటించారు. శరీరానికి పరిమితులు ఉండొచ్చు కానీ సంకల్పానికి ఎలాంటి పరిమితులు ఉండవని, హెలెన్ కెల్లర్ జీవితం ప్రపంచానికి శాశ్వత స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. కేవలం 19 నెలల వయసులోనే చూపు, వినికిడి కోల్పోయినా ఆమె తన సంకల్పబలంతో ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసిందని కొనియాడారు.

విద్యార్థులను ఉద్దేశించి మంత్రి అడ్లూరి మాట్లాడుతూ, దివ్యాంగులు జాలి కోరేవారు కాదని, అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టించే ప్రతిభావంతులు అని అన్నారు. వారి వైకల్యం వారి గుర్తింపు కాదని, వారి విజయమే అసలైన గుర్తింపు అని స్పష్టం చేశారు. ప్రపంచం లోపాన్ని గుర్తుంచుకోదని, సాధించిన విజయాన్ని మాత్రమే చరిత్ర గుర్తుంచుకుంటుందని ఉద్బోధించారు. దృష్టిలోపాన్ని అధిగమించి సివిల్ సర్వీసుల్లో అత్యున్నత విజయాలు సాధించిన యువతను ఉదాహరణగా పేర్కొంటూ, కుటుంబం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని తెలిపారు. ఈ రోజు బెంచ్‌పై కూర్చున్న విద్యార్థులే రేపు జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్, శాస్త్రవేత్తలు, వైద్యులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు కావాలని ఆకాంక్షించారు. వారి పేరు ముందు 'దివ్యాంగుడు' కాదు, 'విజేత' అని సమాజం పిలిచే రోజు రావాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హెలెన్ కెల్లర్ తన గురువు ఆన్ సలివన్ మార్గదర్శకత్వంలో స్పర్శ ద్వారా విద్యను అభ్యసించి, దృష్టి-శ్రవణ వైకల్యం ఉన్న తొలి డిగ్రీధారిణిగా చరిత్ర సృష్టించిందని, రచయిత్రిగా, వక్తగా, సామాజిక సేవకురాలిగా కోట్లాది మంది దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసించారు. ఆమె చీకటిలో జీవించినా ప్రపంచానికి వెలుగు చూపించిందని, హెలెన్ కెల్లర్ కేవలం ఒక వ్యక్తి కాదని, పట్టుదల అనే పదానికి ప్రత్యక్ష రూపం అని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం దివ్యాంగులను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా సమాజ నిర్మాణంలో భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా కట్టుబడి పనిచేస్తోందని మంత్రి అడ్లూరి వెల్లడించారు. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచడం, స్కూటీలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలు, సహాయక పరికరాల పంపిణీ వంటి చర్యలు చేపట్టామని తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా రెండున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో సుమారు 2,000 మంది లబ్ధిదారులకు పారదర్శకంగా సహాయం అందించామని వివరించారు. దివ్యాంగ ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రాంతంలో బదిలీలు పొందేందుకు జీవో నెం. 34 ద్వారా అవకాశం కల్పించడం ఈ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమని పేర్కొన్నారు. దివ్యాంగ విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రాధాన్యమిస్తూ కరీంనగర్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడలో ప్రస్తుతం పదో తరగతి వరకు ఉన్న ప్రత్యేక పాఠశాలలను త్వరలో ఇంటర్మీడియట్ వరకు విస్తరించనున్నామని, దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల వేతనాల్లో ఆలస్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, దివ్యాంగుల పెన్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 4,000 నుంచి రూ. 6,000కు పెంచే దిశగా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దివ్యాంగులకు వారి కోటా ప్రకారం ప్రాధాన్యతనిస్తూ ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాల్లోనూ వారికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నామని మంత్రి తెలియజేశారు.

దివ్యాంగుల కష్టాలు తనకు బాగా తెలుసని, తాను కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. మీకు మంత్రిగా కాకుండా, మీ కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని, మీ సమస్యల పరిష్కారం తన బాధ్యత అని హామీ ఇచ్చారు. గత పాలకులు దాదాపు పదేళ్లపాటు దివ్యాంగుల సమస్యలను పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం మాత్రం వారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. వికలాంగుల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి వారి సంక్షేమం కోసం పాటుపడిన జావేద్ అబిద్ విగ్రహాన్ని త్వరలో ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తానని మంత్రి అడ్లూరి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న ప్రతిభావంతులైన పలువురు దివ్యాంగ విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర సహాయక పరికరాలు అందజేశారు. అవరోధాలను అవకాశాలుగా, పరిమితులను విజయాలుగా మార్చుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదామని, తెలంగాణ అభివృద్ధి గాథలో మన విజయాలను స్వర్ణాక్షరాలతో లిఖిద్దామని మంత్రి అడ్లూరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి దివ్యాంగ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ వేడుకల్లో మహిళా, శిశు సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, దివ్యాంగుల శాఖ సంచాలకురాలు శైలజ, కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ప్రభంజన్, వివిధ దివ్యాంగ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసినందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి పాలనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గొంతెత్తిన కారణంగానే ఈ భద్రతను తప్పించినట్లు తెలుస్తోంది.
    1
    ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసినందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి పాలనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గొంతెత్తిన కారణంగానే ఈ భద్రతను తప్పించినట్లు తెలుస్తోంది.
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Engineer Kagaznagar, Kumuram Bheem Asifabad•
    6 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తానీషా ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లకు, పార్టీ శ్రేణులకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాపై అందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి జూపల్లి సూచించారు. అర్హులైన ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదని, అలా జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం కలుగుతుందని ఆయన హెచ్చరించారు. బెంగాల్, బీహార్ రాష్ట్రాల అనుభవాలు తెలంగాణలో పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు. ముఖ్యంగా వలసదారులు, మైనార్టీల ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని, ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని తెలిపారు. ఓటరు జాబితా సవరణను ఒక సవాల్‌గా తీసుకోవాలని, ఓటు హక్కు పరిరక్షణకు బూత్ ఏజెంట్లు ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, నిరాశ నిస్పృహలకు లోనుకావద్దని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికి పార్టీ పదవుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యతను ఇస్తామని స్పష్టం చేశారు.
    4
    ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తానీషా ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లకు, పార్టీ శ్రేణులకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు.

ఓటర్ల జాబితాపై అందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి జూపల్లి సూచించారు. అర్హులైన ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదని, అలా జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం కలుగుతుందని ఆయన హెచ్చరించారు. బెంగాల్, బీహార్ రాష్ట్రాల అనుభవాలు తెలంగాణలో పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు. ముఖ్యంగా వలసదారులు, మైనార్టీల ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని, ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని తెలిపారు. ఓటరు జాబితా సవరణను ఒక సవాల్‌గా తీసుకోవాలని, ఓటు హక్కు పరిరక్షణకు బూత్ ఏజెంట్లు ముందుండాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, నిరాశ నిస్పృహలకు లోనుకావద్దని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికి పార్టీ పదవుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యతను ఇస్తామని స్పష్టం చేశారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.