logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మంచిర్యాల జిల్లా, జన్నారం మండలంలోని తిమ్మాపూర్ ఎంపీయూపీఎస్ పాఠశాల ఒక ఉపాధ్యాయుడి అమానుష ప్రవర్తనతో వార్తల్లో నిలిచింది. పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఏ. సురేందర్‌పై విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పాఠశాల హెడ్ మాస్టర్ రాథోడ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం, ఈ వేధింపులు మార్చి, ఏప్రిల్ నెలల నుంచే మొదలయ్యాయి. ఉపాధ్యాయుడు ఏ. సురేందర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, వారిని మానసికంగా టార్చర్ పెడుతున్నారని ఆయన వెల్లడించారు. దీనిపై స్థానిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయగా, వారు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని నిలదీసి, హెచ్చరించి వెళ్లినట్లు సమాచారం. పాఠశాల స్థాయిలో కౌన్సెలింగ్‌లు నిర్వహించినా, పై అధికారులకు నివేదికలు సమర్పించినా సురేందర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని హెడ్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదంతం తీవ్రరూపం దాల్చడంతో, జిల్లా ఎన్హెన్ఆర్సీ అధికార ప్రతినిధి కామెర కవిత తిమ్మాపూర్ పాఠశాలను స్వయంగా సందర్శించారు. ఆమె తరగతి గదిలో విద్యార్థినులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి, జరిగిన ఘటనలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు కన్నీటి పర్యంతమవుతూ, సురేందర్ సారు పాఠాలు బోధించడం మానేసి, అసభ్యకరమైన పద్ధతిలో తాకడం (బ్యాడ్ టచ్) వంటి పనులకు పాల్పడుతున్నారని వివరించారు. ఉపాధ్యాయుడు బోధనపై దృష్టి పెట్టకుండా మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తూ, విద్యార్థులను వేధిస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు. సురేందర్ సారు తమ పాఠశాలకు అస్సలు వద్దని, ఆయనను వెంటనే ఇక్కడి నుంచి పంపించి వేరే ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థులందరూ ఏకగ్రీవంగా కోరారు.

3 hrs ago
user_తుడుం జితేందర్
తుడుం జితేందర్
Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
3 hrs ago

మంచిర్యాల జిల్లా, జన్నారం మండలంలోని తిమ్మాపూర్ ఎంపీయూపీఎస్ పాఠశాల ఒక ఉపాధ్యాయుడి అమానుష ప్రవర్తనతో వార్తల్లో నిలిచింది. పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఏ. సురేందర్‌పై విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పాఠశాల హెడ్ మాస్టర్ రాథోడ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం, ఈ వేధింపులు మార్చి, ఏప్రిల్ నెలల నుంచే మొదలయ్యాయి. ఉపాధ్యాయుడు ఏ. సురేందర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, వారిని మానసికంగా టార్చర్ పెడుతున్నారని ఆయన వెల్లడించారు. దీనిపై స్థానిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయగా, వారు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని నిలదీసి, హెచ్చరించి వెళ్లినట్లు సమాచారం. పాఠశాల స్థాయిలో కౌన్సెలింగ్‌లు నిర్వహించినా, పై అధికారులకు నివేదికలు సమర్పించినా సురేందర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని హెడ్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదంతం తీవ్రరూపం దాల్చడంతో, జిల్లా ఎన్హెన్ఆర్సీ అధికార ప్రతినిధి కామెర కవిత తిమ్మాపూర్ పాఠశాలను స్వయంగా సందర్శించారు. ఆమె తరగతి గదిలో విద్యార్థినులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి, జరిగిన ఘటనలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు కన్నీటి పర్యంతమవుతూ, సురేందర్ సారు పాఠాలు బోధించడం మానేసి, అసభ్యకరమైన పద్ధతిలో తాకడం (బ్యాడ్ టచ్) వంటి పనులకు పాల్పడుతున్నారని వివరించారు. ఉపాధ్యాయుడు బోధనపై దృష్టి పెట్టకుండా మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తూ, విద్యార్థులను వేధిస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు. సురేందర్ సారు తమ పాఠశాలకు అస్సలు వద్దని, ఆయనను వెంటనే ఇక్కడి నుంచి పంపించి వేరే ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థులందరూ ఏకగ్రీవంగా కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ, తాను కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అయినప్పటికీ, తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. అధికార పార్టీలో తన మాట ఎవ్వరూ వినడం లేదని, మంత్రుల నుంచి పై స్థాయి నాయకత్వం వరకు తన మాటకు విలువే లేదని ఎమ్మెల్యే బొజ్జు సొంత పార్టీ నాయకత్వంపైనే బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.
    1
    ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ, తాను కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అయినప్పటికీ, తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు.

అధికార పార్టీలో తన మాట ఎవ్వరూ వినడం లేదని, మంత్రుల నుంచి పై స్థాయి నాయకత్వం వరకు తన మాటకు విలువే లేదని ఎమ్మెల్యే బొజ్జు సొంత పార్టీ నాయకత్వంపైనే బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • మంచిర్యాల జిల్లా, జన్నారం మండలంలోని తిమ్మాపూర్ ఎంపీయూపీఎస్ పాఠశాల ఒక ఉపాధ్యాయుడి అమానుష ప్రవర్తనతో వార్తల్లో నిలిచింది. పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఏ. సురేందర్‌పై విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పాఠశాల హెడ్ మాస్టర్ రాథోడ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం, ఈ వేధింపులు మార్చి, ఏప్రిల్ నెలల నుంచే మొదలయ్యాయి. ఉపాధ్యాయుడు ఏ. సురేందర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, వారిని మానసికంగా టార్చర్ పెడుతున్నారని ఆయన వెల్లడించారు. దీనిపై స్థానిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయగా, వారు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని నిలదీసి, హెచ్చరించి వెళ్లినట్లు సమాచారం. పాఠశాల స్థాయిలో కౌన్సెలింగ్‌లు నిర్వహించినా, పై అధికారులకు నివేదికలు సమర్పించినా సురేందర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని హెడ్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదంతం తీవ్రరూపం దాల్చడంతో, జిల్లా ఎన్హెన్ఆర్సీ అధికార ప్రతినిధి కామెర కవిత తిమ్మాపూర్ పాఠశాలను స్వయంగా సందర్శించారు. ఆమె తరగతి గదిలో విద్యార్థినులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి, జరిగిన ఘటనలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు కన్నీటి పర్యంతమవుతూ, సురేందర్ సారు పాఠాలు బోధించడం మానేసి, అసభ్యకరమైన పద్ధతిలో తాకడం (బ్యాడ్ టచ్) వంటి పనులకు పాల్పడుతున్నారని వివరించారు. ఉపాధ్యాయుడు బోధనపై దృష్టి పెట్టకుండా మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తూ, విద్యార్థులను వేధిస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు. సురేందర్ సారు తమ పాఠశాలకు అస్సలు వద్దని, ఆయనను వెంటనే ఇక్కడి నుంచి పంపించి వేరే ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థులందరూ ఏకగ్రీవంగా కోరారు.
    1
    మంచిర్యాల జిల్లా, జన్నారం మండలంలోని తిమ్మాపూర్ ఎంపీయూపీఎస్ పాఠశాల ఒక ఉపాధ్యాయుడి అమానుష ప్రవర్తనతో వార్తల్లో నిలిచింది. పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఏ. సురేందర్‌పై విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

పాఠశాల హెడ్ మాస్టర్ రాథోడ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం, ఈ వేధింపులు మార్చి, ఏప్రిల్ నెలల నుంచే మొదలయ్యాయి. ఉపాధ్యాయుడు ఏ. సురేందర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, వారిని మానసికంగా టార్చర్ పెడుతున్నారని ఆయన వెల్లడించారు. దీనిపై స్థానిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయగా, వారు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని నిలదీసి, హెచ్చరించి వెళ్లినట్లు సమాచారం. పాఠశాల స్థాయిలో కౌన్సెలింగ్‌లు నిర్వహించినా, పై అధికారులకు నివేదికలు సమర్పించినా సురేందర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని హెడ్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఉదంతం తీవ్రరూపం దాల్చడంతో, జిల్లా ఎన్హెన్ఆర్సీ అధికార ప్రతినిధి కామెర కవిత తిమ్మాపూర్ పాఠశాలను స్వయంగా సందర్శించారు. ఆమె తరగతి గదిలో విద్యార్థినులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి, జరిగిన ఘటనలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు కన్నీటి పర్యంతమవుతూ, సురేందర్ సారు పాఠాలు బోధించడం మానేసి, అసభ్యకరమైన పద్ధతిలో తాకడం (బ్యాడ్ టచ్) వంటి పనులకు పాల్పడుతున్నారని వివరించారు. ఉపాధ్యాయుడు బోధనపై దృష్టి పెట్టకుండా మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తూ, విద్యార్థులను వేధిస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు.

సురేందర్ సారు తమ పాఠశాలకు అస్సలు వద్దని, ఆయనను వెంటనే ఇక్కడి నుంచి పంపించి వేరే ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థులందరూ ఏకగ్రీవంగా కోరారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • హైదరాబాద్‌లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకుల కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో హెలెన్ కెల్లర్ 146వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ శాసన సభ్యులు, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైకల్యం విజయానికి అడ్డంకి కాదని, ఆత్మవిశ్వాసం లేకపోవడమే అసలైన అడ్డంకి అని మంత్రి ఉద్ఘాటించారు. శరీరానికి పరిమితులు ఉండొచ్చు కానీ సంకల్పానికి ఎలాంటి పరిమితులు ఉండవని, హెలెన్ కెల్లర్ జీవితం ప్రపంచానికి శాశ్వత స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. కేవలం 19 నెలల వయసులోనే చూపు, వినికిడి కోల్పోయినా ఆమె తన సంకల్పబలంతో ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. విద్యార్థులను ఉద్దేశించి మంత్రి అడ్లూరి మాట్లాడుతూ, దివ్యాంగులు జాలి కోరేవారు కాదని, అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టించే ప్రతిభావంతులు అని అన్నారు. వారి వైకల్యం వారి గుర్తింపు కాదని, వారి విజయమే అసలైన గుర్తింపు అని స్పష్టం చేశారు. ప్రపంచం లోపాన్ని గుర్తుంచుకోదని, సాధించిన విజయాన్ని మాత్రమే చరిత్ర గుర్తుంచుకుంటుందని ఉద్బోధించారు. దృష్టిలోపాన్ని అధిగమించి సివిల్ సర్వీసుల్లో అత్యున్నత విజయాలు సాధించిన యువతను ఉదాహరణగా పేర్కొంటూ, కుటుంబం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని తెలిపారు. ఈ రోజు బెంచ్‌పై కూర్చున్న విద్యార్థులే రేపు జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్, శాస్త్రవేత్తలు, వైద్యులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు కావాలని ఆకాంక్షించారు. వారి పేరు ముందు 'దివ్యాంగుడు' కాదు, 'విజేత' అని సమాజం పిలిచే రోజు రావాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హెలెన్ కెల్లర్ తన గురువు ఆన్ సలివన్ మార్గదర్శకత్వంలో స్పర్శ ద్వారా విద్యను అభ్యసించి, దృష్టి-శ్రవణ వైకల్యం ఉన్న తొలి డిగ్రీధారిణిగా చరిత్ర సృష్టించిందని, రచయిత్రిగా, వక్తగా, సామాజిక సేవకురాలిగా కోట్లాది మంది దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసించారు. ఆమె చీకటిలో జీవించినా ప్రపంచానికి వెలుగు చూపించిందని, హెలెన్ కెల్లర్ కేవలం ఒక వ్యక్తి కాదని, పట్టుదల అనే పదానికి ప్రత్యక్ష రూపం అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం దివ్యాంగులను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా సమాజ నిర్మాణంలో భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా కట్టుబడి పనిచేస్తోందని మంత్రి అడ్లూరి వెల్లడించారు. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచడం, స్కూటీలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలు, సహాయక పరికరాల పంపిణీ వంటి చర్యలు చేపట్టామని తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా రెండున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో సుమారు 2,000 మంది లబ్ధిదారులకు పారదర్శకంగా సహాయం అందించామని వివరించారు. దివ్యాంగ ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రాంతంలో బదిలీలు పొందేందుకు జీవో నెం. 34 ద్వారా అవకాశం కల్పించడం ఈ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమని పేర్కొన్నారు. దివ్యాంగ విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రాధాన్యమిస్తూ కరీంనగర్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడలో ప్రస్తుతం పదో తరగతి వరకు ఉన్న ప్రత్యేక పాఠశాలలను త్వరలో ఇంటర్మీడియట్ వరకు విస్తరించనున్నామని, దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల వేతనాల్లో ఆలస్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, దివ్యాంగుల పెన్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 4,000 నుంచి రూ. 6,000కు పెంచే దిశగా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దివ్యాంగులకు వారి కోటా ప్రకారం ప్రాధాన్యతనిస్తూ ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాల్లోనూ వారికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నామని మంత్రి తెలియజేశారు. దివ్యాంగుల కష్టాలు తనకు బాగా తెలుసని, తాను కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. మీకు మంత్రిగా కాకుండా, మీ కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని, మీ సమస్యల పరిష్కారం తన బాధ్యత అని హామీ ఇచ్చారు. గత పాలకులు దాదాపు పదేళ్లపాటు దివ్యాంగుల సమస్యలను పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం మాత్రం వారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. వికలాంగుల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి వారి సంక్షేమం కోసం పాటుపడిన జావేద్ అబిద్ విగ్రహాన్ని త్వరలో ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తానని మంత్రి అడ్లూరి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న ప్రతిభావంతులైన పలువురు దివ్యాంగ విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర సహాయక పరికరాలు అందజేశారు. అవరోధాలను అవకాశాలుగా, పరిమితులను విజయాలుగా మార్చుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదామని, తెలంగాణ అభివృద్ధి గాథలో మన విజయాలను స్వర్ణాక్షరాలతో లిఖిద్దామని మంత్రి అడ్లూరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి దివ్యాంగ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ వేడుకల్లో మహిళా, శిశు సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, దివ్యాంగుల శాఖ సంచాలకురాలు శైలజ, కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ప్రభంజన్, వివిధ దివ్యాంగ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    4
    హైదరాబాద్‌లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకుల కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో హెలెన్ కెల్లర్ 146వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ శాసన సభ్యులు, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైకల్యం విజయానికి అడ్డంకి కాదని, ఆత్మవిశ్వాసం లేకపోవడమే అసలైన అడ్డంకి అని మంత్రి ఉద్ఘాటించారు. శరీరానికి పరిమితులు ఉండొచ్చు కానీ సంకల్పానికి ఎలాంటి పరిమితులు ఉండవని, హెలెన్ కెల్లర్ జీవితం ప్రపంచానికి శాశ్వత స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. కేవలం 19 నెలల వయసులోనే చూపు, వినికిడి కోల్పోయినా ఆమె తన సంకల్పబలంతో ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసిందని కొనియాడారు.

విద్యార్థులను ఉద్దేశించి మంత్రి అడ్లూరి మాట్లాడుతూ, దివ్యాంగులు జాలి కోరేవారు కాదని, అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టించే ప్రతిభావంతులు అని అన్నారు. వారి వైకల్యం వారి గుర్తింపు కాదని, వారి విజయమే అసలైన గుర్తింపు అని స్పష్టం చేశారు. ప్రపంచం లోపాన్ని గుర్తుంచుకోదని, సాధించిన విజయాన్ని మాత్రమే చరిత్ర గుర్తుంచుకుంటుందని ఉద్బోధించారు. దృష్టిలోపాన్ని అధిగమించి సివిల్ సర్వీసుల్లో అత్యున్నత విజయాలు సాధించిన యువతను ఉదాహరణగా పేర్కొంటూ, కుటుంబం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని తెలిపారు. ఈ రోజు బెంచ్‌పై కూర్చున్న విద్యార్థులే రేపు జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్, శాస్త్రవేత్తలు, వైద్యులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు కావాలని ఆకాంక్షించారు. వారి పేరు ముందు 'దివ్యాంగుడు' కాదు, 'విజేత' అని సమాజం పిలిచే రోజు రావాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హెలెన్ కెల్లర్ తన గురువు ఆన్ సలివన్ మార్గదర్శకత్వంలో స్పర్శ ద్వారా విద్యను అభ్యసించి, దృష్టి-శ్రవణ వైకల్యం ఉన్న తొలి డిగ్రీధారిణిగా చరిత్ర సృష్టించిందని, రచయిత్రిగా, వక్తగా, సామాజిక సేవకురాలిగా కోట్లాది మంది దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసించారు. ఆమె చీకటిలో జీవించినా ప్రపంచానికి వెలుగు చూపించిందని, హెలెన్ కెల్లర్ కేవలం ఒక వ్యక్తి కాదని, పట్టుదల అనే పదానికి ప్రత్యక్ష రూపం అని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం దివ్యాంగులను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా సమాజ నిర్మాణంలో భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా కట్టుబడి పనిచేస్తోందని మంత్రి అడ్లూరి వెల్లడించారు. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచడం, స్కూటీలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలు, సహాయక పరికరాల పంపిణీ వంటి చర్యలు చేపట్టామని తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా రెండున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో సుమారు 2,000 మంది లబ్ధిదారులకు పారదర్శకంగా సహాయం అందించామని వివరించారు. దివ్యాంగ ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రాంతంలో బదిలీలు పొందేందుకు జీవో నెం. 34 ద్వారా అవకాశం కల్పించడం ఈ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమని పేర్కొన్నారు. దివ్యాంగ విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రాధాన్యమిస్తూ కరీంనగర్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడలో ప్రస్తుతం పదో తరగతి వరకు ఉన్న ప్రత్యేక పాఠశాలలను త్వరలో ఇంటర్మీడియట్ వరకు విస్తరించనున్నామని, దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల వేతనాల్లో ఆలస్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, దివ్యాంగుల పెన్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 4,000 నుంచి రూ. 6,000కు పెంచే దిశగా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దివ్యాంగులకు వారి కోటా ప్రకారం ప్రాధాన్యతనిస్తూ ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాల్లోనూ వారికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నామని మంత్రి తెలియజేశారు.

దివ్యాంగుల కష్టాలు తనకు బాగా తెలుసని, తాను కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. మీకు మంత్రిగా కాకుండా, మీ కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని, మీ సమస్యల పరిష్కారం తన బాధ్యత అని హామీ ఇచ్చారు. గత పాలకులు దాదాపు పదేళ్లపాటు దివ్యాంగుల సమస్యలను పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం మాత్రం వారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. వికలాంగుల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి వారి సంక్షేమం కోసం పాటుపడిన జావేద్ అబిద్ విగ్రహాన్ని త్వరలో ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తానని మంత్రి అడ్లూరి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న ప్రతిభావంతులైన పలువురు దివ్యాంగ విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర సహాయక పరికరాలు అందజేశారు. అవరోధాలను అవకాశాలుగా, పరిమితులను విజయాలుగా మార్చుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదామని, తెలంగాణ అభివృద్ధి గాథలో మన విజయాలను స్వర్ణాక్షరాలతో లిఖిద్దామని మంత్రి అడ్లూరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి దివ్యాంగ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ వేడుకల్లో మహిళా, శిశు సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, దివ్యాంగుల శాఖ సంచాలకురాలు శైలజ, కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ప్రభంజన్, వివిధ దివ్యాంగ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసినందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి పాలనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గొంతెత్తిన కారణంగానే ఈ భద్రతను తప్పించినట్లు తెలుస్తోంది.
    1
    ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసినందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి పాలనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గొంతెత్తిన కారణంగానే ఈ భద్రతను తప్పించినట్లు తెలుస్తోంది.
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Engineer Kagaznagar, Kumuram Bheem Asifabad•
    2 hrs ago
  • మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద, జూలై 5న భువనగిరిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) నిర్వహించనున్న "రాజ్యాధికార సమరభేరి" బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా కన్వీనర్ అల్లి సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాంటెంకి, కో-కన్వీనర్ రంజిత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ, బహుజనుల రాజ్యాధికార సాధనే లక్ష్యంగా జరుగుతున్న ఈ సభ చారిత్రాత్మకమైనదని అన్నారు. సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కోసం జరిగే ఈ సభకు మంచిర్యాల జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, బహుజన ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రంజిత్, రవీంద్ర, మహేష్ వర్మ, దినకర్, శివ, రవీందర్, రూప, దిలీప్, లతీఫ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద, జూలై 5న భువనగిరిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) నిర్వహించనున్న "రాజ్యాధికార సమరభేరి" బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా కన్వీనర్ అల్లి సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాంటెంకి, కో-కన్వీనర్ రంజిత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ, బహుజనుల రాజ్యాధికార సాధనే లక్ష్యంగా జరుగుతున్న ఈ సభ చారిత్రాత్మకమైనదని అన్నారు. సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కోసం జరిగే ఈ సభకు మంచిర్యాల జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, బహుజన ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రంజిత్, రవీంద్ర, మహేష్ వర్మ, దినకర్, శివ, రవీందర్, రూప, దిలీప్, లతీఫ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం, మర్రిగడ్డ గ్రామంలో శనివారం మహిళలు ప్రత్యేకంగా బతుకమ్మలు ఆడి వరుణ దేవుడిని వేడుకున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున, విత్తనాలు వేసిన సమయానికి వర్షం పడకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళలు సామూహికంగా బతుకమ్మను పేర్చి, "వరుణ దేవా కరుణించవా" అంటూ పాటలు పాడుతూ సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆట ఆడారు. గ్రామంలోని ఉపాధి హామీ పనులు చేసే మహిళలందరూ ఒకచోట చేరి, నీటి బిందెల కు పూలతో బతుకమ్మలను అలంకరించారు. అనంతరం, వారు వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి, వర్షాలు పడాలని, చెరువులు నిండాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ దేవతలను వేడుకుంటూ పాటలు పాడారు. ఇలా పాటలు పాడుతూ, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆటలు ఆడటం వల్ల వరుణ దేవుడు ప్రసన్నుడై వర్షాలు కురిపిస్తాడని గ్రామ మహిళలు విశ్వసిస్తున్నారు. ఈ బతుకమ్మ వేడుకల్లో గ్రామ సర్పంచి దూది మనిషా పాల్గొన్నారు. అలాగే, సర్పంచ్ దూది మనిషా శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కవిత, మరియు అతిపెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం, మర్రిగడ్డ గ్రామంలో శనివారం మహిళలు ప్రత్యేకంగా బతుకమ్మలు ఆడి వరుణ దేవుడిని వేడుకున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున, విత్తనాలు వేసిన సమయానికి వర్షం పడకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళలు సామూహికంగా బతుకమ్మను పేర్చి, "వరుణ దేవా కరుణించవా" అంటూ పాటలు పాడుతూ సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆట ఆడారు.

గ్రామంలోని ఉపాధి హామీ పనులు చేసే మహిళలందరూ ఒకచోట చేరి, నీటి బిందెల కు పూలతో బతుకమ్మలను అలంకరించారు. అనంతరం, వారు వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి, వర్షాలు పడాలని, చెరువులు నిండాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ దేవతలను వేడుకుంటూ పాటలు పాడారు. ఇలా పాటలు పాడుతూ, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆటలు ఆడటం వల్ల వరుణ దేవుడు ప్రసన్నుడై వర్షాలు కురిపిస్తాడని గ్రామ మహిళలు విశ్వసిస్తున్నారు. ఈ బతుకమ్మ వేడుకల్లో గ్రామ సర్పంచి దూది మనిషా పాల్గొన్నారు. అలాగే, సర్పంచ్ దూది మనిషా శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కవిత, మరియు అతిపెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 min ago
  • కరీంనగర్ నగరంలోని ఐదవ డివిజన్ బొమ్మకల్ శివారులోని రాజరాజేశ్వరి కాలనీలో ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నేడు పున: ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాల్గొని, దొంగిలించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి దుబ్బ పల్లిలో వదిలివేసి వెళ్లారని కాలనీవాసులు గుర్తించి, దానిని తిరిగి కాలనీకి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే గంగుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా, ఆయన విగ్రహ పున: ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ, బొమ్మకల్ గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు, సుమారు 1989లో 125వ సర్వే నంబర్‌లో ప్లాటింగ్ జరిగిందని తెలిపారు. కాలనీ ఏర్పడేందుకు ప్లాటింగ్ చేసిన స్థలంలో 10 శాతం భూమిని పాఠశాలలు, ఆలయాలు లేదా కమ్యూనిటీ అవసరాల కోసం వదిలిపెట్టాలనే నిబంధన ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ నిబంధన ప్రకారం, 125 సర్వే నంబర్‌లో కాలనీవాసులందరూ కలిసి గత 20 ఏళ్లుగా బతుకమ్మ, వినాయక నవరాత్రి, దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడంతో పాటు ఈ స్థలంలో హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తాత్కాలిక గుడి నిర్మించుకున్నారని వివరించారు. అయితే, ఏడాది కాలం క్రితం నుండి ఈ భూమిపై భూ కబ్జాదారుల కన్ను పడిందని, అప్పటి నుండి వారు భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. చివరకు, నాలుగు రోజుల క్రితం హనుమాన్ విగ్రహాన్ని అక్కడి నుండి దొంగిలించి, ఆ స్థలానికి ఫెన్సింగ్ వేశారని తెలిపారు. ఈ విషయం కాలనీవాసుల ద్వారా తెలుసుకున్న తాను స్వయంగా దగ్గర ఉండి విగ్రహాన్ని ప్రతిష్ట చేశానని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మరోసారి ఇటువంటి చర్యలు పునరావృతమైతే, కరీంనగర్ బంద్‌కు పిలుపునిచ్చి, హిందువులందరినీ తీసుకువచ్చి గుడి కడతానని ఎమ్మెల్యే గంగుల తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు డివిజన్ కార్పొరేటర్ గాదే రూప-శ్రీనివాస్, నాయకులు తోట కిరణ్, లక్ష్మన్, అశోక్ మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
    2
    కరీంనగర్ నగరంలోని ఐదవ డివిజన్ బొమ్మకల్ శివారులోని రాజరాజేశ్వరి కాలనీలో ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నేడు పున: ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాల్గొని, దొంగిలించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.

ఈ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి దుబ్బ పల్లిలో వదిలివేసి వెళ్లారని కాలనీవాసులు గుర్తించి, దానిని తిరిగి కాలనీకి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే గంగుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా, ఆయన విగ్రహ పున: ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ, బొమ్మకల్ గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు, సుమారు 1989లో 125వ సర్వే నంబర్‌లో ప్లాటింగ్ జరిగిందని తెలిపారు. కాలనీ ఏర్పడేందుకు ప్లాటింగ్ చేసిన స్థలంలో 10 శాతం భూమిని పాఠశాలలు, ఆలయాలు లేదా కమ్యూనిటీ అవసరాల కోసం వదిలిపెట్టాలనే నిబంధన ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ నిబంధన ప్రకారం, 125 సర్వే నంబర్‌లో కాలనీవాసులందరూ కలిసి గత 20 ఏళ్లుగా బతుకమ్మ, వినాయక నవరాత్రి, దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడంతో పాటు ఈ స్థలంలో హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తాత్కాలిక గుడి నిర్మించుకున్నారని వివరించారు.

అయితే, ఏడాది కాలం క్రితం నుండి ఈ భూమిపై భూ కబ్జాదారుల కన్ను పడిందని, అప్పటి నుండి వారు భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. చివరకు, నాలుగు రోజుల క్రితం హనుమాన్ విగ్రహాన్ని అక్కడి నుండి దొంగిలించి, ఆ స్థలానికి ఫెన్సింగ్ వేశారని తెలిపారు. ఈ విషయం కాలనీవాసుల ద్వారా తెలుసుకున్న తాను స్వయంగా దగ్గర ఉండి విగ్రహాన్ని ప్రతిష్ట చేశానని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

మరోసారి ఇటువంటి చర్యలు పునరావృతమైతే, కరీంనగర్ బంద్‌కు పిలుపునిచ్చి, హిందువులందరినీ తీసుకువచ్చి గుడి కడతానని ఎమ్మెల్యే గంగుల తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు డివిజన్ కార్పొరేటర్ గాదే రూప-శ్రీనివాస్, నాయకులు తోట కిరణ్, లక్ష్మన్, అశోక్ మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • జగిత్యాల మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన ముత్తునూరి నీరజ రాజుకు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నిబంధనల ప్రకారం వేగంగా పూర్తి చేసుకున్న ఆ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం శనివారం నిర్వహించబడింది. ఈ వేడుకకు వారి ఆహ్వానం మేరకు ఉదయం 10 గంటల ప్రాంతంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, నీరజ రాజు కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపి, వారికి చీరను కానుకగా అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, మాజీ ఏఎంసీ ఛైర్మన్ నక్కల రవీందర్ రెడ్డి, సర్పంచ్ మహేష్, మాజీ సర్పంచ్ అంకం సతీష్, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు తదితరులు కూడా పాల్గొన్నారు.
    3
    జగిత్యాల మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన ముత్తునూరి నీరజ రాజుకు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నిబంధనల ప్రకారం వేగంగా పూర్తి చేసుకున్న ఆ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం శనివారం నిర్వహించబడింది. ఈ వేడుకకు వారి ఆహ్వానం మేరకు ఉదయం 10 గంటల ప్రాంతంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు.

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, నీరజ రాజు కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపి, వారికి చీరను కానుకగా అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, మాజీ ఏఎంసీ ఛైర్మన్ నక్కల రవీందర్ రెడ్డి, సర్పంచ్ మహేష్, మాజీ సర్పంచ్ అంకం సతీష్, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు తదితరులు కూడా పాల్గొన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.