40 సంవత్సరాలు నివాసమున్న ఇండ్లకు పట్టాలు లేని వైనం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్న కోసిని గ్రామ ప్రజలు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కోసిని గ్రామపంచాయతీ పరిధిలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న నిరుపేదల సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది. దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద కుటుంబాలు, ఇంటి స్థలాల పట్టాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . గ్రామం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చిన్న చిన్న ఇళ్లు, గుడిసెలు వేసుకుని గత 15 నుంచి 40 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. కొంతమంది 40 ఏళ్లుగా, మరికొందరు 30 ఏళ్లుగా, ఇంకొందరు 15 ఏళ్లుగా అక్కడే జీవిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు అధికారికంగా ఇంటి స్థలాల పట్టాలు అందలేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కోసిని గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు అందజేశారు. తమ దీన స్థితిని గమనించి, సంబంధిత అధికారులతో సర్వే నిర్వహించి, తాము ఎన్నేళ్లుగా నివసిస్తున్న స్థలాలకు తమకే ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
40 సంవత్సరాలు నివాసమున్న ఇండ్లకు పట్టాలు లేని వైనం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్న కోసిని గ్రామ ప్రజలు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కోసిని గ్రామపంచాయతీ పరిధిలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న నిరుపేదల సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది. దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద కుటుంబాలు, ఇంటి స్థలాల
పట్టాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . గ్రామం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చిన్న చిన్న ఇళ్లు, గుడిసెలు వేసుకుని గత 15 నుంచి 40 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. కొంతమంది 40 ఏళ్లుగా, మరికొందరు 30 ఏళ్లుగా, ఇంకొందరు 15 ఏళ్లుగా అక్కడే జీవిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు అధికారికంగా ఇంటి
స్థలాల పట్టాలు అందలేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కోసిని గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు అందజేశారు. తమ దీన స్థితిని గమనించి, సంబంధిత అధికారులతో సర్వే నిర్వహించి, తాము ఎన్నేళ్లుగా నివసిస్తున్న స్థలాలకు తమకే ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- Post by Golem Venkatesham Patel3
- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితిక పంత్ పాల్గొని పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి రంగుల సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి వేడుకలు స్నేహభావం, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు1
- Post by Bharath Newz1
- *మరో బస్సు ప్రమాదం.....ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 10 మందికి గాయాలు!* తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఏపీ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న నిడదవోలు ఆర్టీసీ బస్సు రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1
- Post by Ravi Poreddy1
- వికారాబాద్ లో నిర్వహించిన డిసిసి అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు డాన్స్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిసిసి అధ్యక్షుల ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతులమీదగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న బొజ్జు డాన్స్ చేస్తూ మెమోరాండం పొందారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ గీతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోలీస్ సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుంటూ, డాన్స్ చేస్తూ ఎస్పీ మహేష్ గీతే సందడి చేశారు. అధికారులతో కలిసి స్టెప్పులు వేస్తూ హోలీ ఆనందాన్ని పంచుకున్నారు. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే పోలీస్ శాఖలోనూ ఇలాంటి వేడుకలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం పోలీస్ కార్యాలయం రంగుల మయంగా మారి హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి.1
- 17 నుంచి నిరవధిక సమ్మె హెచ్చరిక: లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఎఐటియుసి ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న లారీ డ్రైవర్లు, క్లీనర్లు, హెల్పర్లు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారు. రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడం, కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఈనెల 17 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు హెచ్చరించారు. డ్రైవర్లకు కనీస వేతనం రూ.32 వేల, క్లీనర్లకు రూ.18 వేల, ఇన్సూరెన్స్, బోనస్, 8 గంటల పని విధానం, పీఎఫ్–ఈఎస్ఐ, క్వార్టర్లు తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ట్రాన్స్‌పోర్ట్ కార్మికులు పాల్గొన్నారు.1