logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పూలే–అంబేద్కర్ స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఏ ఎస్ రావు నగర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పూలే–అంబేద్కర్ స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఫ్యామిలీ గెట్‌టుగెదర్ మరియు సభను ఘనంగా నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని సామాజిక సమానత్వ దినంగా జరుపుకుంటారు .ఈ కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌సీ–ఈసీఐఎల్ కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న పిల్లలు, మహిళల కోసం ఆటల పోటీలు, విజ్ఞానదాయక క్విజ్ పోటీలు నిర్వహించి పాల్గొన్న వారిని ఉత్సాహపరిచారు. అనంతరం జరిగిన సభకు గద్దల నరసింహారావు సమన్వయకర్తగా వ్యవహరించారు. ముఖ్య అతిథిగా హేమేంద్రనాథ్ (డీజీఎం), ఎస్సీ–ఎస్టీ లైజానింగ్ ఆఫీసర్ మల్లేశం, సామాజిక ఉద్యమ నేత కోమటి రవి, మాజీ ప్రిన్సిపాల్ పద్మావతి, ఈసీఐఎల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుధీర్, స్ఫూర్తి గ్రూప్ నాయకులు బాలకృష్ణ, గొడుగు యాదగిరి రావు తదితరులు పాల్గొన్నారు.ముందుగా మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చిత్రపటాలతో పాటు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ముఖ్య అతిథి హేమేంద్రనాథ్ మాట్లాడుతూ స్ఫూర్తి గ్రూప్ గత మూడు సంవత్సరాలుగా కుటుంబ సమేతంగా విజ్ఞానం, వినోదం కలగలిపిన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అంబేద్కర్ భవన్‌ను ఇలాంటి కార్యక్రమాలకు వినియోగించడం సంతోషకరమని పేర్కొన్నారు.పద్మావతి మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వ్యక్తి మాత్రమే కాకుండా గొప్ప సామాజిక ఉద్యమ నేత, విజ్ఞాన గని అని పేర్కొన్నారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం దేశ ప్రజలకు మార్గదర్శకమని తెలిపారు. కోమటి రవి మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. సుధీర్ మాట్లాడుతూ రాజ్యాంగం వల్లే నేడు విద్య, ఉద్యోగ అవకాశాలు అందరికీ లభిస్తున్నాయని అన్నారు.ఈ సందర్భంగా సేవారంగంలో ప్రతిభ కనబరిచిన సింహాచలం దంపతులను సత్కరించారు.అలాగే ఆదర్శ దంపతులుగా నిలిచిన పలువురిని చేనేత వస్త్రాలు, పుస్తకాలతో గౌరవించారు. పోటీల లో విజేతలైన పిల్లలు, మహిళలకు బహుమతులు అందజేశారు.చివరగా సురేష్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. అనంతరం అందరూ సమిష్టిగా భోజనాలు చేసి “జై భీమ్” నినాదాలతో కార్యక్రమాన్ని ముగించారు.

2 hrs ago
user_Suresh Sagar
Suresh Sagar
కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
2 hrs ago
fa750d90-fb9d-4fc4-82bb-54664af8b2cc

పూలే–అంబేద్కర్ స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఏ ఎస్ రావు నగర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పూలే–అంబేద్కర్ స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఫ్యామిలీ గెట్‌టుగెదర్ మరియు సభను ఘనంగా నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని సామాజిక సమానత్వ దినంగా జరుపుకుంటారు .ఈ కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌సీ–ఈసీఐఎల్ కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న పిల్లలు, మహిళల కోసం ఆటల పోటీలు, విజ్ఞానదాయక క్విజ్ పోటీలు నిర్వహించి పాల్గొన్న వారిని ఉత్సాహపరిచారు. అనంతరం జరిగిన సభకు గద్దల నరసింహారావు సమన్వయకర్తగా వ్యవహరించారు. ముఖ్య అతిథిగా హేమేంద్రనాథ్ (డీజీఎం), ఎస్సీ–ఎస్టీ లైజానింగ్ ఆఫీసర్ మల్లేశం, సామాజిక ఉద్యమ నేత కోమటి రవి, మాజీ ప్రిన్సిపాల్ పద్మావతి, ఈసీఐఎల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుధీర్, స్ఫూర్తి గ్రూప్ నాయకులు బాలకృష్ణ, గొడుగు యాదగిరి రావు తదితరులు పాల్గొన్నారు.ముందుగా మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చిత్రపటాలతో

f76bff3f-3762-45b0-a087-d92594bfb6b1

పాటు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ముఖ్య అతిథి హేమేంద్రనాథ్ మాట్లాడుతూ స్ఫూర్తి గ్రూప్ గత మూడు సంవత్సరాలుగా కుటుంబ సమేతంగా విజ్ఞానం, వినోదం కలగలిపిన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అంబేద్కర్ భవన్‌ను ఇలాంటి కార్యక్రమాలకు వినియోగించడం సంతోషకరమని పేర్కొన్నారు.పద్మావతి మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వ్యక్తి మాత్రమే కాకుండా గొప్ప సామాజిక ఉద్యమ నేత, విజ్ఞాన గని అని పేర్కొన్నారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం దేశ ప్రజలకు మార్గదర్శకమని తెలిపారు. కోమటి రవి మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. సుధీర్ మాట్లాడుతూ రాజ్యాంగం వల్లే నేడు విద్య, ఉద్యోగ అవకాశాలు అందరికీ లభిస్తున్నాయని అన్నారు.ఈ సందర్భంగా సేవారంగంలో ప్రతిభ కనబరిచిన సింహాచలం దంపతులను సత్కరించారు.అలాగే ఆదర్శ దంపతులుగా నిలిచిన పలువురిని చేనేత వస్త్రాలు, పుస్తకాలతో గౌరవించారు. పోటీల లో విజేతలైన పిల్లలు, మహిళలకు బహుమతులు అందజేశారు.చివరగా సురేష్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. అనంతరం అందరూ సమిష్టిగా భోజనాలు చేసి “జై భీమ్” నినాదాలతో కార్యక్రమాన్ని ముగించారు.

More news from తెలంగాణ and nearby areas
  • మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రత్యేకంగా యంబ నరసింహులు గారు తన కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకుని, సర్వలోక క్షేమం కోరుతూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొని భక్తి భావంతో సేవలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    4
    మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ప్రత్యేకంగా యంబ నరసింహులు గారు తన కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకుని, సర్వలోక క్షేమం కోరుతూ ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొని భక్తి భావంతో సేవలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    55 min ago
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం (14-04-2026) ఉదయం 9:30 గంటలకు పులిహోర పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ సేవా కార్యక్రమానికి ఈ వారం దాతలుగా శ్రీమతి & శ్రీ మురికి శ్వేత విజయ్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ రామదూత పూజ జనరల్ స్టోర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సక్రమంగా జరిగింది.ఈ సందర్భంగా భక్తులకు పులిహోరను పంపిణీ చేసి, సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, మల్యాల భైరయ్య, నేతి శ్రీనివాస్, దూబకుంట లచ్చల్, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, నోముల సంతోష్, పోగుల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం భక్తి, సేవా భావం కలగలిపిన మంచి ఉదాహరణగా నిలిచింది.
    4
    సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం (14-04-2026) ఉదయం 9:30 గంటలకు పులిహోర పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ప్రతి మంగళవారం నిర్వహించే ఈ సేవా కార్యక్రమానికి ఈ వారం దాతలుగా శ్రీమతి & శ్రీ మురికి శ్వేత విజయ్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ రామదూత పూజ జనరల్ స్టోర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సక్రమంగా జరిగింది.ఈ సందర్భంగా భక్తులకు పులిహోరను పంపిణీ చేసి, సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, మల్యాల భైరయ్య, నేతి శ్రీనివాస్, దూబకుంట లచ్చల్, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, నోముల సంతోష్, పోగుల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం భక్తి, సేవా భావం కలగలిపిన మంచి ఉదాహరణగా నిలిచింది.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    18 hrs ago
  • కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డీ లిమిటేషన్‌ను అడ్డుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కందిలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌ను ఎలా అడ్డుకుంటారో సీఎం చెప్పాలని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మోదీని విమర్శించి ఎక్కడున్నారో అందరికీ తెలుసని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా భవిష్యత్‌లో అదే పరిస్థితి పడుతుందని పేర్కొన్నారు.
    1
    కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డీ లిమిటేషన్‌ను అడ్డుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కందిలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌ను ఎలా అడ్డుకుంటారో సీఎం చెప్పాలని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మోదీని విమర్శించి ఎక్కడున్నారో అందరికీ తెలుసని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా భవిష్యత్‌లో అదే పరిస్థితి పడుతుందని పేర్కొన్నారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    11 hrs ago
  • ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది
    4
    ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది
    user_Meenakshi construction Civil c
    Meenakshi construction Civil c
    లింగాలఘన్‌పూర్, జనగాం, తెలంగాణ•
    23 hrs ago
  • వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో రెండవ రోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగఅరైవ్ -అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్నేపల్లి లోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రజలతో అధికారులతో చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూనే మానసిక దృఢత్వంతో భద్రతగా వాహనాలు నడపాలని సూచించారు. మారుమూల ప్రాంతాల వరకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచాలని అన్నారు.
    1
    వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో రెండవ రోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగఅరైవ్ -అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్నేపల్లి లోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రజలతో అధికారులతో చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూనే మానసిక దృఢత్వంతో భద్రతగా వాహనాలు నడపాలని సూచించారు. మారుమూల ప్రాంతాల వరకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచాలని అన్నారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    23 hrs ago
  • కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో ఇందిరమ్మ ఇళ్లను పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఒక గొప్ప వరమని పేర్కొన్నారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం గృహవసతి కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాణి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో ఇందిరమ్మ ఇళ్లను పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఒక గొప్ప వరమని పేర్కొన్నారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం గృహవసతి కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాణి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
    1
    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    6 hrs ago
  • కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్ని నియంత్రణ విధానాలను అధికారులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అగ్నిని ఆర్పే పద్ధతులపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఓ మధన్, సునీల్ కుమార్, హరిసింగ్ పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్ని నియంత్రణ విధానాలను అధికారులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అగ్నిని ఆర్పే పద్ధతులపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఓ మధన్, సునీల్ కుమార్, హరిసింగ్ పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.