logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సహకార సంఘం ద్వారా రైతులకు పథకాలు మెరుగైన సేవలు అందిస్తా బిక్కనూరు మండలం అంతం పల్లి గ్రామ సహకార సంఘం ద్వారా రైతులకు కావలసిన సేవలు పథకాలను సకాలంలో అందిస్తానని సొసైటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి చెప్పారు. సొసైటీ చైర్మన్గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు అనంతరం మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండి సేవలు చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు రుణాలు సకాలంలో అందిస్తానని తెలిపారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

12 hrs ago
user_Bala prakash.Jangam
Bala prakash.Jangam
భిక్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
12 hrs ago
2b85bda9-8f13-4ceb-a860-0f352938e802

సహకార సంఘం ద్వారా రైతులకు పథకాలు మెరుగైన సేవలు అందిస్తా బిక్కనూరు మండలం అంతం పల్లి గ్రామ సహకార సంఘం ద్వారా రైతులకు కావలసిన సేవలు పథకాలను సకాలంలో అందిస్తానని సొసైటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి చెప్పారు. సొసైటీ చైర్మన్గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు అనంతరం మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండి సేవలు చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు రుణాలు సకాలంలో అందిస్తానని తెలిపారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరదల వినాశనానికి BRS అశాస్త్రీయ పాలనే కారణం:-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్... వరదల వినాశనానికి BRS అశాస్త్రీయ పాలనే కారణం:-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్... పిండ ప్రదానాల నాటకాలకు కామారెడ్డి ప్రజలే బుద్ధి చెబుతారు! కామారెడ్డి అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ... ముందస్తు చూపు లేకుండా, ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు పాటించకుండా పదేళ్ల పాలనలో ఇష్టారీతిన డివైడర్లు నిర్మించి కామారెడ్డిలో వరద వినాశనానికి BRS పార్టీయే ప్రధాన కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు BRS నాయకులకు లేదని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఇప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ... గతంలో వచ్చిన వరదల వల్ల ప్రజలు పడిన అపారమైన ఇబ్బందులకు BRS నాయకులు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పాలనలో చేసిన చారిత్రక తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు 'పిండ ప్రదానాలు' అంటూ చౌకబారు రాజకీయాలు, నాటకాలు ఆడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. శాశ్వత పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం:- BRS చేసిన తప్పులను సరిదిద్ది, కామారెడ్డి ప్రజలకు వరద ముప్పు నుండి శాశ్వత ఉపశమనం కలిగించేందుకు అవసరమైన చర్యలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ గారు ఇప్పటికే తీసుకెళ్లారని తెలిపారు. కామారెడ్డి అభివృద్ధి, ప్రజల భద్రతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ షబ్బీర్ అలీ:- కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ కృషి వల్లే ప్రతీ ఊరికి సబ్ స్టేషన్లు, మల్లన్న గుట్ట వద్ద ఫిల్టర్ బెడ్ నిర్మాణం సాధ్యమయ్యాయని గుర్తుచేశారు. ఈ వేసవి కాలంలో నీటి సమస్య లేకుండా పోవడం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. "గతంలో పట్టణానికి 7 MLD నీరు మాత్రమే వస్తే, ఇప్పుడు అది 11 MLD కి పెరిగింది. అది షబ్బీర్ అలీ సామర్థ్యానికి తార్కాణం. ఇందిరా గాంధీ స్టేడియం నిర్మాణం, ఫ్లడ్ లైట్లు, ప్రధాన రహదారుల అభివృద్ధి అంతా ఆయన హయాంలోనే జరిగింది" అని పేర్కొన్నారు. BRS కు సవాల్:- ప్రజలను మభ్యపెట్టి, కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం ధర్నాలు, నాటకాలు చేయడం BRS నాయకులు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యకమంలో పట్టణ అధ్యక్షులు సందీప్,రాజగౌడ్,గూడెం శ్రీనివాస్,పండ్లరాజు,గోనె శ్రీనివాస్ గొడుగుల,శ్రీనివాస్,కౌన్సిలర్స్ అంజాద్,జావీద్,నిట్టూ గంగాధర్,కాళ్ళ గణేష్,లడ్డు,కన్నయ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
    1
    వరదల వినాశనానికి BRS అశాస్త్రీయ పాలనే కారణం:-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్...
వరదల వినాశనానికి BRS అశాస్త్రీయ పాలనే కారణం:-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్...
పిండ ప్రదానాల నాటకాలకు కామారెడ్డి ప్రజలే బుద్ధి చెబుతారు!
కామారెడ్డి అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ...
ముందస్తు చూపు లేకుండా, ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు పాటించకుండా పదేళ్ల పాలనలో ఇష్టారీతిన డివైడర్లు నిర్మించి కామారెడ్డిలో వరద వినాశనానికి BRS పార్టీయే ప్రధాన కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు BRS నాయకులకు లేదని ఆయన ఖండించారు.
ఈ సందర్భంగా ఇప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ... గతంలో వచ్చిన వరదల వల్ల ప్రజలు పడిన అపారమైన ఇబ్బందులకు BRS నాయకులు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పాలనలో చేసిన చారిత్రక తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు 'పిండ ప్రదానాలు' అంటూ చౌకబారు రాజకీయాలు, నాటకాలు ఆడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
శాశ్వత పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం:-
BRS చేసిన తప్పులను సరిదిద్ది, కామారెడ్డి ప్రజలకు వరద ముప్పు నుండి శాశ్వత ఉపశమనం కలిగించేందుకు అవసరమైన చర్యలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ గారు ఇప్పటికే తీసుకెళ్లారని తెలిపారు. కామారెడ్డి అభివృద్ధి, ప్రజల భద్రతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేశారు.
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ షబ్బీర్ అలీ:-
కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ  కృషి వల్లే ప్రతీ ఊరికి సబ్ స్టేషన్లు, మల్లన్న గుట్ట వద్ద ఫిల్టర్ బెడ్ నిర్మాణం సాధ్యమయ్యాయని గుర్తుచేశారు. ఈ వేసవి కాలంలో నీటి సమస్య లేకుండా పోవడం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. "గతంలో పట్టణానికి 7 MLD నీరు మాత్రమే వస్తే, ఇప్పుడు అది 11 MLD కి పెరిగింది. అది షబ్బీర్ అలీ  సామర్థ్యానికి తార్కాణం. ఇందిరా గాంధీ స్టేడియం నిర్మాణం, ఫ్లడ్ లైట్లు, ప్రధాన రహదారుల అభివృద్ధి అంతా ఆయన హయాంలోనే జరిగింది" అని పేర్కొన్నారు.
BRS కు సవాల్:-
ప్రజలను మభ్యపెట్టి, కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం ధర్నాలు, నాటకాలు చేయడం BRS నాయకులు మానుకోవాలని హెచ్చరించారు.
ఈ కార్యకమంలో పట్టణ  అధ్యక్షులు సందీప్,రాజగౌడ్,గూడెం శ్రీనివాస్,పండ్లరాజు,గోనె శ్రీనివాస్ గొడుగుల,శ్రీనివాస్,కౌన్సిలర్స్ అంజాద్,జావీద్,నిట్టూ గంగాధర్,కాళ్ళ గణేష్,లడ్డు,కన్నయ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • రక్షాబంధన్ ఎఫెక్ట్... రద్దీగా బస్సులు........( వీడియో) బిక్కనూర్ రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నుండి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులలో మహిళా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లడంతో బస్సులు రద్దీగా మారాయి. దీనికి తోడు బస్సుల సంఖ్యను తగ్గించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులో చోటు కోసం మహిళల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కొందరు చేసేది ఏమీ లేక ఆటోలలో ప్రయాణాలు కొనసాగించారు.
    1
    రక్షాబంధన్ ఎఫెక్ట్... రద్దీగా బస్సులు........( వీడియో)
బిక్కనూర్ రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నుండి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులలో మహిళా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లడంతో బస్సులు రద్దీగా మారాయి. దీనికి తోడు బస్సుల సంఖ్యను తగ్గించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
బస్సులో చోటు కోసం మహిళల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కొందరు చేసేది ఏమీ లేక ఆటోలలో ప్రయాణాలు కొనసాగించారు.
    user_Mahesh Nakka
    Mahesh Nakka
    Kamareddy, Hyderabad•
    11 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో నూలు పౌర్ణమి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర అంగరంగ వైభవో పేతంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం శోభాయాత్రలో కన్నుల పండుగలా సాగిన రథయాత్రలో ఒకవైపు మార్కండేయ స్వామి, మరో రథంపై స్వామి ధరించడానికి రథయాత్రలో నేతన్న మొగ్గంపై వస్త్రం నేస్తూ సాగడం భక్తులను ప్రజలను అలరించింది. అంతకు ముందు శ్రీ మార్కండేయ స్వామి దేవస్థానం లో ఉదయం "రక్షాబంధన్" , అలాగే నేతన్నల సామూహిక యజ్ఞోపవీతధారణ (జంజీరమలు ధరించుట) కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం శ్రీ శివభక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర ప్రారంభమైంది. సిరిసిల్ల పద్మశాలి సంఘం, పద్మశాలి యువజన సంఘం, పద్మశాలి మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. శుక్రవారం శ్రీ మార్కండేయ దేవస్థానంలో ఉదయం నుంచి రాత్రి వరకు వేడుకలు జరిగాయి. శ్రీ మార్కండేయుని శోభాయాత్రను వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, డిఎస్పి నాగేంద్ర చారీలు ప్రత్యేక పూజలు చేసి శ్రీ మార్కండేయ స్వామి శోభాయాత్రను ప్రారంభించారు. వందలాది మంది పాల్గొన్న ఈ రథయాత్ర లో నేతన్న చౌక్ లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ లు నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి ప్రసంగించారు. అనంతరం పట్టణంలోని గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా వెంకటేశ్వర దేవస్థానం నుంచి మళ్లీ తిరిగి మార్కండేయ దేవస్థానానికి చేరుకుంది. జై మార్కండేయ, జై జై మార్కండేయ అంటూ భక్తుల నినాదాలతో మారు మోగింది. కోలాటాలు, భజనలు, నృత్యాలతో ఆకట్టుకున్నారు. రథంపై శ్రీ మార్కండేయుని ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. మరో రథంపై చేనేత మగ్గం పై నేత కార్మికుడు వస్త్రాన్ని తయారుచేసి శ్రీ మార్కండేయునికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, పద్మశాలి నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, పద్మశాలి సంఘం, యువజన సంఘం నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య మార్కండేయుని శోభాయాత్ర సాగింది.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో నూలు పౌర్ణమి వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర అంగరంగ వైభవో పేతంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం శోభాయాత్రలో కన్నుల పండుగలా సాగిన రథయాత్రలో ఒకవైపు మార్కండేయ స్వామి, మరో రథంపై స్వామి ధరించడానికి రథయాత్రలో నేతన్న మొగ్గంపై వస్త్రం  నేస్తూ  సాగడం భక్తులను ప్రజలను అలరించింది. అంతకు ముందు శ్రీ మార్కండేయ స్వామి దేవస్థానం లో ఉదయం  "రక్షాబంధన్" , అలాగే నేతన్నల సామూహిక యజ్ఞోపవీతధారణ  (జంజీరమలు ధరించుట) కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం శ్రీ శివభక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర  ప్రారంభమైంది. సిరిసిల్ల పద్మశాలి సంఘం, పద్మశాలి యువజన సంఘం, పద్మశాలి మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. శుక్రవారం శ్రీ మార్కండేయ దేవస్థానంలో ఉదయం నుంచి రాత్రి వరకు వేడుకలు జరిగాయి. శ్రీ మార్కండేయుని శోభాయాత్రను వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, డిఎస్పి నాగేంద్ర చారీలు ప్రత్యేక పూజలు చేసి శ్రీ మార్కండేయ స్వామి శోభాయాత్రను ప్రారంభించారు. వందలాది మంది పాల్గొన్న ఈ రథయాత్ర లో నేతన్న చౌక్ లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ లు నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి ప్రసంగించారు. అనంతరం పట్టణంలోని గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా వెంకటేశ్వర దేవస్థానం నుంచి మళ్లీ తిరిగి మార్కండేయ దేవస్థానానికి చేరుకుంది. జై మార్కండేయ, జై జై మార్కండేయ అంటూ భక్తుల నినాదాలతో మారు మోగింది. కోలాటాలు, భజనలు, నృత్యాలతో ఆకట్టుకున్నారు. రథంపై శ్రీ మార్కండేయుని ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. మరో రథంపై చేనేత మగ్గం పై నేత కార్మికుడు వస్త్రాన్ని తయారుచేసి శ్రీ మార్కండేయునికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, పద్మశాలి నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, పద్మశాలి సంఘం, యువజన సంఘం నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య మార్కండేయుని శోభాయాత్ర సాగింది.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    54 min ago
  • *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రాఖీ కట్టిన సోదరి* రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆయన సోదరి లీల స్వగృహంలో రాఖీ కట్టారు. అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొంటూ, ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు...
    1
    *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రాఖీ కట్టిన సోదరి*

రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆయన సోదరి లీల స్వగృహంలో రాఖీ కట్టారు. 
అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొంటూ, ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు...
    user_Sai
    Sai
    Local News Reporter వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో ఘనంగా కర్ర శ్రీహరి జయంతి వేడుకలు శనిగరం గ్రామం లోని గ్రామపంచాయతీ వద్ద దివంగత నేత అనేక పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి జయంతి వేడుకలు సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో.... బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మరియు వివిధ పార్టీల నాయకులు గ్రామస్తుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామని గుర్తు చేసుకున్నారు... వారి ఆశయాలను కొనసాగించే విధంగా కృషి చేస్తామని అన్నారు.
    4
    సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో ఘనంగా కర్ర శ్రీహరి జయంతి వేడుకలు
శనిగరం గ్రామం లోని గ్రామపంచాయతీ వద్ద దివంగత నేత అనేక పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి  జయంతి వేడుకలు సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో.... బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మరియు వివిధ పార్టీల నాయకులు గ్రామస్తుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామని గుర్తు చేసుకున్నారు... వారి ఆశయాలను కొనసాగించే విధంగా కృషి చేస్తామని అన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    2 hrs ago
  • రాఖీ పౌర్ణమి సందర్భంగా అభిమానం, ప్రేమతో రాఖీలు కట్టిన సోదరీమణులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక, ఇలాంటి పండుగను అందరూ ప్రేమ, అభిమానాలతో జరుపుకోవాలి. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. #rakshabandhan #rakhi
    1
    రాఖీ పౌర్ణమి సందర్భంగా అభిమానం, ప్రేమతో రాఖీలు కట్టిన సోదరీమణులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. 

రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక, ఇలాంటి పండుగను అందరూ ప్రేమ, అభిమానాలతో జరుపుకోవాలి. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.
#rakshabandhan #rakhi
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    6 hrs ago
  • *SIR ప్రక్రియపై ( డ్రప్ట్ ఓటర్ లిస్టు పై ) అవగాహన కోసం 46 & 47వ పరిదిలోని భారత్ రోడ్డులో వార్డు సభ* *కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 46 & 47వ వార్డు కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న - లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో 46 & 47వ వార్డు పరిధిలోని భారత్ రోడ్ లో SIR ప్రక్రియపై ఈ రోజు వార్డు సభ నిర్వహించడం జరిగింది. వార్డులో నిర్వహించిన సమావేశంలో ఓటర్ జాబితా చదివి వినిపించారు. ఓటర్లకు పలు అనుమానాలపై అవగాహన కల్పించారు. జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఓటర్లకు పలు విషయాలపై వివరించారు. ఇట్టి వార్డు సభ కార్యక్రమంలో మున్సిపల్ RO రవి గోపాల్ రెడ్డి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసన్న, మున్సిపల్ అధికారి భాగ్యలక్ష్మీ, 46, 47 వార్డు అధికారి కిశోర్, BLO లు కాశీరాం, పిట్ల రేఖ, వేంకట లక్ష్మి, బాబిత మరియు స్థానిక 46 & 47వ వార్డు ఓటర్లు తదితరులు పాల్గొన్నారు
    1
    *SIR ప్రక్రియపై ( డ్రప్ట్ ఓటర్ లిస్టు పై ) అవగాహన కోసం 46 & 47వ పరిదిలోని భారత్ రోడ్డులో వార్డు సభ*
*కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 46 & 47వ వార్డు కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న - లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో 46 & 47వ వార్డు పరిధిలోని భారత్ రోడ్ లో SIR ప్రక్రియపై ఈ రోజు వార్డు సభ నిర్వహించడం జరిగింది. వార్డులో నిర్వహించిన సమావేశంలో ఓటర్ జాబితా చదివి వినిపించారు. ఓటర్లకు పలు అనుమానాలపై అవగాహన కల్పించారు. జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఓటర్లకు పలు విషయాలపై వివరించారు.
ఇట్టి వార్డు సభ కార్యక్రమంలో మున్సిపల్ RO రవి గోపాల్ రెడ్డి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసన్న, మున్సిపల్ అధికారి భాగ్యలక్ష్మీ, 46, 47 వార్డు అధికారి కిశోర్, BLO లు కాశీరాం, పిట్ల రేఖ, వేంకట లక్ష్మి, బాబిత మరియు స్థానిక 46 & 47వ వార్డు ఓటర్లు తదితరులు పాల్గొన్నారు
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    15 hrs ago
  • రాఖీ పండుగ రోజు రక్తమోడుతున్నా.. బిడ్డ ఆకలి తీర్చిన తల్లి మమకారం రాఖీ పండుగ రోజున బంధువులకు రాఖీలు కట్టేందుకు బయలుదేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం విషాదంలోకి నెట్టింది. హత్నూర మండలం చందాపూర్‌కు చెందిన కుటుంబం చిలిపిచేడ్ చౌరస్తా వద్దకు చేరుకోగానే బైక్‌కు కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడింది. ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలై రక్తస్రావమైనప్పటికీ.. ఒడిలో ఉన్న చిన్నారి ఆకలిని మాత్రం ఆమె పట్టించుకోకుండా ఉండలేకపోయింది. గాయాల బాధను భరిస్తూనే బిడ్డకు పాలు ఇచ్చింది. రక్తమోడుతున్న స్థితిలోనూ బిడ్డ ఆకలి తీర్చిన ఆ తల్లి మమకారం అక్కడున్న వారిని కదిలించింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. రాఖీ పండుగ వేళ చోటుచేసుకున్న ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది.
    1
    రాఖీ పండుగ రోజు రక్తమోడుతున్నా.. బిడ్డ ఆకలి తీర్చిన తల్లి మమకారం
రాఖీ పండుగ రోజున బంధువులకు రాఖీలు కట్టేందుకు బయలుదేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం విషాదంలోకి నెట్టింది. హత్నూర మండలం చందాపూర్‌కు చెందిన కుటుంబం చిలిపిచేడ్ చౌరస్తా వద్దకు చేరుకోగానే బైక్‌కు కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడింది. ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలై రక్తస్రావమైనప్పటికీ.. ఒడిలో ఉన్న చిన్నారి ఆకలిని మాత్రం ఆమె పట్టించుకోకుండా ఉండలేకపోయింది. గాయాల బాధను భరిస్తూనే బిడ్డకు పాలు ఇచ్చింది. రక్తమోడుతున్న స్థితిలోనూ బిడ్డ ఆకలి తీర్చిన ఆ తల్లి మమకారం అక్కడున్న వారిని కదిలించింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. రాఖీ పండుగ వేళ చోటుచేసుకున్న ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    14 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.