పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.... మండల సిపిఐ నాయకులు గన్నేరువరం: మండల కేంద్రం గన్నేరువరంలో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ను ఏర్పాటు చేయాలని మండల సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలు లేక రైతులు వంటను అమ్ముకోవడానికి సుదూర ప్రాంతాలకు తీసుకు వెళ్లాల్సి వస్తుందని, పొద్దుతిరుగుడు తరలింపుకు రవాణా ఖర్చులు భారంగా రైతులకు మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది దళారులను నమ్మి మోసపోతున్నారని రైతుల సంక్షేమ దృష్టిలో ఉంచుకొని వెంటనే పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను మండల కేంద్రంతో పాటు మరి కొన్ని గ్రామాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అయితే పొద్దుతిరుగుడు సాగుకు అధిక సంఖ్యలో రైతులు ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల అంజిరెడ్డి, మండల కార్యదర్శి చొక్కల్ల శ్రీశైలం, సహాయ కార్యదర్శి కూనమల్లయ్య, నాయకులు బోయిని మల్లయ్య, ఎండి నయం తదితరులు పాల్గొన్నారు.
పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.... మండల సిపిఐ నాయకులు గన్నేరువరం: మండల కేంద్రం గన్నేరువరంలో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ను ఏర్పాటు చేయాలని మండల సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలు లేక రైతులు వంటను అమ్ముకోవడానికి సుదూర ప్రాంతాలకు తీసుకు వెళ్లాల్సి వస్తుందని, పొద్దుతిరుగుడు తరలింపుకు రవాణా ఖర్చులు భారంగా రైతులకు మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది దళారులను నమ్మి మోసపోతున్నారని రైతుల సంక్షేమ దృష్టిలో ఉంచుకొని వెంటనే పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను మండల కేంద్రంతో పాటు మరి కొన్ని గ్రామాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అయితే పొద్దుతిరుగుడు సాగుకు అధిక సంఖ్యలో రైతులు ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల అంజిరెడ్డి, మండల కార్యదర్శి చొక్కల్ల శ్రీశైలం, సహాయ కార్యదర్శి కూనమల్లయ్య, నాయకులు బోయిని మల్లయ్య, ఎండి నయం తదితరులు పాల్గొన్నారు.
- పోటీ పరీక్షలకు ప్రణాళిక ప్రకారం సిద్దం కావాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు యువత, అభ్యర్థులు సిద్ధమవుతుండగా, మంగళవారం జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడారు. విద్యార్హతలు, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు? ఏ ఏ పుస్తకాలు చదువుతున్నారు? ఆరా తీశారు. రోజా ఎంత మంది లైబ్రరీకి వస్తారని గ్రంథాలయ అధికారిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అన్ని సబ్జెక్టులు ప్రణాళిక ప్రకారం.. ప్రతి అంశం క్షుణ్ణంగా చదవాలని సూచించారు. కరెంట్ అఫైర్స్, ఇతర అన్ని అంశాలపై మంచి అవగాహనతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు కూడా రిఫరెన్స్ గా తీసుకోవాలని సూచించారు.1
- ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి ,నేను ప్రభుత్వం దగ్గర కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. 65 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజు అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారని, బస్సు ప్రయాణం పేదవాళ్ళకి లైఫ్ లైన్ లాంటిదని తెలిపారు. ఉద్యోగులుగా మీరు ప్రభుత్వం గా మేము కలిసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉందన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,ఉద్యోగుల సంక్షేమం ప్రయాణికుల సౌలభ్యం చూస్తామని తెలిపారు. ఎలాంటి బెషజాలలకు పోకుండా అధికారుల కమిటీ కి మీ సమస్యలు విన్నవించాలని, ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు.1
- జగిత్యాల జిల్లాలో నేడు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు కొద్దిసేపటి క్రితం కెసిఆర్ చేరుకోవడం జరిగింది కాంగ్రెస్ నాలుగు శతాబ్దాలుగా చేసిన సేవను విడిచి టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి స్వాగతం పలికారు1
- ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం సమీప గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన కుర్సం నాగేశ్వరరావు (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, రాత్రి వరకు గాలించినా మృతదేహం లభించలేదు. మంగళవారం పడవలు, ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.1
- మహనీయుల చరిత్ర కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదని, వారి ఆశయాలను విద్యార్థులు వంటబట్టించుకోవాలని మంచిర్యాల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) ప్రిన్సిపల్ వై. రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐటిఐ కళాశాల ఆవరణలో తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (TBSF) ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రిన్సిపల్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. సామాజిక మార్పుకు విద్యే మార్గం ఈ సందర్భంగా టీబీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ మాట్లాడుతూ, దేశంలో విద్యా విప్లవానికి నాంది పలికిన ఘనత జ్యోతిరావు ఫూలేకు దక్కుతుందన్నారు. జ్యోతిరావు ఫూలే: తన భార్య సావిత్రి బాయి ఫూలేను విద్యావంతురాలిని చేసి, తద్వారా స్త్రీ విద్యకు బాటలు వేశారని కొనియాడారు. అంటరానితనం, అస్పృశ్యత వంటి సామాజిక రుగ్మతలపై ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్: మహిళల హక్కుల రక్షణ కోసం హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారని, అది పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోవడంతో నైతిక బాధ్యతగా తన మంత్రి పదవికే రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్ అని గుర్తుచేశారు. ప్రజలందరికీ సమానమైన ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఆయనేనని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు ఈ కార్యక్రమంలో టి.బి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి జాగిరి రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు వేముల కిరణ్, ఐటీఐ ఉపాధ్యాయుడు రాజుతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహనీయుల జీవిత విశేషాలను చాటిచెప్పారు.2
- కాంగ్రెస్ పార్టీకి మహిళలు బుద్ధి చెప్పాలి బిజెపి అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ పిలుపు దేశం అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర ముఖ్యం దేశాభివృద్ధిలో మహిళలు ముందుకొస్తే అభివృద్ధి లో దూసుకెళ్తుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ అన్నారు మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ మహిళలకు మేలు చేస్తుందని చేస్తున్న ప్రకటనలు ప్రకటనలకే పరిమితం అన్నారు ఆరు గ్యారెంటీలలో మహిళలకు 2500 నగదు ఏమైందన్నారు యువతకు స్కూటీలు ఇస్తానని మోసం చేశారన్నారు వృద్ధులకు పెన్షన్ పెంచుతామని పెంచలేదన్నారు అన్ని వర్గాలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు మహిళా బిల్లు పవీగి పోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి మహిళలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ మోసాలను మహిళలు గ్రహించాలన్నారు రిజర్వేషన్ మహిళలకు కల్పిస్తే తమ సీట్లు గల్లంతయితాయని అపోహతో స్వార్థంతో బిల్లును అడ్డుకున్నారన్నారు మోడీ, ఏమిష లు ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెస్తారు మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ ఉండాలని బీజేపీ బిల్లు పెట్టారు మహిళా వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం మా సీట్లను త్యాగాలు చేయడానికి సిద్ధం కాంగ్రెస్, ఇండియా కూటమిని మహిళలు చి కొడుతున్నారు రేవంత్ రెడ్డి వి కేవలం మాటలే చేతల్లో లేవు కెసిఆర్ లాగానే రేవంత్ పాలన సాగుతోంది ఆరు గ్యారెంటీ లు అమలు చేయడంలో రేవంత్ ఫెయిల్ అయ్యారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్దిచెప్పాలనిపిలుపుఇచ్చారు. డిలిమిటేషన్ కు మహిళా బిల్లుకు ఏలాంటి సంబంధం లేదు బీజేపీ నార్త్, సౌత్ అనే బేధం లేకుండా నిదులిస్తుంది కమిషన్లు ఇస్తేనే అభివృద్ధి పనుల నిధులు విడుదల అవుతున్నాయి ఓవెసి కి చెందిన ఫాతిమా కాలేజీ ని ఎందుకు కూల్చడం లేదు హైడ్రా పేదోళ్ళవే కూల్చుతున్నారు.. పెద్దలవి వదిలేస్తున్నారు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మాఫియా కొనసాగుతుందికెసిఆర్ ఫాం హౌజ్ లో కూర్చొని మందు తాగుతున్నారు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ కి వచ్చి కొట్లాడాలి బిఆర్ఎస్ అంటేనే భష్టు పట్టిన రాష్ట్ర సమితి ప్రగతి భవన్ పేరు తీసేసి కమిషన్ భవన్ అని పెట్టాలి ఉద్యోగులు దాచుకున్న డబ్బులకు కూడా కమిషన్లు ఇవ్వాల్సిందే హైడ్రా కూల్చుతున్న భవనాల అనుమతులు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలి వ్యవస్థ కరెక్ట్ ఉంటే బఫర్ జోన్ లల్లో ఇల్లు ఎందుకు కడుతారు ప్రభుత్వానికి మానవత్వం లేదు దేవాలయాలపై దాడులు చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ, ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏమి చేస్తుంది ప్రజల హక్కుల కోసం పోరాడే వారి కోసం పనిచేస్తుంది ఎన్నికలకు ముందు రూ లక్ష కోట్ల స్కామ్ తీస్తా అన్నారు.. ఒక లక్ష కూడా తీయలేదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు . తెలంగాణ లో బిజెపి ఈ కార్య మోసపురిత సీఎం గా మిగిలిపోతారు ఈ సమావేశంలో బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షులు వోల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళా మోర్చా నాయకురాలు మల్లిక మెదక్ కౌన్సిలర్ పబ్బ రాజమణి లక్ష్మణ్ అఖిల భరత్ సర్పంచ్ శైలజ శ్రీనివాస్ మెదక్ జిల్లా బిజెపి కార్యదర్శి మహేశ్వరి మీడియా ఇన్చార్జి సంగీత మౌనిక లావణ్య విజయ్ పట్టణ అధ్యక్షులు నవీన్ ప్రసాద్ బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రామంపేట కౌన్సిలర్ శంకర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.1
- ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉంది.. నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చు.. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది.. ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి గారు ,నేను ప్రభుత్వం దగ్గర కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తాం.. 65 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజు అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు.. ఈ బస్సు ప్రయాణం పేదవాళ్ళకి లైఫ్ లైన్ ఉద్యోగులుగా మీరు ప్రభుత్వం గా మేము కలిసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉంది ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,ఉద్యోగుల సంక్షేమం ప్రయాణికుల సౌలభ్యం చూస్తాం.. ఎలాంటి బెషజాలలకు పోకుండా అధికారుల కమిటీ కి మీ సమస్యలు విన్నవించండి.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..1
- హుజురాబాద్ లో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ బైక్ ల పంపిణీ లో ప్రోటోకాల్ వివాదం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రోటోకాల్ పాటించకుండా దివ్యాంగులకు స్కూటీలు, ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా కాంగ్రెస్ నాయకులతో దివ్యాంగులకు బైకులు పంపిణీ చేయడంపై సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య పరస్పరం నినాదాలు స్వల్ప ఉద్రిక్తతకు దారి తీశాయి. హుజూరాబాద్ సిటీ సెంట్రల్ హాల్ లో ఒకే సమయంలో రెండు ప్రభుత్వ కార్యక్రమాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక ఫ్లోర్ లో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు అందజేస్తే మరో ఫ్లోర్ లో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ ముత్తినేని వీరయ్య కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ ప్రణవ్ బాబు స్కూటీ లు పంపిణీ చేశారు. షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని ముగించుకొని వికలాంగులకు బైకులు పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానికంగానే తాను ఉన్నప్పటికీ తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని, ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషా నా, ఎమ్మెల్యే మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తు పద్ధతి మార్చుకోవాలని మందలించారు. జరిగిన పొరపాటును కప్పించుకునేందుకు అధికారులు ప్రయత్నించగా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూడాలని సూచిస్తూ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యతో కలిసి దివ్యాంగులకు బైకులు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు.1
- ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక వెలికితీతకే పోటీలు నిర్వహించామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ పీఎం శ్రీ విద్యాలయంలో విద్యార్థులకు క్విజ్, డిబేట్, చిత్రలేఖనం తదితర పోటీలు మంగళవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా విద్యార్థుల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి.. అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారని, జూన్ 12 వ తేదీ వరకు 10 శాఖల ఆద్వర్యంలో వివిధ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటి దాకా చేసిన పనులు వివరిస్తూ.. భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు కార్యక్రమం అమలు చేస్తుందని వెల్లడించారు.ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు, వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ఆరుగురు ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, అవగాహన కల్పించామని, రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు అమలు, గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామని, డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించామని వివరించారు. సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో కిచెన్, స్కూల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించామని పేర్కొన్నారు. టాలెంట్ హంట్ లో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి.. వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. అన్ని విద్యాలయాలకు కావాల్సిన మరమ్మత్తుల వివరాలు సేకరించి.. ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచిందని, అన్ని విద్యాలయాల్లో కామన్ డైట్ మెనూ అమలు చేస్తుందని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు తరగతి పుస్తకాలతో పాటు దిన పత్రికలు, కథల పుస్తకాలు చదవాలని సూచించారు. ఆటలు లేదా ఏదైనా ఒక రంగంలో బాగా సాధన చేసి.. రాణించాలని పేర్కొన్నారు. పరిసరాల పై అవగాహన ఉండాలని, సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని సూచించారు. విలువైన సమయం వృథా చేయవద్దని వివరించారు. విద్యార్థులు అందరూ ఏ నేపథ్యం నుంచి వచ్చినా కూడా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, మంచి స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, గురుకులాల డీసీఓ థెరిస్సా, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, సర్పంచ్ సిలివేరి లావణ్య, ప్రిన్సిపాల్ బీ పద్మ తదితరులు పాల్గొన్నారు.2