Shuru
Apke Nagar Ki App…
పాడేరు: షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో రేపు (ఏప్రిల్ 3న) పాడేరులో సత్యాగ్రహ యాత్ర ముగింపు ర్యాలీ జరగనుంది. 2025 డీఎస్సీలో గిరిజనేతరుల నియామకాలను రద్దు చేసి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని, సీఎం హామీని నిలబెట్టుకోవాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జేఏసీ పిలుపునిచ్చింది.
Shyam
పాడేరు: షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో రేపు (ఏప్రిల్ 3న) పాడేరులో సత్యాగ్రహ యాత్ర ముగింపు ర్యాలీ జరగనుంది. 2025 డీఎస్సీలో గిరిజనేతరుల నియామకాలను రద్దు చేసి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని, సీఎం హామీని నిలబెట్టుకోవాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జేఏసీ పిలుపునిచ్చింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Shyam1
- జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీలక్ష్మి దీక్షను ప్రారంభించి సూపర్-6 డిమాండ్స్‌ను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ ఛైర్మన్ నియామకం, బకాయిల చెల్లింపు, ఓపీఎస్ అమలు వంటి అంశాలను ప్రస్తావించారు. అనంతరం నాయకులు జిల్లా రెవిన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.1
- ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించడం ప్రతి తెలుగోడు గర్వించే విషయం అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బుధవారం లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో మంత్రి విజయనగరంలోని తన క్యాంప్ కార్యాయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఏపీ ప్రజలందరికి ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. దేశ పటంలో ఏపీ రాజధాని ఎక్కడ అన్న సందిగ్ధతకు తెరదించుతూ ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఏపీకి ఆంధ్రులు గర్వించే ప్రపంచ స్థాయి రాజధాని కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో తాపత్రయపడ్డారని.. ఆయన కృషి అమోఘం అని కొనియాడారు. శాతవాహనులు పాలించి ఎంతో చరిత్ర ఉన్న అమరావతిని నాడు రాజధానిగా బాబు ఎంపిక చేశారని గుర్తు చేశారు. నాడు చంద్రబాబు 29 వేల మంది రైతులను ఒప్పించి.. 33 వేల ఎకరాలు సేకరించి అమరావతిని ప్రజా రాజధానిగా ఎంపిక చేశారని... రాజధానికి భూములు ఇచ్చిన రైతులందరికి మంత్రి అభినందనలు తెలిపారు. అమరావతిని అభివృద్ధి మోడల్‌లో సింగపూర్ లాంటి ప్రపంచం మెచ్చిన నగరాల స్థాయిలో ఉంచాలనుకున్నారని ... ఎడ్యుకేషన్ హబ్, క్వాంటమ్ వ్యాలీ, మ్యాన్‌ఫ్యాక్చరింగ్ సెక్టార్, నాలెడ్జ్ సిటీ వీటన్నింటిని మేళవిస్తూ అమరావతిని మహానగరం చేయాలని బాబు అనుకున్నారని మంత్రి తెలిపారు. ప్రతిపక్ష నేత జగన్‌కు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న నిర్దిష్టమైన ఆలోచన లేకపోవడం దురదృష్టకరమని మంత్రి వాపోయారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు ప్రారంభించిన అమరావతిని కంటిన్యూ చేస్తే ఆయనకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని.. అమరావతిని సర్వనాశనం చేసి మూడు రాజధానులను తెరమీదకు తెచ్చారని విమర్శించారు. జగన్ తీరుతో 2014 - 19 టైంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కు వెళ్లిపోవడం దురదృష్టకరం అన్నారు. ఆర్సెలర్ మిట్టల్ ప్రాజెక్ట్, పోర్టులు, భోగాపురం ఎయిర్‌పోర్ట్ అన్నీ గత టీడీపీ ప్రభుత్వంలో మొదలు పెట్టినవే అన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ తీసుకువచ్చిన మూడు రాజధానులు పక్కన పెట్టి ఇప్పుడు మళ్లీ మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు నగరాలను కలుపుతూ మావిగన్ పేరుతో కొత్త పల్లవి అందుకోవడం చూస్తుంటే... ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉందన్నారు. రాజధాని విషయంలో జగన్ మతిభ్రమించి మాట్లాడుతూ పూటకో మాట.. రోజుకో నిర్ణయంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు.1
- కాకినాడ జిల్లా తుని పట్టణంలో గురువారం నాడు ఉదయం జైశ్రీరామ్ "హిందూ బంధువులారా"ఏకం కండి అని నినాదంతో పట్టణంలో హిందూ సంఘాలు ఆధ్వర్యంలో పురవీధుల్లో భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన పురవీధుల్లో గుండా జరిగిన ఈ భారీ ర్యాలీలో హిందూ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ పై జరిగిన దాడికి నిరసనగా మేము ఈ ర్యాలీ చేపట్టామని తెలిపారు. ఈ ర్యాలీలో జైశ్రీరామ్ అనే నినాదం పట్టణమంతా దద్దరిల్లిపోయింది.1
- Post by Sode Prasad1
- కాకినాడ జిల్లా.. కాకినాడ రూరల్.. *కాకినాడ రూరల్* పరిధిలోని *సర్పవరంలో* *మేక మాంసం* పేరిట *బీఫ్* కలిపి విక్రయిస్తున్న దుకాణదారుడిని మేక మాంసం వర్తక సంఘం సభ్యులు పట్టుకున్నారు. పూల మార్కెట్ సమీపంలో ఉన్న దుకాణాన్ని తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. వెంటనే దుకాణ నిర్వాహకుడిని పట్టుకుని గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా మేక మాంసం వర్తక సంఘం సభ్యులు మాట్లాడుతూ… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరలకు మేక మాంసం అందిస్తామనే పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. 500 నుంచి 600 రూపాయలకే మేక మాంసం అమ్ముతున్నారని నమ్మి కొనుగోలు చేస్తే, అందులో బీఫ్ కలపడం, చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న మేకలను కోసి విక్రయించడం జరుగుతోందని ఆరోపించారు. గత రెండు రోజులుగా సంఘం ఆధ్వర్యంలో అన్ని మేక మాంసం దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నామని, అసలు తక్కువ ధరలకు మాంసం ఎలా అమ్ముతున్నారో తెలుసుకునేందుకే ఈ చర్యలు చేపట్టామని చెప్పారు. నిజాయితీగా వ్యాపారం చేస్తున్న వారికి ఇలాంటి అక్రమాలు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, రోడ్డు పక్కన అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇకపై కూడా ఇలాంటి దుకాణాలను గుర్తించి ఫిర్యాదులు చేస్తామని స్పష్టం చేశారు.1
- పాతపట్నంలోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చింతాడ పూజిత (12) అనే విద్యార్థిని మృతి చెందింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భోజనాలకు వెళుతుండగా మెట్ల పైనుంచి జారి కిందపడింది. తీవ్రంగా గాయపడిన బాలికను పాఠశాల సిబ్బంది సామాజిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మల మండలం నౌపడ గ్రామంలో హనుమాన్ విజయోత్సవ పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో భాగంగా భక్తులు స్వామివారిని సింధూర సేవలు తమ చిన్న సేవలు చేసి స్వామి వారి విశేష పూజ నిర్వహించారు.4