logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సిద్ధాపూర్ :మొక్కల సంరక్షణ అందరి బాధ్యత.. సర్పంచ్ చెందే పద్మ శంకర్ మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని సర్పంచ్ చెండే పద్మ శంకర్ అన్నారు.బెజ్జూర్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ చెండే పద్మ శంకర్ ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేశారు. మొక్కలు తీసుకుపోయిన ప్రజలు ఇంటి పరిసర ప్రాంతాల్లో వాటిని నాటి సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. చెట్ల తోటే మానవాళికి మనుగడ లభిస్తుందని చెట్లను పెంపొందిస్తేనే సకాల వర్షాలు కురుస్తాయని స్వచ్ఛమైన గాలి లభిస్తుందని సూచించారు. మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

8 hrs ago
user_Srinivas k
Srinivas k
బెజ్జూర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
8 hrs ago
93ec40a6-ec96-41d7-9dd1-ab6e782aa8b7

సిద్ధాపూర్ :మొక్కల సంరక్షణ అందరి బాధ్యత.. సర్పంచ్ చెందే పద్మ శంకర్ మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని సర్పంచ్ చెండే పద్మ శంకర్ అన్నారు.బెజ్జూర్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ చెండే పద్మ శంకర్ ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేశారు. మొక్కలు తీసుకుపోయిన ప్రజలు ఇంటి పరిసర ప్రాంతాల్లో వాటిని నాటి సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. చెట్ల తోటే మానవాళికి మనుగడ లభిస్తుందని చెట్లను పెంపొందిస్తేనే సకాల వర్షాలు కురుస్తాయని స్వచ్ఛమైన గాలి లభిస్తుందని సూచించారు. మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • డ్రోన్లు, డీజే సౌండ్స్ పై కఠిన చర్యలు: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం కమిషనరేట్ పరిధిలోను పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలో అనుమతి డ్రోన్లు, డీజే సౌండ్స్ పై కఠిన చర్యలు ఉంటాయని సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
    1
    డ్రోన్లు, డీజే సౌండ్స్ పై కఠిన చర్యలు: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
రామగుండం కమిషనరేట్ పరిధిలోను పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలో అనుమతి  డ్రోన్లు, డీజే సౌండ్స్ పై కఠిన చర్యలు ఉంటాయని సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    3 hrs ago
  • గంజాయి కేసులో టీజీఎస్‌పీ కానిస్టేబుల్ అరెస్ట్..! కుట్రను ఛేదించిన కొత్తపల్లి పోలీసులు భూ తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తిని అక్రమంగా ఇరికించేందుకు కుట్ర పన్ని, సొంతంగా గంజాయి దాచి కేసు పెట్టించిన ఘటనలో కరీంనగర్ ఈగల్ టీం టీజీఎస్‌పీ కానిస్టేబుల్ మెడబోయిన నాగరాజు (35)ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కేసుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, కరీంనగర్ సీతారాంపూర్ లో నివాసముంటున్న కానిస్టేబుల్ నాగరాజుకు గతంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. తోడేటి శ్రీనివాస్‌కు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ సివిల్ పంచాయితీ తెగకపోవడంతో, శ్రీనివాస్ రెడ్డిపై ఎలాగైనా క్రిమినల్ కేసు పెట్టించి జైలుకు పంపాలనే ఉద్దేశంతో తోడేటి శ్రీనివాస్, సదానందం, అశోక్, ఆకాష్‌లతో కలిసి కానిస్టేబుల్ నాగరాజు ఒక కుట్ర పూరిత పథకం వేశాడు. ఇందులో భాగంగా వరంగల్ నుండి గంజాయిని తెప్పించి, శ్రీనివాస్ రెడ్డికి చెందిన అగ్రోస్ రైతు సేవా కేంద్రం (ఫెర్టిలైజర్ షాప్) లో సుమారు ఒక కిలో గంజాయిని దాచిపెట్టారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి, చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్ రెడ్డిపై గంజాయి కేసు నమోదయ్యేలా చేశారు. అయితే, శ్రీనివాస్ రెడ్డిని ఇరికించడానికి తెప్పించిన గంజాయిలో మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని కానిస్టేబుల్ నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లోనే దాచుకున్నాడు. ఈ విషయమై కొత్తపల్లి పోలీసులకు నమ్మదగిన సమాచారం అందడంతో, వారు కానిస్టేబుల్ నివాసంపై దాడి చేసి అతనిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 370.96 గ్రాముల గంజాయితో పాటు ఇన్ఫినిక్స్ (కాఫీ కలర్), వివో టి1ఎక్స్ (స్కై బ్లూ), రియల్ మీ 7, వన్‌ప్లస్ నార్డ్ సిఇ 3 5జీ (స్కై బ్లూ) మోడళ్లకు చెందిన నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద క్రైమ్ నెంబర్ 469/2026 తో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ బిల్ల కోటేశ్వర్, ఎస్సై సంబమూర్తి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    1
    గంజాయి కేసులో టీజీఎస్‌పీ కానిస్టేబుల్ అరెస్ట్..!

కుట్రను ఛేదించిన కొత్తపల్లి పోలీసులు

భూ తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తిని అక్రమంగా ఇరికించేందుకు కుట్ర పన్ని, సొంతంగా గంజాయి దాచి కేసు పెట్టించిన ఘటనలో కరీంనగర్ ఈగల్ టీం టీజీఎస్‌పీ కానిస్టేబుల్ మెడబోయిన నాగరాజు (35)ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కేసుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, కరీంనగర్ సీతారాంపూర్ లో నివాసముంటున్న కానిస్టేబుల్ నాగరాజుకు గతంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. తోడేటి శ్రీనివాస్‌కు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ సివిల్ పంచాయితీ తెగకపోవడంతో, శ్రీనివాస్ రెడ్డిపై ఎలాగైనా క్రిమినల్ కేసు పెట్టించి జైలుకు పంపాలనే ఉద్దేశంతో తోడేటి శ్రీనివాస్, సదానందం, అశోక్, ఆకాష్‌లతో కలిసి కానిస్టేబుల్ నాగరాజు ఒక కుట్ర పూరిత పథకం వేశాడు. ఇందులో భాగంగా వరంగల్ నుండి గంజాయిని తెప్పించి, శ్రీనివాస్ రెడ్డికి చెందిన అగ్రోస్ రైతు సేవా కేంద్రం (ఫెర్టిలైజర్ షాప్) లో సుమారు ఒక కిలో గంజాయిని దాచిపెట్టారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి, చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్ రెడ్డిపై గంజాయి కేసు నమోదయ్యేలా చేశారు. అయితే, శ్రీనివాస్ రెడ్డిని ఇరికించడానికి తెప్పించిన గంజాయిలో మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని కానిస్టేబుల్ నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లోనే దాచుకున్నాడు. ఈ విషయమై కొత్తపల్లి పోలీసులకు నమ్మదగిన సమాచారం అందడంతో, వారు కానిస్టేబుల్ నివాసంపై దాడి చేసి అతనిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 370.96 గ్రాముల గంజాయితో పాటు ఇన్ఫినిక్స్ (కాఫీ కలర్), వివో టి1ఎక్స్ (స్కై బ్లూ), రియల్ మీ 7, వన్‌ప్లస్ నార్డ్ సిఇ 3 5జీ (స్కై బ్లూ) మోడళ్లకు చెందిన నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద క్రైమ్ నెంబర్ 469/2026 తో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ బిల్ల కోటేశ్వర్, ఎస్సై సంబమూర్తి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    user_Gaddam Naresh
    Gaddam Naresh
    Local News Reporter Karimnagar, Telangana•
    23 hrs ago
  • సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం." "జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది." **"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."
    1
    సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం."
"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... 
సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది."
**"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    17 hrs ago
  • బీఆర్ఎస్ పార్టీలో చేరిన కుంటల సర్పంచ్ బంగారం.......... ADB: నెరడిగొండ మండలంలోని కుంటాల గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు శనివారం తిరిగి MLA అనిల్ జాదవ్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి MLA అనిల్ జాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుంటాల గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరించే MLA అనిల్ జాదవ్ తోనే కొనసాగుతామని గ్రామ పెద్దలతో కలిసి ఒప్పందం చేసుకున్నట్లు సర్పంచ్ గంగారాం పేర్కొన్నారు.
    1
    బీఆర్ఎస్ పార్టీలో చేరిన కుంటల సర్పంచ్ బంగారం..........
ADB: నెరడిగొండ మండలంలోని కుంటాల గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు శనివారం తిరిగి MLA అనిల్ జాదవ్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి MLA అనిల్ జాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుంటాల గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరించే MLA అనిల్ జాదవ్ తోనే కొనసాగుతామని గ్రామ పెద్దలతో కలిసి ఒప్పందం చేసుకున్నట్లు సర్పంచ్ గంగారాం పేర్కొన్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • వరద పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ హరిత కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరద పరిస్థితిని కలెక్టర్ కె. హరిత శుక్రవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం నదిలో నీటి మట్టం 146.65 మీటర్ల వద్ద ఉండగా, దిగువకు 7.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వెళుతోందని, ఎగువ నుంచి మరో 12 లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆందోళనకర పరిస్థితి లేదని, గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు వరద ప్రాంతాలు, నదీ తీరాలు, వంతెనల వద్దకు వెళ్లొద్దని, సెల్ఫీలు, ఈత వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.భారీ వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని, నీటి అవసరం తక్కువగా ఉండే పత్తి, పప్పుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సిర్పూర్(టి) మండలం వెంకట్రావుపేట్ వద్ద పెన్‌గంగా వంతెన వద్ద వరద పరిస్థితిని పరిశీలించి, ఓవర్‌లోడ్ వాహనాల రాకపోకలపై ఆరా తీశారు. వంతెన వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి వరద ప్రభావిత ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనుల పురోగతిని కూడా ఆరా తీసి, నాణ్యతతో వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌సీ వినయ్ బాబు, డిప్యూటీ ఈఈ వెంకటరమణ, ఏఈ రాజ్‌కుమార్, తుమ్మిడిహెట్టి సర్పంచ్ సూరజ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
    4
    వరద పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 కలెక్టర్ హరిత
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరద పరిస్థితిని కలెక్టర్ కె. హరిత శుక్రవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం నదిలో నీటి మట్టం 146.65 మీటర్ల వద్ద ఉండగా, దిగువకు 7.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వెళుతోందని, ఎగువ నుంచి మరో 12 లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లాలో ఆందోళనకర పరిస్థితి లేదని, గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు వరద ప్రాంతాలు, నదీ తీరాలు, వంతెనల వద్దకు వెళ్లొద్దని, సెల్ఫీలు, ఈత వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.భారీ వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని, నీటి అవసరం తక్కువగా ఉండే పత్తి, పప్పుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సిర్పూర్(టి) మండలం వెంకట్రావుపేట్ వద్ద పెన్‌గంగా వంతెన వద్ద వరద పరిస్థితిని పరిశీలించి, ఓవర్‌లోడ్ వాహనాల రాకపోకలపై ఆరా తీశారు. వంతెన వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి వరద ప్రభావిత ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనుల పురోగతిని కూడా ఆరా తీసి, నాణ్యతతో వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌సీ వినయ్ బాబు, డిప్యూటీ ఈఈ వెంకటరమణ, ఏఈ రాజ్‌కుమార్, తుమ్మిడిహెట్టి సర్పంచ్ సూరజ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • బహిరంగ మద్యం సేవనంపై నిషేధాజ్ఞలు : రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ప్రజలు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సిపి తెలిపారు.
    1
    బహిరంగ మద్యం సేవనంపై నిషేధాజ్ఞలు : రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా
ప్రజలు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సిపి తెలిపారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    18 hrs ago
  • మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్ నేనో ప్రభావంతో వర్షా బావ పరిస్థితులు ఎదురైతే కేటీఆర్ హరీష్ రావు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూశారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి, మిడ్ మానేరు నేడు రైతులకు నీళ్లు అందించడానికి వరప్రదాయనిగా మారాయి అన్నారు. మీరు కట్టిన ఒక్క ప్రాజెక్టు అవినీతిలో కూరుకుపోయి కొట్టుకుపోయిన మీకు సిగ్గు రాలేదన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తుంటే మీరు వర్షాలు కురవద్దని ఇంట్లోనే పూజలు చేస్తున్నారన్నారు. మీ హాయంలో నగరంలో స్మార్ట్ సిటీ అవినీతి, కాలేశ్వరం అవినీతి అనేక అవినీతులు జరిగాయని మీ వల్ల రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. మీది అవినీతి పాలన మాది మచ్చలేని ప్రజా పాలన అన్నారు. నగరంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎల్ఎండి కి వెళ్లి క్రికెట్ ఆడాడని, నాలుగు రోజుల తర్వాత గంగుల కమలాకర్ ఎల్ఎండి కి రండి స్విమ్మింగ్ పోటీలు పెట్టుకుందామని సవాల్ విసిరారు. ప్రజా పాలనలో రైతుల కోసం వేములవాడలో వరుణ యాగం, కొండగట్టులో గిరి ప్రదక్షణ చేయడంతో, దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాడని ఇది ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. మీ హాయంలో పదవులు అనుభవించిన మాజీ మేయర్లు ఎంత అవినీతి జరిగిందో వివరిస్తున్నారని ఇది సరిపోతుందా మీకు అని అన్నారు. నగరంలో దొంగతనం జరిగితే రాజకీయం చేయాలని చూశారని ఇది సమంజసమేనా అని ప్రశ్నించారు. మేము అధికారం చేపట్టాక, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూములు ప్రజలకు అందిస్తున్నామని ప్రజలకు నిజాలు ఏంటో తెలుసన్నారు. ప్రజలలో తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
    4
    మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్ నేనో ప్రభావంతో వర్షా బావ పరిస్థితులు ఎదురైతే కేటీఆర్ హరీష్ రావు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూశారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి, మిడ్ మానేరు నేడు రైతులకు నీళ్లు అందించడానికి వరప్రదాయనిగా మారాయి అన్నారు. మీరు కట్టిన ఒక్క ప్రాజెక్టు అవినీతిలో కూరుకుపోయి కొట్టుకుపోయిన మీకు సిగ్గు రాలేదన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తుంటే మీరు వర్షాలు కురవద్దని ఇంట్లోనే పూజలు చేస్తున్నారన్నారు. మీ హాయంలో నగరంలో స్మార్ట్ సిటీ అవినీతి, కాలేశ్వరం అవినీతి అనేక అవినీతులు జరిగాయని మీ వల్ల రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. మీది అవినీతి పాలన మాది మచ్చలేని ప్రజా పాలన అన్నారు. నగరంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎల్ఎండి కి వెళ్లి క్రికెట్ ఆడాడని, నాలుగు రోజుల తర్వాత గంగుల కమలాకర్ ఎల్ఎండి కి రండి స్విమ్మింగ్ పోటీలు పెట్టుకుందామని సవాల్ విసిరారు. ప్రజా పాలనలో రైతుల కోసం వేములవాడలో వరుణ యాగం, కొండగట్టులో గిరి ప్రదక్షణ చేయడంతో, దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాడని ఇది ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. మీ హాయంలో పదవులు అనుభవించిన మాజీ మేయర్లు ఎంత అవినీతి జరిగిందో వివరిస్తున్నారని ఇది సరిపోతుందా మీకు అని అన్నారు. నగరంలో దొంగతనం జరిగితే రాజకీయం చేయాలని చూశారని ఇది సమంజసమేనా అని ప్రశ్నించారు. మేము అధికారం చేపట్టాక, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూములు ప్రజలకు అందిస్తున్నామని ప్రజలకు నిజాలు ఏంటో తెలుసన్నారు. ప్రజలలో తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    6 hrs ago
  • సీఎం వ్యాఖ్యలపై బీజేవైఎం నిరసన: కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత విద్యార్థులను 'క్రిమినల్స్' అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
    2
    సీఎం వ్యాఖ్యలపై బీజేవైఎం నిరసన: కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత

విద్యార్థులను 'క్రిమినల్స్' అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.