logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ములుగు జిల్లా మల్లంపల్లిలో మొక్కజొన్న కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని రైతుల రాస్తారోకో.. రోడ్డుపై టైర్లు దహనం – భారీగా ట్రాఫిక్ జామ్ ములుగు జిల్లా మల్లంపల్లి ప్రాంతంలో మొక్కజొన్న కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై టైర్లు దహనం చేసి నిరసన తెలపడంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నెల రోజులుగా పంటలు కల్లాల్లోనే నిల్వ ఉండిపోయాయని, అధికారులు స్పందించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల భయంతో వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వారు కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.

11 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
11 hrs ago

ములుగు జిల్లా మల్లంపల్లిలో మొక్కజొన్న కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని రైతుల రాస్తారోకో.. రోడ్డుపై టైర్లు దహనం – భారీగా ట్రాఫిక్ జామ్ ములుగు జిల్లా మల్లంపల్లి ప్రాంతంలో మొక్కజొన్న కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై టైర్లు దహనం చేసి నిరసన తెలపడంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నెల రోజులుగా పంటలు కల్లాల్లోనే నిల్వ ఉండిపోయాయని, అధికారులు స్పందించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల భయంతో వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వారు కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.

More news from తెలంగాణ and nearby areas
  • గురజాల సొసైటీ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ BRS ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. రైతులు పండించిన మక్కలకు సరైన ధర లభించడం లేదని, కొనుగోలు కేంద్రం లేక మధ్యవర్తులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కేంద్రం ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో రాకపోకలు అంతరాయం కలగగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
    1
    గురజాల సొసైటీ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ BRS ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. రైతులు పండించిన మక్కలకు సరైన ధర లభించడం లేదని, కొనుగోలు కేంద్రం లేక మధ్యవర్తులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కేంద్రం ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో రాకపోకలు అంతరాయం కలగగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    13 hrs ago
  • స్టేషన్ ఘన్ పూర్ (మీదికొండ): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. మీదికొండలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ​ముఖ్య అంశాలు: ​కుటుంబ సభ్యులపై ఆరోపణలు: తన తండ్రి (కేసీఆర్), సోదరులు అవినీతికి పాల్పడ్డారని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ​తెలంగాణ ద్రోహులకు పదవులు: తెలంగాణ ఉద్యమకారులను పక్కనపెట్టి, ఉద్యమ సమయంలో వ్యతిరేకించిన వారికి (తెలంగాణ ద్రోహులకు) పదవులు కట్టబెట్టి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. ​వ్యక్తిగత విమర్శలపై హితవు: తాను కేసీఆర్ విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తనను నిత్యం విమర్శించడం మానుకోవాలని సూచించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినా, అసలు అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించవద్దని పేర్కొన్నారు. ​అవినీతి ఆరోపణలపై ఇప్పటికైనా స్పందించి వివరణ ఇవ్వాలని, పారదర్శకతను నిరూపించుకోవాలని కడియం శ్రీహరి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
    1
    స్టేషన్ ఘన్ పూర్ (మీదికొండ):
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. మీదికొండలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
​ముఖ్య అంశాలు:
​కుటుంబ సభ్యులపై ఆరోపణలు: తన తండ్రి (కేసీఆర్), సోదరులు అవినీతికి పాల్పడ్డారని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
​తెలంగాణ ద్రోహులకు పదవులు: తెలంగాణ ఉద్యమకారులను పక్కనపెట్టి, ఉద్యమ సమయంలో వ్యతిరేకించిన వారికి (తెలంగాణ ద్రోహులకు) పదవులు కట్టబెట్టి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు.
​వ్యక్తిగత విమర్శలపై హితవు: తాను కేసీఆర్ విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తనను నిత్యం విమర్శించడం మానుకోవాలని సూచించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినా, అసలు అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించవద్దని పేర్కొన్నారు.
​అవినీతి ఆరోపణలపై ఇప్పటికైనా స్పందించి వివరణ ఇవ్వాలని, పారదర్శకతను నిరూపించుకోవాలని కడియం శ్రీహరి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
    user_Parushuram goud
    Parushuram goud
    Singer జనగాం, జనగాం, తెలంగాణ•
    13 hrs ago
  • హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన ఘోర రోడ్డుప్రమాదంతో మృతి చెందిన ఆరుగురికి అశృనయనాల మద్య సిరిసిల్ల అంత్యక్రియలు నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ఉనైన సిరిసిల్ల సర్దార్ నగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ప్రమాదంలో బొల్లి శివకుమార్ (37) ఆయన భార్య బొల్లి లాస్య (30), వారి కూతురు రిషిక (8) శివకుమార్ బావ కోడం శ్రీనివాస్ (40), శ్రీనివాస్ ఇద్దరు కొడుకులు కోడం మాధవ్ (11), కృష్ణచంద్ర (7) మృతి చెందారు. మృతదేహాలకు ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించగా ఆసుపత్రి వద్దనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తీవ్ర గాయాల పాలైన కూతురు శ్వేత (35)ను హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లకు సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతదేహాలను సిరిసిల్లకు తరలించి కన్నీటి వీడ్కోలు మద్య అంత్యక్రియలు నిర్వహించారు. బొల్లి రాజు కొడుకు కోడలు అల్లుడు మనువలు, మనుమరాలు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
    2
    హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన ఘోర రోడ్డుప్రమాదంతో మృతి చెందిన ఆరుగురికి అశృనయనాల మద్య సిరిసిల్ల అంత్యక్రియలు నిర్వహించారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ఉనైన సిరిసిల్ల సర్దార్ నగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ప్రమాదంలో బొల్లి శివకుమార్ (37) ఆయన భార్య బొల్లి లాస్య (30), వారి కూతురు రిషిక (8) శివకుమార్ బావ కోడం శ్రీనివాస్ (40), శ్రీనివాస్ ఇద్దరు కొడుకులు కోడం మాధవ్ (11), కృష్ణచంద్ర (7) మృతి చెందారు. మృతదేహాలకు ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించగా ఆసుపత్రి వద్దనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తీవ్ర గాయాల పాలైన  కూతురు శ్వేత (35)ను హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లకు సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతదేహాలను సిరిసిల్లకు తరలించి కన్నీటి వీడ్కోలు మద్య అంత్యక్రియలు నిర్వహించారు. బొల్లి రాజు కొడుకు కోడలు అల్లుడు మనువలు, మనుమరాలు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు  కోల్పోవడంతో కుటుంబసభ్యులు బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ ల్యాబ్ ముందు శనివారం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నిల్లికట్టు సత్యం మాట్లాడుతూ.. ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బొడ్డు బాలకృష్ణ కుటుంబానికి రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నోష్ ల్యాబ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    1
    చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ ల్యాబ్ ముందు శనివారం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నిల్లికట్టు సత్యం మాట్లాడుతూ.. ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బొడ్డు బాలకృష్ణ కుటుంబానికి రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నోష్ ల్యాబ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    user_T Shankar Public News Reporter Nalgonda
    T Shankar Public News Reporter Nalgonda
    రిపోర్టర్ Nalgonda, Telangana•
    5 hrs ago
  • _ఆంధ్ర–ఒడిశా బోర్డర్ నుంచి నల్గొండకు గంజాయి సప్లై చేస్తున్న గాంజా గ్యాంగ్ అరెస్ట్ చేసిన టూ టౌన్ పోలీస్ పోలీసుల సడెన్ రైడ్‌తో 5 మంది గ్యాంగ్ సభ్యులు అరెస్ట్.. వారి వద్ద నుంచి సుమారు 3 లక్షలు విలువ చేసే 5 కిలోల గంజాయి సీజ్ ,రెండు పల్సర్ బైకులు, 5 మొబైల్ ఫోన్లు పోలీసుల స్వాధీనం... ఉడిపి హోటల్ దగ్గర గుట్టుగా డీల్ చేస్తూ చిక్కిన యువకులు... *పారిపోదాం అనుకున్నారు..* ప్లాన్ ఫెయిల్ – వెంటనే పట్టేసిన టూ టౌన్ పోలీసులు... ఒక్క కేజీ 3 వేలకే కొనుగోలు చేసి నల్గొండలో భారీ రేటుకు అమ్మకం... ఫ్రెండ్స్ గ్యాంగ్‌గా మొదలై గంజాయి బిజినెస్‌గా మారిన కథ... ఇంకా 6 మంది పరారీలో – పోలీసుల వేట కొనసాగుతోంది... గంజాయి అంటే జైలు టికెట్ ఖాయం.. అంటూ *అడిషనల్ ఎస్పీ జి రమేష్* స్ట్రాంగ్ వార్నింగ్... నలగొండ డిఎస్పి శివరాం రెడ్డి నేతృత్వంలో టూ టౌన్ సీఐ S.రాఘవ రావు,ఆద్వర్యంలో ఎస్సై వై.సైదులు మరియు వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ పి.రాజు,మరియు కానిస్టేబుల్ L.బాలకోటి,MD.షకీల్ లతో లను జిల్లా S.P అభినందించనైనది...
    1
    _ఆంధ్ర–ఒడిశా బోర్డర్ నుంచి నల్గొండకు గంజాయి సప్లై చేస్తున్న గాంజా గ్యాంగ్ అరెస్ట్ చేసిన టూ టౌన్ పోలీస్
పోలీసుల సడెన్ రైడ్‌తో 5 మంది గ్యాంగ్ సభ్యులు అరెస్ట్..
వారి వద్ద నుంచి సుమారు 3 లక్షలు విలువ చేసే 5 కిలోల గంజాయి సీజ్ ,రెండు పల్సర్ బైకులు, 5 మొబైల్ ఫోన్లు పోలీసుల స్వాధీనం...
ఉడిపి హోటల్ దగ్గర గుట్టుగా డీల్ చేస్తూ చిక్కిన యువకులు...
*పారిపోదాం అనుకున్నారు..* ప్లాన్ ఫెయిల్ – వెంటనే పట్టేసిన టూ టౌన్ పోలీసులు...
ఒక్క కేజీ 3 వేలకే కొనుగోలు చేసి నల్గొండలో భారీ రేటుకు అమ్మకం...
ఫ్రెండ్స్ గ్యాంగ్‌గా మొదలై గంజాయి బిజినెస్‌గా మారిన కథ...
ఇంకా 6 మంది పరారీలో – పోలీసుల వేట కొనసాగుతోంది...
గంజాయి అంటే జైలు టికెట్ ఖాయం.. అంటూ *అడిషనల్ ఎస్పీ జి రమేష్* స్ట్రాంగ్ వార్నింగ్...
నలగొండ డిఎస్పి శివరాం రెడ్డి నేతృత్వంలో టూ టౌన్ సీఐ S.రాఘవ రావు,ఆద్వర్యంలో ఎస్సై వై.సైదులు మరియు వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ పి.రాజు,మరియు కానిస్టేబుల్ L.బాలకోటి,MD.షకీల్ లతో లను జిల్లా S.P అభినందించనైనది...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    7 hrs ago
  • జూమ్ సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడి లు , ఆర్ ఎం లు, వివిధ విభాగాల హెచ్ఓడి , డీఎం లు.. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల జరిగిన సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలపై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం.. మంత్రి పొన్నం ప్రభాకర్ RTC అధికారులు కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణీకులకు సంధించి సానుకూలంగా ఉండాలి ప్రతి డివిజన్ స్థాయి అధికారులను కోరుతున్న సిబ్బందితో వేధింపులు లేకుండా ప్రేమతో సానుకూల దృక్పధంతో పనులు చేయించాలి ఆర్టీసీ అధికారులు కింది స్థాయి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిని పట్ల దురుసుగా కాకుండా ఫ్రెండ్లీ గా స్నేహపూర్వకంగా పనులు చేయించుకోవాలి.. డిపో మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి.. మే 17 లోపల మీ మీ డిపోలో, బస్ స్టేషన్లలో కార్మికులకు మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి.. టాయిలెట్స్, మంచి నీటి సౌకర్యం, ప్లాంటేషన్, పరిశుభ్రత పాటించాలి 2023 డిసెంబర్ 9 నుండి ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం తీసుకు వచ్చాం ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ, ఇల్లందు లాంటి కొన్ని డిపోలు నష్టాల్లో ఎందుకు నడుస్తున్నాయో ఆర్ఎంలు, డిపో మేనేజర్ లు సమీక్షించుకోవాలి టిక్కెట్ కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరిగితే చర్యలు తీసుకోండి, సిబ్బంది గొడవలు పెట్టుకోవడం సరికాదు.. సoస్థలో ఇంటర్నల్ ఎటాక్ అనేది ప్రమాదకరమైన విషయం.. ప్రతి రెండవ మంగళవారం ఆర్టీసీ సిబ్బంది సమస్యలు వినడానికి అన్ని డిపోల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి..డిపో మేనేజర్లు ఇతర సిబ్బంది అందుబాటులో ఉండాలి ఆర్టీసీ డిపో మేనేజర్లు గ్రామ సర్పంచ్ నుండి మొదలు ,ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలతో మంచి ప్రజా సంబంధాలు మెయింటేన్ చేయాలి.. ఏదైనా సమస్య మీ స్థాయిలో పరిష్కారం కాక పోతే ఆర్టీసీ ఎండీ స్థాయిలో పరిష్కారం చేద్దాం.. సిబ్బంది పట్ల సానుకూలంగా ఉండాలి.. మంత్రి నుండి సిబ్బంది వరకు అందరం కలిసి పని చేద్దాం పెండింగ్ షాప్ లు ఏవైనా ఉంటే జూన్ వరకు క్లియర్ కావాల్సిందే ఎక్కడెక్కడ పెండింగ్ లో ఉందో చూడండి ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలలాలను సమస్యను పరిష్కరించండి ఆర్టీసీ సమ్మెలో డిమాండ్ చేసిన కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తున్నాం, ఇంకా భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించే దిశగా ముందుకు వెళ్దాం..
    2
    జూమ్ సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడి లు , ఆర్ ఎం లు,  వివిధ విభాగాల హెచ్ఓడి , డీఎం లు..
నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల జరిగిన సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలపై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం..
మంత్రి పొన్నం ప్రభాకర్
RTC అధికారులు కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణీకులకు సంధించి  సానుకూలంగా ఉండాలి
ప్రతి డివిజన్ స్థాయి అధికారులను కోరుతున్న సిబ్బందితో వేధింపులు లేకుండా ప్రేమతో సానుకూల దృక్పధంతో  పనులు చేయించాలి
ఆర్టీసీ అధికారులు కింది స్థాయి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిని పట్ల దురుసుగా కాకుండా ఫ్రెండ్లీ గా స్నేహపూర్వకంగా పనులు చేయించుకోవాలి..
డిపో మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి..
మే 17 లోపల మీ మీ డిపోలో, బస్ స్టేషన్లలో కార్మికులకు మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి..
టాయిలెట్స్, మంచి నీటి సౌకర్యం, ప్లాంటేషన్, పరిశుభ్రత పాటించాలి
2023 డిసెంబర్ 9 నుండి ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం తీసుకు వచ్చాం
ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ, ఇల్లందు లాంటి కొన్ని డిపోలు నష్టాల్లో ఎందుకు నడుస్తున్నాయో ఆర్ఎంలు, డిపో మేనేజర్ లు సమీక్షించుకోవాలి
టిక్కెట్ కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరిగితే చర్యలు తీసుకోండి, సిబ్బంది గొడవలు పెట్టుకోవడం సరికాదు..
సoస్థలో ఇంటర్నల్ ఎటాక్ అనేది ప్రమాదకరమైన విషయం..
ప్రతి రెండవ మంగళవారం ఆర్టీసీ సిబ్బంది సమస్యలు వినడానికి అన్ని డిపోల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి..డిపో మేనేజర్లు ఇతర సిబ్బంది అందుబాటులో ఉండాలి
ఆర్టీసీ డిపో మేనేజర్లు గ్రామ సర్పంచ్ నుండి మొదలు ,ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలతో మంచి ప్రజా సంబంధాలు మెయింటేన్ చేయాలి..
ఏదైనా సమస్య మీ స్థాయిలో పరిష్కారం కాక పోతే ఆర్టీసీ ఎండీ స్థాయిలో పరిష్కారం చేద్దాం..
సిబ్బంది పట్ల సానుకూలంగా ఉండాలి..
మంత్రి నుండి  సిబ్బంది వరకు అందరం కలిసి పని చేద్దాం
పెండింగ్ షాప్ లు ఏవైనా ఉంటే జూన్ వరకు క్లియర్ కావాల్సిందే ఎక్కడెక్కడ పెండింగ్ లో ఉందో చూడండి
ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలలాలను సమస్యను పరిష్కరించండి
ఆర్టీసీ సమ్మెలో డిమాండ్ చేసిన కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తున్నాం, ఇంకా భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించే దిశగా ముందుకు వెళ్దాం..
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    11 hrs ago
  • హన్మకొండ జిల్లా వేలేరు మండలం చింతల తండాలో గడ్డి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. గడ్డి కట్టలు అనుకోకుండా విద్యుత్ తీగలను తాకడంతో ట్రాక్టర్ డబ్బా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో రైతు మలోతు జైపాల్‌కు భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ట్రాక్టర్ పూర్తిగా కాలిపోవడంతో జీవనాధారమైన వాహనం కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశారు.
    1
    హన్మకొండ జిల్లా వేలేరు మండలం చింతల తండాలో గడ్డి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. గడ్డి కట్టలు అనుకోకుండా విద్యుత్ తీగలను తాకడంతో ట్రాక్టర్ డబ్బా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది.
ఈ ఘటనలో రైతు మలోతు జైపాల్‌కు భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ట్రాక్టర్ పూర్తిగా కాలిపోవడంతో జీవనాధారమైన వాహనం కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    12 hrs ago
  • ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజం కోసం సిరిసిల్లలో పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన 2K రన్‌ ను ఎస్పీ మహేష్ బి గీతే ప్రారంభించారు. 2కే రన్ లో విద్యార్థులు, క్రీడాకారులు పోలీసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారందరూ డ్రగ్స్ నిర్మూలిద్దాం, భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించి, డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు , కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు,ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు.అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి , యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విద్యార్థులకు , వాహనదారులకు , ప్రజలకు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలన్నారు. కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ చేయవద్దన్నారు.మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులతో పాటుగా వాహన యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
    3
    ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజం కోసం సిరిసిల్లలో పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన 2K రన్‌ ను ఎస్పీ మహేష్ బి గీతే ప్రారంభించారు. 2కే రన్ లో విద్యార్థులు, క్రీడాకారులు పోలీసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారందరూ డ్రగ్స్ నిర్మూలిద్దాం, భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించి, డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు , కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు,ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు.అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి , యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై విస్తృతంగా  అవగాహన కల్పించాలన్నారు. మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విద్యార్థులకు , వాహనదారులకు , ప్రజలకు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమలపై  విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలన్నారు. కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ చేయవద్దన్నారు.మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులతో పాటుగా వాహన యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    17 hrs ago
  • కరీంనగర్ 42వ డివిజన్ భగత్ నగర్ లో సీనియర్ సిటిజన్స్ కేర్ సెంటర్, జెడ్ పీ కోటర్స్ లో యోగా ట్రైనర్ మర్రి రాజేందర్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న సఫాయి కార్మికులకు వేసవికాలం దృష్టిలో పెట్టుకొని టవల్స్ మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మరియు కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ,సీనియర్ సిటిజన్స్ కేర్ సెంటర్ బాధ్యులు వి.మోహన్ రెడ్డి,కేశవ రెడ్డి ,అంజన్న, సత్తన్న ,లింగన్న గారు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.. * ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ వారి సేవలను కొనియాడారు: "మన ఊరు సుందరంగా ఉండాలన్నా, పరిశుభ్రంగా ఉండాలన్నా దానికి కారణం మన మున్సిపల్ కార్మికులే. వారు ఒక రెండు మూడు రోజులు పని చేయకపోయినా మనం ఇంటి నుండి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. మనం గతంలో చూసాము కూడా. కానీ వారు ఎప్పుడూ అలా జరగాలని కోరుకోరు. వారికి ఎన్ని బాధలున్నా ఉదయం 4 గంటలకే ఇంటి నుండి బయలుదేరి 5 గంటలకు అటెండెన్స్ ఇచ్చి, చీకటిలోనే అనేక ప్రమాదాలకు ఎదుర్కొని పనులు చేస్తారు. రోడ్డు ప్రమాదాలు కావొచ్చు, వీధి కుక్కలు కావొచ్చు.. ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని తట్టుకొని మనకు మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నారు మన మున్సిపల్ కార్మికులు. మన ఇంట్లో ఒక రోజు చెత్త తీయకపోయినా వచ్చే వాసనను మనం భరించలేము. అటువంటిది వారు సమాజంలోని చెత్తనంతా తొలగిస్తూ, అనారోగ్య పాలవుతూ కూడా మనకు సేవ చేస్తున్నారు. వారికి ఎంత చేసినా తక్కువే అని మేము భావిస్తున్నాము. అందుకే గతంలో మా పాలకవర్గం ఉన్న సమయంలో, మనుషులు డ్రైనేజీలలోకి దిగకూడదనే ఉద్దేశంతో అధునాతన మెషినరీని (Suction and Jetting Machines) తీసుకువచ్చాము. దీనివల్ల కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చి 'సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్'లో 4 కోట్ల రూపాయల నగదు బహుమతిని గెలుచుకోవడం జరిగింది. భారతదేశంలో కరీంనగర్ కు రెండో స్థానం దక్కింది. మున్సిపల్ కార్మికుల కష్టానికి ప్రస్తుతం ఇస్తున్న 16 వేల రూపాయల వేతనం చాలా తక్కువ. దానిని కనీసం 25 వేల రూపాయలకు పెంచాలని నిన్న మే డే సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. చుట్టుపక్కల ఏదైనా పంది లేదా కుక్క చనిపోతే వచ్చే వాసనకే మనం కార్పొరేటర్లకు ఎన్నో సార్లు ఫోన్ చేస్తాము. అటువంటి దుర్వాసనను భరిస్తూ గంటల తరబడి పనిచేసి మనకు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇస్తున్న సఫాయి కార్మికులకు హృదయపూర్వక నమస్కారాలు. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను." "సఫాయి కార్మికుల పట్ల సమాజంలోని అన్ని వర్గాల వారు శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఎంతో ఎండలో కూడా మీరు చేస్తున్న పనిని గుర్తించి, మంచి నీళ్ల సీసా, టవల్ అందించేందుకు ముందుకు వచ్చిన రాజేందర్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా సఫాయి కార్మికులందరికీ 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నాం. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా, కార్మికుల ఆరోగ్య బీమా గురించి కూడా నగరపాలక సంస్థ ఆలోచిస్తోంది. గతంలో 60 ఏళ్లు దాటితే మానవత్వం లేకుండా కార్మికులను తొలగించే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ నిబంధన మార్చి, అనారోగ్య కారణాల వల్ల ఇబ్బంది ఎదురైనా వారి కుటుంబ సభ్యులకు ఆ అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉద్యోగ భద్రత ఉన్నప్పటికీ, తగినంత జీతాలు లేవని మాకు తెలుసు. కార్మికుల జీతాలు పెంచేందుకు మా పాలక వర్గం ఖచ్చితంగా కృషి చేస్తుంది. నగరం శుభ్రంగా ఉండటానికి మీరు చేస్తున్న కృషికి నగర ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.
    1
    కరీంనగర్ 42వ డివిజన్ భగత్ నగర్ లో సీనియర్ సిటిజన్స్ కేర్ సెంటర్, జెడ్ పీ కోటర్స్ లో యోగా ట్రైనర్ మర్రి రాజేందర్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న సఫాయి కార్మికులకు వేసవికాలం దృష్టిలో పెట్టుకొని టవల్స్ మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు  మరియు కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ,సీనియర్ సిటిజన్స్ కేర్ సెంటర్ బాధ్యులు వి.మోహన్ రెడ్డి,కేశవ రెడ్డి ,అంజన్న, సత్తన్న ,లింగన్న గారు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు..
* ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ వారి సేవలను కొనియాడారు:
"మన ఊరు సుందరంగా ఉండాలన్నా, పరిశుభ్రంగా ఉండాలన్నా దానికి కారణం మన మున్సిపల్ కార్మికులే. వారు ఒక రెండు మూడు రోజులు పని చేయకపోయినా మనం ఇంటి నుండి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. మనం గతంలో చూసాము కూడా. కానీ వారు ఎప్పుడూ అలా జరగాలని కోరుకోరు. వారికి ఎన్ని బాధలున్నా ఉదయం 4 గంటలకే ఇంటి నుండి బయలుదేరి 5 గంటలకు అటెండెన్స్ ఇచ్చి, చీకటిలోనే అనేక ప్రమాదాలకు ఎదుర్కొని పనులు చేస్తారు. రోడ్డు ప్రమాదాలు కావొచ్చు, వీధి కుక్కలు కావొచ్చు.. ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని తట్టుకొని మనకు మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నారు మన మున్సిపల్ కార్మికులు.
మన ఇంట్లో ఒక రోజు చెత్త తీయకపోయినా వచ్చే వాసనను మనం భరించలేము. అటువంటిది వారు సమాజంలోని చెత్తనంతా తొలగిస్తూ, అనారోగ్య పాలవుతూ కూడా మనకు సేవ చేస్తున్నారు. వారికి ఎంత చేసినా తక్కువే అని మేము భావిస్తున్నాము. అందుకే గతంలో మా పాలకవర్గం ఉన్న సమయంలో, మనుషులు డ్రైనేజీలలోకి దిగకూడదనే ఉద్దేశంతో అధునాతన మెషినరీని (Suction and Jetting Machines) తీసుకువచ్చాము. దీనివల్ల కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చి 'సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్'లో 4 కోట్ల రూపాయల నగదు బహుమతిని గెలుచుకోవడం జరిగింది. భారతదేశంలో కరీంనగర్ కు రెండో స్థానం దక్కింది.
మున్సిపల్ కార్మికుల కష్టానికి ప్రస్తుతం ఇస్తున్న 16 వేల రూపాయల వేతనం చాలా తక్కువ. దానిని కనీసం 25 వేల రూపాయలకు పెంచాలని నిన్న మే డే సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. చుట్టుపక్కల ఏదైనా పంది లేదా కుక్క చనిపోతే వచ్చే వాసనకే మనం కార్పొరేటర్లకు ఎన్నో సార్లు ఫోన్ చేస్తాము. అటువంటి దుర్వాసనను భరిస్తూ గంటల తరబడి పనిచేసి మనకు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇస్తున్న సఫాయి కార్మికులకు హృదయపూర్వక నమస్కారాలు. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను." 
"సఫాయి కార్మికుల పట్ల సమాజంలోని అన్ని వర్గాల వారు శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఎంతో ఎండలో కూడా మీరు చేస్తున్న పనిని గుర్తించి, మంచి నీళ్ల సీసా, టవల్ అందించేందుకు ముందుకు వచ్చిన రాజేందర్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా సఫాయి కార్మికులందరికీ 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నాం. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం.
అంతేకాకుండా, కార్మికుల ఆరోగ్య బీమా గురించి కూడా నగరపాలక సంస్థ ఆలోచిస్తోంది. గతంలో 60 ఏళ్లు దాటితే మానవత్వం లేకుండా కార్మికులను తొలగించే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ నిబంధన మార్చి, అనారోగ్య కారణాల వల్ల ఇబ్బంది ఎదురైనా వారి కుటుంబ సభ్యులకు ఆ అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉద్యోగ భద్రత ఉన్నప్పటికీ, తగినంత జీతాలు లేవని మాకు తెలుసు. కార్మికుల జీతాలు పెంచేందుకు మా పాలక వర్గం ఖచ్చితంగా కృషి చేస్తుంది. నగరం శుభ్రంగా ఉండటానికి మీరు చేస్తున్న కృషికి నగర ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.