logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పనా షీలా కండక్టర్ లేకున్నా ప్రయాణికుల వద్ద డబ్బులు వసూలు చెయ్యమన్నట్లు డ్రైవర్ గంగాధర్ ఆర్టీసీ కార్మికులు చేపట్టినటువంటి సమ్మె వలన ప్రజలకు ఆటంకాలు ఏర్పడకూడదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను నడుపుటకు అనుమతి ఇవ్వడం జరిగింది కానీ ఏ బస్సులోనైతే కండక్టర్ ఉండడో ఆ బస్సు ప్రయాణికులకు ఉచితంగా తమ గమ్యం వరకు చేర్చుటకు సహకరించడం జరుగుతుంది. కానీ మెట్పల్లి డిపో మేనేజర్ కల్పనాశీల కండక్టర్ లేకుండా నడిచే బస్సులలో కూడా ప్రయాణికుల వద్ద నుండి ఎలాంటి టికెట్ ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది

4 hrs ago
user_అబ్దుల్ ముసవ్విర్
అబ్దుల్ ముసవ్విర్
కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
4 hrs ago

జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పనా షీలా కండక్టర్ లేకున్నా ప్రయాణికుల వద్ద డబ్బులు వసూలు చెయ్యమన్నట్లు డ్రైవర్ గంగాధర్ ఆర్టీసీ కార్మికులు చేపట్టినటువంటి సమ్మె వలన ప్రజలకు ఆటంకాలు ఏర్పడకూడదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను నడుపుటకు అనుమతి ఇవ్వడం జరిగింది కానీ ఏ బస్సులోనైతే కండక్టర్ ఉండడో ఆ బస్సు ప్రయాణికులకు ఉచితంగా తమ గమ్యం వరకు చేర్చుటకు సహకరించడం జరుగుతుంది. కానీ మెట్పల్లి డిపో మేనేజర్ కల్పనాశీల కండక్టర్ లేకుండా నడిచే బస్సులలో కూడా ప్రయాణికుల వద్ద నుండి ఎలాంటి టికెట్ ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది

More news from తెలంగాణ and nearby areas
  • *పురాతన గడిబురుజులు, కోనేరు భూముల పరిరక్షణకు పిలుపు...* జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక గడిబురుజులు, కోనేరు మరియు వాటి పరిసరాల్లో ఉన్న గ్రామ కంఠ/ఆబాది భూములను పరిరక్షించుకోవాలని *మైనారిటీ సీనియర్ నాయకులు ముజీబుర్ రహమాన్* ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పురాతన చారిత్రాత్మక కట్టడాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, భూ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి జారీ చేసిన వీఎల్‌టీలను (VLTs) తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడిబురుజుల పరిసర భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి పోరాడితేనే ఈ విలువైన ఆస్తులను రక్షించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. పురాతన చారిత్రక సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ కలిసి చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు....
    2
    *పురాతన గడిబురుజులు, కోనేరు భూముల పరిరక్షణకు పిలుపు...*
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక గడిబురుజులు, కోనేరు మరియు వాటి పరిసరాల్లో ఉన్న గ్రామ కంఠ/ఆబాది భూములను పరిరక్షించుకోవాలని *మైనారిటీ సీనియర్ నాయకులు ముజీబుర్ రహమాన్* ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పురాతన చారిత్రాత్మక  కట్టడాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, భూ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి జారీ చేసిన వీఎల్‌టీలను (VLTs) తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గడిబురుజుల పరిసర భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి పోరాడితేనే ఈ విలువైన ఆస్తులను రక్షించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
పురాతన చారిత్రక సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ కలిసి చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు....
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో మల్లికార్జున్ కార్గే దిష్టి బొమ్మను దగ్గదం చేసిన బీజేపీ నాయకులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ కార్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఖర్గే ప్రధాని మోదీని టెర్రరిస్టుగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద ఖర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ… దేశ ప్రధానమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని, కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇలాంటి వ్యాఖ్యలు దేశ రాజకీయ విలువలను దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
    1
    ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో మల్లికార్జున్ కార్గే దిష్టి బొమ్మను దగ్గదం చేసిన బీజేపీ నాయకులు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ కార్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
ఖర్గే ప్రధాని మోదీని టెర్రరిస్టుగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద ఖర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ… దేశ ప్రధానమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని, కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇలాంటి వ్యాఖ్యలు దేశ రాజకీయ విలువలను దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • ఆదివాసుల విద్యా, సాంస్కృతిక సందర్శన కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు బయల్దేరి వెళ్లారు. బుధవారం హైదరాబాదులో ఆదివాసుల కోసం విద్య, సాంస్కృతిక సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మార్గమధ్యమైన జన్నారం మండల కేంద్రంలో తెలంగాణ టూరిజం బస్సులలో రాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బొజ్జు, ఆదివాసి సంఘాల నాయకులతో కలిసి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు.
    1
    ఆదివాసుల విద్యా, సాంస్కృతిక సందర్శన కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు బయల్దేరి వెళ్లారు. బుధవారం హైదరాబాదులో ఆదివాసుల కోసం విద్య, సాంస్కృతిక సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మార్గమధ్యమైన జన్నారం మండల కేంద్రంలో తెలంగాణ టూరిజం బస్సులలో రాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బొజ్జు, ఆదివాసి సంఘాల నాయకులతో కలిసి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కరీంనగర్ లో బి ఆర్ ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. నగరంలోని తెలంగాణ చౌక్ లో టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. హై కోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కుట్ర పూరితంగా ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ నివేదిక అంతా తప్పుల తడకగా భావించి తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హై కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. హై కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందనే భావనతో రెండున్నరేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకొని రేవంత్ రెడ్డి రిపేరింగ్ పేరిట హడావుడి చేశారని అన్నారు.
    1
    కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కరీంనగర్ లో బి ఆర్ ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. నగరంలోని తెలంగాణ చౌక్ లో టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. హై కోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కుట్ర పూరితంగా ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ నివేదిక అంతా తప్పుల తడకగా భావించి తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హై కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. హై కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందనే భావనతో రెండున్నరేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకొని రేవంత్ రెడ్డి రిపేరింగ్ పేరిట హడావుడి చేశారని అన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • Post by Saikumar
    1
    Post by Saikumar
    user_Saikumar
    Saikumar
    Mechanic నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • జగిత్యాల జిల్లా..... RTC నాయకులు, ప్రభుత్వ అధికారుల మధ్య నిన్న జరిగిన చర్చలు విఫలం..... సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించిన RTC JAC..... కోరుట్ల, మెట్టుపల్లి పట్టణాల్లో డిపోలకే పరిమితమైన RTC బస్సులు.
    1
    జగిత్యాల జిల్లా.....
RTC నాయకులు, ప్రభుత్వ అధికారుల మధ్య నిన్న జరిగిన చర్చలు విఫలం.....
సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించిన RTC JAC.....
కోరుట్ల, మెట్టుపల్లి పట్టణాల్లో డిపోలకే పరిమితమైన RTC బస్సులు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    12 hrs ago
  • గుబిడి రోడ్డు నిర్మాణానికి రూ. 9 కోట్లు మంజూరు బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భీంపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో మిట్ట మధ్యాహ్నం మండుటెండని సైతం లెక్కచేయకుండా మారుమూల ప్రాంతం మైన గుబిడిలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించడం గ్రామస్తులను ఎంతో ఆనందాన్ని కలిగించింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... ఈరోజు వెనుకబడిన భీంపూర్ మండలంలో పర్యటించడం ఎన్నో సమస్యలను తెలుసుకోవడం కొత్త అనుభవాన్ని కలిగించిందని,విన్న ప్రతీ సమస్యకు ఈరోజు నుంచే పరిష్కాలకు కృషి చేస్తానన్నారు. గ్రామంలో నీటి సమస్యకు సొంత డబ్బులతో బోరు వెయిస్తానని,పిల్లలు చదువుకోవడానికి అవసరం ఉన్న 20 టేబుల్లను సైతం సొంత డబ్బులతో అందిస్తానని తెలిపారు.గుబిడి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం కొరకు రూ. 9 కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు.మారుమూల ప్రాంతంలో గుట్టపైన గల గుబిడి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని అన్నారు. గ్రామంలో రోడ్లు,డ్రైనేజీలు,బోర్లు,స్థానిక సమస్యలు పరిష్కారం చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    గుబిడి రోడ్డు నిర్మాణానికి రూ. 9 కోట్లు మంజూరు
బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భీంపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో మిట్ట మధ్యాహ్నం మండుటెండని సైతం లెక్కచేయకుండా మారుమూల ప్రాంతం మైన గుబిడిలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించడం గ్రామస్తులను ఎంతో ఆనందాన్ని కలిగించింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... ఈరోజు వెనుకబడిన భీంపూర్ మండలంలో పర్యటించడం ఎన్నో సమస్యలను తెలుసుకోవడం కొత్త అనుభవాన్ని కలిగించిందని,విన్న ప్రతీ సమస్యకు ఈరోజు నుంచే పరిష్కాలకు కృషి చేస్తానన్నారు. గ్రామంలో నీటి సమస్యకు సొంత డబ్బులతో బోరు వెయిస్తానని,పిల్లలు చదువుకోవడానికి అవసరం ఉన్న 20 టేబుల్లను సైతం సొంత డబ్బులతో అందిస్తానని తెలిపారు.గుబిడి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం కొరకు రూ. 9 కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు.మారుమూల ప్రాంతంలో గుట్టపైన గల గుబిడి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని అన్నారు. గ్రామంలో రోడ్లు,డ్రైనేజీలు,బోర్లు,స్థానిక సమస్యలు పరిష్కారం చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter భీంపూర్, ఆదిలాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • జగిత్యాల జిల్లా కోరుట్ల గడిబురుజుల స్థలాల రక్షణ కోసం రెండవ రోజు నిరసన దీక్షకు విస్తృత మద్దతు* జగిత్యాల జిల్లా కోరుట్లలో గడిబురుజుల (గ్రామకంఠ / ఆబాది) ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రెండవ రోజు నిరసన దీక్ష కొనసాగింది. ఈ భూములపై విధించిన VLTలను వెంటనే రద్దు చేయాలని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుదవారం రోజు దీక్షకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఎండి మోసిన్ 19వ వార్డ్ కౌన్సిలర్, పొట్ట సురేందర్ 16వ వార్డు కౌన్సిలర్. 30 వార్డు మాజీ కౌన్సిలర్లు ఎండి ముజఫర్ అహ్మద్ సజ్జు, సయ్యిద్ ఆన్వర్ లు సంఘీభావం తెలపడమే కాకుండా ఉద్యమంలో నేరుగా పాల్గొంటామని అధికారపక్షం కాంగ్రెస్ పార్టీ గడి స్థలాల విషయంలో గొంతు ఎత్తుకపోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఇకనైనా స్పందించి విఎల్టీలు రద్దు చేయాలని కోరారు. అంతకుముందు బిజేపి నాయకులు కూడా మద్దతు తెలిపారు. దీంతో ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ సందర్భంగా అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, కన్వీనర్ మొహమ్మద్ ముజాహిద్, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మాట్లాడుతూ గడిబురుజుల భూములు ప్రజల సామూహిక ఆస్తి అని, వాటిని అక్రమాల నుండి కాపాడాలని అన్నారు. గడిబురుజుల చారిత్రాత్మక ప్రాధాన్యతను కాపాడాలని, కోనేరును సంరక్షించాలని, మైసమ్మ తల్లికి దేవాలయం నిర్మించాలని, అలాగే ఆ ప్రాంతంలో కూరగాయల మార్కెట్ మరియు పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిషాసుర మర్దిని ఉత్సవాల స్థలాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. VLTలు పూర్తిగా రద్దు అయ్యే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని, సమస్య పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఏకమై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల కో - కన్వీనర్ లు తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, సుతారి రాములు, సయ్యద్ అన్వర్, ఎం.ఏ. ముజీబుర్ రహ్మాన్, చింతా భూమేశ్వర్, కుంచెం శంకర్, షాహేద్ మహ్మద్ షేక్,, ఎన్. గంగాధర్, జక్కుల శంకర్, గణేష్, ఎం. రాజయ్య, షేక్ సిరాజ్. ఎండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
    4
    జగిత్యాల జిల్లా కోరుట్ల గడిబురుజుల స్థలాల రక్షణ కోసం రెండవ రోజు నిరసన దీక్షకు విస్తృత మద్దతు* 
జగిత్యాల జిల్లా కోరుట్లలో గడిబురుజుల (గ్రామకంఠ / ఆబాది) ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రెండవ రోజు నిరసన దీక్ష కొనసాగింది. ఈ భూములపై విధించిన VLTలను వెంటనే రద్దు చేయాలని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బుదవారం రోజు దీక్షకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఎండి మోసిన్ 19వ వార్డ్ కౌన్సిలర్, పొట్ట సురేందర్ 16వ వార్డు కౌన్సిలర్. 30 వార్డు మాజీ కౌన్సిలర్లు ఎండి ముజఫర్ అహ్మద్ సజ్జు, సయ్యిద్ ఆన్వర్ లు సంఘీభావం తెలపడమే కాకుండా ఉద్యమంలో నేరుగా పాల్గొంటామని అధికారపక్షం కాంగ్రెస్ పార్టీ గడి స్థలాల విషయంలో గొంతు ఎత్తుకపోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఇకనైనా స్పందించి విఎల్టీలు రద్దు చేయాలని కోరారు. అంతకుముందు బిజేపి నాయకులు కూడా మద్దతు తెలిపారు. దీంతో ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది.
ఈ సందర్భంగా అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, కన్వీనర్ మొహమ్మద్ ముజాహిద్, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మాట్లాడుతూ గడిబురుజుల భూములు ప్రజల సామూహిక ఆస్తి అని, వాటిని అక్రమాల నుండి కాపాడాలని అన్నారు.
గడిబురుజుల చారిత్రాత్మక ప్రాధాన్యతను కాపాడాలని, కోనేరును సంరక్షించాలని, మైసమ్మ తల్లికి దేవాలయం నిర్మించాలని, అలాగే ఆ ప్రాంతంలో కూరగాయల మార్కెట్ మరియు పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిషాసుర మర్దిని ఉత్సవాల స్థలాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. VLTలు పూర్తిగా రద్దు అయ్యే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని, సమస్య పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఏకమై ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల కో - కన్వీనర్ లు తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, సుతారి రాములు, సయ్యద్ అన్వర్, ఎం.ఏ. ముజీబుర్ రహ్మాన్, చింతా భూమేశ్వర్, కుంచెం శంకర్, షాహేద్ మహ్మద్ షేక్,, ఎన్. గంగాధర్, జక్కుల శంకర్, గణేష్, ఎం. రాజయ్య, షేక్ సిరాజ్. ఎండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.