Shuru
Apke Nagar Ki App…
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కాలనీవాసులు కోరిన వెంటనే ఎమ్మెల్యే సురేంద్రబాబు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కాలనీవాసులు కోరిన వెంటనే ఎమ్మెల్యే సురేంద్రబాబు బోరు వేయించారు. ఎమ్మెల్యే స్వయంగా భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడైనా తాగునీటి సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. నీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Merzaa Tv
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కాలనీవాసులు కోరిన వెంటనే ఎమ్మెల్యే సురేంద్రబాబు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కాలనీవాసులు కోరిన వెంటనే ఎమ్మెల్యే సురేంద్రబాబు బోరు వేయించారు. ఎమ్మెల్యే స్వయంగా భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడైనా తాగునీటి సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. నీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చేనేత కార్మికులకు నేటి నుండి ఉచిత విద్యుత్ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డులో మగ్గం చేనేత కార్మికులతో ముచ్చటించారు. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఆది నుండి తెలుగుదేశం పార్టీకి చేనేత వర్గం వారు అండగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.1
- గాండ్లపెంట మండలo క ఠారుపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించి, ముగింపుకు చేరుకున్నాయి. గురువారం రాత్రి ఉత్సవాలు ముగింపు కావడంతో యోగివేమన గొడుగుకి వేమన పీఠాధిపతులు నందవేమారెడ్డి, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక అలంకరణ చేసి, పూజా కార్యక్రమాలు చేశారు. వేమన సమాధిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించిన నందవేమారెడ్డికి భక్తులు ప్రశంసిస్తున్నారు.1
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన ఆశ్రమ ప్రారంభోత్సవం, జయంతి ఉత్సవాల కరపత్రం ఘనంగా విడుదలైంది. జిల్లా అధ్యక్షులు ఎద్దుల చెన్నయ్య, ఉపాధ్యక్షులు బైరుపోగు జయరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజ్, డాక్టర్ కామాళే గణేష్‌తో పాటు పలువురు నాయకులు కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… విద్యా, సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పుకు ఆశ్రమం కీలకమని తెలిపారు. ఏప్రిల్ 11న జరిగే ఆశ్రమ ప్రారంభోత్సవానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక వైఎస్ఆర్సిపి నాయకులు ఎం జక్కయ్య గారు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. దాతలను ఘనంగా సన్మానించగా… కార్యక్రమంలో పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.1
- *🔰ఏపీలో నేటితో ముగియనున్న సర్పంచుల పదవీ కాలం* రేపటి నుంచి ప్రత్యేక అధికారుల నియామకానికి ఉత్తర్వులు తహశీల్దార్, MPDO స్థాయి అధికారులు, కొత్త పాలకమండలి వచ్చే వరకు బాధ్యతలు జీవో జారీ చేసిన ప్రభుత్వం1
- దరూరు మండల కేంద్రములో శ్రీ కొండేటి అంజన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా నిర్వహించిన సర్పంచ్ డి ఆర్ విజయ్ కుమార్. ********<<<<<<>>>>>>******** జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రములో వెలసిన శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయములో హనుమాన్ జయంతి వేడుకలు ముగించుకొని స్వామివారిని పురవీధులగుండా స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి లో మోస్తూ వెనకాల అభయాంజనేయ స్వామి విగ్రహమును ట్రాక్టర్లో ఊరేగిస్తూ ముందుగా పార్థసారతి ఆలయములో స్వామి వారి దర్శనం చేసుకొని పురవీధుల గుండా స్వామిని ఆయిరేగింపుగా తీసుకెలుతూ శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయము వరకు తీసుకెలుతున్నట్లు డి ఆర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1
- ఆర్గానిక్ గా పండించిన పంటలకు రైతులు లాభదాయకంగా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా చెప్పడం జరిగింది1
- నందవరం బంగారమ్మ ఆలయంలో భక్తి విరాజిల్లింది… గోపుర కలశ ప్రతిష్టతో మహోత్సవ వైభవం!”1
- బద్వేలు:రాజధాని అమరావతి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో రాజధానిపై కమ్ముకున్న అనిశ్చితి, చీకట్లు పూర్తిగా తొలగిపోయాయని ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బద్వేలు పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాలు నిర్వహించారు. అమరావతికి వెలుగులు వచ్చినట్లుగా సంకేతంగా దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేశారు., “ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజు. ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి ఇక శాశ్వత రాజధానిగా నిలవనుంది” అని అన్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు తమ సొంత భూములను త్యాగంగా సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వ కాలంలో రాజధాని అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే ఆ పరిస్థితులను అర్థం చేసుకుని తగిన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇకపై ఎలాంటి రాజకీయ మార్పులు వచ్చినా అమరావతిని ఎవరూ కదిలించలేరని, ఇది రాష్ట్ర ప్రజల సంకల్పమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తరఫున దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్,చెరుకూరి రవికుమార్, పరిటాల వెంకట సుబ్బయ్య,బీరం జయ రామి రెడ్డి, పాలకొండు రాజశేఖర్ రెడ్డి,గాజులపల్లె శంకర్ రెడ్డి కొంకుల రాంబాబు, కల్వపల్లె వీర రెడ్డి, జహంగీర్ భాష,బోవిళ్ళ నరసింహ రెడ్డి,బిజీవేముల రమణారెడ్డి,మాచుపల్లి కృష్ణారెడ్డి, పఠాన్ మౌలాలి, రసూల్, ఉపత్తి సుబ్బారెడ్డి,గోపి రెడ్డి, సుబ్బా రాయుడు,రాము,గురు ప్రసాద్ రెడ్డి,కోటపాటి పెంచలయ్య,చిన్నప్ప రెడ్డి, గంగాధర్ రెడ్డి, వెంకటేష్ తదితరు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- అప్పు అడిగినందుకే చంద్రమను హత్య చేశారు: DSP డేగల ప్రభాకర్ పెద్ద పంజాణి మండలం ముద్దేపల్లికి చెందిన చంద్రమ్మను సమీప బంధువైన సుబ్రహ్మణ్యం హత్య చేసి జగమర్ల అడవిలో పడేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయమై పలమనేరు డిఎస్పి డేగల ప్రభాకర్, సిఐ పరశురాముడు పలమనేరు పోలీస్ స్టేషన్లో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రమ్మను సమీప బంధువైన సుబ్రమణి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హత్య చేశారన్నారు. చీటీల డబ్బు మరియు అప్పుగా తీసుకున్న మొత్తం సుమారు రెండు లక్షల నగదును తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయడంతో ముందుగా పన్నిన పథకం ప్రకారం చంద్రమ్మను బైక్ పై తీసుకెళ్లి స్నేహితులతో కలిసి ఓ మామిడి తోపులో హత్య చేశారన్నారు. అనంతరం ఓ బొలెరో వాహనాన్ని బాడుగకు తీసుకొని వారే స్వయంగా నడుపుకుంటూ చంద్రమ్మ మృతదేహాన్ని పలమనేరు సమీపంలోని జగమర్ల అటవీ ప్రాంతంలో పారవేశారన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే క్రమంలో సుబ్రహ్మణ్యం ను విచారించాగా మరో ఇద్దరితో కలిసి హత్య చేసి జగమర్ల అడవిలో పారవేసినట్లు తెలిపారు. ఈ కేసులో సుబ్రమణి అరెస్ట్ చేయగా మరో ఇద్దరు ముద్దాయిలైన నూర్ అహ్మద్, దేవి వరప్రసాద్ లను తొందర్లోనే అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్ని సాక్ష్యాదారాలు సేకరించామన్నారు.1