Shuru
Apke Nagar Ki App…
కటారు పల్లె గ్రామంలో ముగిసిన వేమన ఉత్సవాలు, నందవేమారెడ్డికి ప్రశంసలు గాండ్లపెంట మండలo క ఠారుపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించి, ముగింపుకు చేరుకున్నాయి. గురువారం రాత్రి ఉత్సవాలు ముగింపు కావడంతో యోగివేమన గొడుగుకి వేమన పీఠాధిపతులు నందవేమారెడ్డి, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక అలంకరణ చేసి, పూజా కార్యక్రమాలు చేశారు. వేమన సమాధిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించిన నందవేమారెడ్డికి భక్తులు ప్రశంసిస్తున్నారు.
Srivartha news
కటారు పల్లె గ్రామంలో ముగిసిన వేమన ఉత్సవాలు, నందవేమారెడ్డికి ప్రశంసలు గాండ్లపెంట మండలo క ఠారుపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించి, ముగింపుకు చేరుకున్నాయి. గురువారం రాత్రి ఉత్సవాలు ముగింపు కావడంతో యోగివేమన గొడుగుకి వేమన పీఠాధిపతులు నందవేమారెడ్డి, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక అలంకరణ చేసి, పూజా కార్యక్రమాలు చేశారు. వేమన సమాధిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించిన నందవేమారెడ్డికి భక్తులు ప్రశంసిస్తున్నారు.
More news from Sri Sathya Sai and nearby areas
- కదిరి మండల పరిధిలోని ముత్యాల చెరువు గ్రామంలో శుక్రవారం మన ఊరు మన నీరు మన అందరి బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సాగునీటి చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సీనియర్ టిడిపి నాయకుడు న్యాయవాది వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఓటమి నాయకులు పాల్గొన్నారు.1
- వైరల్: కారు ఢీకొనడంతో మహిళ గాలిలోకి విసిరివేయబడింది *రోడ్డు దాటేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ సంఘటన తెలియజేస్తుంది. కర్ణాటకలోని బంట్వాల్‌లో భారతి(48) అనే యువతి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. మధ్యలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనం వేగాన్ని అంచనా వేయకుండా ముందుకు పరుగులు తీశారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఆమెను బలంగా ఢీకొట్టడంతో గాలిలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన భారతిని ఆస్పత్రికి తరలించారు. గత నెల 30న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.*1
- ఆకలి కడుపులు నింపుటకై పెట్టిన కార్యక్రమం అన్న క్యాంటీన్. దయచేసి ఒక టోకెన్ మాత్రమే తీసుకోవాలి అని మనవి.మీ వెనకాల ఉన్న పేద వాడి కడుపు కూడా నిండాలి అంటే ..1
- అప్పు అడిగినందుకే చంద్రమను హత్య చేశారు: DSP డేగల ప్రభాకర్ పెద్ద పంజాణి మండలం ముద్దేపల్లికి చెందిన చంద్రమ్మను సమీప బంధువైన సుబ్రహ్మణ్యం హత్య చేసి జగమర్ల అడవిలో పడేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయమై పలమనేరు డిఎస్పి డేగల ప్రభాకర్, సిఐ పరశురాముడు పలమనేరు పోలీస్ స్టేషన్లో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రమ్మను సమీప బంధువైన సుబ్రమణి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హత్య చేశారన్నారు. చీటీల డబ్బు మరియు అప్పుగా తీసుకున్న మొత్తం సుమారు రెండు లక్షల నగదును తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయడంతో ముందుగా పన్నిన పథకం ప్రకారం చంద్రమ్మను బైక్ పై తీసుకెళ్లి స్నేహితులతో కలిసి ఓ మామిడి తోపులో హత్య చేశారన్నారు. అనంతరం ఓ బొలెరో వాహనాన్ని బాడుగకు తీసుకొని వారే స్వయంగా నడుపుకుంటూ చంద్రమ్మ మృతదేహాన్ని పలమనేరు సమీపంలోని జగమర్ల అటవీ ప్రాంతంలో పారవేశారన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే క్రమంలో సుబ్రహ్మణ్యం ను విచారించాగా మరో ఇద్దరితో కలిసి హత్య చేసి జగమర్ల అడవిలో పారవేసినట్లు తెలిపారు. ఈ కేసులో సుబ్రమణి అరెస్ట్ చేయగా మరో ఇద్దరు ముద్దాయిలైన నూర్ అహ్మద్, దేవి వరప్రసాద్ లను తొందర్లోనే అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్ని సాక్ష్యాదారాలు సేకరించామన్నారు.1
- రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి ఉత్సవమూర్తిని రథోత్సవం పై కొలువు తీర్చి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మడుగుతేరు కార్యక్రమం నిర్వహించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు రథోత్సవ వేడుకల్లో పాల్గొని రథాన్నిలాగి మొక్కలు తీర్చుకున్నారు.1
- ఆంధ్రప్రదేశ్ లో... ఆగని డోలి మోతలు *అల్లూరి జిల్లా. న్యూస్ డోలిలో గర్భిణి… 5 కి.మీ నడక. ▪️అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల కష్టాలు మరోసారి వెలుగులోకి. ▪️డుంబ్రిగూడ మండలం డొక్రిపాడు గ్రామంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్భిణి మహిళను కుటుంబ సభ్యులు డోలిలో మోసుకెళ్లాల్సిన పరిస్థితి. ▪️పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను భర్తతో పాటు బంధువులు సుమారు 5 కిలోమీటర్ల మేర డోలిలో మోసుకుంటూ ఆస్పత్రికి తరలింపు. ▪️రోడ్డు లేకపోవడంతో ప్రతిసారి ఇలాంటి కష్టాలు పడాల్సి వస్తోందని గిరిజనులు ఆగ్రహం. ▪️వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి వినతి.1
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన ఆశ్రమ ప్రారంభోత్సవం, జయంతి ఉత్సవాల కరపత్రం ఘనంగా విడుదలైంది. జిల్లా అధ్యక్షులు ఎద్దుల చెన్నయ్య, ఉపాధ్యక్షులు బైరుపోగు జయరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజ్, డాక్టర్ కామాళే గణేష్‌తో పాటు పలువురు నాయకులు కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… విద్యా, సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పుకు ఆశ్రమం కీలకమని తెలిపారు. ఏప్రిల్ 11న జరిగే ఆశ్రమ ప్రారంభోత్సవానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక వైఎస్ఆర్సిపి నాయకులు ఎం జక్కయ్య గారు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. దాతలను ఘనంగా సన్మానించగా… కార్యక్రమంలో పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.1
- గాండ్లపెంట మండలo క ఠారుపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించి, ముగింపుకు చేరుకున్నాయి. గురువారం రాత్రి ఉత్సవాలు ముగింపు కావడంతో యోగివేమన గొడుగుకి వేమన పీఠాధిపతులు నందవేమారెడ్డి, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక అలంకరణ చేసి, పూజా కార్యక్రమాలు చేశారు. వేమన సమాధిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించిన నందవేమారెడ్డికి భక్తులు ప్రశంసిస్తున్నారు.1