Shuru
Apke Nagar Ki App…
ఇసుక జీవో జారీపై సర్వత్ర ఉత్కంఠ, జీవో జారీ చేయాలని కోరుతున్న ప్రజలు కేంద్ర ప్రభుత్వం ఇసుక జీవోను జారీ చేయకపోతే మండల అభివృద్ధి నిలిచిపోయినట్టేనని జన్నారం మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జన్నారం కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఉండటంతో 9 కిలోమీటర్ల పరిధిలో ఇసుక సేకరణపై నిషేధం ఉంది. ఇందిరమ్మ ఇళ్లు, రోడ్లు, తదితర వాటి నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అటవీశాఖ అధికారులు చెబుతున్నా సంవత్సర కాలంగా జీవో జారీ కాకపోవడంతో ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఎకో జోన్ పరిమితిని కిలోమీటర్ వరకు తగ్గించి ఇసుకను సేకరించే విధంగా జీవో జారీ చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
P.G. Murthy
ఇసుక జీవో జారీపై సర్వత్ర ఉత్కంఠ, జీవో జారీ చేయాలని కోరుతున్న ప్రజలు కేంద్ర ప్రభుత్వం ఇసుక జీవోను జారీ చేయకపోతే మండల అభివృద్ధి నిలిచిపోయినట్టేనని జన్నారం మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జన్నారం కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఉండటంతో 9 కిలోమీటర్ల పరిధిలో ఇసుక సేకరణపై నిషేధం ఉంది. ఇందిరమ్మ ఇళ్లు, రోడ్లు, తదితర వాటి నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అటవీశాఖ అధికారులు చెబుతున్నా సంవత్సర కాలంగా జీవో జారీ కాకపోవడంతో ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఎకో జోన్ పరిమితిని కిలోమీటర్ వరకు తగ్గించి ఇసుకను సేకరించే విధంగా జీవో జారీ చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- *కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు* *కోడెల మృతిపై విచారణకు ఆదేశం* *నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలం* *రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* *గోశాలను సందర్శించిన విప్ పాల్గొన్న ఆలయ ఈఓ, మున్సిపల్ చైర్మన్ అధికారులు* వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించారు... ఇటీవల ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై, గోశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత పశువైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ చిన్న వయసు కోడెలను దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యాధులు తదితర కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించే ఉద్దేశంతో పాలు మరవని చిన్న కోడెలను సమర్పించకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీసం ఏడాది వయసు వచ్చిన తర్వాత కోడెలను సమర్పిస్తే అవి వాతావరణానికి అలవాటు పడి అనారోగ్యానికి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుందని సూచించారు. గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వయసు ఆధారంగా గ్రేడింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న కోడెలు, పెద్ద కోడెలను వేర్వేరుగా ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒకదానిపై మరొకటి ఎగబడటం, పొడుచుకోవడం వంటి ఘటనలతో గాయాలు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో గోశాలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలో పచ్చిగడ్డి, దాతలు అందించే పశుగ్రాసంతో పాటు అవసరమైన దాణాను నాణ్యతలో రాజీ లేకుండా అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన కోడెల మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. మానవ తప్పిదం లేదా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగిందని తేలితే ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.. వేములవాడలో ఆధునిక పద్ధతుల్లో నూతన గోశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి, క్యాబినెట్ ఆమోదం కూడా పొందినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా నూతన గోశాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న గోశాల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని, భక్తులు సమర్పించే కోడెలను సక్రమంగా సంరక్షించి, అవసరమైన సమయంలో భక్తులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్న ఆవులను కూడా కొందరు భక్తులు ఆలయానికి తీసుకొచ్చి వదిలేస్తున్నారని, వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజన్న ఆలయానికి సమర్పించే కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.4
- *ఎయిర్‌పోర్ట్ భూసేకరణపై రైతులకు జోగు రామన్న భరోసా* ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల రైతులు, గ్రామస్తుల్లో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలపై స్పష్టత కల్పించేందుకు మాజీ మంత్రి జోగు రామన్న చొరవ తీసుకున్నారు. మంగళవారం గ్రామస్తులు, రైతులు మాజీ మంత్రి జోగు రామన్నను కలిసి తమ సమస్యలను వివరించగా, ఆయన జిల్లా కలెక్టర్ రాజర్షి గారితో క్యాంప్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలపై చర్చించారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, భూముల ధరలు, గ్రామాలపై ప్రభావం తదితర అంశాలపై రైతులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న సందేహాలను జిల్లా కలెక్టర్ దృష్టికి జోగు రామన్న తీసుకెళ్లారు. పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని అందించి, రైతులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులు జోగు రామన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ బహిరంగంగా, సోషల్ మీడియా వేదికగా భూములకు తక్కువ ధర వస్తుందంటూ ప్రకటనలు చేయడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజల్లో భయాందోళన వాతావరణం ఏర్పడిందన్నారు. రైతులు, గ్రామస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని సూచించారు. భూముల ధరల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా కలెక్టర్ సమక్షంలో సంబంధిత గ్రామాల ప్రజలు, రైతులతో సమీక్షలు నిర్వహించి, గ్రామసభలు ఏర్పాటు చేయడంతో పాటు సామాజిక-ఆర్థిక సర్వేలు నిర్వహించిన అనంతరం భూసేకరణ, పరిహారం ధరల నిర్ణయ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. రైతులు, గ్రామస్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరుతున్నామని, ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా తమ వంతు కృషి చేస్తామని జోగు రామన్న భరోసా ఇచ్చారు. రైతులు, గ్రామస్తులు ఎవరూ అధైర్యపడవద్దని, వారి వెంట బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లవేళలా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బండి దత్తాత్రే, కడదరపు అశోక్, రావుల సోమన్న, రమేష్, ఇస్తారి, జీవన్, బండి సాగర్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు,2
- 34 నెలల పాలనలో విద్యార్థుల హామీల అమలేది రేవంత్ రెడ్డి? స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు? విద్యార్థుల హామీలు అమలు చేయకపోతే ఉద్యమం ఉధృతం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో ఖాళీ పర్సులు ప్రదర్శిస్తూ ఏఐఎస్ఎఫ్ విన్నూత నిరసన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను, 5లక్షల విద్య భరోసా కార్డును, పెండింగ్ ఫీజు బకాయిలను అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని, సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని విద్యార్థుల హామీల అమలు చేయకుండా విద్యార్థులకు ఓట్లు లేవని చిన్నచూపు చూస్తున్నాడని, రాష్ట్రంలో విద్యార్థులు సమస్యల కోసం ప్రతి రోజు రోడ్డు ఎక్కుతున్నారని,సీఎం వద్ద విద్యాశాఖ ఉంది కమిషన్ల కోసమేనని, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం తప్పదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఖాళీ పర్సులను ప్రదర్శిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ,స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థులు వారి తల్లితండ్రులు జేబులోంచి సర్టిఫికెట్ల కోసం కళాశాలకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని దీంతో పర్సులు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను ,యువవికాసం పేరుతో 5లక్షల విద్యా భరోసా కార్డు ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని , ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నాం ఇది ప్రజాపాలనని చెబుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల హామీలను అమలుచేయకాపోవడానికి కారణం ఎందని? విద్యార్థుల హామీల అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఓట్లతో ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బడ్జెట్ లో 15%నిధులు ఇవ్వాలని , ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా వాటిని అమలు చేసి విద్యార్థుల పట్ల తమ చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలని, రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని విద్యా శాఖకు న్యాయం చేయకుంటే విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని లేనిపక్షంలో ఢిల్లీ తరహా ఉద్యమాన్ని తెలంగాణ గల్లీలలో విద్యార్థులను ఏకం చేసి ఉద్యమిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నూనావత్ శ్రీనివాస్ నాయక్, గర్ల్స్ వింగ్ నాయకురాలు జోష్ణ,నగర నాయకులు సందీప్ రెడ్డి, బోయినీ విష్ణు, అరవింద్,సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు1
- pocharam, bhaskar, raddy,,strike (dharna)against murder1
- వన మహోత్సవంలో భాగస్వాములు కావాలి: సీఐ రామచందర్ రావు... పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కరీంనగర్ వన్ టౌన్ సీఐ రామచందర్ రావు పిలుపునిచ్చారు. కరీంనగర్ 1వ పట్టణ పోలీస్ శాఖ, 'ఫ్రెండ్లీ వాకర్స్' సంయుక్త ఆధ్వర్యంలో GP గ్రౌండ్‌లో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీఐ రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంచడం ద్వారానే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్లీ వాకర్స్ సభ్యులు, స్థానిక పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.3
- CCI పరిశ్రమను పునరుద్ధరించి స్థానికులకు ఉపాధి కల్పించాలి ఆదిలాబాద్ లోని CCI పరిశ్రమను పునరుద్ధరించాలని CCI సాధన కమిటీ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు జండాపూర్ గ్రామస్తులు మంగళవారం సంఘీభావం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపు పరిశ్రమను తెరిపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.1
- ఆలయ పౌండేషన్ ఆధ్వర్యంలో 45 మందికి ఉచిత కేటరాక్ట్ శస్త్రచికిత్స : IAS నరహరి బసంత్‌నగర్, ఆగస్టు 25: పేద, నిరుపేదలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పరికిపండ్ల నరహరి, ఐఏఎస్ సహకారంతో, ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర విజన్ సెంటర్, బసంత్‌నగర్ నుంచి 45 మందికి ఉచిత కేటరాక్ట్ శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌లోని శంకర ఐ హాస్పిటల్‌కు తరలించారు. ఈ సందర్భంగా శ్రీ పరికిపండ్ల నరహరి, ఐఏఎస్ స్వయంగా వారితో మాట్లాడి, వారికి ధైర్యం కల్పిస్తూ, శంకర ఐ హాస్పిటల్‌లో నాణ్యమైన వైద్య చికిత్స పొందిన అనంతరం సురక్షితంగా తిరిగి రావాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కంటి శస్త్రచికిత్స చేయించుకోలేని పేదలకు ఉచితంగా వైద్యం అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తు, పేదల కంటి ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని శంకర విజన్ సెంటర్ ఇన్‌చార్జ్ పరికిపండ్ల రామ్ తెలిపారు.1
- ఆధ్యాత్మిక సదస్సుకు దారుస్సలాం తరలివెళ్లిన ఎంఐఎం శ్రేణులు.. జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించిన ఎంఐఎం అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్.. ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ దారుసలాంలో నిర్వహించ తలపెట్టిన జల్సా రహమతుల్-లీల్-ఆలమీన్ ఆధ్యాత్మిక బహిరంగ సభకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఆదివారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి వందలాదిగా ఎంఐఎం శ్రేణులు, పార్టీ కరీంనగర్ సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో మంగళవారం తరలివెళ్లారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ .. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి 100 వాహనాలలో 500 మంది, కరీంనగర్ పట్టణం నుంచి 35 డివిజన్లలో ప్రతి డివిజన్ నుంచి 4కార్ల చొప్పున 125 వాహనాలలో దాదాపు 500 మంది ఎంఐఎం పార్టీ నాయకులు, డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, క్రియాశీలక కార్యకర్తలు హైదరాబాద్ తరలివెళ్లినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా భారీ ఎత్తున క్రియాశీలక కార్యకర్తలను కూడగట్టి ఎక్కువ సంఖ్యలో వెళ్లినట్లు చెప్పారు. ర్యాలీకి ముందు హాఫిజ్ అస్గర్ అలీ దువా ప్రార్థన చేశారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్లు సయ్యద్ ఇబ్రహీం, మాజిద్ హుస్సేన్, మాజీ కార్పొరేటర్ ఆరిఫ్ అహ్మద్, మాజీ కోఆప్షన్ సభ్యులు అహ్మద్ మొహియుద్దీన్ బాబుజానీ, నాయకులు ఫసియుద్దీన్ ఖాలీద్, ఎంఏ సలీమ్, అబ్దుల్ గఫ్ఫార్, ఖాజా మజారోద్దీన్, వాజిద్ అలీఖాన్, మేరాజ్, అబ్దుల్లా ఖాన్, ఆమెర్, హాఫిజ్ అబ్దుల్ జబ్బార్, యునూస్, యాసర్, అల్మాస్, ఇమ్రాన్, జాకీర్, బాబా ఖాలీద్ తదితరులున్నారు.3
- ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నేత్రదానం చేయండి.. మరొకరికి చూపు ఇవ్వండి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ నేత్రదానం ద్వారా చూపును కోల్పోయిన వారికి కొత్త జీవితాన్ని అందించవచ్చని, ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అన్నారు. జాతీయ అంధత్వం, దృష్టిలోపాల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తున్న 41వ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మంగళవారం సిరిసిల్ల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి గాంధీ చౌక్ వరకు నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక వ్యక్తి మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా సాధారణంగా ఇద్దరు చూపు కోల్పోయిన వ్యక్తులకు చూపు పునరుద్ధరణకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. “ఒకరి జీవితం ముగిసిన చోట.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు ప్రారంభమయ్యేలా నేత్రదానం దోహదపడుతుంది” అని అన్నారు. వ్యక్తి మరణించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా, సాధారణంగా 6 నుంచి 8 గంటలలోపు నేత్ర కణజాలాన్ని సేకరించే అవకాశం ఉంటుందని తెలిపారు. నేత్రదానం వల్ల మృతదేహం రూపంలో ఎలాంటి మార్పు ఉండదని, వైద్య నిపుణులు అవసరమైన నేత్ర కణజాలాన్ని గౌరవప్రదంగా సేకరిస్తారని స్పష్టం చేశారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. మరణానంతరం నేత్రదానానికి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు. రక్తపోటు, క్షయవ్యాధి, ఉబ్బసం ఉన్నవారు, కళ్లద్దాలు ఉపయోగించేవారు, కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు కూడా కొన్ని సందర్భాల్లో నేత్రదానం చేయవచ్చని తెలిపారు. అయితే నేత్రదానానికి అర్హతను వైద్య నిపుణులు నిర్ధారిస్తారని పేర్కొన్నారు. నేత్రదానం ప్రతి కుటుంబ ఆచారంగా మారాలని, నేత్రదానం కేవలం దానం మాత్రమే కాదని, మరణానంతరం కూడా మానవత్వాన్ని కొనసాగించే గొప్ప సేవ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తేజస్విని, జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమ అధికారి డాక్టర్ నయం జహా, నేత్ర వైద్య సహాయకులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.2