ప్రజల సమస్య పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పోగులేటి శీనన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గారి అధ్యక్షతన ప్రజాసమస్యల పరిష్కారానికి కల్లూరు డి.ఎన్.పి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి గారు పేర్కొన్నారు. అనంతరం కల్లూరు & తల్లాడ మండలాల గ్రామాల నుంచి వచ్చిన ప్రజల మంత్రి గారు స్వయంగా అర్జీలు తీసుకుని, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి గారు భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన, పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని మంత్రి గారు తెలిపారు. ఈ క్రమంలో, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, మున్సిపల్ చైర్ పర్సన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్స్, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, ఆయా గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రజల సమస్య పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పోగులేటి శీనన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గారి అధ్యక్షతన ప్రజాసమస్యల పరిష్కారానికి కల్లూరు డి.ఎన్.పి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి గారు పేర్కొన్నారు. అనంతరం కల్లూరు & తల్లాడ మండలాల గ్రామాల నుంచి వచ్చిన ప్రజల మంత్రి గారు స్వయంగా అర్జీలు తీసుకుని, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి గారు భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన, పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని మంత్రి గారు తెలిపారు. ఈ క్రమంలో, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, మున్సిపల్ చైర్ పర్సన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్స్, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, ఆయా గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
- పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని చూసిన మాజీమంత్రి ఎర్రబెల్లి అమెరికా పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే నేరుగా సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి వెళ్లిన జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు.ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ప్రజా జీవితంలో మళ్లీ చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.1
- ఈరోజు, సెయింట్ మేరీస్ బెథానీ కాల్మెన్ విద్యాలయ ఉన్నత పాఠశాల NCC విద్యార్థులు మరియు వారి మేడమ్ పర్వీన్ బేగం, అలాగే సెయింట్ జోసెఫ్స్ బెథానీ నవజీవన్ విద్యాలయ పాఠశాల 10వ మరియు 9వ తరగతి విద్యార్థులు, వారి ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పి.టి. సర్ గారి సమక్షంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈరోజు, సెయింట్ మేరీస్ బెథానీ కాల్మెన్ విద్యాలయ ఉన్నత పాఠశాల NCC విద్యార్థులు మరియు వారి మేడమ్ పర్వీన్ బేగం, అలాగే సెయింట్ జోసెఫ్స్ బెథానీ నవజీవన్ విద్యాలయ పాఠశాల 10వ మరియు 9వ తరగతి విద్యార్థులు, వారి ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పి.టి. సర్ గారి సమక్షంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు.2
- నీట్ లీకేజీకి వ్యతిరేకంగా ఏటూరునాగారంలో యూత్ కాంగ్రెస్ నిరసన ములుగు జిల్లా:నీట్ పేపర్ లీకేజీ ఘటన, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ఏటూరునాగారంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మండల యూత్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వై జంక్షన్ వద్ద జరిగిన నిరసనలో ఆర్టీఏ సభ్యుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు.1
- గౌరవెల్లి ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ..... కాంగ్రెస్ పార్టీ నేతల సంబరాలు హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతుల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేయడంతో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురైన ప్రధాన అడ్డంకులు తొలగాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా వివిధ న్యాయపరమైన వివాదాల కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు తిరిగి వేగం పుంజుకునే అవకాశం ఏర్పడింది. గతంలో పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని కొందరు భూ నిర్వాసితులు సుప్రీంకోర్టుతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ), వనశక్తి సంస్థల్లో పిటిషన్లు దాఖలు చేయడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టతతో ప్రస్తుతం సుమారు 95 శాతం పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. 8.23 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షా 20 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందే అవకాశముంది. దీంతో హుస్నాబాద్ ప్రాంతంలోని రైతులకు శాశ్వత సాగునీటి వసతి కలిగి వ్యవసాయాభివృద్ధికి ఊతమివ్వనుంది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఫలితంగానే ప్రాజెక్టుకు న్యాయపరమైన అడ్డంకులు తొలగి నిర్మాణానికి మార్గం సుగమమైందని వారు పేర్కొన్నారు.2
- వీరందరూ దేశానికి ఈ దేశ ప్రజలకు వీళ్ళు సేవకులు వీళ్లకు జీతాలు మనమే ఇస్తున్నాం: భారతదేశ ప్రజలు వీరందరూ ఈ దేశానికి ఈ దేశ ప్రజలకు వీళ్ళు సేవకులు వీళ్ళకి జీతాలు మనమే ఇస్తున్నాం జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన కొందరు అధికారులు లేదా నాయకులు ప్రజలకు ఆమడి దూరంలో ఉన్నారు ప్రధాన మంత్రి (Prime Minister) కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతి, దేశ పాలనా బాధ్యతలు చూస్తారు. కేంద్ర హోం మంత్రి: శ్రీ అమిత్ షా 2019 నుండి దేశ భద్రత, సరిహద్దుల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సహకార శాఖ బాధ్యతలను చేపడతారు రాష్ట్రపతి (President) దేశ ప్రథమ పౌరుడు మరియు రక్షణ దళాల అధిపతి కేంద్ర మంత్రులు కేబినెట్: వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తూ జాతీయ విధానాలను అమలు చేస్తారు రాష్ట్ర గవర్నర్లు (Governors) రాష్ట్ర స్థాయిలో నామమాత్రపు అధిపతులుగా ఉంటారు ముఖ్యమంత్రులు (Chief Ministers) రాష్ట్ర ప్రభుత్వ పాలనా అధిపతులు IAS (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) జిల్లా స్థాయిలో కలెక్టర్లుగా, ప్రభుత్వ కార్యదర్శులుగా ఉంటూ IPS (ఇండియన్ పోలీస్ సర్వీస్): శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నిరోధానికి జిల్లా ఎస్పీలుగా మరియు ఇతర పోలీస్ విభాగాల్లో పనిచేస్తారు IFS (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్): అడవులు, వన్యప్రాణుల రక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు చూస్తారు IRS (ఇండియన్ రెవెన్యూ సర్వీస్): కేంద్ర పన్నులు, కస్టమ్స్ మరియు ఆదాయపు పన్నుల వసూళ్లు, ఆర్థిక నిర్వహణ చూస్తారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) దేశ అత్యున్నత న్యాయస్థానానికి నాయకత్వం వహిస్తారు (CAG Comptroller and Auditor General) ప్రభుత్వ ఖర్చులు, ఆర్థిక లావాదేవీలను ఆడిట్ చేస్తారు ఎన్నికల కమిషనర్లు (Election Commissioners) దేశంలో స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను నిర్వహిస్తారు తహశీల్దార్ (MRO): మండల స్థాయిలో రెవెన్యూ మరియు ప్రజల ధృవీకరణ పత్రాల బాధ్యతలు చూస్తారు గ్రామ సచివాలయ అధికారులు పంచాయతీ కార్యదర్శులు: గ్రామ స్థాయిలో ప్రజలకు నేరుగా సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులు వీరందరికీ నీ జీతాలు మీ ఇంట్లో వాళ్ళు ఇవ్వడం లేదు ఈ దేశానికి మీరు సేవకులు ఈ దేశ ప్రజలకు మీరు పని చేస్తారు మీకు జీతాలు ఇస్తుంది ఈ దేశ ప్రజలు మీరందరూ ప్రజలకు సేవ చేసేది మరిచిపోయి మీరు ప్రజలకు ఆమడంత దూరంలో ఉన్నారు వాళ్ళని కలవాలంటే కొన్ని సంవత్సరాలు పడతాది లేదంటే లంచం అన్న ఇవ్వాలి రికమండేషన్ గా చేయాలి అందరూ ప్రజల సొమ్ము వేల కోట్లు దోచుకుంటున్నారు ఒక సామాన్యుడిగా ఈ దేశ ప్రజలకు తెలియజేస్తున్నాను1
- యాదగిరిగుట్ట లో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదగిరిగుట్టలో జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. గురువారం మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. విద్య, వైద్య రంగాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 8న నిర్వహించే యువజన ప్రదర్శన, బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు.1
- ఎల్లంపల్లి ప్రాజెక్టు భారీగా వరద...15 గేట్లు ఎత్తిన అధికారులు పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తారు. 1 లక్షా 55 వేల 625 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలో విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 356254 క్యూసెక్కులు కాగ ఔట్ ప్లో 171650 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిలువ 19.341 టిఎంసిలు ఉంది. ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్ ద్వారా ఐదు మోటర్లు ఆన్ చేసి 15750 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు. ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న సుందిళ్ళ పార్వతి బ్యారేజ్ కు భారీగా వరద వచ్చి చేరుతుంది. సుందిళ్ళ బ్యారేజ్ 74 గేట్లు ఎత్తి వచ్చిన నీళ్ళను వచ్చినట్లు వదిలేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ప్లో 1 లక్షా 85 వేల క్యూసెక్కులు ఉంది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు సుందిళ్ళ బ్యారేజ్ లో నీటిని నిల్వ చేయడం లేదు. పార్వతి బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 11.87 టిఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిలువ నిల్ గా ఉంది.1
- మోటకొండూరు: కారు ఆటో ఢీ కొట్టడంతో.. నలుగురికి గాయాలు... మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద కారు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో ఆటో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వారిని చికిత్స కోసం తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, వాహనాల్లో ఉన్న వారి వివరాలు తెలియాల్సి ఉంది.1