logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గోదావరి తీరంలో ముమ్మర ఏర్పాట్లు జన్నారం మండలంలోని బాదంపల్లి శివారులో ఉన్న గోదావరి నది పుష్కర్ ఘాట్ వద్ద ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. మహాశివరాత్రి పురస్కరించుకొని ఆదివారం గోదావరి తీరంలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. దీంతో గ్రామ సర్పంచ్ సామ విజయలక్ష్మి లక్ష్మీ రాజం, వివిధ శాఖల అధికారులు శనివారం బాదంపల్లి గోదావరి తీరంలో ఉన్న పుష్కర శుభ్రం చేయించారు. అలాగే వృద్ధులు వికలాంగుల కోసం నీటి పంపులను ఏర్పాటు చేశారు.

on 14 February
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
on 14 February

గోదావరి తీరంలో ముమ్మర ఏర్పాట్లు జన్నారం మండలంలోని బాదంపల్లి శివారులో ఉన్న గోదావరి నది పుష్కర్ ఘాట్ వద్ద ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. మహాశివరాత్రి పురస్కరించుకొని ఆదివారం గోదావరి తీరంలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. దీంతో గ్రామ సర్పంచ్ సామ విజయలక్ష్మి లక్ష్మీ రాజం, వివిధ శాఖల అధికారులు శనివారం బాదంపల్లి గోదావరి తీరంలో ఉన్న పుష్కర శుభ్రం చేయించారు. అలాగే వృద్ధులు వికలాంగుల కోసం నీటి పంపులను ఏర్పాటు చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ కొనసాగుతోంది.శుక్రవారం ఆలయంలో నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఒక కోడె నీరసంగా ఉన్నట్లు గమనించారు. వెంటనే స్పందించిన , ఆ కోడెను ఆలయంలో విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన గోశాలకు తరలించి వెటర్నరీ డాక్టర్‌ను పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహింపజేశారు.డాక్టర్ కోడె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తగిన చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఆలయ సిబ్బందికి, వెటర్నరీ వైద్యులకు కోడెల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు.భక్తులు మొక్కుల రూపంలో తీసుకువచ్చే కోడెల ఆరోగ్యం మరియు సంరక్షణపై ఆలయ యాజమాన్యం ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ కోడెలకు తగిన ఆహారం, విశ్రాంతి మరియు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారుఅలాగే ఆలయానికి తీసుకువచ్చే కోడెలు ఆరోగ్యంగా ఉండేలా భక్తులు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ కొనసాగుతోంది.శుక్రవారం ఆలయంలో నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఒక కోడె నీరసంగా ఉన్నట్లు గమనించారు. వెంటనే స్పందించిన , ఆ కోడెను ఆలయంలో విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన గోశాలకు తరలించి వెటర్నరీ డాక్టర్‌ను పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహింపజేశారు.డాక్టర్ కోడె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తగిన చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఆలయ సిబ్బందికి, వెటర్నరీ వైద్యులకు కోడెల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు.భక్తులు మొక్కుల రూపంలో తీసుకువచ్చే కోడెల ఆరోగ్యం మరియు సంరక్షణపై ఆలయ యాజమాన్యం ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటుందని  తెలిపారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ కోడెలకు తగిన ఆహారం, విశ్రాంతి మరియు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారుఅలాగే ఆలయానికి తీసుకువచ్చే కోడెలు ఆరోగ్యంగా ఉండేలా భక్తులు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
  • జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో సిలిండర్ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెలలో సిలిండర్ కోసం అన్లైన్ లో బుక్ చేసినా ఆ సిలిండర్ ఇప్పటికే తీసుకుంటున్నట్టు చూపిస్తుందని, తమ పేరుతో బుకు చేసుకున్న సిలిండర్ ఇతరులకు అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పదిహేను రోజులుగా ఆఫీసుకు వస్తున్నా ఇంకా సిలిండర్ తీసుకోలేమని చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయం నుండి సిలిండర్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని గంటల తరబడి లైనులో నిలబడిన సిలిండర్ దొరకటం కష్టంగా మారిందని చెపుతున్నారు. బుక్ చేసుకున్న వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు.
    1
    జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో సిలిండర్ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెలలో సిలిండర్ కోసం అన్లైన్ లో బుక్ చేసినా ఆ సిలిండర్ ఇప్పటికే తీసుకుంటున్నట్టు చూపిస్తుందని, తమ పేరుతో బుకు చేసుకున్న సిలిండర్ ఇతరులకు అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పదిహేను రోజులుగా ఆఫీసుకు వస్తున్నా ఇంకా సిలిండర్ తీసుకోలేమని చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయం నుండి సిలిండర్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని గంటల తరబడి లైనులో నిలబడిన సిలిండర్ దొరకటం కష్టంగా మారిందని చెపుతున్నారు. బుక్ చేసుకున్న వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    15 hrs ago
  • Post by Solanke Ravi
    3
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    14 hrs ago
  • కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నడిమితండాలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గ్రామానికి చెందిన భూక్యా పద్మ నివాసపు పూరి గుడిసె పూర్తిగా కాలి దగ్ధమైంది. గమనించిన స్థానికులు స్పందించి మంటలను ఆరిపివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణామాన్ని జరగలేదు. అలాగే సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
    1
    కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నడిమితండాలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గ్రామానికి చెందిన భూక్యా పద్మ నివాసపు పూరి గుడిసె పూర్తిగా కాలి దగ్ధమైంది. గమనించిన స్థానికులు స్పందించి మంటలను ఆరిపివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణామాన్ని జరగలేదు. అలాగే  సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    12 hrs ago
  • గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ సిఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో మొదట సిలువ ఊరేగింపు తో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్ ఎమెరిటస్ ఆర్.టి. రెవ. టి.ఎస్. కనక ప్రసాద్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. సకల మానవాళి రక్షణ కోసం యేసు సిలువ లో మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
    1
    గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ సిఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో మొదట సిలువ ఊరేగింపు తో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు.  ఈ సందర్భంగా బిషప్ ఎమెరిటస్ ఆర్.టి. రెవ. టి.ఎస్. కనక ప్రసాద్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. సకల మానవాళి రక్షణ కోసం యేసు సిలువ లో మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    11 hrs ago
  • దొడ్డి కొమరయ్య 99వ జయంతి ఉత్సవాలను సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఘనంగా నివాళులర్పించారు , అదనపు కలెక్టర్ నగేష్, బీసీ సంక్షేమ కార్యాలయ సిబ్బంది శ్రీనివాస్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు
    1
    దొడ్డి కొమరయ్య 99వ జయంతి ఉత్సవాలను సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఘనంగా నివాళులర్పించారు  , అదనపు కలెక్టర్ నగేష్, బీసీ సంక్షేమ కార్యాలయ సిబ్బంది శ్రీనివాస్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    15 hrs ago
  • బీ.ఆర్.ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా 49వ వార్డు కౌన్సిలర్ వేనగంటి ప్రకాష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం మాజీమంత్రి జోగురామన్న ఆయనను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియచేశారు. బీ.ఆర్.ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఆయనను నియమించాలని మున్సిపల్ కమిషనర్ కు, చైర్ పర్సన్ కు లేఖ రాశారు. పట్టణ పరిధిలో నెలకొన్న సమస్యలను మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు... కౌన్సిల్ లో అత్యంత కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయనకు తోటి కౌన్సిలర్లు అభినందనలు తెలియచేశారు. పట్టణాభివృద్దికి గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని ఈ సందర్భంగా మాజీమంత్రి జోగురామన్న అన్నారు. అదే స్పూర్తితో ప్రస్తుత కౌన్సిల్ లోనూ అభివృద్ధికే బీ.ఆర్.ఎస్ కౌన్సిలర్లు పాటు పడాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించడంతో పాటు... పట్టణాభివృద్ధికి తీసుకునే కీలక నిర్ణయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్, అన్నెల వసంత్, ఆత్రం వెంకటేష్, డాక్టర్ గౌస్ , సలీమ్,అనిల్, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు..
    4
    బీ.ఆర్.ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా 49వ వార్డు కౌన్సిలర్ వేనగంటి ప్రకాష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం మాజీమంత్రి జోగురామన్న ఆయనను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియచేశారు. బీ.ఆర్.ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఆయనను నియమించాలని మున్సిపల్ కమిషనర్ కు, చైర్ పర్సన్ కు లేఖ రాశారు. పట్టణ పరిధిలో నెలకొన్న సమస్యలను మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు... కౌన్సిల్ లో అత్యంత కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయనకు తోటి కౌన్సిలర్లు అభినందనలు తెలియచేశారు. పట్టణాభివృద్దికి గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని ఈ సందర్భంగా మాజీమంత్రి జోగురామన్న అన్నారు. అదే స్పూర్తితో ప్రస్తుత కౌన్సిల్ లోనూ అభివృద్ధికే బీ.ఆర్.ఎస్ కౌన్సిలర్లు పాటు పడాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించడంతో పాటు... పట్టణాభివృద్ధికి తీసుకునే కీలక నిర్ణయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్, అన్నెల వసంత్, ఆత్రం వెంకటేష్, డాక్టర్ గౌస్ , సలీమ్,అనిల్, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు..
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    15 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు చల్లని త్రాగునీరు అందించే ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన జల ప్రసాద కేంద్రం ప్లాంట్ ద్వారా కూలర్లకు నల్లల ద్వారా త్రాగునీరు అందిస్తూ భక్తులకు సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే సేవా వాలంటీర్ల సహకారంతో అవసరమైన ప్రాంతాల్లో కూల్ బబుల్స్ ఏర్పాటు చేసి భక్తులకు సులభంగా నీరు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నటరాజ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి ప్రారంభించారు.వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా అవసరాన్ని బట్టి మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఈవో తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు, అలాగే విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి త్రాగునీరు అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, సేవా వాలంటీర్లు పాల్గొన్నారు
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు చల్లని త్రాగునీరు అందించే ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన జల ప్రసాద కేంద్రం ప్లాంట్ ద్వారా కూలర్లకు నల్లల ద్వారా త్రాగునీరు అందిస్తూ భక్తులకు సౌకర్యం కల్పిస్తున్నారు.
అలాగే సేవా వాలంటీర్ల సహకారంతో అవసరమైన ప్రాంతాల్లో కూల్ బబుల్స్ ఏర్పాటు చేసి భక్తులకు సులభంగా నీరు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నటరాజ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి ప్రారంభించారు.వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా అవసరాన్ని బట్టి మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఈవో తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు, అలాగే విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి త్రాగునీరు అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, సేవా వాలంటీర్లు పాల్గొన్నారు
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
  • కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి వారం పది రోజుల్లో ఏ పార్టీలో చేరేది క్లారిటీ ఇస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ ను ఓడించే సత్తా గల పార్టీలో చేరతానని స్పష్టం చేశారు. జగిత్యాలలో విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు తమపై అభిమానాన్ని చూపుతున్నాయని అందుకు ఆయా పార్టీల నేతలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఏ పార్టీలో చేరాలనేది అభిమానుల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని త్వరలోనే ఫైనల్ నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. గతంలో మార్పు రావాలని....కెసిఆర్ పోవాలని కోరుకున్నామని, పదేళ్ల తర్వాత ప్రజల్లో మార్పు వస్తే, ఇప్పుడు పరిస్థితి మారి, రెండేళ్లలో మార్పు రావాలి రేవంత్ రెడ్డి పోవాలి అనే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోకవడం, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి, వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులు చేపట్టాలని, ప్రాణహిత నది జలాల వినియోగానికి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజి నిర్మాణం చేపట్టాలని జీవన్ రెడ్డి చేశారు.
    1
    కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి వారం పది రోజుల్లో ఏ పార్టీలో చేరేది క్లారిటీ ఇస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ ను ఓడించే సత్తా గల పార్టీలో చేరతానని స్పష్టం చేశారు. 
జగిత్యాలలో విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు తమపై  అభిమానాన్ని చూపుతున్నాయని అందుకు ఆయా పార్టీల నేతలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఏ పార్టీలో చేరాలనేది అభిమానుల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని త్వరలోనే ఫైనల్ నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. గతంలో మార్పు రావాలని....కెసిఆర్ పోవాలని కోరుకున్నామని, పదేళ్ల తర్వాత ప్రజల్లో మార్పు వస్తే, 
ఇప్పుడు పరిస్థితి మారి, రెండేళ్లలో మార్పు రావాలి రేవంత్ రెడ్డి పోవాలి అనే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోకవడం, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి, వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులు చేపట్టాలని, ప్రాణహిత నది జలాల వినియోగానికి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజి నిర్మాణం చేపట్టాలని జీవన్ రెడ్డి చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.