ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి: సుదర్శన్ రెడ్డి ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పని చేస్తోందని ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈనెల 6వ తేదీన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా, ఆయన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్‌లతో కలిసి బాసరలో ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా బాసరకు చేరుకున్న సుదర్శన్ రెడ్డి తదితరులకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ముఖ్యమంత్రి పూజలు చేసే ప్రదేశం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగే ప్రాంతాలను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తదనంతరం ఆలయ అతిథిగృహంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, బాసర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బాసరతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నింటినీ అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 6న ముఖ్యమంత్రి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని చెప్పారు. దేశం నలుమూలల నుంచి బాసరకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు సౌకర్యవంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, తహసిల్దార్ పవన్ చంద్ర, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి: సుదర్శన్ రెడ్డి ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పని చేస్తోందని ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈనెల 6వ తేదీన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా, ఆయన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్‌లతో కలిసి బాసరలో ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా బాసరకు చేరుకున్న సుదర్శన్ రెడ్డి తదితరులకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పూలమాలలతో
స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ముఖ్యమంత్రి పూజలు చేసే ప్రదేశం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగే ప్రాంతాలను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తదనంతరం ఆలయ అతిథిగృహంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, బాసర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బాసరతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నింటినీ అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 6న ముఖ్యమంత్రి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని చెప్పారు. దేశం నలుమూలల నుంచి
బాసరకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు సౌకర్యవంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, తహసిల్దార్ పవన్ చంద్ర, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
- Post by Solanke Ravi3
- .' అలాంటి రైతన్నను కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత. భారత దేశపు 75 ఏళ్ల చరిత్రలో ఏ నాయకుడూ ఆలోచించని ఒక గొప్ప పథకం, రైతు బంధు.1
- కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మనగర్లో శుక్రవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. సర్పంచ్ ప్రవీణ్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు. హోరాహోరీగా సాగిన ఈ కుస్తీలు ప్రేక్షకులను అలరించాయి. గెలుపొందిన విజేతలకు సర్పంచ్ నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో AMC వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురంలో ఉన్న గోశాలను ఆలయ ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.గోశాలకు వచ్చే డీసీఎం వాహనంలో లోడ్ చేసి తీసుకువచ్చిన Heritage Bypass Cattle Feed బ్యాగులను పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగులను తెరిపించి, అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు పెట్టి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు.కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి ఈవో సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు మరియు వివిధ ప్రాంతాలను కూడా పరిశీలించారు.అలాగే కోడెల నుంచి వచ్చే పెండను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఈవో తెలుసుకున్నారు.ఈ తనిఖీ సందర్భంగా పరివేక్షకులు విజయ్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి మరియు గోశాల సిబ్బంది పాల్గొన్నారు.1
- దొడ్డి కొమరయ్య 99వ జయంతి ఉత్సవాలను సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఘనంగా నివాళులర్పించారు , అదనపు కలెక్టర్ నగేష్, బీసీ సంక్షేమ కార్యాలయ సిబ్బంది శ్రీనివాస్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీలో జరిగిన గ్రామసభ ఉద్రిక్తంగా మారింది. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల గైర్హాజరు, బోధనలో నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు చదువులో వెనుకబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపించారు. అర్హులను పక్కనబెట్టి అనర్హులకు ఇళ్లు ఇచ్చారని మండిపడ్డారు. సమస్యలపై అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో సిలిండర్ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెలలో సిలిండర్ కోసం అన్లైన్ లో బుక్ చేసినా ఆ సిలిండర్ ఇప్పటికే తీసుకుంటున్నట్టు చూపిస్తుందని, తమ పేరుతో బుకు చేసుకున్న సిలిండర్ ఇతరులకు అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పదిహేను రోజులుగా ఆఫీసుకు వస్తున్నా ఇంకా సిలిండర్ తీసుకోలేమని చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయం నుండి సిలిండర్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని గంటల తరబడి లైనులో నిలబడిన సిలిండర్ దొరకటం కష్టంగా మారిందని చెపుతున్నారు. బుక్ చేసుకున్న వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు.1
- Post by Solanke Ravi1