గుంటూరు జిల్లా పోలీస్... కొల్లిపర పోలీస్ స్టేషన్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన కొల్లిపర పోలీసులు.ఆరుగురు నిందితుల అరెస్ట్,. _// *ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలో 15 మంది నిందితులుగా ఉన్నారని, వారిలో ఇద్దరు నిర్వాహకులతో పాటు మరో నలుగురిని(మొత్తం ఆరుగురు) అరెస్ట్ చేసినట్లు తెలిపిన తెనాలి డిఎస్పీ శ్రీ జనార్దన్ గారు రూ.10 వేల నగదుతో పాటు, బ్యాంక్ ఖాతాల్లోని రూ.3.61 లక్షల నగదు, ఆన్లైన్ బెట్టింగ్ కి వాడుతున్న 08 సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు వెల్లడి. * తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో క్రికెట్ మరియు ఇతర బెట్టింగులు, పేకాట, జూదం వంటివి నిర్వహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డిఎస్పీ గారు. 🚩 గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో జూదం, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, పేకాట, కోడిపందాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా క్షేత్ర స్థాయిలో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణ చేస్తూ పోలీస్ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 📍దీనిలో భాగంగా కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తోట గ్రామంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని కొల్లిపర ఎస్సై శ్రీ N.C. ప్రసాద్ గారికి అందిన విశ్వసనీయ మేరకు తెనాలి డిఎస్పీ శ్రీ జనార్దన్ రావు గారి పర్యవేక్షణలో తెనాలి రూరల్ సీఐ శ్రీ నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో ఆదివారం(19.04.2026) ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై మెరుపు దాడులు నిర్వహించి ఇద్దరు ప్రధాన నిర్వాహకులతో పాటు బెట్టింగ్‌లో పాల్గొన్న మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 📍ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తెనాలి డీఎస్పీ బి. జనార్ధన్ గారు తెనాలి సర్కిల్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. *కేసు వివరాలు:* కొల్లిపర మండలం, అత్తోట గ్రామంలోని పాఠశాల సమీపంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.తెనాలి రూరల్ సీఐ ఎస్.కె. నాయబ్ రసూల్ గారు మరియు కొల్లిపర ఎస్ఐ ఎన్.సి. ప్రసాద్ గారు తమ సిబ్బందితో కలిసి మధ్యాహ్నం 4:00 గంటల సమయంలో ఆకస్మిక దాడి నిర్వహించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు ప్రధాన వ్యక్తులను వారికి సహకరిస్తున్న మరో నలుగురు వ్యక్తులను (మొత్తం 6 మంది) పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 👉 *నేరం చేసే విధానం (ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే విధానం):-* 📍ఈ కేసులో నిందితులు అత్యంత సాంకేతిక పద్ధతుల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారని, ప్రకాశం జిల్లా, సింగరాయకొండకు చెందిన ప్రధాన నిందితుడు (ప్రస్తుతం పరారీలో ఉన్నాడు) ఈ ముఠాకు సూత్రధారిగా వ్యవహరిస్తూ, ఇతను ఆన్లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ అత్తోట గ్రామానికి చెందిన శంతన్ కుమార్ కి లింకును పంపేవాడు. 📍ఆ లింకుతో పాటు ప్రత్యేకమైన యూజర్ ఐడి(User ID) మరియు పాస్ వర్డ్(Password) ఇచ్చి, దాని ద్వారా ఫోన్లతో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించేలా ప్రోత్సహించేవాడు. 📍ఈ ఆన్లైన్ యాప్ ద్వారా క్రికెట్ మ్యాచ్‌లో ఎన్ని రన్స్ కొడతారు, ప్రతి బంతికి (Ball to Ball), ప్రతి ఓవర్‌కు (Over) మరియు విన్నింగ్ రేటు (Rate) వంటి అంశాలపై జూదం నిర్వహించేవారు. 📍పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని, వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డిఎస్పీ గారు తెలిపారు. 📍క్రికెట్ బెట్టింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల వల్ల యువత తమ విలువైన జీవితాలను, కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 📍నిందితుల నుండి రూ. 10,000/- నగదు, బెట్టింగ్ కోసం నిందితులు ఉపయోగిస్తున్న 08 స్మార్ట్ ఫోన్లను సీజ్ చేసి, నిందితుల బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ. 3,61,000/- నగదును పోలీసులు వెంటనే ఫ్రీజ్ చేయించడం జరిగింది. 👉 ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన రూరల్ సీఐ నాయబ్ రసూల్, కొల్లిపర ఎస్ఐ ప్రసాద్ మరియు వారి సిబ్బంది ASI లు ప్రసాద రావు,పోతురాజు, HC లు సత్యనారాయణ,మురళీకృష్ణ మరియు కానిస్టేబుల్ కూర్మరావు లను డీఎస్పీ గారు అభినందించారు.

- చంద్రబాబు76వ పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల విరాళం.. అమరావతి: అన్నదానం అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భువనేశ్వరి అన్ని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందించారు. అలాగే ప్రజలు కూడా తమకు తోచిన విధంగా అన్నదాన క్యాంటీన్లకు విరాళాలు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.1
- పెదకూరపాడు: పోలీస్ సిబ్బంది ఉండేందుకు నిర్మించిన క్వార్టర్స్ శిథిలావస్థకు సుమారు 20 సంవత్సరాలు అయినప్పటికీ తొలగింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు అన్నారు. వివిధ కేసుల నిమిత్తం స్టేషన్ వచ్చేవారికి శిథిలావస్థలో చేరిన బిల్డింగ్ నుండి విషసర్పలు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఏ సమయంలో క్వార్టర్స్ పెచ్చులు ఊడి కింద పడతాయో తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు.1
- మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.1
- Post by కొప్పుల విజయ బాబు10
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao1
- నార్కట్పల్లి, ఏప్రిల్ 20: నార్కట్పల్లిలో నిన్న రాత్రి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై లింగయ్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున వేలాది సంఖ్యలో తరలివచ్చారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చెరుకు సుధాకర్, నోముల భగత్, నకిరేకల్ మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాకుండా, ఈ జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు పాల్గొని చిరుమర్తి లింగయ్య గారికి పుష్పగుచ్ఛాలు అందించి, కేక్ కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల కోలాహలం, పటాకుల మోతతో నార్కట్పల్లి ప్రాంతం అంతా సందడిగా మారింది.1
- SIR ట్రైనింగ్ ప్రోగ్రామ్ అమరావతి: ఎలక్షన్ కమిషన్ తీసుకువచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో పేర్లు లేకుండా ఉండిపోతే తిరిగి పేర్లు ఓటర్ లిస్టులో రావటానికి ఏమి చేయాలో ఒక కార్యక్రమం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మంగళవారం మెడికల్ హాల్ లో జరుగుతుందని ప్రజాసంఘాల నాయకులు కేఎంఏ సుభాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలు చూడగలరు. కార్యక్రమానికి వచ్చేవారు పేరు నమోదు చేసుకోగలరు.1