Shuru
Apke Nagar Ki App…
థార్ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు.. తల్లిదండ్రుల ఆవేదన నర్సాపూర్ కూడలిలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర ఆందోళన నింపింది. పట్టణానికి చెందిన హనుమంత్ రాకేష్ (27) బుల్లెట్ బైక్‌పై వెళ్తుండగా, అతివేగంగా వచ్చిన థార్ వాహనం ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో రాకేష్ కాళ్లు, ఛాతి భాగంలో ఎముకలు విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కుటుంబానికి ఏకైక కుమారుడైన రాకేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Sraya
థార్ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు.. తల్లిదండ్రుల ఆవేదన నర్సాపూర్ కూడలిలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర ఆందోళన నింపింది. పట్టణానికి చెందిన హనుమంత్ రాకేష్ (27) బుల్లెట్ బైక్‌పై వెళ్తుండగా, అతివేగంగా వచ్చిన థార్ వాహనం ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో రాకేష్ కాళ్లు, ఛాతి భాగంలో ఎముకలు విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కుటుంబానికి ఏకైక కుమారుడైన రాకేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- విద్యుత్ అంతరాయాలతో ఎండుతున్న పంటలు.. రైతుల రాస్తారోకో వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవంచ, రామచంద్రపురం, మాడాపూర్ గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో సాగు పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నర్సాపూర్–సంగారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ అందించాలని, పంటలు నష్టపోకుండా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు.1
- ఇచ్చిన మాట నిలబెట్టుకోలే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడి, ఇక రాదు ప్రజల ఆవేదన దుబ్బాక రైతులకు 18 గంటల కరెంట్ ఇవ్వాల్సిందే ! దుబ్బాక రైతన్నల సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోజుకు 18 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం తక్షణమే పరిశీలించాలి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది! పంటలు పండాలంటే నిరంతర విద్యుత్ అవసరం! రైతన్నల గొంతుకను ప్రభుత్వం వినాలి ! మా డిమాండ్ ఒక్కటే — దుబ్బాక రైతులకు 18 గంటల విద్యుత్ అందించాలి! రైతుల ప్రయోజనాల కోసం ఈ డిమాండ్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపండి.1
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా భూ సర్వే కలెక్టర్ ప్రతిమాసింగ్ పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా భూ సర్వే కలెక్టర్ ప్రతిమాసింగ్ భూ రీసర్వే ప్రక్రియలు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా పూర్తిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. హవేలీ ఘనపూర్ మండలం శాలిపేట్ గ్రామంలో భూభారతి భూముల రి సర్వే ను ఏడి సర్వే కిషన్ , తాసిల్దార్ సింధు రేణుక తో కలిసి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు గ్రామ పరిధిలో మొత్తం .534 ఎకరాల రెండు కుంటల భూమి ఉండగా ఇప్పటివరకు సుమారు ..278 ఎకరాల 27 కుంటల మేర సరిహద్దుల నిర్ధారణ సర్వే పూర్తి చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రభుత్వ భూమి 341 ఎకరం 5 కుంటలు ఇనామ్ ల్యాండ్ 17 కుంటలు ,అసైన్డ్ ల్యాండ్ 240 ఎకరా లు12 కుంటలు శిఖం ల్యాండ్61 ఎకరాలకు సంబంధించి ఇంతవరకు సర్వే కంప్లీట్ చేయడం జరిగింది మిగిలిన సర్వే ప్రక్రియ రైతు వారి ఆధీనంలో ఉన్న భూములను సర్వే నిర్వహిస్తున్నామని దీనిలో హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే నోటీసులు ఇవ్వడం జరుగుతుందని అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలపాలని పునః పరిశీలన పగడ్బందీ మ్యాపులతో డిజిటల్ సర్వే పూర్తవుతున్నారు ఒకరి భూమి మరొకరికి పోయే ఆస్కారం ఉండదని వివరించారు ఆధునిక సాంకేతికతను వినియోగించి, పాత రికార్డులతో సరిపోల్చుతూ భూముల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. సరిహద్దుల విషయంలో రైతుల సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని సూచించారు. రీ-సర్వే తర్వాత రికార్డులు మరింత స్పష్టంగా ఉండి, భవిష్యత్తులో యాజమాన్య సమస్యలు తలెత్తకుండా రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ అధికారులు సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు1
- SHE POWER Women’s Safety Bike Rally 2026: What Did Apoorva Ji Say About Women’s Safety & Empowerment? Let’s Hear It From Her! 🏍️💪 SHE POWER Women’s Safety Bike Rally 2026: What Did Apoorva Ji Say About Women’s Safety & Empowerment? Let’s Hear It From Her! 🏍️💪1
- కుషాయిగూడ డిపోలో ఏఐటీయూసీ–ఈయూ ఘన విజయం క్లాస్–3లో 525 ఓట్లు.. క్లాస్–6లో 391 ఓట్లు కుషాయిగూడ : టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కుషాయిగూడ బస్ డిపోలో ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ఘన విజయం సాధించింది. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ చేస్తున్న నిరంతర పోరాటానికి ఈ విజయం నిదర్శనమని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల్లో క్లాస్–3 విభాగంలో 729 ఓట్లకు గాను 525 ఓట్లు సాధించగా, క్లాస్–6 విభాగంలో 720 ఓట్లకు గాను 391 ఓట్లు సాధించింది. ఈ విజయంతో యూనియన్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వియస్. బోస్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జీ. దామోదర్ రెడ్డి, ఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు కె. ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్యప్రసాద్, ఏఐటీయూసీ అనుబంధ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కుషాయిగూడ గౌరవ అధ్యక్షుడు ముత్యం వెంకన్న గౌడ్, చైర్మన్ రత్నం, డిపో ప్రధాన కార్యదర్శి యుగంధర్ తదితరులు కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రత, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ విజయానికి సహకరించిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మిక ఐక్యత వర్ధిల్లాలి.. ఏఐటీయూసీ జిందాబాద్ అంటూ నినదించారు.1
- రేవంత్ రెడ్డి 818 ఎకరాల భూములు తాకట్టు పెట్టి పదివేల కోట్లు అప్పు తెచ్చాడు రేవంత్ రెడ్డి 818 ఎకరాల భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చుకున్నాడు ఒక్క ఎకరం రూ.200 కోట్లు ఉన్న భూమిని, ఎకరానికి రూ.17 కోట్లకే తాకట్టు పెట్టారు ఇజ్జత్‌నగర్ (శేరిలింగంపల్లి)లో సర్వే నంబర్ 5/2–5/23లోని 26 ఎకరాలు, మొకిలాలో సర్వే నంబర్ 96లోని 41 ఎకరాలు, మియాపూర్ సర్వే నంబర్ 21లోని 105 ఎకరాలు, ఇస్నాపూర్‌లో సర్వే నంబర్ 496లోని 27 ఎకరాలు, ఇంజాపూర్ 126/Pలోని 22 ఎకరాలు, చిలుకూరు సర్వే నంబర్ 472లోని 49 ఎకరాలు, పఠాన్‌చెరు సర్వే నంబర్ 639లోని 17 ఎకరాలు, గాజులరామారంలో సర్వే నంబర్ 220/Pలోని 44 ఎకరాలు, జవహర్‌నగర్ సర్వే నంబర్ 12లోని 449 ఎకరాలు, జవహర్‌నగర్ సర్వే నంబర్ 706లోని 35 ఎకరాలు 31-03-2026 నాటికి హెచ్‌ఎండీఏ బ్యాంకు ఖాతాలో రూ.275 కోట్లు మాత్రమే ఉన్నాయి. కానీ, జూన్ 30 నాటికి అదే బ్యాంకు ఖాతాలో రూ.10 వేల కోట్లు జమ అయ్యాయి అంటే అతి తక్కువ ధరకు మన భూములను రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చుకున్నాడు – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్1
- థార్ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు.. తల్లిదండ్రుల ఆవేదన నర్సాపూర్ కూడలిలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర ఆందోళన నింపింది. పట్టణానికి చెందిన హనుమంత్ రాకేష్ (27) బుల్లెట్ బైక్‌పై వెళ్తుండగా, అతివేగంగా వచ్చిన థార్ వాహనం ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో రాకేష్ కాళ్లు, ఛాతి భాగంలో ఎముకలు విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కుటుంబానికి ఏకైక కుమారుడైన రాకేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.1