Shuru
Apke Nagar Ki App…
పటాన్చెరు పట్టణంలో హోటల్ లో అగ్ని ప్రమాదం తప్పిన ప్రమాదం పటాన్ చెరు బస్టాండ్ సమీపంలోని ఖానవల్లి హోటల్ లో షార్ట్ సర్క్యూట్ తో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే స్పందించిన యాజమాన్యం హోటల్లో ఉన్న వారిని వెంటనే బయటకు పంపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పి వేశారు. హోటల్ యజమాని జరప్పకు శిల్ప గాయాలు అయ్యాయి.
Praveen
పటాన్చెరు పట్టణంలో హోటల్ లో అగ్ని ప్రమాదం తప్పిన ప్రమాదం పటాన్ చెరు బస్టాండ్ సమీపంలోని ఖానవల్లి హోటల్ లో షార్ట్ సర్క్యూట్ తో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే స్పందించిన యాజమాన్యం హోటల్లో ఉన్న వారిని వెంటనే బయటకు పంపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పి వేశారు. హోటల్ యజమాని జరప్పకు శిల్ప గాయాలు అయ్యాయి.
More news from Telangana and nearby areas
- పాపన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనకి చేసిన ఎమ్మెల్యే రోహిత్ రావు ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి... పాపన్నపేటలో కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు * రైస్ మిల్లర్లతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యేధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సూచించారు.ఆదివారం సాయంత్రం పాపన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు.కొనుగోలు ప్రక్రియలో రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని స్థానిక నాయకులు, రైతులు ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి పలువురు రైస్ మిల్లర్లతో ఫోన్లో మాట్లాడారు.రైతులకు ఇబ్బందులు లేకుండా మిల్లుకు వచ్చిన వెంటనే ధాన్యాన్ని ఖాళీ చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని రైస్ మిల్లర్లకు సూచించారు.రైతులు అధైర్య పడవద్దని పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.అధికారులు ఎప్పటికపుడు కొనుగోలు ప్రక్రియను పరిశీలించాలని సూచించారు.ఎమ్మెల్యే వెంట మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, మండల నాయకులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంతప్ప, శ్రీనివాస్, హీరాలాల్, గౌస్, తదితరులున్నారు.1
- నాతో కలువు.. రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన మోడీ నాతో కలిస్తే నువ్వు వెళ్ళాలి అనుకుంటున్న స్థానానికి తీసుకెళ్త.. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ1
- టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది. ఆయన పాలనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.1
- నిజాంసాగర్ మండలం : మంగ్లూరు నుంచి మోడీ బహిరంగ సభకు భారీగా తరలిన బిజెపి శ్రేణులు, మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామం నుంచి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. గ్రామ సర్పంచ్ నర్మల రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పయనమయ్యారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. ప్రధాని సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలాయి.1
- Post by Mana Velugu1
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆదివారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో రూ.16,83,760, VIP దర్శనాలతో రూ.9,29,700, కార్ పార్కింగ్తో రూ.7,27,500, బ్రేక్ దర్శనాలతో రూ.4,21,500, ప్రధాన బుకింగ్తో రూ.3,57,950, వ్రతాలతో రూ.2,79,000, యాదరుషి నిలయం రూ.2,71,150, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.51,80,379 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- మంత్రులు సీతక్క, పొంగులేటి స్కాంల పై ఆధారాలతో సహా చూపించి ప్రశ్నించినందుకు నన్ను జైలుకి పంపించారు మంత్రులు సీతక్క, పొంగులేటి స్కాంల పై ఆధారాలతో సహా చూపించి ప్రశ్నించినందుకు నన్ను జైలుకి పంపించారు1
- కేంద్ర సహాయ శాఖ హోంమంత్రి బండి సంజయ్ బర్తరఫ్ చేయాలి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి : మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి.. బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. మదర్స్ డే రోజున హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై సమాధానం చెప్పాలని అన్నారు.మోడీ ప్రసంగం ప్రారంభించక ముందే బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించాలని, లేనిపక్షంలో ప్రజలు ప్రధాని మాటలను పట్టించుకోరనివ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రేవంత్ రెడ్డి హోంమంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఒక మైనర్ బాలిక ఎఫ్‌ఐఆర్ నమోదు కోసం గంటల తరబడి పోలీస్ స్టేషన్‌లో వేచి ఉండాల్సి రావడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు.మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్‌లో గొప్పలు చెప్పుకున్న ప్రధాని మోదీ, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్ల కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని అన్నారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని విమర్శించారు. బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఉపయోగపడే ఒక్క మాట కూడా బండి సంజయ్ మాట్లాడలేదని, రేవంత్ రెడ్డి ఆయనను కాపాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణపై ప్రధాని మోదీకి ప్రేమ లేదని, విభజన హామీలు ఇంకా అమలు కాలేదని విమర్శించారు.1
- తెలంగాణలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను మహిళలు ముట్టడించారు. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.1