కేంద్ర సహాయ శాఖ హోంమంత్రి బండి సంజయ్ బర్తరఫ్ చేయాలి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి : మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి.. బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. మదర్స్ డే రోజున హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై సమాధానం చెప్పాలని అన్నారు.మోడీ ప్రసంగం ప్రారంభించక ముందే బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించాలని, లేనిపక్షంలో ప్రజలు ప్రధాని మాటలను పట్టించుకోరనివ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రేవంత్ రెడ్డి హోంమంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఒక మైనర్ బాలిక ఎఫ్‌ఐఆర్ నమోదు కోసం గంటల తరబడి పోలీస్ స్టేషన్‌లో వేచి ఉండాల్సి రావడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు.మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్‌లో గొప్పలు చెప్పుకున్న ప్రధాని మోదీ, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్ల కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని అన్నారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని విమర్శించారు. బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఉపయోగపడే ఒక్క మాట కూడా బండి సంజయ్ మాట్లాడలేదని, రేవంత్ రెడ్డి ఆయనను కాపాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణపై ప్రధాని మోదీకి ప్రేమ లేదని, విభజన హామీలు ఇంకా అమలు కాలేదని విమర్శించారు.

- 17254 మంది రైతులు నుండి ధాన్యం కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు జరిగాయి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రచురణార్థం మెదక్ 10 మే,2026 ప్రణాళిక బద్ధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కలెక్టర్ *కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిని మిల్లులకు తరలించాలి..* 86 కోట్ల రూపాలు రైతులకు చెల్లింపు *ధాన్యాన్ని విల్లులకు తలించేందకు ప్రత్యేక చర్యలు* ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు కొనుగోలు అయిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబందిత అధికారులను ఆదివారం ఒక ప్రకటన ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు చేస్తున్నట్లు వివరించారు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను కలెక్టర్ తెలుసుకొని... నిల్వలు లేకుండా వెను వెంటనే విల్లులకు తలించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు. వేగవంతంగా రవాణా చేయుటకు దిశనిర్ధేశం చేశారు. కొనుగోలు అయిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించుటకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లారీ ల పైనే ఆధార పడకుండా అవసరమైతే ఇతరాత్ర వాహనాలను ద్వారా మిల్లులకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రోజువారిగా కేంద్రాలో గల నిల్వలు, మిల్లులకు తరలించిన వివరాల నివేదికలను సమర్పించాలని కలెక్టర్ కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు ధాన్యాన్ని మిల్లులకు తరలించుటలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని నిర్వహకులకు కలెక్టర్ స్పష్టం చేశారు. గన్ని సంచులు, టార్పాలిన్లు సరిపడా అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, కేంద్రాలలో ఉండే ప్రతి దాన్యం గింజను మిల్లులకు తరలించే వరకు శ్రమించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తెవాలన్నారు. అలాగే ధాన్యాన్ని కొనుగోలు చేసిన వివరాలు , మిల్లులకు రవాణా చేస్తున్న ధాన్యం వివరాలను సంబంధిత రిజిష్టర్లలో పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు1
- నిజాంసాగర్ మండలం : మంగ్లూరు నుంచి మోడీ బహిరంగ సభకు భారీగా తరలిన బిజెపి శ్రేణులు, మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామం నుంచి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. గ్రామ సర్పంచ్ నర్మల రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పయనమయ్యారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. ప్రధాని సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలాయి.1
- పటాన్చెరు పట్టణంలో హోటల్ లో అగ్ని ప్రమాదం తప్పిన ప్రమాదం పటాన్ చెరు బస్టాండ్ సమీపంలోని ఖానవల్లి హోటల్ లో షార్ట్ సర్క్యూట్ తో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే స్పందించిన యాజమాన్యం హోటల్లో ఉన్న వారిని వెంటనే బయటకు పంపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పి వేశారు. హోటల్ యజమాని జరప్పకు శిల్ప గాయాలు అయ్యాయి.1
- టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.1
- సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ప్రేమ వ్యవహారం కారణంగా 23 ఏళ్ల బీటెక్ విద్యార్థి యావన్‌ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించినా కలుస్తుండటంతో, ఆరుగురు దుండగులు అతడిని 17 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.1
- నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము1
- చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.1
- పాపన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనకి చేసిన ఎమ్మెల్యే రోహిత్ రావు ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి... పాపన్నపేటలో కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు * రైస్ మిల్లర్లతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యేధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సూచించారు.ఆదివారం సాయంత్రం పాపన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు.కొనుగోలు ప్రక్రియలో రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని స్థానిక నాయకులు, రైతులు ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి పలువురు రైస్ మిల్లర్లతో ఫోన్లో మాట్లాడారు.రైతులకు ఇబ్బందులు లేకుండా మిల్లుకు వచ్చిన వెంటనే ధాన్యాన్ని ఖాళీ చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని రైస్ మిల్లర్లకు సూచించారు.రైతులు అధైర్య పడవద్దని పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.అధికారులు ఎప్పటికపుడు కొనుగోలు ప్రక్రియను పరిశీలించాలని సూచించారు.ఎమ్మెల్యే వెంట మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, మండల నాయకులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంతప్ప, శ్రీనివాస్, హీరాలాల్, గౌస్, తదితరులున్నారు.1