న్యాయవాది దువ్వాడ శ్రీధర్ బాబా పలాస జిల్లా ఏర్పాటు డిమాండ్ కేవలం ప్రాంతీయ సెంటిమెంట్ కాదని, ఇది యువత భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, పరిపాలనా వికేంద్రీకరణ, మరియు సమాన న్యాయం కోసం చేస్తున్న అత్యవసరమైన, న్యాయమైన డిమాండ్ అని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాత 13 జిల్లాల వ్యవస్థను మార్చి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు పరిపాలన దగ్గరై, అభివృద్ధి అవకాశాలు పెరిగాయని, ఇది ఒక మంచి నిర్ణయమని ఆయన అంగీకరించారు. అయితే, ఈ ప్రక్రియలో శ్రీకాకుళం జిల్లాకు మాత్రం పూర్తి న్యాయం జరగలేదని దువ్వాడ శ్రీధర్ బాబా ఆరోపించారు. పాత 13 జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లాను మినహాయిస్తే, మిగతా 12 జిల్లాలు విభజన చెంది 26 జిల్లాలుగా మారాయని, ఆపై మరో 3 జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 29కి చేరిందని ఆయన వివరించారు. ఈ పునర్విభజన రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు పరిపాలనా, అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలను పెంచిందని, కానీ ప్రకటించిన పలాస జిల్లాను చివరి క్షణంలో తొలగించి, శ్రీకాకుళం జిల్లాను మాత్రం యథాతథంగా ఉంచేశారని, ఇదే శ్రీకాకుళం జిల్లా ప్రజలకు జరిగిన అన్యాయమని పేర్కొన్నారు. జిల్లా అంటే కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు మాత్రమే కాదని, నేటి పరిస్థితుల్లో అది ఉద్యోగ అవకాశాలు కూడా అని యువత అర్థం చేసుకోవాలని శ్రీధర్ బాబా సూచించారు. AP Public Employment Order – 2025 ప్రకారం రాష్ట్రంలో 6 జోన్‌లు, 2 మల్టీ జోన్‌లు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఉందని తెలిపారు. జిల్లా క్యాడర్ పోస్టుల్లో సుమారు 95% ఉద్యోగాలు స్థానిక జిల్లా అభ్యర్థులకే రిజర్వ్ చేయబడి ఉంటాయని, కేవలం 5% మాత్రమే ఓపెన్ కేటగిరీకి చెందుతాయని, దీనివల్ల పోటీ ప్రధానంగా జిల్లా లోపలే ఉంటుందని వివరించారు. పెద్ద జిల్లా అయితే అభ్యర్థుల సంఖ్య పెరిగి, పోటీ తీవ్రంగా ఉంటుందని, ఒక పోస్టుకు వందల, వేల మంది పోటీ పడతారని, దీంతో స్థానిక యువతకు అవకాశాలు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పలాస ప్రత్యేక జిల్లాగా ఏర్పడితే స్థానిక అభ్యర్థుల సంఖ్య తగ్గి, జిల్లా క్యాడర్ ఉద్యోగాల్లో పోటీ తగ్గి, యువతకు అవకాశాలు పెరుగుతాయని, కొత్త జిల్లా కార్యాలయాల ద్వారా అదనపు ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయని తెలిపారు. ఇతర జిల్లాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలుగా విడిపోవడం వల్ల అక్కడి యువతకు పోటీ తగ్గి, అవకాశాలు పెరిగి, పరిపాలన దగ్గరై, కొత్త ఉద్యోగాలు వస్తున్నాయని శ్రీధర్ బాబా నొక్కి చెప్పారు. అయితే, శ్రీకాకుళం జిల్లాలో మాత్రం అదే జనాభా, అదే పరిధి, అదే స్థాయి పోటీ కొనసాగుతోందని, దీనివల్ల రాష్ట్రం మొత్తం జిల్లాల విభజన ప్రయోజనాలు పొందుతుంటే, శ్రీకాకుళం జిల్లా మాత్రం పాత వ్యవస్థలోనే మిగిలిపోయిందని, ఇది తమ ప్రాంత యువత దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. పలాస జిల్లా ఏర్పడితే యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, పరిపాలన ప్రజలకు దగ్గరవుతుందని, అభివృద్ధి వేగవంతమవుతుందని, పలాస ప్రాంతానికి ప్రాధాన్యం పెరిగి వలసలు తగ్గుతాయని ఆయన ప్రయోజనాలను వివరించారు. పాత 13 జిల్లాలను 29 జిల్లాలుగా విస్తరించినప్పుడు ప్రకటించిన పలాస జిల్లాను ఎందుకు తప్పించారని, ఇతర జిల్లాల యువతకు ఇచ్చిన అవకాశాలు శ్రీకాకుళం జిల్లా యువతకు ఎందుకు ఇవ్వలేదని దువ్వాడ శ్రీధర్ బాబా ప్రశ్నించారు. జిల్లాల విభజన వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగితే, శ్రీకాకుళం జిల్లాను ఎందుకు విస్మరించారని, పలాస జిల్లా ప్రకటనను చివరి క్షణంలో నిలిపివేసింది ఎవరని ఆయన నిలదీశారు. పలాస జిల్లా అనేది కేవలం సెంటిమెంట్ కాదని, ఇది శ్రీకాకుళం జిల్లా యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశమని పునరుద్ఘాటించిన ఆయన, 95% స్థానిక ఉద్యోగ అవకాశాల్లో సమాన న్యాయం కోసం, పరిపాలనా వికేంద్రీకరణ కోసం, ప్రాంతీయ అభివృద్ధి కోసం పలాస జిల్లాను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. “మిగతా జిల్లాలకు ఇచ్చిన న్యాయం... పలాసకు కూడా చేయాలి,” మరియు “యువత భవిష్యత్తు కోసం — పలాస జిల్లా కావాలి,” అని దువ్వాడ శ్రీధర్ బాబా తమ డిమాండ్‌ను ముగించారు.

- న్యాయవాది దువ్వాడ శ్రీధర్ బాబా పలాస జిల్లా ఏర్పాటు డిమాండ్ కేవలం ప్రాంతీయ సెంటిమెంట్ కాదని, ఇది యువత భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, పరిపాలనా వికేంద్రీకరణ, మరియు సమాన న్యాయం కోసం చేస్తున్న అత్యవసరమైన, న్యాయమైన డిమాండ్ అని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాత 13 జిల్లాల వ్యవస్థను మార్చి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు పరిపాలన దగ్గరై, అభివృద్ధి అవకాశాలు పెరిగాయని, ఇది ఒక మంచి నిర్ణయమని ఆయన అంగీకరించారు. అయితే, ఈ ప్రక్రియలో శ్రీకాకుళం జిల్లాకు మాత్రం పూర్తి న్యాయం జరగలేదని దువ్వాడ శ్రీధర్ బాబా ఆరోపించారు. పాత 13 జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లాను మినహాయిస్తే, మిగతా 12 జిల్లాలు విభజన చెంది 26 జిల్లాలుగా మారాయని, ఆపై మరో 3 జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 29కి చేరిందని ఆయన వివరించారు. ఈ పునర్విభజన రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు పరిపాలనా, అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలను పెంచిందని, కానీ ప్రకటించిన పలాస జిల్లాను చివరి క్షణంలో తొలగించి, శ్రీకాకుళం జిల్లాను మాత్రం యథాతథంగా ఉంచేశారని, ఇదే శ్రీకాకుళం జిల్లా ప్రజలకు జరిగిన అన్యాయమని పేర్కొన్నారు. జిల్లా అంటే కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు మాత్రమే కాదని, నేటి పరిస్థితుల్లో అది ఉద్యోగ అవకాశాలు కూడా అని యువత అర్థం చేసుకోవాలని శ్రీధర్ బాబా సూచించారు. AP Public Employment Order – 2025 ప్రకారం రాష్ట్రంలో 6 జోన్‌లు, 2 మల్టీ జోన్‌లు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఉందని తెలిపారు. జిల్లా క్యాడర్ పోస్టుల్లో సుమారు 95% ఉద్యోగాలు స్థానిక జిల్లా అభ్యర్థులకే రిజర్వ్ చేయబడి ఉంటాయని, కేవలం 5% మాత్రమే ఓపెన్ కేటగిరీకి చెందుతాయని, దీనివల్ల పోటీ ప్రధానంగా జిల్లా లోపలే ఉంటుందని వివరించారు. పెద్ద జిల్లా అయితే అభ్యర్థుల సంఖ్య పెరిగి, పోటీ తీవ్రంగా ఉంటుందని, ఒక పోస్టుకు వందల, వేల మంది పోటీ పడతారని, దీంతో స్థానిక యువతకు అవకాశాలు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పలాస ప్రత్యేక జిల్లాగా ఏర్పడితే స్థానిక అభ్యర్థుల సంఖ్య తగ్గి, జిల్లా క్యాడర్ ఉద్యోగాల్లో పోటీ తగ్గి, యువతకు అవకాశాలు పెరుగుతాయని, కొత్త జిల్లా కార్యాలయాల ద్వారా అదనపు ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయని తెలిపారు. ఇతర జిల్లాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలుగా విడిపోవడం వల్ల అక్కడి యువతకు పోటీ తగ్గి, అవకాశాలు పెరిగి, పరిపాలన దగ్గరై, కొత్త ఉద్యోగాలు వస్తున్నాయని శ్రీధర్ బాబా నొక్కి చెప్పారు. అయితే, శ్రీకాకుళం జిల్లాలో మాత్రం అదే జనాభా, అదే పరిధి, అదే స్థాయి పోటీ కొనసాగుతోందని, దీనివల్ల రాష్ట్రం మొత్తం జిల్లాల విభజన ప్రయోజనాలు పొందుతుంటే, శ్రీకాకుళం జిల్లా మాత్రం పాత వ్యవస్థలోనే మిగిలిపోయిందని, ఇది తమ ప్రాంత యువత దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. పలాస జిల్లా ఏర్పడితే యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, పరిపాలన ప్రజలకు దగ్గరవుతుందని, అభివృద్ధి వేగవంతమవుతుందని, పలాస ప్రాంతానికి ప్రాధాన్యం పెరిగి వలసలు తగ్గుతాయని ఆయన ప్రయోజనాలను వివరించారు. పాత 13 జిల్లాలను 29 జిల్లాలుగా విస్తరించినప్పుడు ప్రకటించిన పలాస జిల్లాను ఎందుకు తప్పించారని, ఇతర జిల్లాల యువతకు ఇచ్చిన అవకాశాలు శ్రీకాకుళం జిల్లా యువతకు ఎందుకు ఇవ్వలేదని దువ్వాడ శ్రీధర్ బాబా ప్రశ్నించారు. జిల్లాల విభజన వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగితే, శ్రీకాకుళం జిల్లాను ఎందుకు విస్మరించారని, పలాస జిల్లా ప్రకటనను చివరి క్షణంలో నిలిపివేసింది ఎవరని ఆయన నిలదీశారు. పలాస జిల్లా అనేది కేవలం సెంటిమెంట్ కాదని, ఇది శ్రీకాకుళం జిల్లా యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశమని పునరుద్ఘాటించిన ఆయన, 95% స్థానిక ఉద్యోగ అవకాశాల్లో సమాన న్యాయం కోసం, పరిపాలనా వికేంద్రీకరణ కోసం, ప్రాంతీయ అభివృద్ధి కోసం పలాస జిల్లాను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. “మిగతా జిల్లాలకు ఇచ్చిన న్యాయం... పలాసకు కూడా చేయాలి,” మరియు “యువత భవిష్యత్తు కోసం — పలాస జిల్లా కావాలి,” అని దువ్వాడ శ్రీధర్ బాబా తమ డిమాండ్‌ను ముగించారు.1
- పలాస మండలం కోసంగిపురం గ్రామంలో మంగళవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ ఆర్. నరసింహమూర్తి, తమ పోలీస్ సిబ్బందితో కలిసి గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ప్రజలకు నారీ శక్తి, కొత్త చట్టాల గురించి అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, మహిళలపై జరిగే నేరాలు, మరియు 112 కాల్ ఉపయోగం గురించి కూడా వివరించారు. అలాగే, పోలీసులు గ్రామంలో జరిగే సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, బెట్టింగ్, పేకాట, గంజాయి, నాటు సారా అక్రమ రవాణా, అమ్మకాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. గ్రామ దేవాలయాలు, మసీదులు, చర్చ్‌లకు సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు. గ్రామంలో ఏదైనా పండుగలు లేదా ఉత్సవాలు జరిగినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కూడా తెలియజేశారు.1
- శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బుధవారం జోరుగా వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి పలు గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. అయితే, ఈ వర్షం ఖరీఫ్ వరి సాగు కోసం పొడి దుక్కిలో వేసిన విత్తనాలకు మేలు చేస్తుందని అధికారులు తెలిపారు. దుక్కి పనులకు అనుకూల పరిస్థితులు నెలకొనడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.1
- రాష్ట్ర హోంమంత్రి వంగళపూడి అనితకు వైసీపీ మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలుగు మహిళా పట్టణ అధ్యక్షురాలు కె.లక్ష్మి, మాజీ కౌన్సిలర్లు బర్లి శ్రీదేవి, తెంటు పార్వతి డిమాండ్ చేశారు. బుధవారం బొబ్బిలి కోటలో వారు ఈ మేరకు స్పందించారు. మహిళలను గౌరవించాల్సిన వైసీపీ నాయకులు కించపరిచేలా మాట్లాడడం ఏమాత్రం సరికాదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. హోంమంత్రి అనితపై అసభ్యకరంగా మాట్లాడడం అన్యాయమని తీవ్రంగా ఖండించారు. మహిళల పట్ల గౌరవం ప్రదర్శించాలని వారు డిమాండ్ చేశారు.2
- అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గత వారం రోజులుగా కొనసాగుతున్న ఎండ తీవ్రత, ఉక్కపోతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో స్థానికులు ఊరట చెందారు. ఈ వర్షం రాగులు, సామలు, వరి వంటి పంటలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని వర్షాలు కురిస్తే సాగుకు మరింత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.1
- విశాఖ నగరంలో యువత ఖరీదైన బైక్‌లపై కంపెనీ అమర్చిన సైలెన్సర్లను తొలగించి, అధిక శబ్దం మరియు పొగను వెదజల్లే సైలెన్సర్లను అమర్చడం, అలాగే కార్లు/ఆటోలకు అనధికారికంగా హై-బీమ్ లైట్లను అమర్చడం, ద్విచక్ర వాహనాలకు మొబైల్ స్టాండ్‌లను అమర్చడం వంటి చర్యల వల్ల మితిమీరిన శబ్ద, వాయు కాలుష్యం మరియు రహదారి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ వ్యవహారంపై చాలామంది మహిళలు, వృద్ధులు, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు ఆందోళన వ్యక్తం చేస్తూ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ మరియు అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు జనవరి 01, 2026 నుండి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో ఇప్పటివరకు 142 సైలెన్సర్లు, 89 హై-బీమ్ లైట్లు, 290 మొబైల్ స్టాండ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా, బీచ్ మరియు ఇతర రహదారులపై బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న వారిపై చర్యలు చేపట్టి, దఫాదఫాలుగా 3 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకుని, వారిపై కేసులు నమోదు చేశారు. వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేయమని డిప్యూటీ టఠకాన్పూరక్టర్ కమీషనర్ (DTC), విశాఖపట్నానికి సిఫార్సు చేయడం జరిగింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన శిక్షా వివరాలను కూడా పోలీసులు వెల్లడించారు: మోడిఫైడ్ సైలెన్సర్లు మరియు హై-బీమ్ లైట్ ఉల్లంఘనలకు మొదటిసారి 3 నెలల జైలు శిక్ష లేదా ₹10,000 జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ జప్తు; రెండవసారి 6 నెలల జైలు శిక్ష లేదా ₹10,000 జరిమానాతో పాటు వాహనం స్వాధీనం మరియు లైసెన్స్ మరో 3 నెలల పాటు జప్తు ఉంటుంది. మొబైల్ స్టాండ్ ఉల్లంఘనకు ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా ₹1,000 నుండి ₹10,000 వరకు జరిమానా, మరియు 3 నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ జప్తు విధించబడుతుంది. కాగా, గౌరవ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారు అందించిన ₹6,75,000 నిధులతో 450 వేసవి కిట్‌లను ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి గౌరవ పోలీస్ కమషనర్ శ్రీ శంఖబ్రత బాగ్చి ఐపీఎస్ గారు అందజేశారు. విశాఖపట్నం సిటీ పోలీస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, వాహనాల్లో మార్పులు చేసి శబ్ద కాలుష్యం కలిగించే వాహనాల వల్ల పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, గుండె జబ్బులు ఉన్నవారు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. హై-బీమ్ లైట్లు మరియు మొబైల్ స్టాండ్‌లు ప్రమాదాలకు కారణమవుతున్నందున, వాహనదారులు అందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు.1
- ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థకు జీవనాధారంగా నిలిచిన పలాస జీడి పరిశ్రమపై ప్రభుత్వం అమలు చేయబోతున్న కొత్త ఆన్‌లైన్ ఈ-ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్ విధానం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పలాస న్యాయవాది దువ్వాడ శ్రీధర్ బాబా అన్నారు. రాష్ట్ర ఖజానాకు ఏటా సుమారు ₹80 కోట్ల ఆదాయం అందిస్తున్న ఈ పరిశ్రమను ప్రోత్సహించకుండా, మరిన్ని ఆంక్షలతో ఇబ్బందులకు గురిచేయడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. జులై 1 నుండి అమలు చేయనున్న కొత్త సర్కులర్‌ను బేషరతుగా ఉపసంహరించాలని, డబుల్ ఈ-పర్మిట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది పలాస మరియు పరిసర ప్రాంతాల్లో సుమారు ₹1500 కోట్ల జీడి వ్యాపారం జరుగుతోందని, దీని ద్వారా జీఎస్టీ (5%) రూపంలో సుమారు ₹75 కోట్లు, మార్కెట్ సెస్ రూపంలో ₹4-5 కోట్లు కలిపి ప్రభుత్వానికి ఏటా దాదాపు ₹80 కోట్ల ఆదాయం వస్తోందని శ్రీధర్ బాబా వివరించారు. 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి గడిచిన 9 ఏళ్లలో పలాస జీడి పరిశ్రమ ద్వారా ప్రభుత్వానికి ₹720 కోట్లకు పైగా ఆదాయం సమకూరిందని ఆయన తెలిపారు. డబుల్ పర్మిట్ విధానం ప్రకారం, రైతుల వద్ద నుంచి జీడిపిక్కలు కొనుగోలు చేసిన వెంటనే 1% మార్కెట్ సెస్ చెల్లించి ఆన్‌లైన్ ఈ-ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్ పొందాలి. ఆ తర్వాత, అదే జీడిపిక్కలను పరిశ్రమల్లో ప్రాసెస్ చేసి జీడిపప్పుగా తయారు చేసి ఇతర రాష్ట్రాలకు తరలించినప్పుడు మళ్లీ మరోసారి ఆన్‌లైన్ ఈ-ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్ తీసుకోవాలని, ఒకే సరుకుపై రెండుసార్లు అనుమతులు తీసుకోవడం అనవసర పరిపాలనా భారమని ఆయన అన్నారు. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు లేదా చిన్నపాటి తప్పిదాలు జరిగినా వాహనాలు చెక్‌పోస్టుల వద్ద నిలిచిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల వ్యాపార నష్టం, అధికారుల వేధింపులు, అవినీతి అవకాశాలు పెరుగుతాయని శ్రీధర్ బాబా హెచ్చరించారు. పలాస జీడి వ్యాపారం ప్రధానంగా అరువు వ్యవస్థపై నడుస్తుందని, కొనుగోలు చేసిన సరుకు అమ్ముడై డబ్బు రావడానికి ఒకటి రెండు నెలలు పడుతుందని, ఈ పరిస్థితుల్లో తోటల దగ్గర నుంచే ఆన్‌లైన్ చెల్లింపులు, పర్మిట్లు తప్పనిసరి చేయడం చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు భారంగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పలాస నుండి వందల కోట్ల జీఎస్టీ వెళ్తోందని, కానీ తిరిగి పలాసకు ఏమి వచ్చిందో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక జీడి పరిశ్రమ పార్క్ ఎక్కడ, యువ పారిశ్రామికవేత్తలకు భూముల కేటాయింపు ఎందుకు జరగలేదని, ఆధునిక గిడ్డంగులు, ఎగుమతులకు అవసరమైన మౌలిక వసతులు ఎందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు. ఏటా కోట్ల రూపాయల మార్కెట్ సెస్ వసూలు చేస్తున్న ప్రభుత్వం, ఆ నిధుల్లో పలాస పరిశ్రమ అభివృద్ధికి ఎంత ఖర్చు చేసిందో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంక్షలు కాకుండా పరిశ్రమ విస్తరణే పరిష్కారమని దువ్వాడ శ్రీధర్ బాబా సూచించారు. ప్రభుత్వం నిజంగా ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశం ఉంటే వ్యాపారులను ఇబ్బంది పెట్టకుండా పరిశ్రమను విస్తరించాలని అన్నారు. 300 మంది యువ పారిశ్రామికవేత్తలకు తలా 20 సెంట్ల చొప్పున భూమి కేటాయించి, విద్యుత్, రోడ్లు, నీటి వసతులు కల్పించాలని, కొత్త యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆయన కోరారు. దీనితో పలాస జీడి పరిశ్రమ టర్నోవర్ ₹1500 కోట్ల నుంచి ₹3000 కోట్లకు పెరిగే అవకాశం ఉందని, అప్పుడు ప్రభుత్వానికి వచ్చే జీఎస్టీ ఆదాయం కూడా రెట్టింపు అవుతుందని, వేలాది మంది యువతకు ఉపాధి, రైతులకు మెరుగైన ధరలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. జులై 1 నుండి అమలు చేయనున్న కొత్త సర్కులర్‌ను తక్షణమే రద్దు చేయాలని, జీడిపిక్కలు – జీడిపప్పుపై డబుల్ ఆన్‌లైన్ ఈ-పర్మిట్ విధానాన్ని ఉపసంహరించుకొని ప్రస్తుతం అమలులో ఉన్న పాత విధానాన్నే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. పలాసలో అన్ని వసతులతో కూడిన ప్రత్యేక జీడి పరిశ్రమ పార్క్ ఏర్పాటు చేయాలని, 300 మంది యువ పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించి కొత్త యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, మార్కెట్ సెస్ నిధుల వినియోగంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ఖజానాకు ఏటా ₹80 కోట్ల ఆదాయం అందిస్తూ, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న పలాస జీడి పరిశ్రమను కాపాడుకోవడం ప్రభుత్వ కనీస బాధ్యత అని శ్రీధర్ బాబా స్పష్టం చేశారు. ఈ అనాలోచిత డబుల్ ఈ-పర్మిట్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.1
- విశాఖపట్నంలోని జ్ఞానాపురం సత్యప్రకాశ్ మెడికల్ షాప్ సమీపంలో ఉన్న ఫుట్‌పాత్‌పై ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయం తెలియగానే అవర్ హాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి పిల్లి గోవిందరాజు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి కంచరపాలెం హైవే ప్రాంతానికి చెందిన రోజువారీ కూలీ అని, అధికంగా మద్యం సేవించడం వల్ల అతను మరణించినట్లు వెల్లడైంది. పిల్లి గోవిందరాజు పోలీసుల సమక్షంలో తన సొంత ఖర్చులతో ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఆ అంబులెన్స్ ద్వారా ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యుల స్వస్థలానికి తరలించి, గోవిందరాజు తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.1