అలుగునూరు "సీఓఈ" విజయకేతనం.. - ఇంటర్ ఫలితాల్లో విద్యార్థుల ప్రభంజనం తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆదివారం విడుదల చేసిన ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులతో మెరిశారు.రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన అక్షిత ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో కళాశాలకు చెందిన కే. అక్షిత 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. అక్షిత సాధించిన ఈ ఘనత పట్ల కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.మొదటి సంవత్సరంలో ఇతర విద్యార్థులు సైతం పోటాపోటీగా మార్కులు సాధించారు.జి.నందిని, ఎల్.అక్షిత, ఎం.సుదీక్ష, ఎం.శైలజ, బి.అవంతిక, కె.వినీలలు 467 మార్కులతో సత్తా చాటగా.. మరో 12 మంది 466 మార్కులు, ఆరుగురు 465 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. గరిష్ట మార్కులు సాధించిన వారి జాబితాలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉండటం కళాశాల రికార్డు స్థాయి ఫలితాలకు నిదర్శనంగా నిలిచింది.సెకండియర్‌లోనూ రికార్డు మార్కులు ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ అలుగునూరు విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.ఎంపీసీ విభాగంలో కే. సౌమ్య 1000 మార్కులకు గాను 994 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలవగా, బి. అక్షిత 993 మార్కులతో తన ప్రతిభను చాటుకుంది.బైపీసీ విభాగంలో జె. ప్రసన్న 1000 మార్కులకు గాను 988 మార్కులతో అత్యుత్తమ ఫలితాన్ని నమోదు చేసింది.పరీక్ష ఫలితాలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలను జోనల్ అధికారి ప్రత్యూష, కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్. మాధవి, వైస్ ప్రిన్సిపాల్ ఆసియా సుల్తానాలు ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల కష్టానికి అధ్యాపకుల నిరంతర పర్యవేక్షణ తోడవ్వడం వల్లే ఈ అద్భుత విజయాలు సాధ్యపడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో కళాశాల పేరును నిలబెట్టిన విద్యార్థులను తీర్చిదిద్దిన అధ్యాపక బృందాన్ని జోనల్ అధికారి ప్రత్యూష ప్రత్యేకంగా ప్రశంసించారు.

- జగిత్యాల కాంగ్రెస్ లో సరికొత్త లొల్లి తెరపైకి వచ్చింది. సీనియర్, జూనియర్ల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఇప్పటికే సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి ఈనెల 20న బీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో సీనియర్లతో సీఎం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిఆర్ఎస్ లో చేరుతుండగా జగిత్యాలలో కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో సీనియర్, జూనియర్ అనే అంశం తెరపైకి వచ్చింది. కో అప్షన్ పదవులు సీనియర్లకే ఇవ్వాలని ఇంతకాలం జీవన్ రెడ్డితో నడిచిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన వారితో భర్తీ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో పాటు జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పదవులు రాకుంటే సీనియర్లు జీవన్ రెడ్డి వెంట బిఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని, వారు చేజారి పోకుండా ఉండాలంటే సీఎంతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు సాయంత్రం అపాయింట్మెంట్ తీసుకున్నారు. నిన్న జరగాల్సిన సమావేశం అనివార్య కారణాలవల్ల ఈరోజు జరగడంతో డిసిసి అధ్యక్షులు నందయ్య నేతృత్వంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణంతో పాటు 50 మంది నాయకులు సీఎం వద్దకు వెళ్లారు. పార్టీ మారే ఉద్దేశం తమకు లేదని, సీనియర్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామని సీనియర్లు అంటున్నారు. సీఎం నుండి తమకు ఎలాంటి భరోసా లభిస్తుందో చూస్తామని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తోపాటు డిసిసి అధ్యక్షులు మాత్రం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అందరం కలిసే సీనియర్ లను సీఎం వద్దకు తీసుకెళ్ళాలని నిర్ణయించినట్లు తెలిపారు.4
- భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి పైన గోపి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను సమర్పించి నివాళులను అర్పించారు.1
- హుస్నాబాద్ మండలం పరిసర గ్రామాల్లో యాసంగి వరి కోతలు సోమవారం ప్రారంభమయ్యాయి. సాగునీరు అందుబాటులో ఉండటంతో ముందస్తుగా సాగు చేసిన రైతులు.. వాతావరణ మార్పుల భయంతో పంటను త్వరగా కోత చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ ఏడాది మోగి పురుగు ప్రభావంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదని, దిగుబడి గణనీయంగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1
- గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, నాయకులు దొనకొండ తిరుపతి, దొనకొండ మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- జగిత్యాల : జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో ఈ నెల 20 న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామాల నుండి బహిరంగ సభకు వేలాది మందిని తరలించి, బహిరంగ సభను విజయవంతం చేయాలనీ నిర్ణయించారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీ బలోపేతం కోసం ఒకే కుటుంబంగా పనిచేసినామన్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనకు ప్రజలు విసిగిపోయి, కేసీఆర్ పాలనే బాగుండే అనే చర్చ వచ్చింది. రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో నుండి వచ్చింది. నేను అంటున్నది కాదు. గ్రామ సర్పంచ్ ను ఎవరు ఏమి చేయలేరు..15 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా వస్తాయి.. విధిలేని పరిస్థితిలో పార్టీ నీ వీడాల్సి వచ్చిందనీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే సి ఆర్ దశాబ్దకాలం, రైతులకు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు.2
- Post by Vedam chamdu Vedam1
- గత కొంతకాలంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యాపారవేత్తలను చంపుతానని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విత్తనాల నాగరాజు అను రౌడీ షీటర్ ని , జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు, మెట్టుపల్లి డి.ఎస్.పి ఏ రాములు గారి ఆధ్వర్యంలో, ఈరోజు కోరుట్ల పట్టణంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది గతంలో కూడా విత్తనాలు నాగరాజు పై రెండు మర్డర్ కేసులు మరియు ఎక్స్ట్రాక్షన్ కేసులు నమోదు కాబడినవి అలాగే ఇతనిపై గతంలో PD Act కూడా నమోదు చేసి జైలుకు పంపించనైనది. అలాగే ఈరోజు అరెస్టు చేసిన కేసులో విత్తనాల నాగరాజు తో పాటు మరొక నిందితుడు కూడా ఉన్నట్లు ఆ దర్యాప్తులో తెలిసినది ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు తొందర్లోనే అతని పట్టుకుని అరెస్టు చేస్తాం వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారిని కూడా రిమాండ్ చేస్తాం ఈ కేసుని చాలా మైనేట్గా దర్యాప్తు చేస్తున్నాం, అదేవిధంగా విత్తనాల నాగరాజు అనే రౌడీషీటర్ తో కానీ ఇతని సహచరులతో కానీ ఎవరైనా సంబంధాలు కలిగి ఉండి వారితో తిరిగిన ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిగా పెట్టి వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోబడును, అలాగే ఎవరైనా ఎవరినైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడి బలవంతపు వసూలు చేస్తే వారిపై చట్టపరంగా చాలా కఠిన చర్యలు తీసుకోబడును. ముఖ్యంగా కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ పోలీస్ తరఫున విన్నపం ఏమనగా ఎవరు కూడా ఇలాంటి భయాలకు ఆందోళనలకు గురికావాల్సిన పనిలేదు మిమ్మల్ని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసిన బెదిరించిన నిర్భయంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వవచ్చు అదేవిధంగా మీ వివరాలు చాలా రహస్యంగా ఉంచబడతాయి.1
- కరీంనగర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు స్వల్ప ఉద్రిక్తతకు దారితీసాయి. ఏబీవీపీ జెండాలు, ప్రోటోకాల్ వివాదం కలకలం సృష్టించింది. అధికారులు కరీంనగర్ కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన జయంతి వేడుకలు ఆందోళనలు నిరసనలు అరెస్టుల మధ్య సాగాయి. ప్రోటోకాల్ వివాదం, ఏబీవిపి జెండాలు లొల్లికి దారి తీశాయి ఏబీవీపీ జండాలతో అంబేద్కర్ విగ్రహానికి ఎబివిపి పూలమాలలు వేస్తుండగా దళిత సంఘాలు అభ్యంతరం తెలిపిపాయి. తాము దళితులమే అంటూ ఏబీవీపీ కార్యకర్తలు ఘాటుగా సమాధానం చెప్పడంతో దళితులకు ఏబీవీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాట జరిగింది. పరస్పర నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. బలవంతంగా వాహనాల్లో స్టేషన్ కు తరలించారు. మరోవైపు వేదికపైకి దళిత సంఘాల ప్రతినిధులను పిలువలేదని నిరసన పలువురు దళిత సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. వేదిక పైకి దూసుకెళ్లి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ముఖ్యనేతలు, అధికారులను మాత్రమే వేదిక పైకి పిలిచామని రాద్ధాంతం చేయొద్దని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సముదాయించి చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.2