Shuru
Apke Nagar Ki App…
కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నెరడిగొండ మండల కేంద్రంలో నాఫెడ్ వారిచే తెలంగాణ మార్కుఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ సొసైటీ ఆవరణ యందు నూతనంగా ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతును సన్మానించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్మాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు నీలిమ రవీందర్ రెడ్డి,ఉప సర్పంచ్ గులాబ్, పీఏసీఎస్ చైర్మన్ కిషోర్,నానక్ సింగ్,మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్,మండల కన్వీనర్ శివారెడ్డి,మాజీ జడ్పీటీసీ జహీర్,మాజీ సర్పంచ్ పెంట రమణ,మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి,ప్రతాప్,రాథోడ్ సురేందర్,సాబ్లే సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
AlluriMahesh
కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నెరడిగొండ మండల కేంద్రంలో నాఫెడ్ వారిచే తెలంగాణ మార్కుఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ సొసైటీ ఆవరణ యందు నూతనంగా ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతును సన్మానించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్మాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు నీలిమ రవీందర్ రెడ్డి,ఉప సర్పంచ్ గులాబ్, పీఏసీఎస్ చైర్మన్ కిషోర్,నానక్ సింగ్,మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్,మండల కన్వీనర్ శివారెడ్డి,మాజీ జడ్పీటీసీ జహీర్,మాజీ సర్పంచ్ పెంట రమణ,మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి,ప్రతాప్,రాథోడ్ సురేందర్,సాబ్లే సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- మ్యాదరిపేటలో విషాదం: ఇనుప స్టాండ్‌కు తగిలిన హైఓల్టేజ్ వైర్లు.. ఒకరు సజీవ దహనం, మరొకరు అక్కడికక్కడే మృతి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేట గ్రామంలో సోమవారం ఒక పెను విషాదం చోటుచేసుకుంది. పని నిమిత్తం వెళ్ళిన ఇద్దరు యువకులను విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. హైఓల్టేజ్ విద్యుత్ తీగలు తగలడంతో ఒక యువకుడు కళ్లెదుటే మంటల్లో కాలిపోగా, మరొకరు తీవ్రమైన షాక్‌తో ప్రాణాలు విడిచారు. అసలేం జరిగింది? స్థానికుల కథనం ప్రకారం.. మ్యాదరిపేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ఒక భారీ ఇనుప స్టాండ్ ఉంది. మ్యాదరిపేటకు చెందిన సల్ల లక్ష్మీనారాయణ (ఎడ్డన్న), వెల్గనూర్ గ్రామానికి చెందిన చందనగిరి నాగరాజు ఆ స్టాండ్‌ను రోడ్డుపై నుంచి జరుపుతున్నారు. అయితే, పైన తక్కువ ఎత్తులో వేలాడుతున్న హైఓల్టేజ్ విద్యుత్ మెయిన్ లైన్లను వారు గమనించలేదు. ఆ ఇనుప స్టాండ్ ఒక్కసారిగా విద్యుత్ తీగలకు తగలడంతో భారీ స్థాయిలో కరెంట్ ప్రవహించింది. ఈ క్రమంలో: సజీవ దహనం: విద్యుత్ తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. స్టాండ్‌ను పట్టుకుని ఉన్న లక్ష్మీనారాయణ శరీరం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. అందరూ చూస్తుండగానే ఆయన సజీవ దహనమయ్యాడు. అక్కడికక్కడే మృతి: మరో యువకుడు నాగరాజు తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామాల్లో మిన్నంటిన రోదనలు చేతికొచ్చిన కొడుకులు కళ్లెదుటే విగతజీవులుగా పడి ఉండటంతో మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడి వారిని కలచివేశాయి. మ్యాదరిపేట, వెల్గనూర్ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. "విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగింది. వైర్లు తక్కువ ఎత్తులో వేలాడుతున్నా పట్టించుకోకపోవడం వల్లే ఇద్దరు యువకులు బలైపోయారు." > — స్థానికుల ఆవేదన విచారణ చేపట్టిన పోలీసులు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.1
- పత్రికా ప్రకటన తేది:10.03.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం త్రైమాసిక తనిఖీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం (EVM) గోదాంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి గోదాంలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాల భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు భద్రతా నిబంధనల అమలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదాంలో ఉన్న రికార్డులను పరిశీలించి, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సామగ్రి భద్రతపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత అధికారులు నిబంధనలను పూర్తిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, RDO వీణ, MRO హిమబిందు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.1
- ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో స్వచ్చత పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై తనిఖీ చేశారు.గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లోని నీటి పారుదల శాఖ, ఈఈ పీ ఆర్, ఆర్ అండ్ బీ, బీసీ సంక్షేమ శాఖ, డీటీ సీపీఓ, కార్మిక శాఖ, భూగర్భ శాఖ, డీఆర్ డీఓ, మైనింగ్, సీపీఓ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సహకార శాఖ, ఎక్సైజ్, విద్యా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పౌర సరఫరాల శాఖ, ఉపాధి కల్పన శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, జిల్లా పంచాయతీ ఆఫీస్, ట్రెజరీ శాఖ, ఏవో ఆఫీస్, డీపీఆర్ఓ, సంక్షేమ శాఖ తదితర కార్యాలయాలను కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని వివిధ గదుల్లో ఉన్న ఫర్నిచర్, ఫైల్స్, రికార్డులు, సామగ్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా శాఖ కార్యాలయం, మండలాల్లోని కార్యాలయాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయం లోని ఫైళ్లు, రిజిస్టర్లు స్టోర్ రూమ్ లా సిద్ధం చేయాలని, నిబంధనల ప్రకారం భద్రపరచాలని స్పష్టం చేశారు. అనవసరమైనవి తొలగించాలని సూచించారు. కార్యాలయం ఆవరణలోని నిరుపయోగ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు తొలగించాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న కుండీల్లో మొక్కలు పెట్టించాలని కలెక్టర్ తెలిపారు.1
- రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మిస్‌మేనేజ్‌మెంట్ జరుగుతోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా వినియోగం కావడం లేదని, కేవలం 70% ప్రొడక్షన్ మాత్రమే కొనసాగుతోందన్నారు. హెడ్‌ఆఫీస్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మార్చాలని పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందన రాలేదన్నారు. యూరియా నిర్వహణలో గందరగోళంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.1
- జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని స్పష్టం చేశారు.1
- పక్కగా భూ హక్కులకోసం రీసర్వే ----జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ వివరించారు. మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీ సర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. 100 సంవత్సరాల పూర్వం నిజాం ప్రభుత్వం 35 నుంచి 40 సంవత్సరాల మధ్య కష్టపడి పనిచేసి భూమి నక్ష ను రూపొందించడం జరిగిందన్నారు. అప్పటినుంచి కొన్ని గ్రామాల్లో భూనక్షల్లో సమస్యల తలెత్తయన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకే భూ రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొంద పరుస్తామన్నారు. ఏలాంటి భూ వివాదాలు లేకుండా చేసి,భూమికి భూధార్ ను అందించడం జరుగుతుందన్నారు. భూమి ప్రతి రైతుకు ఒక సెంటిమెంట్ అని ,భూమికోసం రైతులు పరితపిస్తూఉంటారన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం అన్నారు.జిల్లాలో 24 గ్రామాల్లో భూ రిసర్వే ను శాస్త్రీయంగా నిర్వహించి రైతుల భూ హక్కులను పరిరక్షిస్థామన్నారు. భూ రిసర్వే అనంతరం విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం పక్కగా వారి భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి,ఎ .డి ల్యాండ్ సర్వే కిషన్, డి.పి ఆర్ ఓ రామచంద్ర రాజు,తహసిల్దార్ రజనీ,ఎంపీడీవో గ్రామ సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.1
- పత్రిక ప్రకటన తేది:10.03.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం కొత్త డ్రెయిన్ చివర సోక్‌పిట్ ఏర్పాటు పనులకు భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లో పలు కార్యక్రమాలలో పాల్గొని పరిశీలించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాచరెడ్డి మండలంలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొని గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు, మురికి కాలువలు, వీధుల శుభ్రపరిచే పనులు, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి చర్యలను పరిశీలించారు. అదేవిధంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద కొత్త డ్రెయిన్ చివర సోక్‌పిట్ ఏర్పాటు పనులకు మార్కింగ్ కు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు. ఈ పనికి సుమారు రూ. 92 వేల వ్యయం అంచనా వేయడం జరిగిందని, గ్రామంలోని అయ్యవారి గుట్టం సమీపంలో ఉన్న పనికిరాని బోర్‌వెల్‌ను మూసివేయడం కూడా ఈ సందర్భంగా నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్యం, మౌలిక సదుపాయాల మెరుగుదలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 99 రోజుల ప్రణాళికలో రోజు వారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, ఈ కార్యక్రమం లో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో dpo మురళీ, dlpo శ్రీనివాస్, MRO, సరళ, మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని సిరిసిల్లలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పాల్గొని సావిత్రిబాయి పూలే విగ్రహానికి అంబేద్కర్ చౌక్ లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చదువుల తల్లి అని ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సీనియర్ జర్నలిస్ట్ కరుణాల భద్రాచలం, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు వంకాయల కార్తీక్, గడ్డం నర్సయ్య, పంబాల దేవరాజు, లక్ష్మణ్, రాగుల రాములు కత్తెర దేవదాస్ కంసాల మల్లేశం పండుగ రవి తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కాలేశ్వరం 11/6 ప్యాకేజీ పనులు నిలిచిపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై మానేరు వంతెన వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 15 గ్రామాలకు సంబంధించిన దాదాపు 9500 ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాలేశ్వరం పనులు పూర్తి చేసి నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మానేరు వంతెనపై కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం3