కామారెడ్డి : త్రైమాసిక తనిఖీలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పత్రికా ప్రకటన తేది:10.03.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం త్రైమాసిక తనిఖీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం (EVM) గోదాంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి గోదాంలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాల భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు భద్రతా నిబంధనల అమలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదాంలో ఉన్న రికార్డులను పరిశీలించి, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సామగ్రి భద్రతపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత అధికారులు నిబంధనలను పూర్తిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, RDO వీణ, MRO హిమబిందు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి : త్రైమాసిక తనిఖీలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పత్రికా ప్రకటన తేది:10.03.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం త్రైమాసిక తనిఖీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం (EVM) గోదాంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి గోదాంలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాల భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు భద్రతా నిబంధనల అమలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదాంలో ఉన్న రికార్డులను పరిశీలించి, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సామగ్రి భద్రతపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత అధికారులు నిబంధనలను పూర్తిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, RDO వీణ, MRO హిమబిందు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
- పత్రికా ప్రకటన తేది :10.03.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మాచారెడ్డి మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలో పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం 8వ విడత గాలికుంటు వ్యాధి (FMD) నివారణ టీకా కార్యక్రమాన్ని ఆశిష్ సంగ్వాన్, IAS అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం మార్చి 10, 2026 నుండి ఏప్రిల్ 9, 2026 వరకు నెల రోజుల పాటు కొనసాగుతుంది. జిల్లాలోని 25 మండలాల్లో మొత్తం 1,42,400 ఆవులు , గేదెలకు టీకాలు వేయడం లక్ష్యంగా పెట్టబడింది. ఈ భారీ కార్యక్రమం కోసం పశుసంవర్ధక శాఖ 48 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఇంటింటికి వెళ్ళి ఏ ఒక్క పశువు మిగిలిపోకుండా టీకాలు వేస్తాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, గాలికుంటు వ్యాధి (FMD) అనేది గాలి ద్వారా వేగంగా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ అని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. "టీకా వేయించడం అనేది కేవలం ఆరోగ్య చర్య మాత్రమే కాదు; ఇది రైతు జీవనోపాధికి ఒక రక్షణ కవచం వంటిది. గాలికుంటు వ్యాధి వల్ల పశువుల పాల దిగుబడి తగ్గడం, వంధ్యత్వం , బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ 8వ విడతలో అన్ని ఆవులు, గేదెలకు టీకాలు వేయించడం ద్వారా రైతులు ఆర్థిక నష్టాలను నివారించడం , పశువుల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు" అని తెలిపారు. పశువైద్య బృందాలు గ్రామాలను సందర్శించే సమయంలో రైతులు , పశువుల యజమానులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. గ్రామాలకు బృందాలు వచ్చినప్పుడు పశువులను సిద్ధంగా ఉంచి, వాటిని కట్టి ఉంచాలని పశుసంవర్ధకశాఖ అభ్యర్థించింది. ఈ కార్యక్రమానికి జిల్లా పశు వైద్య ,పశుసంవర్ధక అధికారి, కామారెడ్డి నేరుగా పర్యవేక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సంబంధిత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- పక్కగా భూ హక్కులకోసం రీసర్వే ----జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ వివరించారు. మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీ సర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. 100 సంవత్సరాల పూర్వం నిజాం ప్రభుత్వం 35 నుంచి 40 సంవత్సరాల మధ్య కష్టపడి పనిచేసి భూమి నక్ష ను రూపొందించడం జరిగిందన్నారు. అప్పటినుంచి కొన్ని గ్రామాల్లో భూనక్షల్లో సమస్యల తలెత్తయన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకే భూ రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొంద పరుస్తామన్నారు. ఏలాంటి భూ వివాదాలు లేకుండా చేసి,భూమికి భూధార్ ను అందించడం జరుగుతుందన్నారు. భూమి ప్రతి రైతుకు ఒక సెంటిమెంట్ అని ,భూమికోసం రైతులు పరితపిస్తూఉంటారన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం అన్నారు.జిల్లాలో 24 గ్రామాల్లో భూ రిసర్వే ను శాస్త్రీయంగా నిర్వహించి రైతుల భూ హక్కులను పరిరక్షిస్థామన్నారు. భూ రిసర్వే అనంతరం విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం పక్కగా వారి భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి,ఎ .డి ల్యాండ్ సర్వే కిషన్, డి.పి ఆర్ ఓ రామచంద్ర రాజు,తహసిల్దార్ రజనీ,ఎంపీడీవో గ్రామ సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.1
- మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం లింగసాన్ పల్లి తండా కు చెందిన గిరిజన దంపతులకు నెల రోజుల క్రితం మగ బిడ్డ జన్మించారు. తొలి కాన్పులో మగ బిడ్డ జన్మించిన ఆనందంగా ఉన్న దంపతులు కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులు ఓ మధ్యవర్తి ద్వారా బాలు తల్లిదండ్రులను కలిసి బేరం పెట్టారు. 50 వేలకు బేరం కుదిరింది. డబ్బులు ఇచ్చిన కామారెడ్డి కి చెందిన దంపతులు తీసుకు వెళ్ళారు. అయితే బాబు పుట్టిన తరవాత అంగన్వాడిలో పాలు, ఇతర పోషక ఆహారం కు బాలింత రాకపోవడం తో అనుమానం కలిగిన అంగన్వాడీ టీచర్ ఆరా తీసింది. విషయం అడగడం తో ఇంటికి తాళం వెళ్ళిపోయారు. అధికారులు రంగంలోకి దిగి పోలీస్ లకు సమాచారం అందించారు. కామారెడ్డి లో ఉన్న నెల రోజుల పసికందును తీసుకొని సఖి కేంద్రం కు తరలించారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి నట్టు నిర్వాహకురాలు రేణుక తెలిపారు. నెల రోజుల పసి కందు ను విక్రయించడం పై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.1
- తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల - తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు.1
- ప్రతి గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పోతారం (ఎస్) గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణకు FMD టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పశు సంపద పెంచడానికి వ్యాదులు నివారించడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేసే FMD టీకా ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. మనకు ఆరోగ్యాన్నిచ్చే పాల ఉత్పత్తి పెంచడానికి రైతులంతా పాడి సంపద పెంచాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపట్టిందన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని.. ప్లాస్టిక్ నిర్మూలించేలా కృషి చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంక్ అందజేశామని వాటిని వినియోగించాలని సూచించారు.1
- Post by Narasimulu Narasimulu1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 10 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నిరసన గజ్వేల్: కరెంట్ సరఫరాలో కోత విధించడంతో పoటలు ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితి మారక పోతే సహించేదీలేదని ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం గజ్వే ల్లో లోని సబ్స్టే స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్శాఖ డీఈ భానుప్రకాశకు వినతిపత్రం అందజేశారు. అనం తరం ఆయన మాట్లాడుతూ గతంలో కేసీఆర్ రైతులకు 24గంటలూ విద్యుత్ సరఫరా అందజేసి అండగా నిలిస్తే.. నేడు పరిస్థితి భిన్నంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో 9గంటలకు మించి సరఫరా కావడం లేదన్నారు. దీంతో పం టలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన, దేవీ రవీందర్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.4
- పత్రికా ప్రకటన తేది:10.03.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం త్రైమాసిక తనిఖీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం (EVM) గోదాంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి గోదాంలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాల భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు భద్రతా నిబంధనల అమలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదాంలో ఉన్న రికార్డులను పరిశీలించి, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సామగ్రి భద్రతపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత అధికారులు నిబంధనలను పూర్తిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, RDO వీణ, MRO హిమబిందు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.1