Shuru
Apke Nagar Ki App…
తడ్కల్ లో సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు : సర్పంచ్ సుగుణ గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి తెలిపారు.సోమవారం కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో గడ్డి మందు పిచికారి పనులను ప్రారంభించారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పనులను వేగవంతం చేశామని, అంటువ్యాధులు సోకకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉన్నామని ఆమె వెల్లడించారు. ఉపసర్పంచ్ సమీర్ గ్రామపంచాయతీ కార్మికులు ఉన్నారు.
JALEEL RUSTUM REPORTER
తడ్కల్ లో సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు : సర్పంచ్ సుగుణ గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి తెలిపారు.సోమవారం కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో గడ్డి మందు పిచికారి పనులను ప్రారంభించారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పనులను వేగవంతం చేశామని, అంటువ్యాధులు సోకకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉన్నామని ఆమె వెల్లడించారు. ఉపసర్పంచ్ సమీర్ గ్రామపంచాయతీ కార్మికులు ఉన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- నందిపేట్ ZPHSలో బాల గ్రామ సభ - విద్యార్థుల సమస్యలపై స్పందించిన సర్పంచ్ నందిపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో సోమవారం బాల గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ పాఠశాలలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలను నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులు వివరించిన సమస్యలను సర్పంచ్ శ్రద్ధగా నోట్ చేసుకుని, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఉప సర్పంచ్ చందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేందర్, వార్డు సభ్యులు పాషా, పెట్ల శ్రీనివాస్, చింత శ్రీనివాస్, కంఠం చిన్నయ్య, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- సికింద్రాబాద్ మహంకాళి బోనాల జోష్‌లో పోలీసుల తీన్మార్ స్టెప్పులు.. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర రెండో రోజు వేడుకల్లో పోలీసు సిబ్బంది సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత వారం రోజులుగా బోనాల ఉత్సవాల భద్రతా విధుల్లో రాత్రింబవళ్లు నిమగ్నమైన పోలీసులు, అమ్మవారి భవిష్యవాణి, ఫలహార బండ్ల ఊరేగింపు సందర్భంగా కాసేపు ఉత్సాహంగా తీన్మార్ స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా అడుగులు వేస్తూ బోనాల సంబరాల్లో భాగమయ్యారు. సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఓయూ సీఐ మహేష్ కూడా సిబ్బందితో కలిసి నృత్యం చేయడంతో అక్కడి వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. పోలీసుల ఉత్సాహాన్ని చూసిన భక్తులు చప్పట్లతో అభినందించగా, పలువురు తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. విధి నిర్వహణతో పాటు పండుగ సంబరాల్లో భాగస్వాములైన పోలీసుల తీరుపై భక్తులు ప్రశంసలు కురిపించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతూ బోనాల జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.1
- శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి రూ.3.50 లక్షల విలువైన 37 గ్రాముల రాళ్లతో కూడిన మిశ్రమ బంగారు గొలుసు విరాళం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ఓ భక్త కుటుంబం భక్తిశ్రద్ధలతో సుమారు రూ.3.50 లక్షల విలువైన 37 గ్రాముల రాళ్లతో కూడిన మిశ్రమ బంగారు గొలుసును విరాళంగా అందజేసింది.దేవస్థానం రికార్డుల ప్రకారం, వేములవాడ బ్రహ్మంగారి వీధికి చెందిన బై విద్యాసాగర్, సురేఖ దంపతులు సోమవారం స్వామి వారికి ఈ రాళ్లతో కూడిన మిశ్రమ బంగారు గొలుసును కానుకగా సమర్పించారు. దేవస్థానం అధికారులు ఈ గొలుసు బరువు 37 గ్రాములు, విలువ సుమారు రూ.3,50,000గా నమోదు చేశారు.ఈ సందర్భంగా దాతలు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవికి బంగారు గొలుసును అందజేయగా, దేవస్థానం తరఫున అధికారిక రసీదును జారీ చేసి విరాళాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) నవీన్ కుమార్, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. దేవస్థానం అధికారులు దాతల సేవాభావాన్ని అభినందిస్తూ, శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుగ్రహంతో వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. భక్తులు బంగారం, వెండి, నగదు రూపంలో అందించే విరాళాలు దేవస్థానం అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, అలాగే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు వినియోగించబడుతున్నాయని దేవస్థానం అధికారులు తెలిపారు.1
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలలో భవిష్యవాణి వినిపిస్తున్న మాతంగి స్వర్ణలత ఈ ఏడాది కుంభవృష్టి కురుస్తుంది అగ్నిప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరుగుతుంది.. జాగ్రత్తగా ఉండండి నేను సంతోషంగా రాలేదు. క్రోధంతో వచ్చాను నేను చెప్పిన విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేయాలి.. లేదంటే ప్రాణనష్టం జరుగుతుంది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలలో భవిష్యవాణి వినిపిస్తున్న మాతంగి స్వర్ణలత1
- తెలంగాణ పబ్లిక్ స్కూలు కుకునూరుకు తరలించవద్దని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ యువజన సంఘం నాయకుల నిరసన వెల్దుర్తికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూలు కుకునూరుకు తరలించవద్దని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు, వివిధ పార్టీల నేతలు పీవీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బంద్ చేయించారు. వెల్దుర్తికి మంజూరైన పాఠశాలను అధికారులు పక్క గ్రామానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- సోమవారం సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించిన ఈవో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవి ఆలయ ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దర్శనం ముగించుకుని వస్తున్న ఓ దివ్యాంగ భక్తిని పలకరించి, దర్శనం సక్రమంగా జరిగిందా, ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ఆరా తీశారు. భక్తులకు అందుతున్న సేవలపై ప్రత్యక్షంగా తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.అనంతరం ఆలయంలోని కోడె టికెట్ కౌంటర్లు, దీపాలు వెలిగించే కౌంటర్లు, రెండు చెక్‌పోస్టులు తదితర ప్రాంతాలను పరిశీలించారు. కోడె టికెట్ల జారీ విధానాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఆలయ ప్రాంగణంలో భక్తులు కొబ్బరి కాయలు కొట్టిన అనంతరం వాటి పెంకులు, చిన్న ముక్కలను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల ఇతర భక్తుల కాళ్లకు గుచ్చుకుని గాయాలు, ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ఈవో తెలిపారు. కొబ్బరి వ్యర్థాలను తప్పనిసరిగా డస్ట్‌బిన్‌లలో వేయాలని భక్తులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా ఆలయ ప్రాంగణంలోఎప్పటికప్పుడు పారిశుధ్యాన్ని నిర్వహిస్తూ పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.మొత్తం ఆలయ పరిసరాలను పర్యవేక్షించిన ఈవో రమాదేవి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.2
- బోనాల విజయానికి కృషి చేసిన అధికారులకు, వాలంటీర్లకు తలసాని సన్మానం హైదరాబాద్‌లో సికింద్రాబాద్ నిర్వహించిన శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరను అందరి సహకారం, సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించగలిగామని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో బోనాల సందర్భంగా సేవలందించిన వివిధ శాఖల అధికారులు, వాలంటీర్లను శాలువాలతో సత్కరించి డెక్కన్ మానవ సేవా సమితి శతాబ్ది ఉత్సవాల జ్ఞాపికలను అందజేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో కృషి చేసిన జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, దేవాదాయ, ఆరోగ్య, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు, ఆలయ పండితులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాలంటీర్లు, అలాగే జాతరను విస్తృతంగా ప్రజలకు చేరవేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డెక్కన్ మానవ సేవా సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు, సమితి సభ్యులు పాల్గొన్నారు.1
- కాప్రా లో భారీ వర్షానికి ప్రధాన రహదారులు వర్షపు నీటితో నిండిపోయి... మల్కాజిగిరి, సైనిక్‌పురి, యాప్రాల్, కాప్రా పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు వర్షపు నీటితో నిండిపోయి జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులు ఏరులను తలపించేలా మారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా సాయంత్రం వేళ ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్లకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగడంతో వాహనాలు బారులుగా నిలిచాయి. వర్షపు నీరు త్వరగా బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, నీరు నిలిచిన ప్రాంతాల్లో సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.1