సికింద్రాబాద్ మహంకాళి బోనాల జోష్‌లో పోలీసుల తీన్మార్ స్టెప్పులు.. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర రెండో రోజు వేడుకల్లో పోలీసు సిబ్బంది సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత వారం రోజులుగా బోనాల ఉత్సవాల భద్రతా విధుల్లో రాత్రింబవళ్లు నిమగ్నమైన పోలీసులు, అమ్మవారి భవిష్యవాణి, ఫలహార బండ్ల ఊరేగింపు సందర్భంగా కాసేపు ఉత్సాహంగా తీన్మార్ స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా అడుగులు వేస్తూ బోనాల సంబరాల్లో భాగమయ్యారు. సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఓయూ సీఐ మహేష్ కూడా సిబ్బందితో కలిసి నృత్యం చేయడంతో అక్కడి వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. పోలీసుల ఉత్సాహాన్ని చూసిన భక్తులు చప్పట్లతో అభినందించగా, పలువురు తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. విధి నిర్వహణతో పాటు పండుగ సంబరాల్లో భాగస్వాములైన పోలీసుల తీరుపై భక్తులు ప్రశంసలు కురిపించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతూ బోనాల జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సికింద్రాబాద్ మహంకాళి బోనాల జోష్‌లో పోలీసుల తీన్మార్ స్టెప్పులు.. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర రెండో రోజు వేడుకల్లో పోలీసు సిబ్బంది సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత వారం రోజులుగా బోనాల ఉత్సవాల భద్రతా విధుల్లో రాత్రింబవళ్లు నిమగ్నమైన పోలీసులు, అమ్మవారి భవిష్యవాణి, ఫలహార బండ్ల ఊరేగింపు సందర్భంగా కాసేపు ఉత్సాహంగా తీన్మార్ స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా అడుగులు వేస్తూ బోనాల సంబరాల్లో భాగమయ్యారు. సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఓయూ సీఐ మహేష్ కూడా సిబ్బందితో కలిసి నృత్యం చేయడంతో అక్కడి వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. పోలీసుల ఉత్సాహాన్ని చూసిన భక్తులు చప్పట్లతో అభినందించగా, పలువురు తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. విధి నిర్వహణతో పాటు పండుగ సంబరాల్లో భాగస్వాములైన పోలీసుల తీరుపై భక్తులు ప్రశంసలు కురిపించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతూ బోనాల జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
- Parents Raise Concern Over Late Entry Policy at Green Meadows School, Kishan Bagh Concerns have been raised by parents regarding the late-entry policy at Green Meadows School, Kishan Bagh, where students are reportedly being denied entry if they arrive 5 to 10 minutes late. According to the complaint, while punctuality is important, refusing entry to children for a minor delay affects their education and causes unnecessary stress to both students and parents. The complainants believe that schools should prioritize uninterrupted learning and adopt a more child-friendly approach. Parents have appealed to the school management to review the existing policy and allow students who arrive only a few minutes late to attend their classes instead of being sent back home. The matter has been brought to the attention of the school administration, and parents are hoping for a positive and student-friendly resolution.1
- చిన్నశంకరంపేట మండలంలో 2 నిమిషాల్లో ఖాళీ.. 2,200 యూరియా బస్తాలు సరిపోలేదు చిన్నశంకరంపేట మండలంలోని నాలుగు సహకార సంఘాలకు వచ్చిన 2,200 యూరియా బస్తాలు రైతుల అవసరాలకు ఏమాత్రం సరిపోలలేదు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫర్టిలైజర్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే బుకింగ్‌లు వెల్లువెత్తగా, కేవలం రెండు నిమిషాల్లోనే మొత్తం స్టాక్ ముగిసిపోయింది. వేగంగా బుక్ చేసిన కొందరికే యూరియా దక్కగా, ఆశతో ఎదురుచూసిన వందలాది మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు. సాగు సీజన్‌లో తగినంత యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.1
- కీసర రామలింగేశ్వరుడిని దర్శించుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సోమవారం కీసర శ్రీ రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.1
- ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో మరోసారి భద్రతా లోపం సెల్ ఫోన్‌పై నిషేధం ఉన్నా.. దర్జాగా రీల్స్ చేస్తున్న భక్తులు పెద్ద రాజగోపురం వద్ద రీల్స్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన మహిళ దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆఫీస్ ఎదురుగా రీల్స్ చేస్తున్నా చోద్యం మహిళ ఇన్ స్టా రీల్ తో మరోసారి బయటపడ్డ ఆలయ భద్రత లోపం1
- మల్కాజిగిరిలో బోనాల చెక్కుల పంపిణీ.. 230 ఆలయాలకు రూ.76 లక్షల మంజూరు మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఆలయాలకు బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 230 ఆలయాలకు మొత్తం రూ.76 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, సంప్రదాయ పండుగల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎండోమెంట్స్ శాఖ అధికారులు, మాజీ కార్పొరేటర్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బోనాల పండుగను ఘనంగా నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులు సూచించారు.1
- Delhi–Dehradun Highway Partially Diverted for Kanwar Yatra, Traffic Restrictions Tightened Traffic arrangements on the Delhi–Dehradun Highway (NH-58) have been modified in view of the ongoing Kanwar Yatra. According to the current traffic plan, one lane has been reserved exclusively for Kanwariyas, while all other vehicles are being allowed to use the remaining lane. Authorities have stated that as the number of Kanwar pilgrims increases in the coming days, the highway will be closed to regular vehicular traffic in phases to ensure the safety and smooth movement of devotees. Commuters have been advised to follow traffic advisories, use alternate routes where necessary, and cooperate with police during the yatra period.1
- తెలంగాణ పబ్లిక్ స్కూలు కుకునూరుకు తరలించవద్దని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ యువజన సంఘం నాయకుల నిరసన వెల్దుర్తికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూలు కుకునూరుకు తరలించవద్దని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు, వివిధ పార్టీల నేతలు పీవీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బంద్ చేయించారు. వెల్దుర్తికి మంజూరైన పాఠశాలను అధికారులు పక్క గ్రామానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- హైదరాబాదులోని ఇందిరాపార్క్ చౌరస్తాలో నిరుద్యోగుల మెరుపు ధర్నా హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ చౌరస్తాలో నిరుద్యోగుల మెరుపు ధర్నా 7,437 పోస్టులతో కాకుండా 19 వేల పోలీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలి పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలంటూ డిమాండ్ నోటిఫికేషన్ ఆలస్యంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆవేదన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు పోలీస్ నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 36 సంవత్సరాలకు, ఎస్సై పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ దరఖాస్తు రుసుమును వెంటనే తగ్గించాలని, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నిరుద్యోగుల హెచ్చరిక1