logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం : ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి ఆదిలాబాద్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా,ప్రత్యేక అధికారి,డీపీఓ రమేష్ గుడిపల్లితో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఎంపీడీవో కె.వంశీకృష్ణ,తహసీల్దార్ గోవింద్ భూక్య,ఎంఏవో నగేష్‌రెడ్డి,వివిధ శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

3 hrs ago
user_AlluriMahesh
AlluriMahesh
Local News Reporter Adilabad Urban, Telangana•
3 hrs ago

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం : ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి ఆదిలాబాద్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా,ప్రత్యేక అధికారి,డీపీఓ రమేష్ గుడిపల్లితో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఎంపీడీవో కె.వంశీకృష్ణ,తహసీల్దార్ గోవింద్ భూక్య,ఎంఏవో నగేష్‌రెడ్డి,వివిధ శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • ఆదిలాబాద్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, స్పెషల్ ఆఫీసర్ డీపీఓ రమేష్ గుడిపల్లిలతో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో మండల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. వివిధ శాఖల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిని సమీక్షించి, అధికారులకు తగు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో K.వంశీకృష్ణ, తహసీల్దార్ గోవింద్ భూక్య, ఎంఏవో నగేష్ రెడ్డి, ఏఈఈ ఐ & సీఏడీ (I&CAD) D.వికాస్ రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ A.తిరుమల, ఏఈ (TW) K.శంకర్ రావు, ఎఫ్‌ఎస్‌వో J.ధన్ సింగ్, ఐసీడీఎస్ సూపరింటెండెంట్ P.స్వాతి, ఐసీడీఎస్ సూపర్వైజర్ P.నీరజ, ఎంపీవో T.సత్యానంద స్వామి, వీఏఎస్ (VAS) Dr.V.సురేశ్, ఏఈఈ ఆర్డబ్ల్యూఎస్ (RWS) M.ప్రత్యవిధాన్, ఏఈ (MB) R.గణేశ్, ఏఈ ఎంబీ గ్రిడ్ M.సంతోష్, ఏఈ పీఆర్ (PR) M.సంతోష్, ఏఈ ఎలక్ట్రిసిటీ G.సతీశ్ మరియు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
    3
    ఆదిలాబాద్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, స్పెషల్
ఆఫీసర్ డీపీఓ రమేష్ గుడిపల్లిలతో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
ఈ సమావేశంలో మండల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. వివిధ శాఖల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిని సమీక్షించి, అధికారులకు తగు సూచనలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో K.వంశీకృష్ణ, తహసీల్దార్ గోవింద్ భూక్య, ఎంఏవో నగేష్ రెడ్డి, ఏఈఈ ఐ & సీఏడీ (I&CAD) D.వికాస్ రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ A.తిరుమల, ఏఈ (TW) K.శంకర్ రావు, ఎఫ్‌ఎస్‌వో J.ధన్ సింగ్, ఐసీడీఎస్ సూపరింటెండెంట్ P.స్వాతి, ఐసీడీఎస్ సూపర్వైజర్ P.నీరజ, ఎంపీవో T.సత్యానంద స్వామి, వీఏఎస్ (VAS) Dr.V.సురేశ్, ఏఈఈ ఆర్డబ్ల్యూఎస్ (RWS) M.ప్రత్యవిధాన్, ఏఈ (MB) R.గణేశ్, ఏఈ ఎంబీ గ్రిడ్ M.సంతోష్, ఏఈ పీఆర్ (PR) M.సంతోష్, ఏఈ ఎలక్ట్రిసిటీ G.సతీశ్ మరియు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    5 hrs ago
  • ఎయిర్ పోర్ట్ భూ రైతులు, కూలీలకు తగిన నష్టపరిహారం చెల్లించాలి ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అనుకుంట ఎయిర్ పోర్ట్ భూ రైతులు బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ సందర్భంగా భూములు కోల్పోతున్న తమకు ప్రభుత్వం ఎకరాకు రూ. 6 కోట్ల నష్టపరిహారం చెల్లించాలన్నారు. భూమిపై ఆధారపడి ఉన్న కూలీలకు సైతం తగిన ఉపాధి కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
    1
    ఎయిర్ పోర్ట్ భూ రైతులు, కూలీలకు తగిన నష్టపరిహారం చెల్లించాలి
ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అనుకుంట ఎయిర్ పోర్ట్ భూ రైతులు బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ సందర్భంగా భూములు కోల్పోతున్న తమకు ప్రభుత్వం ఎకరాకు రూ. 6 కోట్ల నష్టపరిహారం చెల్లించాలన్నారు. భూమిపై ఆధారపడి ఉన్న కూలీలకు సైతం తగిన ఉపాధి కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • సొంత ఖర్చులతో పారిశుద్ధ్య పనులను నిర్వహించిన కౌన్సిలర్ లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ ఎగ్గడి జమున కుమార్ సొంత ఖర్చులతో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మున్సిపాలిటీలో బుధవారం కురిసిన భారీ వర్షాలకు వార్డులోని పలు కాలనీలలో వరద నీరు నిలిచిపోయింది. దీంతో స్థానికులు సమస్యను కౌన్సిలర్ దృష్టికి తీసుకువచ్చారు. కౌన్సిలర్ తన సొంత ఖర్చులతో సమస్య ఉన్న ప్రాంతాలలో జెసిబి సహాయంతో నీటిని తీసివేయించారు. కౌన్సిలర్ జమున కుమార్ను ప్రజలు అభినందించారు.
    1
    సొంత ఖర్చులతో పారిశుద్ధ్య పనులను నిర్వహించిన కౌన్సిలర్
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ ఎగ్గడి జమున కుమార్ సొంత ఖర్చులతో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మున్సిపాలిటీలో బుధవారం కురిసిన భారీ వర్షాలకు వార్డులోని పలు కాలనీలలో వరద నీరు నిలిచిపోయింది. దీంతో స్థానికులు సమస్యను కౌన్సిలర్ దృష్టికి తీసుకువచ్చారు. కౌన్సిలర్ తన సొంత ఖర్చులతో సమస్య ఉన్న ప్రాంతాలలో జెసిబి సహాయంతో నీటిని తీసివేయించారు. కౌన్సిలర్ జమున కుమార్ను ప్రజలు అభినందించారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • జన్నారం–మంచిర్యాల్ ప్రధాన రహదారిలో దొంగపెళ్లి సమీపంలో చెట్టు కూలి ట్రాఫిక్‌కు అంతరాయం జన్నారం–మంచిర్యాల్ ప్రధాన రహదారిలో దొంగపెళ్లి సమీపంలో భారీ వృక్షం రోడ్డుపై కూలిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనులపై వెళ్లే వారు ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ చెట్టును వెంటనే తొలగించి రాకపోకలు సజావుగా సాగేందుకు అటవీ శాఖ, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
    2
    జన్నారం–మంచిర్యాల్ ప్రధాన రహదారిలో దొంగపెళ్లి సమీపంలో చెట్టు కూలి ట్రాఫిక్‌కు అంతరాయం
జన్నారం–మంచిర్యాల్ ప్రధాన రహదారిలో దొంగపెళ్లి సమీపంలో భారీ వృక్షం రోడ్డుపై కూలిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనులపై వెళ్లే వారు ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ చెట్టును వెంటనే తొలగించి రాకపోకలు సజావుగా సాగేందుకు అటవీ శాఖ, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    16 hrs ago
  • వర్షపు ముప్పుపై మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తం లోతట్టు ప్రాంతాల్లో విస్తృత పర్యటన.. జేసీబీలు, మోటార్లతో వరద నీటి మళ్లింపు... మెట్ పల్లి జూలై:- 29. జగిత్యాల జిల్లా, మెట్‌ పల్లి పట్టణంలో బుధవారం కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మెట్‌పల్లి మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, స్థానిక కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, మురికి కాలువలు, వరద నీటి కాలువలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడా నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా జేసీబీలతో కాలువలను శుభ్రం చేయించి వరద నీటిని వేగంగా మళ్లించే చర్యలు చేపట్టారు. పట్టణంలోని 11వ వార్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో అధికారులు వెంటనే స్పందించారు. జేసీబీ సహాయంతో కాలువ ఏర్పాటు చేసి నీటిని మళ్లించగా, ఎత్తైన ప్రాంతం నుంచి చేరుతున్న నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపించి ముంపు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ వారిని సురక్షితంగా వారి ఇళ్లకు పంపించారు. అనంతరం పట్టణంలోని ఇతర లోతట్టు ప్రాంతాల్లో కూడా పర్యటించిన అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా మున్సిపల్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు.
    4
    వర్షపు ముప్పుపై మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తం

లోతట్టు ప్రాంతాల్లో విస్తృత పర్యటన.. జేసీబీలు, మోటార్లతో వరద నీటి మళ్లింపు...

మెట్ పల్లి జూలై:- 29. జగిత్యాల జిల్లా, మెట్‌ పల్లి పట్టణంలో బుధవారం కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మెట్‌పల్లి మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, స్థానిక కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, మురికి కాలువలు, వరద నీటి కాలువలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడా నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా జేసీబీలతో కాలువలను శుభ్రం చేయించి వరద నీటిని వేగంగా మళ్లించే చర్యలు చేపట్టారు. పట్టణంలోని 11వ వార్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో అధికారులు వెంటనే స్పందించారు. జేసీబీ సహాయంతో కాలువ ఏర్పాటు చేసి నీటిని మళ్లించగా, ఎత్తైన ప్రాంతం నుంచి చేరుతున్న నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపించి ముంపు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ వారిని సురక్షితంగా వారి ఇళ్లకు పంపించారు. అనంతరం పట్టణంలోని ఇతర లోతట్టు ప్రాంతాల్లో కూడా పర్యటించిన అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా మున్సిపల్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు.
    user_Mahammad Vaseem
    Mahammad Vaseem
    Milk delivery service మెట్‌పల్లి, జగిత్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • భక్తి పారవశ్యం.. బాబా అనుగ్రహం : లెండిగూడలో ఆధ్యాత్మిక శోభ సుప్రభాత వేళ.. ప్రశాంతమైన వాతావరణం.. ఆలయం నుంచి వినవస్తున్న మంత్రోచ్ఛారణలు.. ధూపదీపాల సువాసనల నడుమ శ్రీ శ్రీ శ్రీ శక్తీ బాబా సన్నిధి భక్తి పారవశ్యంతో మైమరిచిపోయింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ప్రశాంత గ్రామం లెండిగూడ (సోయం గూడ). అక్కడ వేంచేసియున్న శ్రీ శక్తి బాబా దేవస్థానం బుధవారం నాడు జనసందోహంతో పోటెత్తింది. పవిత్రమైన గురు పౌర్ణమి ని పురస్కరించుకుని ఆలయంలో వేడుకలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే బాబావారికి ఓం పూజ, గురు పూజ, నదీజలాలతో అభిషేకాలు, విశేష ఆరాధనలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పిల్లాపాపలతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాబావారిని దర్శించుకుని, తమ మనోభీష్టాలు నెరవేరాలని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు వారం జాతక పరిశీలన కార్యక్రమం చేపట్టారు. దైవ దర్శనం ముగించుకున్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా ప్రసాద వితరణ అన్నదానం గావించారు. రోజంతా 'ఓమ్ శ్రీ శక్తి బాబా' నామస్మరణతో లేండిగూడ మారుమోగిపోయింది.లెండిగూడ శ్రీ శక్తి బాబా క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. గత 21 సంవత్సరాలుగా ఇక్కడ ఆధ్యాత్మిక సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ప్రతి శని,సోమ,గురువారాల్లో ప్రత్యేక పూజలు జరగడం,పౌర్ణమి మరియు అమావాస్య తిథుల్లో శక్తివంతమైన హోమాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్ర క్షేత్రంలో అడుగుపెట్టి,నిష్టతో బాబాను వేడుకుంటే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి.. కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అనేది భక్తుల గాఢ విశ్వాసం. అందుకే కేవలం తెలంగాణ నుంచే కాక సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా ప్రతియేటా భక్తుల రాక పెరుగుతోంది. ఈ గురు పౌర్ణమి వేడుకలు విజయవంతంగా జరగడానికి ఆలయ కమిటీ సభ్యులు బాపూరావు, మాడవి ముకుంద్ రావు, ఉర్వేత బాపురావు, వెడ్మ నగ్నద్, గేడం భారత్, కోవా హిరాలాల్, గేడం లీలావతి రాము తదితరులు ముందుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసిన గ్రామస్తులకు, దాతలకు మరియు తరలివచ్చిన భక్తులందరికీ ఆలయ కమిటీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. భక్తిసంద్రాన్ని తలపించిన ఈ వేడుక ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయే ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చింది.
    1
    భక్తి పారవశ్యం.. బాబా అనుగ్రహం : లెండిగూడలో ఆధ్యాత్మిక శోభ
సుప్రభాత వేళ.. ప్రశాంతమైన వాతావరణం.. ఆలయం నుంచి వినవస్తున్న మంత్రోచ్ఛారణలు.. ధూపదీపాల సువాసనల నడుమ శ్రీ శ్రీ శ్రీ శక్తీ బాబా సన్నిధి భక్తి పారవశ్యంతో మైమరిచిపోయింది.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ప్రశాంత గ్రామం లెండిగూడ (సోయం గూడ). అక్కడ వేంచేసియున్న శ్రీ శక్తి బాబా దేవస్థానం బుధవారం నాడు జనసందోహంతో పోటెత్తింది. పవిత్రమైన గురు పౌర్ణమి ని పురస్కరించుకుని ఆలయంలో వేడుకలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే బాబావారికి ఓం పూజ, గురు పూజ, నదీజలాలతో అభిషేకాలు, విశేష ఆరాధనలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పిల్లాపాపలతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాబావారిని దర్శించుకుని, తమ మనోభీష్టాలు నెరవేరాలని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు వారం జాతక పరిశీలన కార్యక్రమం చేపట్టారు. దైవ దర్శనం ముగించుకున్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా ప్రసాద వితరణ అన్నదానం గావించారు. రోజంతా 'ఓమ్ శ్రీ శక్తి బాబా' నామస్మరణతో లేండిగూడ మారుమోగిపోయింది.లెండిగూడ శ్రీ శక్తి బాబా క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. గత 21 సంవత్సరాలుగా ఇక్కడ ఆధ్యాత్మిక సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ప్రతి శని,సోమ,గురువారాల్లో ప్రత్యేక పూజలు జరగడం,పౌర్ణమి మరియు అమావాస్య తిథుల్లో శక్తివంతమైన హోమాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్ర క్షేత్రంలో అడుగుపెట్టి,నిష్టతో బాబాను వేడుకుంటే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి.. కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అనేది భక్తుల గాఢ విశ్వాసం. అందుకే కేవలం తెలంగాణ నుంచే కాక సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా ప్రతియేటా భక్తుల రాక పెరుగుతోంది. ఈ గురు పౌర్ణమి వేడుకలు విజయవంతంగా జరగడానికి ఆలయ కమిటీ సభ్యులు బాపూరావు, మాడవి ముకుంద్ రావు, ఉర్వేత బాపురావు, వెడ్మ నగ్నద్, గేడం భారత్, కోవా హిరాలాల్, గేడం లీలావతి రాము తదితరులు ముందుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసిన గ్రామస్తులకు, దాతలకు మరియు తరలివచ్చిన భక్తులందరికీ ఆలయ కమిటీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. భక్తిసంద్రాన్ని తలపించిన ఈ వేడుక ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయే ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చింది.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    4 hrs ago
  • మావల గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వర్షాకాలంలో పశువులకు సోకే లంపి స్కిన్ (ముద్ద చర్మవ్యాధి) నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో పశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా పశుసంవర్ధక శాఖ అందిస్తున్న టీకాలను రైతులు, గొర్రెలు-మేకల కాపర్లు తప్పకుండా ఇప్పించుకోవాలని కోరారు. జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ రామారావు రాథోడ్ మాట్లాడుతూ, ఆవులకు, ఎడ్లకు సోకే లంపి స్కిన్ వ్యాధి నివారణకు రైతులు విధిగా టీకాలు వేయించాలని, అలాగే గొర్రెలు, మేకలకు పీపీఆర్ (PPR) టీకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు పశుసంవర్ధక శాఖ తరపున అందించిన ట్రేవిస్‌ను గ్రామపంచాయతీ ఆవరణలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రామారావు రాథోడ్ సమక్షంలో ప్రారంభించారు. వర్షం కారణంగా నేడు టీకాలు వేయించుకోలేని వారికి రేపు, ఎల్లుండి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జ్ పశువైద్య అధికారి డాక్టర్ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ పశువైద్య అధికారి డాక్టర్ సురేశ్, డాక్టర్ దూడ్రామ్ రాథోడ్, డాక్టర్ గజానంద్, గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, సిబ్బంది అమీన్, పశుపోషకులు, తదితరులు పాల్గొన్నారు.
    2
    మావల గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వర్షాకాలంలో పశువులకు సోకే లంపి స్కిన్ (ముద్ద చర్మవ్యాధి) నివారణ టీకాల కార్యక్రమాన్ని
నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో పశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా పశుసంవర్ధక శాఖ అందిస్తున్న టీకాలను రైతులు, గొర్రెలు-మేకల కాపర్లు తప్పకుండా ఇప్పించుకోవాలని కోరారు. జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ రామారావు రాథోడ్ మాట్లాడుతూ, ఆవులకు, ఎడ్లకు సోకే లంపి స్కిన్ వ్యాధి నివారణకు రైతులు విధిగా టీకాలు వేయించాలని, అలాగే గొర్రెలు, మేకలకు పీపీఆర్ (PPR) టీకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు పశుసంవర్ధక శాఖ తరపున అందించిన ట్రేవిస్‌ను గ్రామపంచాయతీ ఆవరణలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రామారావు రాథోడ్ సమక్షంలో ప్రారంభించారు. వర్షం కారణంగా నేడు టీకాలు వేయించుకోలేని వారికి రేపు, ఎల్లుండి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జ్ పశువైద్య అధికారి డాక్టర్ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ పశువైద్య అధికారి డాక్టర్ సురేశ్, డాక్టర్ దూడ్రామ్ రాథోడ్, డాక్టర్ గజానంద్, గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, సిబ్బంది అమీన్, పశుపోషకులు, తదితరులు పాల్గొన్నారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    8 hrs ago
  • ఆదిలాబాద్ రూరల్ మండలం: నిండుకుండలా మారిన పోచెర వాగు... ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పోచెర, జందాపూర్ గ్రామాల్లోని వాగులు, చెరువులు నిండుకుండల మారాయి. గత కొన్ని రోజులుగా మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి నీరు పుష్కలంగా చేరడంతో చెరువులు, వాగులలో భూగర్భ జలాలు ఒక్కసారిగా పెరిగినట్లు స్థానికులు తెలిపారు. దీంతో మత్స్య సంపద సైతం పెంపొందుతుందని పేర్కొన్నారు.
    1
    ఆదిలాబాద్ రూరల్ మండలం: నిండుకుండలా మారిన పోచెర వాగు...
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పోచెర, జందాపూర్ గ్రామాల్లోని వాగులు, చెరువులు నిండుకుండల మారాయి. గత కొన్ని రోజులుగా మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి నీరు పుష్కలంగా చేరడంతో చెరువులు, వాగులలో భూగర్భ జలాలు ఒక్కసారిగా పెరిగినట్లు స్థానికులు తెలిపారు. దీంతో మత్స్య సంపద సైతం పెంపొందుతుందని పేర్కొన్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • రాయికల్ సింగరావుపేట వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది వాగు దాటలేక రాకపోకలు నిలిచిపోయాయి జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని సింగరావుపేట వద్ద వాగు భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాగుపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు వాగు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. నీటి ప్రవాహం తగ్గే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
    1
    రాయికల్ సింగరావుపేట వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది
వాగు దాటలేక రాకపోకలు నిలిచిపోయాయి
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని సింగరావుపేట వద్ద వాగు భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాగుపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు వాగు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. నీటి ప్రవాహం తగ్గే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.