logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాయికల్ సింగరావుపేట వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది వాగు దాటలేక రాకపోకలు నిలిచిపోయాయి జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని సింగరావుపేట వద్ద వాగు భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాగుపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు వాగు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. నీటి ప్రవాహం తగ్గే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.

12 hrs ago
user_MD. YOUSUF ALI KHAN
MD. YOUSUF ALI KHAN
కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
12 hrs ago

రాయికల్ సింగరావుపేట వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది వాగు దాటలేక రాకపోకలు నిలిచిపోయాయి జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని సింగరావుపేట వద్ద వాగు భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాగుపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు వాగు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. నీటి ప్రవాహం తగ్గే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.

More news from తెలంగాణ and nearby areas
  • *జగిత్యాల పట్టణంలో దోశ సెంటర్ లో వడ లో బొద్దింక.. బాధితుని ఆందోళన యావర్ రోడ్డు శ్రీనివాస టాకీస్ ముందు గల దోశ టిఫిన్ సెంటర్ లో తన పిల్లలకు ఇడ్లీ, వడ టిఫిన్ తీసుకెళ్లిన వ్యక్తి., ఇంటికెళ్ళి పార్సిల్ విప్పి చూడగా వడలో బొద్దింక రోస్ట్ అయి కంపించింది, దీంతో దోశ టిఫిన్ సెంటర్ యజమానిని అడుగగా నిర్లక్ష్యం సమాధానం ఇవ్వడంతో టిఫిన్ సెంటర్ ముందు బాధితుని ఆందోళన
    1
    *జగిత్యాల పట్టణంలో దోశ సెంటర్ లో వడ లో బొద్దింక..  
బాధితుని ఆందోళన 


యావర్ రోడ్డు శ్రీనివాస టాకీస్ ముందు గల దోశ టిఫిన్ సెంటర్ లో తన పిల్లలకు ఇడ్లీ, వడ టిఫిన్ తీసుకెళ్లిన వ్యక్తి., 
ఇంటికెళ్ళి పార్సిల్ విప్పి చూడగా వడలో బొద్దింక రోస్ట్ అయి కంపించింది, దీంతో దోశ టిఫిన్ సెంటర్ యజమానిని అడుగగా నిర్లక్ష్యం సమాధానం ఇవ్వడంతో టిఫిన్ సెంటర్ ముందు బాధితుని ఆందోళన
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • వర్షపు ముప్పుపై మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తం లోతట్టు ప్రాంతాల్లో విస్తృత పర్యటన.. జేసీబీలు, మోటార్లతో వరద నీటి మళ్లింపు... మెట్ పల్లి జూలై:- 29. జగిత్యాల జిల్లా, మెట్‌ పల్లి పట్టణంలో బుధవారం కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మెట్‌పల్లి మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, స్థానిక కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, మురికి కాలువలు, వరద నీటి కాలువలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడా నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా జేసీబీలతో కాలువలను శుభ్రం చేయించి వరద నీటిని వేగంగా మళ్లించే చర్యలు చేపట్టారు. పట్టణంలోని 11వ వార్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో అధికారులు వెంటనే స్పందించారు. జేసీబీ సహాయంతో కాలువ ఏర్పాటు చేసి నీటిని మళ్లించగా, ఎత్తైన ప్రాంతం నుంచి చేరుతున్న నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపించి ముంపు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ వారిని సురక్షితంగా వారి ఇళ్లకు పంపించారు. అనంతరం పట్టణంలోని ఇతర లోతట్టు ప్రాంతాల్లో కూడా పర్యటించిన అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా మున్సిపల్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు.
    4
    వర్షపు ముప్పుపై మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తం

లోతట్టు ప్రాంతాల్లో విస్తృత పర్యటన.. జేసీబీలు, మోటార్లతో వరద నీటి మళ్లింపు...

మెట్ పల్లి జూలై:- 29. జగిత్యాల జిల్లా, మెట్‌ పల్లి పట్టణంలో బుధవారం కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మెట్‌పల్లి మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, స్థానిక కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, మురికి కాలువలు, వరద నీటి కాలువలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడా నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా జేసీబీలతో కాలువలను శుభ్రం చేయించి వరద నీటిని వేగంగా మళ్లించే చర్యలు చేపట్టారు. పట్టణంలోని 11వ వార్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో అధికారులు వెంటనే స్పందించారు. జేసీబీ సహాయంతో కాలువ ఏర్పాటు చేసి నీటిని మళ్లించగా, ఎత్తైన ప్రాంతం నుంచి చేరుతున్న నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపించి ముంపు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ వారిని సురక్షితంగా వారి ఇళ్లకు పంపించారు. అనంతరం పట్టణంలోని ఇతర లోతట్టు ప్రాంతాల్లో కూడా పర్యటించిన అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా మున్సిపల్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు.
    user_Mahammad Vaseem
    Mahammad Vaseem
    Milk delivery service మెట్‌పల్లి, జగిత్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • నిజామాబాదు జిల్లా : బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించి, అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు భీంగల్, వేల్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించిన ఆయన, సంబంధిత తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో SIR నమోదు ప్రక్రియ పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల నమోదు, మ్యాపింగ్, డిజిటలైజేషన్, ASD (డెత్, డబుల్, షిఫ్టెడ్) వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిందని వివరించగా, నమోదైన వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా నో మ్యాపింగ్,డెత్, డబుల్, షిఫ్టెడ్ (ASD) కేటగిరీల్లో నమోదైన ప్రతి కేసును పునఃపరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోరారు. నియోజకవర్గంలో ప్రస్తుతం సగటున 89 శాతం మేర ఓటర్ల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్న ఎమ్మెల్యే, ఈ శాతం కంటే తక్కువగా నమోదు జరిగిన పోలింగ్ బూత్‌ల జాబితాను సంబంధిత తహసీల్దార్లకు అందజేసినట్లు తెలిపారు. ఆయా బూత్‌లలో నమోదు శాతం ఎందుకు తగ్గిందో ప్రత్యేకంగా పరిశీలించి, మిగిలిన అర్హులైన ఓటర్లను గుర్తించి ఆగస్టు 3లోపు ఎన్యూమరేషన్ పత్రాలు అందజేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో ఇంకా నమోదుకాని అర్హులైన ఓటర్లను గుర్తించి, BLAలు, BLOలు, రెవెన్యూ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి వంద శాతం ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. "ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా నమోదు కాకుండా మిగలకూడదు. ప్రతి ఓటరి హక్కు పరిరక్షించబడాలి. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం" అని ఆయన అన్నారు.
    1
    నిజామాబాదు జిల్లా :
బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించి, అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే  వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు 

భీంగల్, వేల్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించిన ఆయన, సంబంధిత తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో SIR నమోదు ప్రక్రియ పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల నమోదు, మ్యాపింగ్, డిజిటలైజేషన్, ASD (డెత్, డబుల్, షిఫ్టెడ్) వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిందని వివరించగా, నమోదైన వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా నో మ్యాపింగ్,డెత్, డబుల్, షిఫ్టెడ్ (ASD) కేటగిరీల్లో నమోదైన ప్రతి కేసును పునఃపరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోరారు.

నియోజకవర్గంలో ప్రస్తుతం సగటున 89 శాతం మేర ఓటర్ల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్న ఎమ్మెల్యే, ఈ శాతం కంటే తక్కువగా నమోదు జరిగిన పోలింగ్ బూత్‌ల జాబితాను సంబంధిత తహసీల్దార్లకు అందజేసినట్లు తెలిపారు. ఆయా బూత్‌లలో నమోదు శాతం ఎందుకు తగ్గిందో ప్రత్యేకంగా పరిశీలించి, మిగిలిన అర్హులైన ఓటర్లను గుర్తించి ఆగస్టు 3లోపు ఎన్యూమరేషన్ పత్రాలు అందజేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.



మండల కేంద్రాలు, గ్రామాల్లో ఇంకా నమోదుకాని అర్హులైన ఓటర్లను గుర్తించి, BLAలు, BLOలు, రెవెన్యూ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి వంద శాతం ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. "ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా నమోదు కాకుండా మిగలకూడదు. ప్రతి ఓటరి హక్కు పరిరక్షించబడాలి. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం" అని ఆయన అన్నారు.
    user_Boss
    Boss
    భీమ్‌గల్, నిజామాబాద్, తెలంగాణ•
    8 min ago
  • గీతాశ్రమంలో ఘనంగా భజన కార్యక్రమం, ఆధ్యాత్మిక కీర్తనల ఆలాపన జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామంలో ఉన్న గీతాశ్రమంలో భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని గీతాశ్రమంలో బుధవారం చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 9 గంటలకు ఆశ్రమ నిర్వాహకులు, గ్రామస్తులు భజన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గురువులను గుర్తు చేసుకుంటూ భజన కీర్తనలను ఆలపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మౌన స్వామి, ప్రజలు పాల్గొన్నారు.
    1
    గీతాశ్రమంలో ఘనంగా భజన కార్యక్రమం, ఆధ్యాత్మిక కీర్తనల ఆలాపన
జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామంలో ఉన్న గీతాశ్రమంలో భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని గీతాశ్రమంలో బుధవారం చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 9 గంటలకు ఆశ్రమ నిర్వాహకులు, గ్రామస్తులు భజన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గురువులను గుర్తు చేసుకుంటూ భజన కీర్తనలను ఆలపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మౌన స్వామి, ప్రజలు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • వరుణయాగ ఏర్పాట్లను పరిశీలించిన గౌరవ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లోకకళ్యాణార్థం, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పిస్తూ మూడు రోజులపాటు నిర్వహించనున్న వరుణయాగం ఏర్పాట్లను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 30వ తేదీ గురువారం నుంచి ఆగస్టు 1వ తేదీ శనివారం వరకు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సత్వర సద్యఃసువృష్టి (సకాల వర్షప్రాప్తి) కోసం ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణయాగం, వరుణ పర్జన్య జపానుష్ఠానాలు, హవనాలు, శ్రీ భీమేశ్వర స్వామివారికి సంతత ధారాభిషేకం నిర్వహించనున్నారు.జూలై 30వ తేదీ గురువారం ఉదయం స్వస్తి పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణం, ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణ జపాలు, సంతత ధారాభిషేకం, వరుణయాగ హోమం, జపానుష్ఠానాలు నిర్వహించబడనున్నాయి. అదేవిధంగా దేవస్థానం పరివార, అనుబంధ ఆలయాల్లో మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, విరాటపర్వ పారాయణాలు, ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే వరుణయాగ మహోత్సవాలకు హాజరయ్యే భక్తులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు.అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో రమాదేవి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని కోడెలకు పచ్చిగడ్డి, కోతులకు అరటిపండ్లు తినిపించారు. రానున్న మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో నవీన్ కుమార్, ఏఈఓలు జయకుమారి, నాగుల మహేష్, లక్ష్మణరావు, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, పెరిక శ్రీనివాస్, శివసాయి సీనియర్ అసిస్టెంట్ వంశీ మోహన్ శర్మ నక్క తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
    1
    వరుణయాగ ఏర్పాట్లను పరిశీలించిన గౌరవ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లోకకళ్యాణార్థం, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పిస్తూ మూడు రోజులపాటు నిర్వహించనున్న వరుణయాగం ఏర్పాట్లను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 30వ తేదీ గురువారం నుంచి ఆగస్టు 1వ తేదీ శనివారం వరకు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సత్వర సద్యఃసువృష్టి (సకాల వర్షప్రాప్తి) కోసం ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణయాగం, వరుణ పర్జన్య జపానుష్ఠానాలు, హవనాలు, శ్రీ భీమేశ్వర స్వామివారికి సంతత ధారాభిషేకం నిర్వహించనున్నారు.జూలై 30వ తేదీ గురువారం ఉదయం స్వస్తి పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణం, ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణ జపాలు, సంతత ధారాభిషేకం, వరుణయాగ హోమం, జపానుష్ఠానాలు నిర్వహించబడనున్నాయి. అదేవిధంగా దేవస్థానం పరివార, అనుబంధ ఆలయాల్లో మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, విరాటపర్వ పారాయణాలు, ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రేపటి నుంచి ప్రారంభమయ్యే వరుణయాగ మహోత్సవాలకు హాజరయ్యే భక్తులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు.అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో రమాదేవి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.
అలాగే ఆలయ ప్రాంగణంలోని కోడెలకు పచ్చిగడ్డి, కోతులకు అరటిపండ్లు తినిపించారు. రానున్న మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో డీఈవో నవీన్ కుమార్, ఏఈఓలు జయకుమారి, నాగుల మహేష్, లక్ష్మణరావు, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, పెరిక శ్రీనివాస్, శివసాయి సీనియర్ అసిస్టెంట్ వంశీ మోహన్ శర్మ  నక్క తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ గురువారం సిరిసిల్ల, వేములవాడ పర్యటన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా & BC సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. *30.07.2026 గురువారం కార్యక్రమ వివరాలు:* *ఉదయం 6.30 గం:* హైదరాబాద్ నుండి బయలుదేరడం *ఉదయం 9.00 గం:* వేములవాడ చేరుకొని శ్రీ రాజ రాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం. అనంతరం గుడి చెరువు ట్యాంక్ బండ్ పార్క్ ను ప్రారంభించడం, తిప్పాపూర్ బస్ స్టాండ్ పునరుద్ధరణకు శంకుస్థాపన చేయడం *ఉదయం 10.30 గం:* సిరిసిల్ల చేరుకొని రాగుడు బైపాస్ జంక్షన్, రాగుడు జంక్షన్ వద్ద బస్ షెల్టర్ ను ప్రారంభించడం. IDOC లో El Nino యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశంలో పాల్గొనడం *మధ్యాహ్నం 12.30 గం:* సిరిసిల్ల నుండి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం ఈ మేరకు వ్యవసాయ శాఖ OSD V. శ్రీధర్ టూర్ ప్రోగ్రాం నెం. 64/M/2026 ద్వారా జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
    1
    మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ గురువారం సిరిసిల్ల, వేములవాడ పర్యటన
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు, రవాణా & BC సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు.
*30.07.2026 గురువారం కార్యక్రమ వివరాలు:*
*ఉదయం 6.30 గం:* హైదరాబాద్ నుండి బయలుదేరడం  
*ఉదయం 9.00 గం:* వేములవాడ చేరుకొని శ్రీ రాజ రాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం. అనంతరం గుడి చెరువు ట్యాంక్ బండ్ పార్క్ ను ప్రారంభించడం, తిప్పాపూర్ బస్ స్టాండ్ పునరుద్ధరణకు శంకుస్థాపన చేయడం  
*ఉదయం 10.30 గం:* సిరిసిల్ల చేరుకొని రాగుడు బైపాస్ జంక్షన్, రాగుడు జంక్షన్ వద్ద బస్ షెల్టర్ ను ప్రారంభించడం. IDOC లో El Nino యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశంలో పాల్గొనడం  
*మధ్యాహ్నం 12.30 గం:* సిరిసిల్ల నుండి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం
ఈ మేరకు వ్యవసాయ శాఖ OSD V. శ్రీధర్ టూర్ ప్రోగ్రాం నెం. 64/M/2026 ద్వారా జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
    user_శ్రీధర్ సూర్య రిపోటర్
    శ్రీధర్ సూర్య రిపోటర్
    చొప్పదండి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • లక్షెట్టిపేట, కరీంనగర్ ఎక్స్‌రోడ్ చెరువును తలపించిన రహదారి.. ట్రాఫిక్‌కు అంతరాయం లక్షెట్టిపేట పట్టణంలోని కరీంనగర్ ఎక్స్‌రోడ్ వద్ద కురిసిన వర్షానికి రహదారి పూర్తిగా నీటమునిగింది. వర్షపు నీరు భారీగా నిల్వ ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి లోతు అంచనా వేయలేక పలువురు భయాందోళనల మధ్య ప్రయాణిస్తున్నారు. వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
    1
    లక్షెట్టిపేట, కరీంనగర్ ఎక్స్‌రోడ్ చెరువును తలపించిన రహదారి.. ట్రాఫిక్‌కు అంతరాయం
లక్షెట్టిపేట పట్టణంలోని కరీంనగర్ ఎక్స్‌రోడ్ వద్ద కురిసిన వర్షానికి రహదారి పూర్తిగా నీటమునిగింది. వర్షపు నీరు భారీగా నిల్వ ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి లోతు అంచనా వేయలేక పలువురు భయాందోళనల మధ్య ప్రయాణిస్తున్నారు. వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.