Shuru
Apke Nagar Ki App…
ఎయిర్ పోర్ట్ భూ రైతులు, కూలీలకు తగిన నష్టపరిహారం చెల్లించాలి ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అనుకుంట ఎయిర్ పోర్ట్ భూ రైతులు బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ సందర్భంగా భూములు కోల్పోతున్న తమకు ప్రభుత్వం ఎకరాకు రూ. 6 కోట్ల నష్టపరిహారం చెల్లించాలన్నారు. భూమిపై ఆధారపడి ఉన్న కూలీలకు సైతం తగిన ఉపాధి కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
Mallaiah Potta
ఎయిర్ పోర్ట్ భూ రైతులు, కూలీలకు తగిన నష్టపరిహారం చెల్లించాలి ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అనుకుంట ఎయిర్ పోర్ట్ భూ రైతులు బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ సందర్భంగా భూములు కోల్పోతున్న తమకు ప్రభుత్వం ఎకరాకు రూ. 6 కోట్ల నష్టపరిహారం చెల్లించాలన్నారు. భూమిపై ఆధారపడి ఉన్న కూలీలకు సైతం తగిన ఉపాధి కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
More news from Telangana and nearby areas
- 29 जुलाई 2026: भारतीय रेलवे के इतिहास में एक स्वर्णिम अध्याय!🚆🇮🇳 *चेन्नई में निर्मित 'कार्गो वंदे भारत' ट्रेन का 145 किमी/घंटा की रफ्तार से सफल ट्रायल सशक्त और आत्मनिर्भर भारत की एक नई पहचान बनकर उभरा है।* यह ऐतिहासिक पहल न केवल रेलवे की माल ढुलाई क्षमता और राजस्व को नई ऊंचाइयों पर ले जाएगी, बल्कि 'मेक इन इंडिया' के संकल्प को जमीनी स्तर पर और अधिक मजबूत करेगी। 📈1
- ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం : ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి ఆదిలాబాద్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా,ప్రత్యేక అధికారి,డీపీఓ రమేష్ గుడిపల్లితో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఎంపీడీవో కె.వంశీకృష్ణ,తహసీల్దార్ గోవింద్ భూక్య,ఎంఏవో నగేష్‌రెడ్డి,వివిధ శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- గుడిహత్నూర్: కొలహారి లో ఘనంగా గురు పౌర్ణిమ వేడుకలు.... గుడిహత్నూరు మండలంలోని కొలహారి గ్రామ హనుమాన్ ఆలయంలో గురుపౌర్ణిమ వేడుకలను బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంత్ శ్రీ ఏక్ నాథ్ నాందేవ్ మహారాజ్ భక్తులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తి ప్రపత్తులను చాటారు. నాందేవ్ మహారాజ్ చూపించిన మార్గంలో ముందుకు వెళ్లి ఆయన ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు.1
- గీతాశ్రమంలో ఘనంగా భజన కార్యక్రమం, ఆధ్యాత్మిక కీర్తనల ఆలాపన జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామంలో ఉన్న గీతాశ్రమంలో భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని గీతాశ్రమంలో బుధవారం చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 9 గంటలకు ఆశ్రమ నిర్వాహకులు, గ్రామస్తులు భజన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గురువులను గుర్తు చేసుకుంటూ భజన కీర్తనలను ఆలపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మౌన స్వామి, ప్రజలు పాల్గొన్నారు.1
- భారీ వర్షాలు – ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు అప్రమత్తత సూచనలు కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు వెలువడ్డాయి.ఆసిఫాబాద్‌లోని తుంపెల్లి వాగు, గుండి వాగులను పోలీసు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. వరద తగ్గిన తర్వాతనే ప్రజలను దాటేందుకు అనుమతించాలని, వరద అధికంగా ఉన్న సమయంలో రాకపోకలు నిలిపివేయాలని, భద్రత సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.రానున్న నాలుగు రోజుల పాటు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాగులు, వంకలు, చెరువులు, నదులు, కల్వర్టులు, లో-లెవల్ వంతెనల వద్దకు వెళ్లకూడదు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రయాణాలు నిషేధం. వరద ప్రభావిత ప్రాంతాలు, లో-లెవల్ వంతెనల వద్ద పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది.అత్యవసర పరిస్థితుల్లో డయల్–100కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి. ప్రజలకు పోలీసు శాఖ సూచనలు: ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి దిగవద్దు చేపల వేట కోసం వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లవద్దు నీటిలో మునిగిన కల్వర్టులు, వంతెనలు, వాగులను దాటే ప్రయత్నం చేయవద్దు పశువులను మేతకు తీసుకెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన తీగలకు దూరంగా ఉండి అధికారులకు సమాచారం ఇవ్వాలి వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు నీటి ప్రవాహాలు, విద్యుత్ తీగల పట్ల అప్రమత్తత అవసరం శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించవద్దు అత్యవసరం కాని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మేలు వాహనాల్లో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దు సెల్ఫీలు, రీల్స్ కోసం వరద ప్రాంతాలు, వాగులు, జలపాతాల వద్దకు వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టవద్దు పోలీసు, రెవెన్యూ శాఖల సూచనలను జిల్లా ప్రజలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.3
- *జగిత్యాల పట్టణంలో దోశ సెంటర్ లో వడ లో బొద్దింక.. బాధితుని ఆందోళన యావర్ రోడ్డు శ్రీనివాస టాకీస్ ముందు గల దోశ టిఫిన్ సెంటర్ లో తన పిల్లలకు ఇడ్లీ, వడ టిఫిన్ తీసుకెళ్లిన వ్యక్తి., ఇంటికెళ్ళి పార్సిల్ విప్పి చూడగా వడలో బొద్దింక రోస్ట్ అయి కంపించింది, దీంతో దోశ టిఫిన్ సెంటర్ యజమానిని అడుగగా నిర్లక్ష్యం సమాధానం ఇవ్వడంతో టిఫిన్ సెంటర్ ముందు బాధితుని ఆందోళన1
- పశువులకు టీకాలు వేయించి.. పాడి రైతులకు భరోసానిచ్చిన శ్రీకాంత్‌రెడ్డి వర్షాకాలంలో పశువులకు సోకే లంపి స్కిన్ ముద్ద చర్మవ్యాధి నివారణకు మావల గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టీకాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి హాజరై రైతులు తప్పనిసరిగా పశువులకు టీకాలు వేయించుకోవాలని సూచించారు. జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ రామారావు రాథోడ్ మాట్లాడుతూ.. ఆవులు, ఎడ్లకు లంపి స్కిన్ నివారణ టీకాలు, గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాలు వేయించుకోవాలని కోరారు. వర్షం కారణంగా టీకాలు వేయించుకోలేని వారికి మరో రెండు రోజులు అవకాశం కల్పిస్తున్నట్లు ఇన్‌చార్జ్ పశువైద్య అధికారి డాక్టర్ సురేష్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, పశువైద్య సిబ్బంది,పశుపోషకులు పాల్గొన్నారు.1
- లక్షెట్టిపేట, కరీంనగర్ ఎక్స్‌రోడ్ చెరువును తలపించిన రహదారి.. ట్రాఫిక్‌కు అంతరాయం లక్షెట్టిపేట పట్టణంలోని కరీంనగర్ ఎక్స్‌రోడ్ వద్ద కురిసిన వర్షానికి రహదారి పూర్తిగా నీటమునిగింది. వర్షపు నీరు భారీగా నిల్వ ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి లోతు అంచనా వేయలేక పలువురు భయాందోళనల మధ్య ప్రయాణిస్తున్నారు. వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.1