logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఫ్యూచర్ సిటీకి పెట్టుబడును రావడంలేదని అక్రోషంలో రేవంత్ సీఎం గారు పొలిటికల్ క్లియరెన్స్ అంటే రాజకీయ కుట్ర కాదు 30 నెలల నుండి తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు గుర్తులేదు:BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ *పత్రికా ప్రకటన* 26/08/2026 తెలంగాణ భవన్,హైదరాబాద్ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,బిఆర్ఎస్. *ఫ్యూచర్ సిటీకి పెట్టుబడులు రావడంలేదని ఆక్రోశంలో రేవంత్* *సిఎం గారు పొలిటికల్ క్లియరెన్స్ అంటే రాజకీయ కుట్ర కాదు.* *30 నెలల నుండి తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు గుర్తు లేదు?* జెట్ లాగ్ లేకుండానే సెక్రటేరియట్ కు వచ్చారు. ఇంటికి వెళ్లకుండానే నేరుగా సెక్రటేరియట్ లో ప్రెస్ మీట్ ప్రజలకు నిజాలు చెప్పకుండా,అటెన్షన్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. 30 నెలల పాలన తర్వాత రేవంత్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి అని, తెలంగాణ ఆత్మగౌరవం గురించి గుర్తుకు వచ్చింది. కేబినెట్ లోనే మంత్రుల మధ్య సయోధ్య లేదని అర్థమైంది. ఉత్తమ్,భట్టి గారు మీడియా సమావేశం ప్రారంభమైన 10 నిమిషాలకు వచ్చి కూర్చున్నారు. వారికి తెలియదా ప్రెస్ మీట్ గురించి. పొలిటికల్ క్లియరెన్స్ ఈస్ డిక్లయిన్డ్ అని వార్త వచ్చింది, నేనేమో తెలంగాణ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించాలని చూశానని అన్నారు. రేవంత్ రెడ్డి మరోసారి పప్పులో కాలేసి, తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెడుతున్నారు. బ్యూరోక్రాట్స్ కి కూడా పొలిటికల్ క్లియరెన్స్ ఉంటది. విదేశాంగ శాఖ నుండి ఖచ్చితంగా అనుమతి పొందాలి. దానినే పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చారు. నేను ఐకరాజ్యసమితిలో పని చేసినపుడు కూడా పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చారు. ఏ అధికారి అయినా విదేశాంగ విధానం, విదేశీ మంత్రిత్వ శాఖ విధివిధానాల ఆధారంగా అనుమతి పొందాల్సిందే. విదేశాలకు ప్రభుత్వం తరపున వెళ్లినపుడు వారికి విదేశాంగ శాఖ , బ్లూ పాస్ పోర్ట్ తీసుకొని, వైట్ డిప్లోమాటిక్ పాస్ పోర్ట్ ఇస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ టర్నల్ అఫేర్స్ లో 15 రోజుల ముందే దానికి అప్లై చేసుకోవాలి. ఏ ఏ కార్యక్రమాల కోసం వెళ్తున్నారో అన్ని వివరాలు ఇస్తే... విదేశాంగ విధాన శాఖ మన దేశానికి, ఇతర దేశాలకు ఉండే సంబంధాలు ఇతర అన్ని రకాల అవకాశాలను చూసి క్లియరెన్స్ ఇస్తారు. ఎవరిని కలుస్తాం. ఎందుకు కలుస్తాం.. దాని వల్ల కలిగే ప్రయోజనం గురించి కూడా చెప్పాలి. కేటి ఆర్ , హరీష్ రావు వెళ్లడానికి క్లియరెన్స్ ఇచ్చారు మాకు ఇవ్వలేదు అంటున్నారు. కేటిఆర్ హరీష్ ఇపుడు మంత్రులు కాదు, ముఖ్యమంత్రి కాదు. ఆయన ముఖ్యమంత్రి అయితే మీ లాగా చేయరు. ఆర్గనైజ్డ్ గా చేస్తారు. గతంలో మూడు నెలల ముందే అన్ని అనుమతులు తీసుకునేవాడు. ముఖ్యమంత్రి అమెరికా వెళ్లడం కోసం 5 రోజుల ముందే అప్లై చేశారు. ఇంగ్లండ్ కు అనుమతి వచ్చింది కాని అమెరికాకు రాలే. నిన్న మీరు విదేశాంఖ శాఖకు అప్లై చేసిన డాక్యెమెంట్స్ చూపిస్తారు అనుకున్నాం. పొలిటికల్ అంటే రాజకీయం కాదు.. విదేశాంగ శాఖ అనుమతి. ఎవరెవరిని కలుస్తారని చెప్పారో వివరాలు చూపిస్తారనుకున్నాం. అమెరికాలో మీరేమైనా చేయకూడని పనులు చేస్తారనే అనుమానంతోనే విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదు. ఇన్ అప్రోప్రియేట్ అనే పదం గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అమెరికా లో మీరు కలవాలనుకున్న స్ట్రాటజిస్ట్ఉలు , స్టేక్ హోల్డర్లు ఎవరు? మాయా ట్యూడర్ ప్రొఫెసర్ ను కలుస్తానని ముందే చెప్పారా? ప్రజల సొమ్ముతో వెళ్లినప్పుడు ఖచ్చితంగా విదేశాంగ శాఖకు అన్ని వివరాలు చెప్పాలి. ఇన్ అప్రొప్రియేట్ అంటే ఏంటో బిజెపి కూడా చెప్పడం లేదు. బిజేపి కాంగ్రెస్ పార్టీలు కావాలని గేమ్ ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏం అప్లై చేశారో చెప్పడం లేదు. తెలంగాణ ప్రజల చెవులలో పూలు పెడుతున్నారు. లండన్ యూనివర్సిటీలతో ఏం చర్చలు జరిపారో ప్రజలకు చెప్పాలి. ఎలాంటి అగ్రిమెంట్,ఏమని ఎంఓయూలు చేసుకున్నారో ప్రజలకు చెప్పాలి. 2012 అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదు. గోడావరి, కృష్ణ జలాల్లో, బనకచర్ల లో అన్యాయం జరిగితే తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు గుర్తు రాలేదు? రేవంత్ రెడ్డికి. ఆదిత్యనాథ్ దాస్ అడ్వయిజర్ గా వచ్చినపుడు ఆత్మగౌరవం ఏమైంది. తేజస్వి సూర్య తెలంగాణను పార్లమెంట్ లో అవమానిస్తే ముఖ్యమంత్రి,ఎంపీలకు తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు గుర్తు రాలేదు. ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి ఆత్మ ఉన్నది. ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ ఎంటర్ ప్రైజెస్ గా చేయాలని ఉంది. ఫ్యూచర్ సిటీని జాక్ లు పెట్ఠి లేపాలని ఉంది. అందుకే అమెరికా, లండన్ నుండి యూనివర్సిటీలను తెచ్చి కేవలం ఫ్యూచర్ సిటీలో పెట్టాలని చూస్తున్నాడు. తెలంగాణలో ఉన్న వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్,మహబూబ్ నగర్, నల్గొండ ఖమ్మం జిల్లాల కి వద్దంట. నేను కూడా హార్వర్డ్ లో చదువుకున్న .. కేటిఆర్ ,హరీష్ రావు పిల్లలు చదువుకున్నరు. కేటి శఆర్ అమెరికాలో చదివితే చిప్పలు కడిగారని అన్నరు కదా.. మరి రేవంత్ హార్వర్డ్ లో చదివిన అని చెబుతున్నారు.. అయితే మీరు కూడా చిప్పలు కడిగినట్టేనా? అసలు యూనివర్సీటీలు ఆ దేశాలను దాటి వస్తాయా? ఇతర దేశాల్లో క్యాంపస్ లు ఏర్పాటు చేస్తాయా నిజాలు చెప్పండి. నేను కూడా హార్వర్డ్ లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో చదువుకున్న భారత్ నుండి ఆనాడు ముగ్గురు సెలెక్ట్ అయ్యారు అందులో నేను. ప్రభుత్వ సొమ్ముతోనే వెళ్లి చదువుకున్నాను. 385 ఏళ్ల చరిత్రలో హార్వర్డ్ యూనివర్సిటీకి ఓకే క్యాంపస్ ఉంది. మసాచుసెట్స్ యూనివర్సిటీ ఇతర దేశాల్లో ఎక్కడా మరో క్యాంపస్ పెట్టమని ప్రకటించింది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా తమ క్యాంపస్ లండన్ లో మాత్రమే ఉంటుందని చెప్పారు. 900 ఏళ్ల చరిత్ర ఉన్న ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలో ఎక్కడా రెండవ క్యాంపస్ పెట్టము అని ప్రకటించారు. మీరు చెప్పిన యూనివర్సిటీలు ఏవి కూడా ఇతర ప్రాంతాల్లో క్యాంపస్ లు పెట్టరు. మీరేమో డైరెక్ట్ అమెరికా ,లండన్ నుండి ఫ్యూచర్ సిటీలో లాండ్ చేయాలని చూస్తున్నారు. భారతదేశంలో తెలంగాణలో ఇపుడు మనకు వాన కాలం... కానీ ఇపుడు అమెరికాలో ఎండాకాలం. అక్కడ యూనివర్సిటీలు వెకేషన్ లో ఉన్నాయి.ఇపుడు ప్రొఫెసర్లు ఎక్కడ ఉంటరు. బిజేపి కాంగ్రెస్ కలిసి తెలంగాణకు ద్రోహమే చేశాయి. తెలంగాణకు మణిరత్నం లాంటి ఉస్మానియాకు ఆగస్టు 25 నెలలో వెయ్యి కోట్లు ఇస్తామన్నారు. డిసెంబర్ 10న జీవో విడుదల చేశారు. మార్చి 2026 నాడు విసి కూడా థాంక్స్ చెప్పారు. మే 26 నాడు ఒక్క పైసా రాలేదు అన్నడు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ కాశీం గారు. నిజంగా ఎస్సీ ఎస్టీ బిసి వర్గాలకు న్యాయం చేయాలనుకుంటే ఓయూ, కేయూ, ఎంజియూ, పియు యేనివర్సిటీలను అభివృద్ధి చేయండి. 111 కోట్లతో హెలికాప్టర్, సిఎం రమేష్ కి వేల కోట్ల బడ్జెట్ ఇచ్చి రోడ్లు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి కానీ,యూనివర్సిటీలకు ఇవ్వడానికి డబ్బులు ఉండవా? మన యూనివర్సిటీ ప్రొఫెసర్లను ఇతర దేశాలకు పంపండి. ఆ యూనివర్సిటీలల్లో పరిశోధన చేసి రమ్మనండి. మన యూనివర్సిటీలో అభివృద్ధి చేయించమని చెప్పండి. చైనా దేశం ఇతర దేశాల క్యాంపస్ లు కావాలని చెప్పలేదు. ముందు చైనా యూనివర్సిటీలలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పింది సౌత్ కొరియా దానంతట అదే అభివృద్ధి చెందింది. ఇతర దేశాల యూనివర్సిటీలు కావాలని అడగలేదు. తెలంగాణ ఆత్మగౌరవం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజే దెబ్బ తిన్నది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినపుడే ఆత్మగౌరవానికి దెబ్బ. ఫ్యూచర్ సిటీకి ఫారిన్ యూనివర్సిటీ రానందుకే ఆక్రోశంతో రాజకీయ కుట్రతో చేస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. బిఆర్ఎస్ నాయకులపై అబండాలు వేయకండి. రోహన్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఫయీం ఖురేషి ఎలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారో అందుకే అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకుండీ ఆపారు. అధికారులను మాత్రం పంపారు. అమెరికా టూర్ షెడ్యూల్ విడుదల చేయండి. లేదా బిజేపి అయినా చెప్పాలి. విదేశాంగ విధానానికి భంగం కలిగితేనే పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వరు. కేటిఆర్ గారు ఎన్నో సార్లు విదేశాలకు వెళ్లారు. కాని ఎపుడు ఇలా జరగలేదు. షెల్ కంపెనీల కోసం రేవంత్ రెడ్డి వెళ్లాలనుకున్నారు. ప్రభుత్వ సొమ్ముతో వెళ్లి ప్రైవేట్ కార్యక్రమాలు చేస్తారా? ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్ మీట్ అండ్ గ్రీట్ అనే కార్యక్రమం ప్రజల సొమ్ముతో ఎలా చేస్తారు.? ప్రధాని మోడీని బడే భాయ్ అన్నరు బిజేపి నాయకులను పోక్సో కేసుల నుండి కాపాడింది మీరే. బిజేపి నాయకుల మీద ఎలాంటి కేసులు కాకుండా కాపాడారు. జనసేన ఎంపి కొడుకు యాక్సిడెంట్ చేస్తే కేసులు కాకుండా కాపాడింది మీరే. ఇపుడేమో తెలంగాణ ఆత్మగౌరవం,రాజకీయ కుట్ర అంటున్నారు. ఆకునూరి మురళి కమీషన్ రిపోర్టులో ఎక్కడా హార్వర్డ్ లో మీరు నేర్చుకున్న విషయాల గురించి లేదు. ఫారిన్ యూనివర్సిటీలో ఇక్కడికి రావాలంటే యూజిసి అప్రూవల్ కావాలి. యూజీసి అనుమతి రావాలంటే అప్లై చేసుకున్న తర్వాత కనీసం రెండు మూడేళ్లు పడుతది. గాలి మాటలు చెప్పొద్దు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. బిజేపి పాలనలో పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయి. పదవ తరగతి పేపర్లు కూడా లీక్ చేశారు. బిజేపి అధ్యక్షులు రాం చందర్ రావు డ్రామాలు చేయొద్దు. పోక్సో కేసు విషయంలో ఎందుకు మాట్లాడలేదు. సంగప్ప విచారణకు హాజరు కాలేదు, వాల్ల పార్టీ ఎంపిని కనీసం ప్రశ్నించలేదు. రాంచందర్ రావు ఎందుకు అడగలేదు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కోసం ఏం అప్లై చేసుకున్నారు, ఎందుకు అనుమతి నిరాకరించారని బిజేపి చెప్పవచ్చు కదా. ఎందుకు చెప్పడం లేదు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు

19 hrs ago
user_Golem Venkatesham Patel
Golem Venkatesham Patel
Salesperson కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
19 hrs ago
bd1f08a1-0b4d-4e86-a3f3-0a36df263203

More news from తెలంగాణ and nearby areas
  • ఆనాడు ఓట్ల కోసమే వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పాల్వాయి ఎమ్మెల్యే గెలిచాక అభివృద్ధికి తూట్లు.... అభివృద్ధి పట్టించుకోని సిర్పూర్ ఎమ్మెల్యే ఆనాడు ఓట్ల కోసమే వారి నాట్లు వేసిన పాల్వాయి ఎమ్మెల్యే కాకముందు వరి నాట్లు ఎమ్మెల్యే గెలిచాక అభివృద్ధికి తూట్లు .... ఎమ్మెల్యే గెలవక ముందు హరీష్ బాబు మీరు ఎక్కడ బురద ఉంటే అక్కడ వరి నాట్లు వేశారు,,మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితి మారుతుంది అనుకుంటే గిరివెల్లి ప్రధాన రోడ్డు పైన BRS నాయకులు వరి నాట్లు వేస్తున్నారు అభివృద్ధి ఎక్కడ ఉంది గిరివెల్లి రోడ్డు సమస్యపై BRS నిరసన ఈ రోజు దహిగాం మండలం గిరివెల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పూర్తిగా బురదమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ BRS నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బురదమయమైన రోడ్డులోనే వరి నాట్లు వేసి తమ నిరసనను వినూత్నంగా వ్యక్తం చేశారు. గేర్రె–గిరివెల్లి నుంచి మొట్లగూడ–రాంపూర్ వరకు రహదారిని వెంటనే మంజూరు చేసి, శాశ్వతంగా నిర్మించాలని MLA గారు, MLC గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని BRS నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిన ఈ రహదారి సమస్యను ఇకనైనా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో BRS మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    2
    ఆనాడు ఓట్ల కోసమే వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పాల్వాయి 
ఎమ్మెల్యే గెలిచాక అభివృద్ధికి తూట్లు....
అభివృద్ధి పట్టించుకోని సిర్పూర్ ఎమ్మెల్యే
ఆనాడు ఓట్ల కోసమే వారి నాట్లు వేసిన పాల్వాయి 
ఎమ్మెల్యే కాకముందు వరి నాట్లు ఎమ్మెల్యే గెలిచాక అభివృద్ధికి తూట్లు ....
ఎమ్మెల్యే గెలవక ముందు  హరీష్ బాబు మీరు ఎక్కడ బురద ఉంటే అక్కడ వరి నాట్లు వేశారు,,మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితి మారుతుంది అనుకుంటే 
గిరివెల్లి ప్రధాన రోడ్డు పైన BRS నాయకులు వరి నాట్లు వేస్తున్నారు అభివృద్ధి ఎక్కడ ఉంది 
గిరివెల్లి రోడ్డు సమస్యపై BRS నిరసన
ఈ రోజు దహిగాం మండలం గిరివెల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పూర్తిగా బురదమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ BRS నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బురదమయమైన రోడ్డులోనే వరి నాట్లు వేసి తమ నిరసనను వినూత్నంగా వ్యక్తం చేశారు.
గేర్రె–గిరివెల్లి నుంచి మొట్లగూడ–రాంపూర్ వరకు రహదారిని వెంటనే మంజూరు చేసి, శాశ్వతంగా నిర్మించాలని MLA గారు, MLC గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని BRS నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిన ఈ రహదారి సమస్యను ఇకనైనా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో BRS మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Salesperson కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    20 hrs ago
  • పర్యావరణ పరిరక్షణ బాధ్యత భావి తరాలదే కంపా సీసీఎఫ్ క్షితిజ సిర్పూర్(టి)లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో నిర్వహించిన "వనమహోత్సవం" కార్యక్రమంలో కంపా సీసీఎఫ్ క్షితిజ ఐ.ఎఫ్.ఎస్ పాల్గొన్నారు. అడవులను, వన్యప్రాణులను సంరక్షించి విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించి గొప్ప స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఎఫ్డీపీటీ శాంతారాం ఐ.ఎఫ్.ఎస్, ఎఫ్డివో భార్గవ్ కుమార్ ఐ.ఎఫ్.ఎస్, డా. అప్పయ్య ఏసీఎఫ్, వేణుబాబు ఏసీఎఫ్, ఎఫ్ఆర్ఓలు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సిర్పూర్(టి) సర్పంచ్ నాగమణి నానయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు
    4
    పర్యావరణ పరిరక్షణ బాధ్యత భావి తరాలదే

కంపా సీసీఎఫ్ క్షితిజ
సిర్పూర్(టి)లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో నిర్వహించిన "వనమహోత్సవం" కార్యక్రమంలో కంపా సీసీఎఫ్ క్షితిజ ఐ.ఎఫ్.ఎస్ పాల్గొన్నారు. అడవులను, వన్యప్రాణులను సంరక్షించి విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించి గొప్ప స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఎఫ్డీపీటీ శాంతారాం ఐ.ఎఫ్.ఎస్, ఎఫ్డివో భార్గవ్ కుమార్ ఐ.ఎఫ్.ఎస్, డా. అప్పయ్య ఏసీఎఫ్, వేణుబాబు ఏసీఎఫ్, ఎఫ్ఆర్ఓలు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సిర్పూర్(టి) సర్పంచ్ నాగమణి నానయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • పొలంలోకి అడుగుపెట్టిన చిన్నారులు.. రైతు కష్టాన్ని తెలుసుకున్న విద్యార్థులు పొనకల్: తరగతి గదిలో పుస్తకాల్లో చదివిన వ్యవసాయ పాఠాలను ప్రత్యక్ష అనుభవంగా మార్చుకున్నారు పొనకల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పొనకల్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన చిన్నారులు వరి సాగు విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. విత్తనం నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు పడే శ్రమను తెలుసుకున్న విద్యార్థులు.. నారుమడి, నీటి వినియోగం, నేల స్వభావం, నాట్ల ప్రక్రియ తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలోకి దిగి స్వయంగా నారు మోసి, నాట్లు వేసి వ్యవసాయ పనుల్లో భాగస్వాములయ్యారు. దీంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. క్షేత్రస్థాయి అనుభవం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంతో పాటు పరిశీలన, ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పుస్తక జ్ఞానానికి ఆచరణాత్మక అనుభవం తోడైతే అభ్యసనం మరింత ఫలప్రదంగా ఉంటుందని హెచ్‌ఎం కే. రాజేశం తెలిపారు. రైతుల శ్రమ, వ్యవసాయం ప్రాధాన్యతను చిన్నారులు అర్థం చేసుకునేలా కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్, వనిత, సుజాత, పలువురు రైతులు పాల్గొన్నారు.
    1
    పొలంలోకి అడుగుపెట్టిన చిన్నారులు.. రైతు కష్టాన్ని తెలుసుకున్న విద్యార్థులు
పొనకల్: తరగతి గదిలో పుస్తకాల్లో చదివిన వ్యవసాయ పాఠాలను ప్రత్యక్ష అనుభవంగా మార్చుకున్నారు పొనకల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పొనకల్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన చిన్నారులు వరి సాగు విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు.
విత్తనం నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు పడే శ్రమను తెలుసుకున్న విద్యార్థులు.. నారుమడి, నీటి వినియోగం, నేల స్వభావం, నాట్ల ప్రక్రియ తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలోకి దిగి స్వయంగా నారు మోసి, నాట్లు వేసి వ్యవసాయ పనుల్లో భాగస్వాములయ్యారు. దీంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది.
క్షేత్రస్థాయి అనుభవం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంతో పాటు పరిశీలన, ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పుస్తక జ్ఞానానికి ఆచరణాత్మక అనుభవం తోడైతే అభ్యసనం మరింత ఫలప్రదంగా ఉంటుందని హెచ్‌ఎం కే. రాజేశం తెలిపారు. రైతుల శ్రమ, వ్యవసాయం ప్రాధాన్యతను చిన్నారులు అర్థం చేసుకునేలా కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్, వనిత, సుజాత, పలువురు రైతులు పాల్గొన్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    16 hrs ago
  • ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి : జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పెద్దపల్లి జిల్లాలో ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి అని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, నిర్మాణం పూర్తయిన 2బీహెచ్‌కే ఇళ్ల కేటాయింపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో* కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* జిల్లాలో నిర్మాణం పూర్తయి ఇంకా కేటాయించని 2బీహెచ్‌కే ఇళ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు కేటాయించేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లు ఖాళీగా ఉండకుండా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇళ్లను కేటాయించే ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఇందుకోసం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందేందుకు అవసరమైన లబ్ధిదారుల వివరాలన్నింటినీ సెప్టెంబర్ 5, 2026లోగా ఎంఐఎస్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. లబ్ధిదారుల వివరాల నమోదు, డేటా అప్‌లోడ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, అర్హులైన వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన పథకాల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పీడీ హౌసింగ్ పి. పవన్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి : జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష
పెద్దపల్లి జిల్లాలో ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి అని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు.
జిల్లాలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, నిర్మాణం పూర్తయిన 2బీహెచ్‌కే ఇళ్ల కేటాయింపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో* కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* జిల్లాలో నిర్మాణం పూర్తయి ఇంకా కేటాయించని 2బీహెచ్‌కే ఇళ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు కేటాయించేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
నిర్మాణం పూర్తయిన ఇళ్లు ఖాళీగా ఉండకుండా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇళ్లను కేటాయించే ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఇందుకోసం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందేందుకు అవసరమైన లబ్ధిదారుల వివరాలన్నింటినీ సెప్టెంబర్ 5, 2026లోగా ఎంఐఎస్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. లబ్ధిదారుల వివరాల నమోదు, డేటా అప్‌లోడ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, అర్హులైన వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు.
గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన పథకాల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో పీడీ హౌసింగ్ పి. పవన్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    16 hrs ago
  • బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలి: జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి జగిత్యాల జిల్లా కమిటీలలో నూతనంగా నియమితులైన నాయకులకు జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ హైదరాబాద్ లో నియామక పత్రాలు అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు బీసీల హక్కుల సాధనకు క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సాంబారి కళావతి, కస్తూరి నరేష్, ఆడెపు సత్యం, అల్లే సుదర్శన్, సిరికొండ చంద్రన్న, ఎనుగుర్తి శ్రవణ్, రాజేష్, రాజ శేఖర్, చెట్పెల్లి సురేష్, గుండేటి మారుతి పాల్గొన్నారు.
    4
    బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలి: జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ
జాతీయ బీసీ చైతన్య సమితి జగిత్యాల జిల్లా కమిటీలలో నూతనంగా నియమితులైన నాయకులకు జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ హైదరాబాద్ లో నియామక పత్రాలు అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు బీసీల హక్కుల సాధనకు క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సాంబారి కళావతి, కస్తూరి నరేష్, ఆడెపు సత్యం, అల్లే సుదర్శన్, సిరికొండ చంద్రన్న, ఎనుగుర్తి శ్రవణ్, రాజేష్, రాజ శేఖర్, చెట్పెల్లి సురేష్, గుండేటి మారుతి పాల్గొన్నారు.
    user_Boga naga bhushanam
    Boga naga bhushanam
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    12 hrs ago
  • *ఎయిర్‌పోర్ట్ భూసేకరణపై రైతులకు జోగు రామన్న భరోసా* ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల రైతులు, గ్రామస్తుల్లో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలపై స్పష్టత కల్పించేందుకు మాజీ మంత్రి జోగు రామన్న చొరవ తీసుకున్నారు. మంగళవారం గ్రామస్తులు, రైతులు మాజీ మంత్రి జోగు రామన్నను కలిసి తమ సమస్యలను వివరించగా, ఆయన జిల్లా కలెక్టర్ రాజర్షి గారితో క్యాంప్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలపై చర్చించారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, భూముల ధరలు, గ్రామాలపై ప్రభావం తదితర అంశాలపై రైతులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న సందేహాలను జిల్లా కలెక్టర్ దృష్టికి జోగు రామన్న తీసుకెళ్లారు. పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని అందించి, రైతులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులు జోగు రామన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ బహిరంగంగా, సోషల్ మీడియా వేదికగా భూములకు తక్కువ ధర వస్తుందంటూ ప్రకటనలు చేయడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజల్లో భయాందోళన వాతావరణం ఏర్పడిందన్నారు. రైతులు, గ్రామస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని సూచించారు. భూముల ధరల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా కలెక్టర్ సమక్షంలో సంబంధిత గ్రామాల ప్రజలు, రైతులతో సమీక్షలు నిర్వహించి, గ్రామసభలు ఏర్పాటు చేయడంతో పాటు సామాజిక-ఆర్థిక సర్వేలు నిర్వహించిన అనంతరం భూసేకరణ, పరిహారం ధరల నిర్ణయ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. రైతులు, గ్రామస్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరుతున్నామని, ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా తమ వంతు కృషి చేస్తామని జోగు రామన్న భరోసా ఇచ్చారు. రైతులు, గ్రామస్తులు ఎవరూ అధైర్యపడవద్దని, వారి వెంట బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లవేళలా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బండి దత్తాత్రే, కడదరపు అశోక్, రావుల సోమన్న, రమేష్, ఇస్తారి, జీవన్, బండి సాగర్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు,
    2
    *ఎయిర్‌పోర్ట్ భూసేకరణపై రైతులకు జోగు రామన్న భరోసా*

ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల రైతులు,
గ్రామస్తుల్లో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలపై స్పష్టత కల్పించేందుకు మాజీ మంత్రి జోగు రామన్న చొరవ తీసుకున్నారు. మంగళవారం గ్రామస్తులు, రైతులు మాజీ మంత్రి జోగు రామన్నను కలిసి తమ సమస్యలను వివరించగా, ఆయన జిల్లా కలెక్టర్ రాజర్షి గారితో క్యాంప్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలపై చర్చించారు.
ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, భూముల ధరలు, గ్రామాలపై ప్రభావం తదితర అంశాలపై రైతులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న సందేహాలను జిల్లా కలెక్టర్ దృష్టికి జోగు రామన్న తీసుకెళ్లారు. పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని అందించి, రైతులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులు జోగు రామన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ బహిరంగంగా, సోషల్ మీడియా వేదికగా భూములకు తక్కువ ధర వస్తుందంటూ ప్రకటనలు చేయడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజల్లో భయాందోళన వాతావరణం ఏర్పడిందన్నారు. రైతులు, గ్రామస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని సూచించారు.
భూముల ధరల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా కలెక్టర్ సమక్షంలో సంబంధిత గ్రామాల ప్రజలు, రైతులతో సమీక్షలు నిర్వహించి, గ్రామసభలు ఏర్పాటు చేయడంతో పాటు సామాజిక-ఆర్థిక సర్వేలు నిర్వహించిన అనంతరం భూసేకరణ, పరిహారం ధరల నిర్ణయ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
రైతులు, గ్రామస్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరుతున్నామని, ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా తమ వంతు కృషి చేస్తామని జోగు రామన్న భరోసా ఇచ్చారు. రైతులు, గ్రామస్తులు ఎవరూ అధైర్యపడవద్దని, వారి వెంట బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లవేళలా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బండి దత్తాత్రే, కడదరపు అశోక్, రావుల సోమన్న, రమేష్, ఇస్తారి, జీవన్, బండి సాగర్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు,
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • సింగరేణి అంటే కేవలం బొగ్గు గనులు కాదు — తెలంగాణ అభివృద్ధికి వెన్నెముక. సింగరేణి కార్మికులకు రాఖీ లు కట్టిన BJP నాయకురాలు కందుల సంధ్యారాణి మండే ఎండలో, చీకటి గనుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న సింగరేణి కార్మికుల త్యాగాలకు మనందరం సెల్యూట్ చేయాలి. - రాఖీ అంటే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. అదే విధంగా కార్మికులు–కుటుంబాలు–సమాజం మధ్య అనుబంధాన్ని మరింత బలపరచాలి. - దేశానికి విద్యుత్ అందించడానికి, పరిశ్రమలు నడవడానికి సింగరేణి కార్మికుల శ్రమ ఎంతో కీలకం. - కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, వారి పిల్లల భవిష్యత్తు మనందరి బాధ్యత. - విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సింగరేణి కార్మిక కుటుంబాలను ఎప్పటికీ మర్చిపోకూడదు. - ప్రతి కార్మికుడి ఇంట్లో ఆనందం ఉండాలి; ప్రతి కార్మిక కుటుంబానికి మెరుగైన విద్య, వైద్యం, గౌరవప్రదమైన జీవితం అందాలి. - సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం మరియు యాజమాన్యం సానుకూలంగా పరిష్కరించాలి. - కార్మికుడి చెమట చుక్కలోనే సింగరేణి భవిష్యత్తు ఉంది. - ఈ రాఖీ సందర్భంగా సింగరేణి కార్మిక సోదరులందరికీ మనం ఒక మాట ఇవ్వాలి — వారి హక్కులు, సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటాం. - చివరగా: “సింగరేణి కార్మికుడు బలంగా ఉంటే సింగరేణి బలంగా ఉంటుంది… సింగరేణి బలంగా ఉంటే తెలంగాణ బలంగా ఉంటుంది!”
    1
    సింగరేణి అంటే కేవలం బొగ్గు గనులు కాదు — తెలంగాణ అభివృద్ధికి వెన్నెముక.
సింగరేణి కార్మికులకు రాఖీ లు కట్టిన BJP నాయకురాలు కందుల సంధ్యారాణి
మండే ఎండలో, చీకటి గనుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న సింగరేణి కార్మికుల త్యాగాలకు మనందరం సెల్యూట్ చేయాలి.
- రాఖీ అంటే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. అదే విధంగా కార్మికులు–కుటుంబాలు–సమాజం మధ్య అనుబంధాన్ని మరింత బలపరచాలి.
- దేశానికి విద్యుత్ అందించడానికి, పరిశ్రమలు నడవడానికి సింగరేణి కార్మికుల శ్రమ ఎంతో కీలకం.
- కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, వారి పిల్లల భవిష్యత్తు మనందరి బాధ్యత.
- విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సింగరేణి కార్మిక కుటుంబాలను ఎప్పటికీ మర్చిపోకూడదు.
- ప్రతి కార్మికుడి ఇంట్లో ఆనందం ఉండాలి; ప్రతి కార్మిక కుటుంబానికి మెరుగైన విద్య, వైద్యం, గౌరవప్రదమైన జీవితం అందాలి.
- సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం మరియు యాజమాన్యం సానుకూలంగా పరిష్కరించాలి.
- కార్మికుడి చెమట చుక్కలోనే సింగరేణి భవిష్యత్తు ఉంది.
- ఈ రాఖీ సందర్భంగా సింగరేణి కార్మిక సోదరులందరికీ మనం ఒక మాట ఇవ్వాలి — వారి హక్కులు, సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటాం.
- చివరగా: “సింగరేణి కార్మికుడు బలంగా ఉంటే సింగరేణి బలంగా ఉంటుంది… సింగరేణి బలంగా ఉంటే తెలంగాణ బలంగా ఉంటుంది!”
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    16 hrs ago
  • సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం ద్వారకుంట బస్సు ప్రమాద ఘటన.. షాకింగ్ విజువల్స్ సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం ద్వారకుంట వద్ద బుధవారం జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికుల ఆర్తనాదాలు వినిపించాయి. ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దుర్ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
    1
    సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం ద్వారకుంట బస్సు ప్రమాద ఘటన.. షాకింగ్ విజువల్స్
సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం ద్వారకుంట వద్ద బుధవారం జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికుల ఆర్తనాదాలు వినిపించాయి. ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దుర్ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter Kotapally, Mancherial•
    11 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.