logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శాకాంబరి అవతారంలో భక్తులకు శ్రీ ఊరడమ్మ అమ్మవారిని దర్శనం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని గడిలో వెలసిన శ్రీ ఊరడమ్మ ఆలయంలో అమ్మవారిని శాకాంబరి దేవి అవతారంలో అత్యంత వైభవంగా అలంకరించారు. కూరగాయలు, ఆకుకూరలు, వంకాయలు, బెండకాయలు, మిరపకాయలు, క్యాబేజీ, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, పూలతో ప్రత్యేకంగా చేసిన ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.శాకాంబరి దేవి అలంకరణ ప్రకృతి సంపద, వ్యవసాయాభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, సమృద్ధికి ప్రతీకగా భావిస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతులు, తీర్థప్రసాదాల పంపిణీ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ అధ్యక్షులు పి.శ్రీకాంత్ రెడ్డి, నాయకులు సిద్దు రవి, పాండు, ఫవాన్, సుధాకర్, నాగరాజు, విక్రమ్,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Reporter MD khaleel
Reporter MD khaleel
Local News Reporter జహీరాబాద్, సంగారెడ్డి, తెలంగాణ•
2 hrs ago
d46f5442-58a2-41d8-9a20-8a2f0b651d8d

శాకాంబరి అవతారంలో భక్తులకు శ్రీ ఊరడమ్మ అమ్మవారిని దర్శనం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని గడిలో వెలసిన శ్రీ ఊరడమ్మ ఆలయంలో అమ్మవారిని శాకాంబరి దేవి అవతారంలో అత్యంత వైభవంగా అలంకరించారు. కూరగాయలు, ఆకుకూరలు, వంకాయలు, బెండకాయలు, మిరపకాయలు, క్యాబేజీ, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, పూలతో ప్రత్యేకంగా చేసిన ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.శాకాంబరి దేవి అలంకరణ ప్రకృతి సంపద, వ్యవసాయాభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, సమృద్ధికి ప్రతీకగా భావిస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతులు, తీర్థప్రసాదాల పంపిణీ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ అధ్యక్షులు పి.శ్రీకాంత్ రెడ్డి, నాయకులు సిద్దు రవి, పాండు, ఫవాన్, సుధాకర్, నాగరాజు, విక్రమ్,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఫీజు బకాయిలపై బీజేపీ సమరభేరి సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: తాడూరి శ్రీనివాస్
    1
    ఫీజు బకాయిలపై బీజేపీ సమరభేరి
సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: తాడూరి శ్రీనివాస్
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    16 hrs ago
  • దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రమాదాలకు గురికావడంతో అధికారులు వెంటనే స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    1
    దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్

నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్
నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రమాదాలకు గురికావడంతో అధికారులు వెంటనే స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    user_SAI KIRAN TRP
    SAI KIRAN TRP
    కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    13 hrs ago
  • తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావం: కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ టీయూ లోగో ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. రాష్ట్రంలోని కోటిన్నర మంది కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీఆర్ టీయూ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.
    1
    తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావం: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ టీయూ లోగో  ను  తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. రాష్ట్రంలోని కోటిన్నర మంది కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీఆర్ టీయూ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    13 hrs ago
  • రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
    1
    రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
    user_SHEKHAR
    SHEKHAR
    రాజపేట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    11 hrs ago
  • ముధోల్ పదవ సెంటర్ అంగన్వాడి లో పాము కలకలం... పట్టుకుని అటవీ ప్రాంతం లో వదిలేసిన స్థానికులు... నిర్మల్ జిల్లా // ముధోల్ BREAKING NEWS ముధోల్ మండల కేంద్రంలోని పదవ సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో విషపూరిత పాము కలకలం... ఉదయం అంగన్వాడిని శుభ్రం చేయడానికి వచ్చి బాత్రూంలో ఉన్న పామును చూసి ఉలిక్కిపడ్డ అంగన్వాడి కేంద్రం సహాయకురాలు (ఆయమ్మ)... ఆయమ్మ కేకలు వేయడంతో అప్రమత్తమై పామును పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు... అదే సమయంలో అంగన్వాడి కేంద్రం లో విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం...
    1
    ముధోల్ పదవ సెంటర్ అంగన్వాడి లో పాము కలకలం... పట్టుకుని అటవీ ప్రాంతం లో వదిలేసిన స్థానికులు...
నిర్మల్ జిల్లా // ముధోల్ 
BREAKING NEWS
ముధోల్ మండల కేంద్రంలోని పదవ సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో విషపూరిత పాము కలకలం...
ఉదయం అంగన్వాడిని శుభ్రం చేయడానికి వచ్చి బాత్రూంలో ఉన్న పామును చూసి ఉలిక్కిపడ్డ అంగన్వాడి కేంద్రం సహాయకురాలు (ఆయమ్మ)...
ఆయమ్మ కేకలు వేయడంతో అప్రమత్తమై పామును పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు...
అదే సమయంలో అంగన్వాడి కేంద్రం లో విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం...
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    22 hrs ago
  • సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ అమ్మవారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలని ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ వ్యవసాయం వ్యాపారం వారి వారి రంగాలలో వృద్ధిని సాధిస్తూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూన్నామని అన్నారు. ఆరెకటిక సంఘం సిరిసిల్ల వారిలోని ఐక్యతను తెలియజేసేలా వైభవంగా అమ్మవారికి బోనాలను సమర్పించడానికి అందరూ కలిసి ఊరేగింపుగా బయలుదేరి వెళ్తున్న ఈ దృశ్యం కనుల పండగ ఉందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న అరేకటిక సంఘం సిరిసిల్ల వారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని ఆ పోచమ్మ తల్లి వారి ఆశీస్సులతో సిరిసిల్ల అరెకటిక సంఘం వారు సమాజంలో ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలవాలని అమ్మవారి ఆశీస్సులు వారిపై వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో అరెకటిక సంఘం రాష్ట్ర నాయకులు గజబింకర్ చందు , సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు గజబింకర్ మహేందర్ , ఉపాధ్యక్షులు గజబింకర్ బాబు ,గజబింకర్ దశరథం , ఇతర కార్యవర్గ సభ్యులు కుల పెద్దలు ఆడపడుచులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ అమ్మవారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలని ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ వ్యవసాయం వ్యాపారం వారి వారి రంగాలలో వృద్ధిని సాధిస్తూ సుఖ సంతోషాలతో  జీవించాలని కోరుకుంటూన్నామని అన్నారు. ఆరెకటిక సంఘం సిరిసిల్ల  వారిలోని ఐక్యతను తెలియజేసేలా వైభవంగా అమ్మవారికి బోనాలను సమర్పించడానికి  అందరూ కలిసి ఊరేగింపుగా బయలుదేరి వెళ్తున్న ఈ దృశ్యం కనుల పండగ ఉందని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న అరేకటిక సంఘం సిరిసిల్ల వారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని ఆ పోచమ్మ తల్లి వారి ఆశీస్సులతో సిరిసిల్ల అరెకటిక సంఘం వారు సమాజంలో ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలవాలని అమ్మవారి ఆశీస్సులు వారిపై వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో అరెకటిక సంఘం రాష్ట్ర నాయకులు గజబింకర్ చందు , సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు గజబింకర్ మహేందర్ , ఉపాధ్యక్షులు గజబింకర్ బాబు ,గజబింకర్ దశరథం , ఇతర కార్యవర్గ సభ్యులు కుల పెద్దలు ఆడపడుచులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
  • హైవే ప్రమాదాలపై ఎస్పీ కొత్త పిలుపు.. 'గోల్డెన్ అవర్'లో స్పందిస్తే ప్రాణాలు కాపాడొచ్చు జిల్లాలో హైవేలపై జరిగే రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించేందుకు డాబాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమానులు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే తొలి గంటను 'గోల్డెన్ అవర్'గా పేర్కొంటూ, ఆ సమయంలో క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ప్రమాదాలు కనిపించిన వెంటనే పోలీసులకు, అంబులెన్స్ సేవలకు సమాచారం అందించడంతో పాటు బాధితులకు సహాయం చేయడంలో హోటల్ యాజమానులు ముందుండాలని సూచించారు. పోలీసు-ప్రజల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల మృతులను తగ్గించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు.
    1
    హైవే ప్రమాదాలపై ఎస్పీ కొత్త పిలుపు.. 'గోల్డెన్ అవర్'లో స్పందిస్తే ప్రాణాలు కాపాడొచ్చు
జిల్లాలో హైవేలపై జరిగే రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించేందుకు డాబాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమానులు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే తొలి గంటను 'గోల్డెన్ అవర్'గా పేర్కొంటూ, ఆ సమయంలో క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ప్రమాదాలు కనిపించిన వెంటనే పోలీసులకు, అంబులెన్స్ సేవలకు సమాచారం అందించడంతో పాటు బాధితులకు సహాయం చేయడంలో హోటల్ యాజమానులు ముందుండాలని సూచించారు. పోలీసు-ప్రజల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల మృతులను తగ్గించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    15 hrs ago
  • మల్కాజిగిరి పరిధిలోని ఆర్కేపురం చెరువులో నీరు నింపాలని స్థానికుల డిమాండ్ మల్కాజిగిరి పరిధిలోని ఆర్కేపురం చెరువును గత ఏడున్నర నుంచి ఎనిమిది సంవత్సరాలుగా పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఖాళీగా ఉంచారు. ఇప్పటివరకు చెరువులో కలుపు మొక్కలు తొలగించి, నీటిని నిల్వ చేసే చర్యలు చేపట్టకపోవడంతో చెరువు పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది నీటి ఎద్దడి ప్రారంభమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు చెరువును శుభ్రపరచి నీటిని నింపితే భూగర్భ జలాలు పెరిగి, బోరుబావుల్లో నీటి లభ్యత మెరుగుపడి నీటి సమస్య తగ్గుతుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
    1
    మల్కాజిగిరి పరిధిలోని ఆర్కేపురం చెరువులో నీరు నింపాలని స్థానికుల డిమాండ్

మల్కాజిగిరి పరిధిలోని ఆర్కేపురం చెరువును గత ఏడున్నర నుంచి ఎనిమిది సంవత్సరాలుగా పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఖాళీగా ఉంచారు. ఇప్పటివరకు చెరువులో కలుపు మొక్కలు తొలగించి, నీటిని నిల్వ చేసే చర్యలు చేపట్టకపోవడంతో చెరువు పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది నీటి ఎద్దడి ప్రారంభమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు చెరువును శుభ్రపరచి నీటిని నింపితే భూగర్భ జలాలు పెరిగి, బోరుబావుల్లో నీటి లభ్యత మెరుగుపడి నీటి సమస్య తగ్గుతుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    16 hrs ago
  • వర్షంలో కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర తెలంగాణ రాష్ట్రంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర వర్షంలో కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరి చూపు చూసేందుకు అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు.
    1
    వర్షంలో కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర

తెలంగాణ రాష్ట్రంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర వర్షంలో కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరి చూపు చూసేందుకు అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.