Shuru
Apke Nagar Ki App…
రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు పొడిగింపు ములుగు: రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు ఆగస్టు 31 వరకు పొడిగించారు. రాష్ట్రంలో వర్షాలు, SIR ప్రక్రియ దృష్ట్యా ఈ-కేవైసీ గడువును ప్రభుత్వం పొడిగించింది. నేటి నుంచి చౌకధరల దుకాణాల్లో 3 నెలల రేషన్ పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 31 వరకు మూడు నెలల రేషన్ తీసుకోవచ్చని. ప్రభుత్వం తెలిపింది పోర్టబిలిటీ ద్వారా ఏ దుకాణం నుంచైనా తీసుకోవచ్చని వెల్లడించింది.
ఎనగందుల కొమురయ్య
రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు పొడిగింపు ములుగు: రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు ఆగస్టు 31 వరకు పొడిగించారు. రాష్ట్రంలో వర్షాలు, SIR ప్రక్రియ దృష్ట్యా ఈ-కేవైసీ గడువును ప్రభుత్వం పొడిగించింది. నేటి నుంచి చౌకధరల దుకాణాల్లో 3 నెలల రేషన్ పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 31 వరకు మూడు నెలల రేషన్ తీసుకోవచ్చని. ప్రభుత్వం తెలిపింది పోర్టబిలిటీ ద్వారా ఏ దుకాణం నుంచైనా తీసుకోవచ్చని వెల్లడించింది.
More news from తెలంగాణ and nearby areas
- గ్రోమోర్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కొత్తగూడ మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, విక్రయాల రికార్డులు, స్టాక్ వివరాలను పరిశీలించి నిబంధనల మేరకు రైతులకు ఎరువులు అందించాలని అధికారులకు సూచించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- బహిరంగ మద్యం సేవనంపై నిషేధాజ్ఞలు : రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ప్రజలు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సిపి తెలిపారు.1
- హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుకై మహబూబాబాద్ లో సంతకాల సేకరణ. మహబూబాబాద్ జిల్లా జులై 31 హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని హమాలి సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబాబాద్ పట్టణ హమాలీ సంఘం ఆధ్వర్యంలో మార్కెట్‌లోని కాటన్ కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ కార్మికుల నుంచి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరికుంట్ల నాగన్న పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, 50 సంవత్సరాలు దాటిన ప్రతి హమాలీ కార్మికుడికి నెలకు రూ.6,000 పెన్షన్ అందించాలని కోరారు. అలాగే ప్రతి హమాలీ కార్మికుడికి రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, విధి నిర్వహణలో కార్మికుడు మరణిస్తే ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అసెంబ్లీలో కూడా చర్చించకుండా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. ఇప్పటికే హమాలీ కార్మికులు పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఆగస్టు 13న తహసీల్దార్ కార్యాలయం ఎదుట, ఆగస్టు 24న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా హమాలీ కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బత్తుల వెంకన్న, బానోత్ రవి, హేమ, వీరన్న, రవి, రాము, చంద్రయ్య, వీరు, రమేష్, బాలు, రామారావు, రాములు, శ్రీను, చందు, నవీన్, కృష్ణ, మోహన్‌రావు, వెంకన్న, చారి, హరి, బిట్టు, సూర్య, లక్ష్మణ్, సేవ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.1
- దొంగతనం కేసులో ట్విస్ట్.. పోలీసులకు ఫిర్యాదు చేయబోతే సీసీటీవీలో కనిపించిన అసలు దొంగ ఎలుక! కర్ణాటక: తుమకూరులోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో ఆభరణాలు కనిపించకుండా పోవడంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ముందుగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, ఓ ఎలుక ఒక్కో ఉంగరం, చిన్న ఆభరణాలను నోటితో తీసుకెళ్లడం కనిపించింది. దీంతో ఎలుక బొరియను పరిశీలించగా 10 బంగారు ఉంగరాలు, మూడు బంగారు చైన్లు లభించాయి. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని దుకాణ యాజమాన్యం తెలిపింది. మెరిసే వస్తువులను తన గూటిలోకి తీసుకెళ్లే అలవాటు వల్లే ఎలుక ఆభరణాలను తరలించినట్లు భావిస్తున్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరవళ్ళు తొక్కుతున్న మూలవాగు...నిమ్మపల్లి ప్రాజెక్ట్ జలకళ...ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులకు కొత్త జీవం పోస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి వద్ద ఉన్న మూలవాగు జలకళను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండి, మత్తడి దూకుతూ నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ మత్తడి దూకుతూ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ దృశ్యాలను చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రాజెక్ట్ నిండడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. దీంతో ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి సమస్య తీరనుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్ట్ నుంచి విడుదలవుతున్న వరద నీరు వేములవాడ మూలవాగు గుండా ప్రవహిస్తూ చివరకు మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్ట్ వద్దకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్తడి ప్రాంతాలకు దగ్గరగా వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ...3
- సింగరేణి పరిరక్షణకు కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం :BMS గత BRS ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి లో జోక్యం కారణంగా నష్ట పోతుందని bms నాయకులు ఆరోపించారు.1
- ఇక సెలవు..! ప్రభుత్వ లాంఛనాలతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అంతిమ వీడ్కోలు వరంగల్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు శుక్రవారం రాత్రి నల్లబెల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ప్రభుత్వ గౌరవ వందనం మధ్య జరిగిన అంతిమ సంస్కారాల్లో కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తుది వీడ్కోలు పలికారు. ఆయన మృతితో ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకోగా, పలువురు నాయకులు ఆయన ప్రజాసేవలను స్మరించుకుని నివాళులర్పించారు.1