సమాజ అభివృద్ధికి మహిళలు ఆదర్శంగా నిలవాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అంకిత్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి విద్య ఎంతో కీలకమని అన్నారు. విద్యావంతురాలైన మహిళ అన్ని రంగాల్లో తన ప్రతిభను చాటుకుని ఉన్నత స్థాయికి ఎదగగలదని తెలిపారు. సమాజ పురోగతిలో మహిళల పాత్ర అత్యంత ముఖ్యమని అన్నారు . మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిలో చాలా సంక్షేమ కార్యక్రమాలు మహిళల పేరుమీదే మంజూరు చేయబడుతున్నాయని తెలిపారు. ప్రతి రంగంలో మహిళలు ముందుకు వచ్చి తమ సామర్థ్యాలను నిరూపిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మాట్లాడుతూ మహిళల పట్ల లింగ వివక్ష తొలగింపు కుటుంబ వ్యవస్థ నుండే ప్రారంభం కావాలని అన్నారు. తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారినప్పుడే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని తెలిపారు . పనిచేసే మహిళలపై ఎటువంటి వేధింపులు జరగకుండా ఉండేలా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి స్వర్ణలత లేనినా మాట్లాడుతూ మహిళల సాధికారతకు విద్య, అవగాహన మరియు ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని అన్నారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. “బేటీ బచావో – బేటీ పడావో” కార్యక్రమం ద్వారా బాలికల విద్య, భద్రత మరియు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు . ప్రతి కుటుంబంలో బాలికలకు సమాన అవకాశాలు కల్పించి వారి ప్రతిభను వెలికితీయాల్సిన బాధ్యత సమాజంపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను సన్మానించారు. అలాగే ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన మహిళా కార్పొరేటర్లు, సర్పంచులు, ఉప సర్పంచులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, వివిధ శాఖల మహిళా అధికారులు, కార్పొరేటర్లు, మహిళా సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు,మహిళా సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు
సమాజ అభివృద్ధికి మహిళలు ఆదర్శంగా నిలవాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అంకిత్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి విద్య ఎంతో కీలకమని అన్నారు. విద్యావంతురాలైన మహిళ అన్ని రంగాల్లో తన ప్రతిభను
చాటుకుని ఉన్నత స్థాయికి ఎదగగలదని తెలిపారు. సమాజ పురోగతిలో మహిళల పాత్ర అత్యంత ముఖ్యమని అన్నారు . మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిలో చాలా సంక్షేమ కార్యక్రమాలు మహిళల పేరుమీదే మంజూరు చేయబడుతున్నాయని తెలిపారు. ప్రతి రంగంలో మహిళలు ముందుకు వచ్చి తమ సామర్థ్యాలను నిరూపిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మాట్లాడుతూ మహిళల పట్ల లింగ వివక్ష తొలగింపు కుటుంబ వ్యవస్థ నుండే ప్రారంభం కావాలని అన్నారు. తల్లిదండ్రుల ఆలోచనా విధానం
మారినప్పుడే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని తెలిపారు . పనిచేసే మహిళలపై ఎటువంటి వేధింపులు జరగకుండా ఉండేలా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి స్వర్ణలత లేనినా మాట్లాడుతూ మహిళల సాధికారతకు విద్య, అవగాహన మరియు ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని అన్నారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. “బేటీ బచావో – బేటీ పడావో” కార్యక్రమం ద్వారా బాలికల విద్య, భద్రత మరియు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని
అన్నారు . ప్రతి కుటుంబంలో బాలికలకు సమాన అవకాశాలు కల్పించి వారి ప్రతిభను వెలికితీయాల్సిన బాధ్యత సమాజంపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను సన్మానించారు. అలాగే ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన మహిళా కార్పొరేటర్లు, సర్పంచులు, ఉప సర్పంచులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, వివిధ శాఖల మహిళా అధికారులు, కార్పొరేటర్లు, మహిళా సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు,మహిళా సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని విజయలక్ష్మి, బీసీ సంఘం నాయకులు పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత మహనీయులను గౌరవించుకుంటున్నామని, అందులో భాగంగా దొడ్డి కొమరయ్య జయంతిని అధికారికంగా జరుపుకుంటున్నామని అన్నారు. అమరుల ఆశయ సాధనకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకుందామన్నారు.4
- Post by Ramprasad islavath1
- ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను లోబరుచుకుని, అత్యాచారం చేసిన నిందితుణ్ణి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. టౌన్ పోలీసుల కథనం ప్రకారం…నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన నిందితుడు చిలుకబత్తిని రంజిత్, S/o వెంకన్న, 19 సం,,లు, వృత్తి:డెకరేషన్ వర్క్, అనే యువకుడు, 15 సం,,ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గత సోమవారం మహబూబాబాద్ కు వచ్చిన బాలికను తన బైక్ పై ఎక్కించుకుని వెళ్ళిపోయినాడు. ఈ విషయమై బాలిక తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితున్ని అదుపులోకి తీసుకుని, అతనిపై కిడ్నాప్ మరియు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినామని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.*1
- *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…2
- నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. ఈ కార్యక్రమం నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నర్సంపేట సెగ్మెంట్‌లో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆరు జిల్లాల నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, అనిల్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.1
- పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సూర్యాంధ్ర ప్రగతి శకటాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో పలు గృహాలపై అమర్చిన సౌర విద్యుత్ ఫలకాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పరిశీలించారు.1
- ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్గ్రౌండ్ కేబుల్స్ రక్షణ కోసం ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. టవర్ అనుమతులు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.1
- *రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..* **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..** పాల్వంచ మండలం నాగారం కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న లారీ.. మృతుడు వెంగళరావు కాలనీకి చెందిన దుర్గారావు గా గుర్తింపు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు1