Shuru
Apke Nagar Ki App…
పాల్వంచ నాగారం గ్రామ సమీపంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న లారీ, వెంగళరావు కాలనీకి చెందిన దుర్గారావు అనే వ్యక్తి మృతి *రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..* **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..** పాల్వంచ మండలం నాగారం కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న లారీ.. మృతుడు వెంగళరావు కాలనీకి చెందిన దుర్గారావు గా గుర్తింపు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
VANAMA SRINIVAS RAO
పాల్వంచ నాగారం గ్రామ సమీపంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న లారీ, వెంగళరావు కాలనీకి చెందిన దుర్గారావు అనే వ్యక్తి మృతి *రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..* **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..** పాల్వంచ మండలం నాగారం కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న లారీ.. మృతుడు వెంగళరావు కాలనీకి చెందిన దుర్గారావు గా గుర్తింపు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by వేముల నాగరాజు1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ శివారు లాలు తండాలో ఎస్సారెస్పీ కాలువ నీళ్లు పొంగిపొర్లుతున్నాయి. తండా వైపు వచ్చే కాలువ గేట్లను కొందరు ఇష్టారాజ్యంగా ఎత్తడం వల్ల నీరు కాలువపై నుంచి కిందికి వచ్చి రైతుల పొలాల్లోకి చేరుతోంది. దీంతో పంట పొలాలు నీటమునిగే పరిస్థితి ఏర్పడగా, కాలువ తెగిపోవచ్చనే ప్రమాదం కూడా నెలకొంది. సమస్యపై వెంటనే స్పందించి నీటి విడుదలను నియంత్రించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.1
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో *సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం..* ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి... మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణం వైద్యరంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్ష... లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలి... పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలి... డబ్బు కోసం కాకుండా మనశ్శాంతి కోసం వైద్యం చేయాలి.. అంటూ డాక్టర్లకు సూచన... అత్యాధునిక సదుపాయాలతో ఆస్పత్రి ఏర్పాటుపై హర్షం వ్యక్తం... అత్యవసర వైద్యం 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి... గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు విస్తరించాలి... ప్రభుత్వం కూడా వైద్య రంగ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుంది... కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..1
- కరీంనగర్ జిల్లాలో కన్నతండ్రే కవల పిల్లల పట్ల కాలయముడులా మారాడు. ఆడపిల్లలనే అక్కసుతో భార్యతో గొడవ పడి ఇద్దరు కవల పిల్లలకు విషమిచ్చి బావిలో పడేశాడు. ఈ ఘటన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీ నగర్ లో చోటు చేసుకుంది. ప్రైవేట్ ఉద్యోగం చేసే కచ్చు శ్రీశైలంకు కవల ఆడపిల్లలు జన్మించారు. వారికి గీతాన్ శ్రీ, గీతాన్విక నామకరణం చేశారు. ఇద్దరు ఆడబిడ్డలేనన్న కారణంతో తరుచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. బంధువులు జోక్యం చేసుకుని పలుమార్లు సర్దిచెప్పారు. ఇద్దరు ఆడబిడ్డలే పుట్టారన్న విషయంపై ఈరోజు ఉదయం కూడా భార్యతో గొడవ పడ్డాడు. బిడ్డలు ఇద్దరికీ గడ్డి మందు తాగించి బావిలో పడేశాడు. ఏమి ఎరగనట్లు స్థానికులతో కలిసి పిల్లల కోసం వెతికి బావిలో నుంచి వెలికి తీసే ప్రయత్నం చేశాడు. ఒక పాప మృతదేహం లభించగా మరొకరి కోసం స్థానికులు గాలిస్తున్నారు. చూడ ముచ్చటగా ఉన్న పసి పిల్లలను ప్రాణం తీసిన తండ్రి శ్రీశైలం పై స్థానికులు ఆగ్రహంతో దాడి చేశారు. పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఆడపిల్లలు అనే కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు.4
- Post by SS NEWS1
- ఈ రోజు Good Friday సందర్భంగా యేసుక్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేమ, క్షమ, నమ్మకం నేర్చుకుందాం 🙏1
- జూలూరుపాడు మండలం, సుజాతనగర్ మండలంలో మట్టిమాఫియా రెచ్చిపోతుంది. ఏకంగా సీతారామ ప్రాజెక్టు కాలువ మట్టిని పట్టపగలు జేసీబీ ల సాయంతో పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తోలకాలు సాగిస్తున్నారు. సుజాతనగర్ మండలంలోని లక్ష్మీదేవి పల్లి గ్రామంలో ఉన్న పల్లెప్రకృతి వనం ఉన్న గుట్టల మట్టిని కూడా యథేచ్ఛగా తోలకాలు సాగిస్తున్నారు. సుజాతనగర్ లోని వెంచర్లు, జూలూరుపాడు లోని నిర్మాణాలు పలు వాటికి తోలకాలు సాగిస్తున్నారు. అతివేగంగా వెళ్తూ స్థానికులతో గొడవలకు సైతం దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు, రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు కనీసం పట్టించుకునే పాపాన పోవట్లేదు. ఎవరికి వారికి పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టజెప్తున్నామని తోలకాలు జరిపే వారే బహిరంగంగా చెప్పడం విశేషం.1
- మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు గండి కమలాకర్ హెల్మెట్ ధరించి తాటి చెట్టు ఎక్కుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్‌ను నిర్లక్ష్యం చేసే వారికి, చెట్టు ఎక్కేటప్పుడూ భద్రతను పాటిస్తూ కమలాకర్ మంచి సందేశం ఇస్తున్నారు.1
- జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో సిలిండర్ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెలలో సిలిండర్ కోసం అన్లైన్ లో బుక్ చేసినా ఆ సిలిండర్ ఇప్పటికే తీసుకుంటున్నట్టు చూపిస్తుందని, తమ పేరుతో బుకు చేసుకున్న సిలిండర్ ఇతరులకు అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పదిహేను రోజులుగా ఆఫీసుకు వస్తున్నా ఇంకా సిలిండర్ తీసుకోలేమని చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయం నుండి సిలిండర్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని గంటల తరబడి లైనులో నిలబడిన సిలిండర్ దొరకటం కష్టంగా మారిందని చెపుతున్నారు. బుక్ చేసుకున్న వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు.1