logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సముద్ర తీరంలో అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన శివలింగాలు. వేటపాలెం మండలం లోని పొట్టి సుబ్బయ్యపాలెం సముద్రతీరంలో రాకాసి అలల తాకిడికి శివలింగాలు, ఇతర విగ్రహాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పురాతన విగ్రహాలు బయటపడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.సముద్రంలోపలి నుంచి అలల ఉద్ధృతికి కొట్టుకొచ్చి ఇవి తీరానికి చేరాయా? లేక సముద్రతీరంలోని భూమిలో ఇసుక పొరల కింద ఉన్న శివలింగాలు, విగ్రహాలు అలల తాకిడికి ఇసుక కొట్టుకుపోవడంతో వెలుగులోకి వచ్చాయా? అనే సందేహాలు స్థానిక ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. అలల ఉద్ధృతి కారణంగా తీర ప్రాంతంలో భారీగా ఇసుక కోతకు గురికావడంతో గతంలో కనిపించని కొన్ని వస్తువులు, విగ్రహాలు వెలుగులోకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇవి సముద్రం నుంచి కొట్టుకొచ్చినవా, లేక భూమిలో ఇంతకాలం ఇసుక కింద ఉండి ఇప్పుడు బయటపడ్డాయా అన్నది అధికారులు, పురావస్తు నిపుణుల పరిశీలనతోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

14 hrs ago
user_M.Vijay Kishore
M.Vijay Kishore
Cherukupalle H/O Arumbaka, Bapatla•
14 hrs ago
5aba7006-dea9-4f3f-919e-09df80c0f7e4

సముద్ర తీరంలో అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన శివలింగాలు. వేటపాలెం మండలం లోని పొట్టి సుబ్బయ్యపాలెం సముద్రతీరంలో రాకాసి అలల తాకిడికి శివలింగాలు, ఇతర విగ్రహాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పురాతన విగ్రహాలు బయటపడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.సముద్రంలోపలి నుంచి అలల ఉద్ధృతికి కొట్టుకొచ్చి ఇవి తీరానికి చేరాయా? లేక సముద్రతీరంలోని భూమిలో ఇసుక పొరల కింద ఉన్న శివలింగాలు, విగ్రహాలు అలల తాకిడికి ఇసుక కొట్టుకుపోవడంతో వెలుగులోకి వచ్చాయా? అనే

df70b947-96e2-496f-a65f-137d23423877

సందేహాలు స్థానిక ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. అలల ఉద్ధృతి కారణంగా తీర ప్రాంతంలో భారీగా ఇసుక కోతకు గురికావడంతో గతంలో కనిపించని కొన్ని వస్తువులు, విగ్రహాలు వెలుగులోకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇవి సముద్రం నుంచి కొట్టుకొచ్చినవా, లేక భూమిలో ఇంతకాలం ఇసుక కింద ఉండి ఇప్పుడు బయటపడ్డాయా అన్నది అధికారులు, పురావస్తు నిపుణుల పరిశీలనతోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

More news from Andhra Pradesh and nearby areas
  • వైసీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్ గుంటూరు :పదవిని దుర్వినియోగం చేసే అధికారులు భవిష్యత్తులో ఎక్కడున్నా శిక్ష తప్పదని YCP చీఫ్ జగన్ హెచ్చరించారు. 'తప్పు చేసే వారి పేర్లు డిజిటల్ బుక్లోకి ఎక్కించండి. న్యాయంగా ఎన్నికలు జరిపించాలి. లేదు మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. ఇప్పుడు మీ టైమ్ నడుస్తోంది. ఆ తరువాత వచ్చేది మా టైమ్' అని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఏకగ్రీవం కారాదని, అలాంటి చోట ఇన్ఛార్జులకు MLA సీటు ఉండదని స్పష్టం చేశారు.
    1
    వైసీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్
గుంటూరు :పదవిని దుర్వినియోగం చేసే అధికారులు భవిష్యత్తులో ఎక్కడున్నా శిక్ష తప్పదని YCP చీఫ్ జగన్ హెచ్చరించారు. 'తప్పు చేసే వారి పేర్లు డిజిటల్ బుక్లోకి ఎక్కించండి. న్యాయంగా ఎన్నికలు జరిపించాలి. లేదు మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. ఇప్పుడు మీ టైమ్ నడుస్తోంది. ఆ తరువాత వచ్చేది మా టైమ్' అని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఏకగ్రీవం కారాదని, అలాంటి చోట ఇన్ఛార్జులకు MLA సీటు ఉండదని స్పష్టం చేశారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    14 hrs ago
  • ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    3
    ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి  దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • *దాములూరులో విజయవంతంగా ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన సదస్సు* *​ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా):* ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, వెస్ట్ జోన్ డిసిపి జి. రామకృష్ణ, వెస్ట్ డివిజన్ ఏసిపి దుర్గారావు పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో 24 ఆగస్టు 2026 రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, ప్రత్యేక ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ. సుబ్రహ్మణ్యం, ఎస్ఐ బి. రాజు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ​గ్రామస్తుల రక్షణ, భద్రత మరియు చైతన్యం లక్ష్యంగా నిర్వహించిన ఈ సదస్సులో పలు కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు: ​సైబర్ క్రైమ్స్: ఆన్‌లైన్ మోసాలు, అపరిచితులతో ఓటిపి (OTP) షేర్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు మరియు గుర్తుతెలియని లింకుల (Links) పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ​ఈగల్ ఛాలెంజ్: డిజిటల్ భద్రతను పెంపొందించుకోవడంలోనూ, సైబర్ నేరాల నివారణలోనూ యువత మరియు గ్రామస్తులు చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ​పంచాయతీ ఎన్నికలు: రాబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు గొడవలు లేకుండా పూర్తి చేసుకునేందుకు గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. ​ఈ సందర్భంగా డిసిపి జి. రామకృష్ణ మాట్లాడుతూ— రాత్రి వేళల్లో పోలీసు అధికారులే స్వయంగా గ్రామంలో ఉంటూ (పల్లె నిద్ర), ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం మరియు స్థానిక శాంతిభద్రతలను పర్యవేక్షించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    *దాములూరులో విజయవంతంగా ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన సదస్సు*


*​ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా):*
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, వెస్ట్ జోన్ డిసిపి జి. రామకృష్ణ, వెస్ట్ డివిజన్ ఏసిపి దుర్గారావు పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో 24 ఆగస్టు 2026 రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, ప్రత్యేక ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ. సుబ్రహ్మణ్యం, ఎస్ఐ బి. రాజు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
​గ్రామస్తుల రక్షణ, భద్రత మరియు చైతన్యం లక్ష్యంగా నిర్వహించిన ఈ సదస్సులో పలు కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు:
​సైబర్ క్రైమ్స్: ఆన్‌లైన్ మోసాలు, అపరిచితులతో ఓటిపి (OTP) షేర్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు మరియు గుర్తుతెలియని లింకుల (Links) పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వివరించారు.
​ఈగల్ ఛాలెంజ్: డిజిటల్ భద్రతను పెంపొందించుకోవడంలోనూ, సైబర్ నేరాల నివారణలోనూ యువత మరియు గ్రామస్తులు చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
​పంచాయతీ ఎన్నికలు: రాబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు గొడవలు లేకుండా పూర్తి చేసుకునేందుకు గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు.
​ఈ సందర్భంగా డిసిపి జి. రామకృష్ణ మాట్లాడుతూ— రాత్రి వేళల్లో పోలీసు అధికారులే స్వయంగా గ్రామంలో ఉంటూ (పల్లె నిద్ర), ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం మరియు స్థానిక శాంతిభద్రతలను పర్యవేక్షించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • జాలలపాలెం అటవీ భూముల ఆక్రమణపై చర్యలు కోరుతూ ప్రజా సంఘంగాలు ధర్నా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలలపాలెం గ్రామంలో అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఎర్రచందనం చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేటలోని జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారికి అర్జీ సమర్పించారు.జాలలపాలెం పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమించారని, అటవీ భూముల్లో ఎర్రచందనం తదితర చెట్లను నరికివేస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఆక్రమిత భూములను వెంటనే స్వాధీనం చేసుకుని అటవీ సంపద, వన్యప్రాణులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు.
    1
    జాలలపాలెం అటవీ భూముల ఆక్రమణపై చర్యలు కోరుతూ ప్రజా సంఘంగాలు ధర్నా
వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలలపాలెం గ్రామంలో అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఎర్రచందనం చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేటలోని జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారికి అర్జీ సమర్పించారు.జాలలపాలెం పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమించారని, అటవీ భూముల్లో ఎర్రచందనం తదితర చెట్లను నరికివేస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఆక్రమిత భూములను వెంటనే స్వాధీనం చేసుకుని అటవీ సంపద, వన్యప్రాణులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు.
    user_Orsu Krishna
    Orsu Krishna
    Social worker పిడుగురాళ్ల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా... బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    1
    అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా...
బస్సులో 80 మంది.. 🚍
ఇద్దరే పురుషులు.. 
కండక్టర్ వీడియో వైరల్

TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • రాజుపాలెం లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక అలంకారం చేసి ఆకు పూజ జరిపించారు. పరిసర ప్రాంతాలలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి కయా కర్పూరం సమర్పించారు. అనంతరం దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు
    1
    రాజుపాలెం లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు 
పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక అలంకారం చేసి ఆకు పూజ జరిపించారు. పరిసర ప్రాంతాలలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి కయా కర్పూరం సమర్పించారు. అనంతరం దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • 18 ఏళ్లు నిండిన ప్రతి యువతకు R&R ప్యాకేజీ కల్పించి, వారి భవిష్యత్తుకు న్యాయం చేయాలి. ఇది భిక్షం కాదు — మా న్యాయమైన హక్కు! 18 ఏళ్లు నిండిన ప్రతి యువతకు R&R ప్యాకేజీ కల్పించి, వారి భవిష్యత్తుకు న్యాయం చేయాలి. ఇది భిక్షం కాదు — మా న్యాయమైన హక్కు! 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హ నిర్వాసిత యువతి, యువకుడికి R&R ప్యాకేజీ ఇవ్వాలి. 2019లో కట్‌ఆఫ్ తేదీ ప్రకటించిన తర్వాత కూడా మమ్మల్ని ఖాళీ చేయించకుండా, మా అమ్మానాన్నలకు రావాల్సిన నష్టపరిహారం కూడా పూర్తిగా అందకపోవడం మా తప్పా? ఏళ్లుగా మేము ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు మా ఇళ్లను ఖాళీ చేయమంటున్నారు. మరి మా భవిష్యత్తు పరిస్థితి ఏమిటి? మా త్యాగానికి న్యాయం చేయండి. 18+ అర్హ నిర్వాసిత యువతకు R&R విషయంలో న్యాయం చేయండి. 🙏✊
    1
    18 ఏళ్లు నిండిన ప్రతి యువతకు R&R ప్యాకేజీ కల్పించి, వారి భవిష్యత్తుకు న్యాయం చేయాలి. ఇది భిక్షం కాదు — మా న్యాయమైన హక్కు! 


18 ఏళ్లు నిండిన ప్రతి యువతకు R&R ప్యాకేజీ కల్పించి, వారి భవిష్యత్తుకు న్యాయం చేయాలి. ఇది భిక్షం కాదు — మా న్యాయమైన హక్కు! 
18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హ నిర్వాసిత యువతి, యువకుడికి R&R ప్యాకేజీ ఇవ్వాలి.
2019లో కట్‌ఆఫ్ తేదీ ప్రకటించిన తర్వాత కూడా మమ్మల్ని ఖాళీ చేయించకుండా, మా అమ్మానాన్నలకు రావాల్సిన నష్టపరిహారం కూడా పూర్తిగా అందకపోవడం మా తప్పా?
ఏళ్లుగా మేము ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు మా ఇళ్లను ఖాళీ చేయమంటున్నారు. మరి మా భవిష్యత్తు పరిస్థితి ఏమిటి?
మా త్యాగానికి న్యాయం చేయండి.
18+ అర్హ నిర్వాసిత యువతకు R&R విషయంలో న్యాయం చేయండి. 🙏✊
    user_Bollavaram Mallikarjuna
    Bollavaram Mallikarjuna
    పెద అరవీడు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • రెడ్డి, చౌదరి అనేది కులం కాదు రెడ్డి చౌదరి అనేది కులం కాదు అది పూర్వకాలంలో పన్నులు వసూలు చేసే వారి పేర్లు.ఈ రోజుల్లో రెడ్డి, చౌదరి అని కుల సంఘాలు పెట్టుకొని ఇతరులను చిన్నచూపు చూస్తూ వారి జ్ఞానవంతులని పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఈ అజ్ఞానాన్ని దూరం చేస్తూ ప్రతి ఒక్కరు రెడ్డి, చౌదరి తమ పిల్లలకు పేర్లు పెట్టాలి.
    1
    రెడ్డి, చౌదరి అనేది కులం కాదు 
రెడ్డి చౌదరి అనేది కులం కాదు అది పూర్వకాలంలో పన్నులు వసూలు చేసే వారి పేర్లు.ఈ రోజుల్లో రెడ్డి, చౌదరి అని కుల సంఘాలు పెట్టుకొని ఇతరులను చిన్నచూపు చూస్తూ వారి జ్ఞానవంతులని పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఈ అజ్ఞానాన్ని దూరం చేస్తూ ప్రతి ఒక్కరు రెడ్డి, చౌదరి 
తమ పిల్లలకు పేర్లు పెట్టాలి.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.