logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆదివాసుల హక్కులు సాధించేంతవరకు పోరాటం కొనసాగుతుంది.... ADB: ఆదివాసీల హక్కులను సాధించేవరకు పోరాటం కొనసాగుతుందని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ అన్నారు. ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఉట్నూర్ మండల కేంద్రంలో ఆదివాసీ మార్చ్ నిర్వహించారు. పోడు భూములకు పట్టాలు, అర్హత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడం, ఏజెన్సీ ఏరియాలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

8 hrs ago
user_Mallaiah Potta
Mallaiah Potta
Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
8 hrs ago

ఆదివాసుల హక్కులు సాధించేంతవరకు పోరాటం కొనసాగుతుంది.... ADB: ఆదివాసీల హక్కులను సాధించేవరకు పోరాటం కొనసాగుతుందని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ అన్నారు. ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఉట్నూర్ మండల కేంద్రంలో ఆదివాసీ మార్చ్ నిర్వహించారు. పోడు భూములకు పట్టాలు, అర్హత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడం, ఏజెన్సీ ఏరియాలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

More news from Telangana and nearby areas
  • కలెక్టరేట్‌లో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం నిర్మల్ కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిళ పాల్గొన్నారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ప్రభుత్వ విప్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గేయం, జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను విప్ వివరించారు. ఉద్యానవన పంటల అభివృద్ధికి కృషి చేసిన మండల వ్యవసాయ అధికారులను అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారు పుట్ట సుమన్‌కు మంజూరైన ఎలక్ట్రిక్ ట్రాలీ ఆటోను ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కలెక్టర్ భవేశ్ మిశ్రా, అధికారులు కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డీఎఫ్‌ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, డీఆర్వో రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    3
    కలెక్టరేట్‌లో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం
నిర్మల్ కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిళ పాల్గొన్నారు.
ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ప్రభుత్వ విప్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గేయం, జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను విప్ వివరించారు.
ఉద్యానవన పంటల అభివృద్ధికి కృషి చేసిన మండల వ్యవసాయ అధికారులను అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
అనంతరం మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారు పుట్ట సుమన్‌కు మంజూరైన ఎలక్ట్రిక్ ట్రాలీ ఆటోను ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కలెక్టర్ భవేశ్ మిశ్రా, అధికారులు కలిసి అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డీఎఫ్‌ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, డీఆర్వో రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    user_Venu
    Venu
    Nirmal U, Telangana•
    2 hrs ago
  • భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కించపరిచే విధంగా పోస్టులు చేసిన హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిర్మల్ జిల్లా *ఖబడ్దార్ హమారా ప్రసాద్* *అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి* *హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం* నిర్మల్, సెప్టెంబర్ 16, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కించపరిచే విధంగా పోస్టులు చేసిన హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ.. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై ప్రభుత్వం, పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలని కోరారు.అనంతరం హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంటోళ్ల వెంకటస్వామి, కొంతం మురళీధర్, ఎలమల రాజేశ్వర్, ఎలమల ప్రభాకర్, ఆకుల రమేష్, దరువు భోజన్న, సందీప్, మసీదు రమేష్, కప్పకంటి సురేష్, నరేందర్, సేపురి సిద్ధార్థ, రావుల వినేందర్, పురుషోత్తం, రాజలింగం, గుండా సతీష్, మాడస్తూ భూమేష్, బత్తుల రాజు, సంపత్, దినేష్, వినోద్, గంగాధర్, తదితర జిల్లా, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు. *ఆకట్టుకున్న దరువు భోజన్న* నిరసన కార్యక్రమంలో సారంగాపూర్ గ్రామానికి చెందిన ఉత్తమ కళాకారుడి అవార్డు, రివార్డు గ్రహీత, ప్రజా కళాకారుడు దరువు భోజన్న తనదైన ప్రత్యేక శైలిలో డప్పు వాయిద్యంతో ఆకట్టుకున్నారు. డప్పు దరువులతో కార్యక్రమంలో ఉత్సాహాన్ని నింపుతూ పాల్గొన్న వారిని ఉర్రూతలూగించారు. ఆయన కళా ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
    1
    భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కించపరిచే విధంగా పోస్టులు చేసిన హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
నిర్మల్ జిల్లా
*ఖబడ్దార్ హమారా ప్రసాద్*
*అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి*
*హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం*
నిర్మల్, సెప్టెంబర్ 16, 
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కించపరిచే విధంగా పోస్టులు చేసిన హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ.. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై ప్రభుత్వం, పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలని కోరారు.అనంతరం హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కుంటోళ్ల వెంకటస్వామి, కొంతం మురళీధర్, ఎలమల రాజేశ్వర్, ఎలమల ప్రభాకర్, ఆకుల రమేష్, దరువు భోజన్న, సందీప్, మసీదు రమేష్, కప్పకంటి సురేష్, నరేందర్, సేపురి సిద్ధార్థ, రావుల వినేందర్, పురుషోత్తం, రాజలింగం, గుండా సతీష్, మాడస్తూ భూమేష్, బత్తుల రాజు, సంపత్, దినేష్, వినోద్, గంగాధర్, తదితర జిల్లా, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
*ఆకట్టుకున్న దరువు భోజన్న*
నిరసన కార్యక్రమంలో సారంగాపూర్ గ్రామానికి చెందిన ఉత్తమ కళాకారుడి అవార్డు, రివార్డు గ్రహీత, ప్రజా కళాకారుడు దరువు భోజన్న తనదైన ప్రత్యేక శైలిలో డప్పు వాయిద్యంతో ఆకట్టుకున్నారు. డప్పు దరువులతో కార్యక్రమంలో ఉత్సాహాన్ని నింపుతూ పాల్గొన్న వారిని ఉర్రూతలూగించారు. ఆయన కళా ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
    user_Douda karthik
    Douda karthik
    Local News Reporter నిర్మల్ రూరల్, నిర్మల్, తెలంగాణ•
    20 hrs ago
  • జన్నారం మండలంలోని విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ జన్నారం: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని జన్నారం మండలంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి, విశ్వకర్మ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. సంఘం అధ్యక్షుడు కడర్ల నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సింగ్ ఓజి శ్రీనివాస్, కోశాధికారి కొత్త శ్రీనివాస్‌తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ ఐక్యత, సమాజ అభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
    1
    జన్నారం మండలంలోని విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ
జన్నారం: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని జన్నారం మండలంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి, విశ్వకర్మ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. సంఘం అధ్యక్షుడు కడర్ల నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సింగ్ ఓజి శ్రీనివాస్, కోశాధికారి కొత్త శ్రీనివాస్‌తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ ఐక్యత, సమాజ అభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • జన్నారంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల అధ్యక్షులు కడారి నర్సయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కులస్తులు గురువారం ఉదయం జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    జన్నారంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు
జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల అధ్యక్షులు కడారి నర్సయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కులస్తులు గురువారం ఉదయం జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం ఘటన: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్ పేలింది. కారణం: కారు క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాంతం: మహబూబాబాద్‌లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నష్టం: డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. ప్రస్తుత పరిస్థితి: భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్‌కు పయనమయ్యారు.
    1
    మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
ఘటన: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్ పేలింది.
కారణం: కారు క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రాంతం: మహబూబాబాద్‌లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
నష్టం: డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు.
ప్రస్తుత పరిస్థితి: భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్‌కు పయనమయ్యారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    1 hr ago
  • కొండాపూర్ గ్రామ పంచాయితిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుక తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జాతీయ జెండాను సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ఆవిష్కరించారు. అనంతరం గీతాలాపన చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నగేష్, వార్డు సభ్యులు భూమారావు, సుమన్, శ్రీధర్,FA సతీష్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు భాగమ్మ, ఆశ కార్యకర్తలు సుమలత, సువర్ణ, ఆయా స్రవంతి, కారోబార్ ప్రభాకర్ యువత గ్రామస్తులు పాల్గొన్నారు.
    1
    కొండాపూర్ గ్రామ పంచాయితిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుక
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జాతీయ జెండాను సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ఆవిష్కరించారు. అనంతరం గీతాలాపన చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నగేష్, వార్డు సభ్యులు భూమారావు, సుమన్, శ్రీధర్,FA సతీష్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు భాగమ్మ, ఆశ కార్యకర్తలు సుమలత, సువర్ణ, ఆయా స్రవంతి, కారోబార్ ప్రభాకర్ యువత గ్రామస్తులు పాల్గొన్నారు.
    user_M S SRIDHAR
    M S SRIDHAR
    Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • అనాధ శవానికి అంత్యక్రియలు చేసి ఉదారత చాటిన సొసైటీ సభ్యులు గత 10 రోజుల క్రితం రైల్వే స్టేషన్ సమీపంలో మరణించిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పట్టణంలోని రిమ్స్ శవాగారంలో పోలీసులు భద్రపరిచారు. అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు రాకపోవడంతో పోలీసులు మానవసేవే మాధవసేవ, బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు సమాచారం అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు ముందుకు వచ్చి ఆయనకు బుధవారం అంత్యక్రియలు చేసి ఉదారత చాటారు.
    1
    అనాధ శవానికి అంత్యక్రియలు చేసి ఉదారత చాటిన సొసైటీ సభ్యులు
గత 10 రోజుల క్రితం రైల్వే స్టేషన్ సమీపంలో మరణించిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పట్టణంలోని రిమ్స్ శవాగారంలో పోలీసులు భద్రపరిచారు. అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు రాకపోవడంతో పోలీసులు మానవసేవే మాధవసేవ, బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు సమాచారం అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు ముందుకు వచ్చి ఆయనకు బుధవారం అంత్యక్రియలు చేసి ఉదారత చాటారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • బెల్లంపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు నినాదాలతో ధర్నా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దని నినాదాలు చేశారు. యూనివర్సిటీలో విలీనం చేస్తే ఫీజుల భారం పెరిగి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    1
    బెల్లంపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు నినాదాలతో ధర్నా 
బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దని నినాదాలు చేశారు. యూనివర్సిటీలో విలీనం చేస్తే ఫీజుల భారం పెరిగి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    user_M S SRIDHAR
    M S SRIDHAR
    Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • బాసర మండల కేంద్రంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఎగురవేసిన నాయకులు..అధికారులు... నిర్మల్ జిల్లా // బాసర 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయి, నిజాం నిరంకుశ పాలన నుండి ప్రజలకు విముక్తి లభించిన రోజు : *తహసీల్దార్ పవన్ చంద్ర ఝకాటే...* 13 నెలల సాయుధ పోరాటం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా విముక్తి చేసిన రోజు : *ఎంపిడిఓ దేవేందర్* *ఈ రోజును ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమానత్వం అమల్లోకి వచ్చిన రోజు.. ప్రజా పాలన స్ఫూర్తితో అందరం కలిసి పని చేద్దాం. రాజ్యాంగ విలువలను కాపాడుదాం. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుదాం. : *సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్* బాసర లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం వేడుకలు.. ఆయా ప్రభుత్వ ప్రయివేట్ కార్యాలయాలు పాఠశాల ల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అధికారులు.. నాయకులు...
    1
    బాసర మండల కేంద్రంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఎగురవేసిన నాయకులు..అధికారులు...
నిర్మల్ జిల్లా // బాసర 
1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయి, నిజాం నిరంకుశ పాలన నుండి ప్రజలకు విముక్తి లభించిన రోజు : *తహసీల్దార్ పవన్ చంద్ర ఝకాటే...*
13 నెలల సాయుధ పోరాటం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా విముక్తి చేసిన రోజు : *ఎంపిడిఓ దేవేందర్*
*ఈ రోజును ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమానత్వం అమల్లోకి వచ్చిన రోజు..
ప్రజా పాలన స్ఫూర్తితో అందరం కలిసి పని చేద్దాం. రాజ్యాంగ విలువలను కాపాడుదాం. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుదాం. :
*సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్*
బాసర లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం వేడుకలు.. ఆయా ప్రభుత్వ ప్రయివేట్ కార్యాలయాలు పాఠశాల ల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అధికారులు.. నాయకులు...
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.