కలెక్టరేట్‌లో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం నిర్మల్ కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిళ పాల్గొన్నారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ప్రభుత్వ విప్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గేయం, జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను విప్ వివరించారు. ఉద్యానవన పంటల అభివృద్ధికి కృషి చేసిన మండల వ్యవసాయ అధికారులను అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారు పుట్ట సుమన్‌కు మంజూరైన ఎలక్ట్రిక్ ట్రాలీ ఆటోను ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కలెక్టర్ భవేశ్ మిశ్రా, అధికారులు కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డీఎఫ్‌ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, డీఆర్వో రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం నిర్మల్ కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిళ పాల్గొన్నారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ప్రభుత్వ విప్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం జాతీయ గేయం, జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను విప్ వివరించారు. ఉద్యానవన పంటల అభివృద్ధికి కృషి చేసిన మండల వ్యవసాయ అధికారులను అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం మహిళా, శిశు, దివ్యాంగుల
సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారు పుట్ట సుమన్‌కు మంజూరైన ఎలక్ట్రిక్ ట్రాలీ ఆటోను ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కలెక్టర్ భవేశ్ మిశ్రా, అధికారులు కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డీఎఫ్‌ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, డీఆర్వో రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కించపరిచే విధంగా పోస్టులు చేసిన హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిర్మల్ జిల్లా *ఖబడ్దార్ హమారా ప్రసాద్* *అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి* *హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం* నిర్మల్, సెప్టెంబర్ 16, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కించపరిచే విధంగా పోస్టులు చేసిన హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ.. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై ప్రభుత్వం, పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలని కోరారు.అనంతరం హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంటోళ్ల వెంకటస్వామి, కొంతం మురళీధర్, ఎలమల రాజేశ్వర్, ఎలమల ప్రభాకర్, ఆకుల రమేష్, దరువు భోజన్న, సందీప్, మసీదు రమేష్, కప్పకంటి సురేష్, నరేందర్, సేపురి సిద్ధార్థ, రావుల వినేందర్, పురుషోత్తం, రాజలింగం, గుండా సతీష్, మాడస్తూ భూమేష్, బత్తుల రాజు, సంపత్, దినేష్, వినోద్, గంగాధర్, తదితర జిల్లా, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు. *ఆకట్టుకున్న దరువు భోజన్న* నిరసన కార్యక్రమంలో సారంగాపూర్ గ్రామానికి చెందిన ఉత్తమ కళాకారుడి అవార్డు, రివార్డు గ్రహీత, ప్రజా కళాకారుడు దరువు భోజన్న తనదైన ప్రత్యేక శైలిలో డప్పు వాయిద్యంతో ఆకట్టుకున్నారు. డప్పు దరువులతో కార్యక్రమంలో ఉత్సాహాన్ని నింపుతూ పాల్గొన్న వారిని ఉర్రూతలూగించారు. ఆయన కళా ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.1
- జన్నారం మండలంలోని విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ జన్నారం: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని జన్నారం మండలంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి, విశ్వకర్మ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. సంఘం అధ్యక్షుడు కడర్ల నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సింగ్ ఓజి శ్రీనివాస్, కోశాధికారి కొత్త శ్రీనివాస్‌తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ ఐక్యత, సమాజ అభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.1
- జన్నారంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల అధ్యక్షులు కడారి నర్సయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కులస్తులు గురువారం ఉదయం జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.1
- ఆదివాసుల హక్కులు సాధించేంతవరకు పోరాటం కొనసాగుతుంది.... ADB: ఆదివాసీల హక్కులను సాధించేవరకు పోరాటం కొనసాగుతుందని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ అన్నారు. ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఉట్నూర్ మండల కేంద్రంలో ఆదివాసీ మార్చ్ నిర్వహించారు. పోడు భూములకు పట్టాలు, అర్హత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడం, ఏజెన్సీ ఏరియాలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.2
- గుర్తుతెలియని వ్యక్తికి అంత్యక్రియలు మానవత్వం చాటిన మానవసేవే మాధవసేవ సంస్థ ఆదిలాబాద్: పట్టణంలోని రైల్వే క్వార్టర్స్‌లో వారం రోజుల క్రితం మృతిచెందిన గుర్తుతెలియని వ్యక్తికి ‘మానవసేవే మాధవసేవ’ సంస్థ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. బంధువుల కోసం మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. టూటౌన్ సీఐ ద్వారా సమాచారం తెలుసుకున్న సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చి స్థానిక తీర్పెల్లి హిందూ వైకుంఠధామంలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. రెడ్‌క్రాస్ సొసైటీ మాజీ జనరల్ సెక్రటరీ రామ్‌చందర్ మహాత్మే దాతగా నిలిచారు. కార్యక్రమంలో శశికళ, శ్రీపాదవార్ శ్రీనివాస్, అబ్దుల్ అజీజ్, సవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.1
- సెప్టెంబర్ 16, 2026_ఆదిలాబాదు: *ఆధునిక రుగ్మతలకు చిరుధాన్యాలే ఔషధం: కలెక్టర్ రాజర్షిషా* *సిరికొండలో ఘనంగా ‘ఆదివాసీ ఆహార వైభవం’* పత్రిక ప్రకటన ఆదివాసీల సాంప్రదాయ ఆహార అలవాట్లు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులే సమాజ ఆరోగ్యానికి నిజమైన రక్ష అని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. బుధవారం సిరికొండ మండలం నారాయణపూర్‌లో ఆర్‌పీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ ఆహార వైభవం’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదివాసీల సాంప్రదాయ ఆహార అలవాట్లు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులే సమాజ ఆరోగ్యానికి నిజమైన రక్ష అని, నేటి ఆధునిక జీవనశైలిలో తలెత్తుతున్న పలు అనారోగ్య సమస్యలను అధిగమించాలంటే మళ్లీ సంప్రదాయ ఆహార విధానాల వైపు మళ్లక తప్పదని అన్నారు. మన పూర్వీకులు అందించిన సహజసిద్ధమైన ఆహార ధాన్యాలు, చిరుధాన్యాల వినియోగంతో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. సుస్థిర భవిష్యత్తు కోసం పర్యావరణహిత సేంద్రీయ సాగును, మిల్లెట్ల ఉత్పత్తిని పెద్దఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీల విలక్షణ జీవన సంస్కృతిని, బలవర్ధక ఆహారాన్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తూ, గిరిజనుల ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేస్తున్న ఆర్‌పీజీ ఫౌండేషన్ బృందాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఫుడ్ ఫెస్టివల్’ స్టాల్ లను కలెక్టర్ సందర్శించి, స్థానిక చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలతో రూపొందించిన పోషకాలతో కూడిన వంటకాల వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేసి, మొక్కను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, ఉద్యానవన శాఖ అధికారి సందీప్ కుమార్, ఆర్‌పీజీ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీకర్‌రెడ్డి, తెలంగాణ ప్రోగ్రామ్ అధికారి జి.రవికుమార్, స్థానిక సర్పంచ్ విమలాబాయి, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పరిసర గ్రామాల రైతులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.1
- *కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చేసే ఆందోళన - పోరాటాలపై పెడుతున్న ఆంక్షలు-నిర్భంధాల ఖండిస్తున్నాం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు సామూహిక నిరసన దీక్షలు సందర్భంగా బొమ్మెనసురేష్ CITU జిల్లా ప్రధాన కార్యదర్శి*మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి అనేక హమీలు ఇచ్చి అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినప్పటికీ, కార్మిక వర్గానికి ఇచ్చిన హమీల అమలు పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. దీనితో కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన -పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాటు వివిధ జిల్లాల్లో తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కనీసం ధర్నా చేసుకునేందుకు కూడా అనుమతిని నిరాకరిస్తున్నారు. ఇది సబబు కాదు, 2026 సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన అంగన్వాడీ, ఆశా రెండు సంఘాల "ఛలో హైదరాబాద్" పిలుపులను భగ్నం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ పడరాని పాట్లు పడింది. వివిధ జిల్లాల్లో నాయకులను ఇండ్ల వద్దే ముందు రోజు రాత్రే అరెస్టులు చేశారు. సిఐటియు రాష్ట్ర నాయకులను సైతం తెల్లవారిఝూము నుండే వేటాడారు, వందలాది మంది పోలీసులు తమ బలగాలతో వచ్చి అక్రమ ముందస్తు అరెస్ట్లకు పాల్పడుతున్నారు. పోలీసుల ఈ చర్యల మూలంగా ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా పనిచేస్తున్న సిఐటియు నాయకులను సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించడమే. రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్భంధం, అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ సెప్టెంబర్ 16 జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరసన దీక్షలు చేయాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందు సామూహిక దీక్షలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో, *సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు క్లైమెంటు వెస్లీ,ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు, పి సుజాత, జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ సుగుణ, విజయ,నంద ఇంద్రమాల, మౌనిక, కోశాధికారి లక్ష్మి, అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు B.లలిత, జిల్లా ఉపాధ్యక్షులు కవిత, భాగ్య,కళ గంగామణి, వనజ,లావణ్య, మద్దతుగా, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తొడసo.శంభు* తదితరులు పాల్గొన్నారు,1
- అనాధ శవానికి అంత్యక్రియలు చేసి ఉదారత చాటిన సొసైటీ సభ్యులు గత 10 రోజుల క్రితం రైల్వే స్టేషన్ సమీపంలో మరణించిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పట్టణంలోని రిమ్స్ శవాగారంలో పోలీసులు భద్రపరిచారు. అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు రాకపోవడంతో పోలీసులు మానవసేవే మాధవసేవ, బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు సమాచారం అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు ముందుకు వచ్చి ఆయనకు బుధవారం అంత్యక్రియలు చేసి ఉదారత చాటారు.1
- *రిమ్స్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆకస్మిక సందర్శన* *రిమ్స్ లో అందజేస్తున్న మధ్యాహ్న భోజన పరిశీలన* *నాణ్యమైన వైద్యంతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలి* *రిమ్స్ డైరెక్టర్ కు అనిల్ జాదవ్ పలు సూచనలు* *ఆదిలాబాద్ పట్టణంలో గల రిమ్స్ ఆసుపత్రిని బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందజేస్తున్న వైద్యంతో పాటు ఆహారాన్ని పరిశీలించారు. స్థానిక రోగుల సహాయకులతో మాట్లాడుతూ ఆహార నాణ్యత గురించి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన పైటనే విట్ఠల్ గారిని పరామర్శించి వారి ఆరోగ్య బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జేసింగ్ రాథోడ్ ను ఆదేశించారు. వీరి వెంట తిరుమల గౌడ్, రవి నాయక్, రాథోడ్ భీంరావ్, దేవేందర్ రెడ్డి, భూమన్న, సుజీల్ తదితరులు ఉన్నారు*3