logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కించపరిచే విధంగా పోస్టులు చేసిన హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిర్మల్ జిల్లా *ఖబడ్దార్ హమారా ప్రసాద్* *అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి* *హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం* నిర్మల్, సెప్టెంబర్ 16, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కించపరిచే విధంగా పోస్టులు చేసిన హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ.. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై ప్రభుత్వం, పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలని కోరారు.అనంతరం హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంటోళ్ల వెంకటస్వామి, కొంతం మురళీధర్, ఎలమల రాజేశ్వర్, ఎలమల ప్రభాకర్, ఆకుల రమేష్, దరువు భోజన్న, సందీప్, మసీదు రమేష్, కప్పకంటి సురేష్, నరేందర్, సేపురి సిద్ధార్థ, రావుల వినేందర్, పురుషోత్తం, రాజలింగం, గుండా సతీష్, మాడస్తూ భూమేష్, బత్తుల రాజు, సంపత్, దినేష్, వినోద్, గంగాధర్, తదితర జిల్లా, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు. *ఆకట్టుకున్న దరువు భోజన్న* నిరసన కార్యక్రమంలో సారంగాపూర్ గ్రామానికి చెందిన ఉత్తమ కళాకారుడి అవార్డు, రివార్డు గ్రహీత, ప్రజా కళాకారుడు దరువు భోజన్న తనదైన ప్రత్యేక శైలిలో డప్పు వాయిద్యంతో ఆకట్టుకున్నారు. డప్పు దరువులతో కార్యక్రమంలో ఉత్సాహాన్ని నింపుతూ పాల్గొన్న వారిని ఉర్రూతలూగించారు. ఆయన కళా ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

6 hrs ago
user_Douda karthik
Douda karthik
Local News Reporter నిర్మల్ రూరల్, నిర్మల్, తెలంగాణ•
6 hrs ago

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కించపరిచే విధంగా పోస్టులు చేసిన హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిర్మల్ జిల్లా *ఖబడ్దార్ హమారా ప్రసాద్* *అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి* *హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం* నిర్మల్, సెప్టెంబర్ 16, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కించపరిచే విధంగా పోస్టులు చేసిన హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ.. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై ప్రభుత్వం, పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలని కోరారు.అనంతరం హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంటోళ్ల వెంకటస్వామి, కొంతం మురళీధర్, ఎలమల రాజేశ్వర్, ఎలమల ప్రభాకర్, ఆకుల రమేష్, దరువు భోజన్న, సందీప్, మసీదు రమేష్, కప్పకంటి సురేష్, నరేందర్, సేపురి సిద్ధార్థ, రావుల వినేందర్, పురుషోత్తం, రాజలింగం, గుండా సతీష్, మాడస్తూ భూమేష్, బత్తుల రాజు, సంపత్, దినేష్, వినోద్, గంగాధర్, తదితర జిల్లా, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు. *ఆకట్టుకున్న దరువు భోజన్న* నిరసన కార్యక్రమంలో సారంగాపూర్ గ్రామానికి చెందిన ఉత్తమ కళాకారుడి అవార్డు, రివార్డు గ్రహీత, ప్రజా కళాకారుడు దరువు భోజన్న తనదైన ప్రత్యేక శైలిలో డప్పు వాయిద్యంతో ఆకట్టుకున్నారు. డప్పు దరువులతో కార్యక్రమంలో ఉత్సాహాన్ని నింపుతూ పాల్గొన్న వారిని ఉర్రూతలూగించారు. ఆయన కళా ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

More news from తెలంగాణ and nearby areas
  • CCI పరిశ్రమను పునరుద్ధరించేంతవరకు పోరాడదాం: దాసరి రమేష్ ఆదిలాబాద్ పట్టణంలో సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారంతో 39వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న సాధన సమితి సభ్యులు సీసీఐ ప్రారంభించే వరకు పోరాడదాం అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. సాధన కమిటీ సభ్యులు దాసరి రమేష్, జగన్ తదితరులు ఉన్నారు
    1
    CCI పరిశ్రమను పునరుద్ధరించేంతవరకు పోరాడదాం: దాసరి రమేష్
ఆదిలాబాద్ పట్టణంలో సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారంతో 39వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న సాధన సమితి సభ్యులు సీసీఐ ప్రారంభించే వరకు పోరాడదాం అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. సాధన కమిటీ సభ్యులు దాసరి రమేష్, జగన్ తదితరులు ఉన్నారు
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • *రిమ్స్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆకస్మిక సందర్శన* *రిమ్స్ లో అందజేస్తున్న మధ్యాహ్న భోజన పరిశీలన* *నాణ్యమైన వైద్యంతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలి* *రిమ్స్ డైరెక్టర్ కు అనిల్ జాదవ్ పలు సూచనలు* *ఆదిలాబాద్ పట్టణంలో గల రిమ్స్ ఆసుపత్రిని బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందజేస్తున్న వైద్యంతో పాటు ఆహారాన్ని పరిశీలించారు. స్థానిక రోగుల సహాయకులతో మాట్లాడుతూ ఆహార నాణ్యత గురించి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన పైటనే విట్ఠల్ గారిని పరామర్శించి వారి ఆరోగ్య బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జేసింగ్ రాథోడ్ ను ఆదేశించారు. వీరి వెంట తిరుమల గౌడ్, రవి నాయక్, రాథోడ్ భీంరావ్, దేవేందర్ రెడ్డి, భూమన్న, సుజీల్ తదితరులు ఉన్నారు*
    3
    *రిమ్స్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆకస్మిక సందర్శన*

*రిమ్స్ లో అందజేస్తున్న మధ్యాహ్న భోజన పరిశీలన*
*నాణ్యమైన వైద్యంతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలి*
*రిమ్స్ డైరెక్టర్ కు అనిల్ జాదవ్ పలు సూచనలు*
*ఆదిలాబాద్ పట్టణంలో గల రిమ్స్ ఆసుపత్రిని బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందజేస్తున్న వైద్యంతో పాటు ఆహారాన్ని పరిశీలించారు. స్థానిక రోగుల సహాయకులతో మాట్లాడుతూ ఆహార నాణ్యత గురించి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన పైటనే విట్ఠల్ గారిని పరామర్శించి వారి ఆరోగ్య బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జేసింగ్ రాథోడ్ ను ఆదేశించారు. వీరి వెంట తిరుమల గౌడ్, రవి నాయక్, రాథోడ్ భీంరావ్, దేవేందర్ రెడ్డి, భూమన్న, సుజీల్ తదితరులు ఉన్నారు*
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • ఉండం పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభం.. చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి: సర్పంచ్ మహేందర్ తలమడుగు: మండలంలోని ఉండం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంఈఓ వెంకట్రావు, కాంప్లెక్స్ హెచ్‌ఎం వాసుదేవ్, పాఠశాల హెచ్‌ఎం సారికతో పాటు గ్రామ సర్పంచ్ బొండ్ల మహేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొండ్ల మహేందర్ మాట్లాడుతూ.. చిన్నారులకు చిన్ననాటి నుంచే నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చన్నారు. ప్రీ-ప్రైమరీ విద్య ద్వారా పిల్లల్లో చదువుపై ఆసక్తి, సృజనాత్మకత, క్రమశిక్షణ పెంపొందుతాయని తెలిపారు. గ్రామంలోనే ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. పాఠశాల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని సర్పంచ్ మహేందర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తూ ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన అందించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ వెంకట్రావు సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం వాసుదేవ్, హెచ్‌ఎం సారిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
    1
    ఉండం పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభం.. చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి: సర్పంచ్ మహేందర్
తలమడుగు: మండలంలోని ఉండం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంఈఓ వెంకట్రావు, కాంప్లెక్స్ హెచ్‌ఎం వాసుదేవ్, పాఠశాల హెచ్‌ఎం సారికతో పాటు గ్రామ సర్పంచ్ బొండ్ల మహేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొండ్ల మహేందర్ మాట్లాడుతూ.. చిన్నారులకు చిన్ననాటి నుంచే నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చన్నారు. ప్రీ-ప్రైమరీ విద్య ద్వారా పిల్లల్లో చదువుపై ఆసక్తి, సృజనాత్మకత, క్రమశిక్షణ పెంపొందుతాయని తెలిపారు. గ్రామంలోనే ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. పాఠశాల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని సర్పంచ్ మహేందర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తూ ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన అందించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ వెంకట్రావు సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం వాసుదేవ్, హెచ్‌ఎం సారిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • బెల్లంపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు నినాదాలతో ధర్నా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దని నినాదాలు చేశారు. యూనివర్సిటీలో విలీనం చేస్తే ఫీజుల భారం పెరిగి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    1
    బెల్లంపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు నినాదాలతో ధర్నా 
బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దని నినాదాలు చేశారు. యూనివర్సిటీలో విలీనం చేస్తే ఫీజుల భారం పెరిగి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    user_M S SRIDHAR
    M S SRIDHAR
    Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ • గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ • గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష • వివిధ సంబంధిత శాఖల అధికారులతో కలిసి నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ • నిమజ్జన మార్గంలో ట్రాఫిక్, విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్ల పరిశీలన - అధికారులకు సూచనలు • నిమజ్జన ప్రదేశాల్లో గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు • గణేష్ నవరాత్రులు పూర్తయ్యే వరకు సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా • డీజేలకు స్వస్తి – సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని పిలుపు: జిల్లా ఎస్పీ కామారెడ్డి పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, , జిల్లా ఎస్పీ . రాజేష్ చంద్ర, బుధవారం పరిశీలించారు. తొలుత ట్రాఫిక్ గణపతిని దర్శించుకున్న అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు అధికారులు, మున్సిపల్ చైర్‌పర్సన్, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లతో కలిసి ప్రత్యేక బస్సులో నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించారు. కామారెడ్డి ఓల్డ్ బస్టాండ్ – ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ముఖ్య ప్రాంతాల గుండా బాంబే క్లాత్, పాన్ చౌరస్తా, బడా మసీద్, రైల్వే ఫ్లైఓవర్, నిజాంసాగర్ చౌరస్తా, న్యూ బస్టాండ్ మీదిగా నిమజ్జన మార్గాన్ని పరిశీలిస్తూ, నిమజ్జన ముగింపు ప్రదేశమైన టేకిర్యాల్ చెరువు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వరకు రూట్‌లోని అన్నీ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా నిమజ్జన రూట్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, రహదారుల పరిస్థితి, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, బారికేడ్లు, అత్యవసర మార్గాలు, విగ్రహాల తరలింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూట్‌లో గుర్తించిన సమస్యలను నిమజ్జన కార్యక్రమానికి ముందే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ సూచించారు. జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్, మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి తదితర అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన మార్గంలో భక్తులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ మరియు రహదారి సంబంధిత పనుల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు, భక్తులు మరియు ప్రజల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు మరియు వైద్య సహాయ బృందాలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా రెస్క్యూ వ్యవస్థను అందుబాటులో ఉంచాలని సూచించారు. నిమజ్జన రూట్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయడంతో పాటు, సీసీ కెమెరాలు మరియు డ్రోన్ల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ డీజేలకు స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుందామని జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. అధిక శబ్దంతో కూడిన డీజేల కారణంగా చిన్నపిల్లలు, విద్యార్థులు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అమలులో ఉన్న నిబంధనలు, ఆదేశాల మేరకు డీజేల వినియోగంపై నిషేధం అమల్లో ఉందని స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయ పద్ధతుల్లో, శాంతియుతంగా మరియు ఆనందోత్సాహాలతో నిర్వహించాలని, నిమజ్జన సమయంలో పోలీస్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సూచించే భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ కోరారు. నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ బి. నరహరి, కామారెడ్డి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి, మున్సిపల్ తదితర శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
•	గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష
కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
•	గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష
•	వివిధ సంబంధిత శాఖల అధికారులతో కలిసి నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ  
•	నిమజ్జన మార్గంలో ట్రాఫిక్, విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్ల పరిశీలన - అధికారులకు సూచనలు
•	నిమజ్జన ప్రదేశాల్లో గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు
•	గణేష్ నవరాత్రులు పూర్తయ్యే వరకు సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా
•	డీజేలకు స్వస్తి – సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని పిలుపు: జిల్లా ఎస్పీ
కామారెడ్డి పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్, , జిల్లా ఎస్పీ . రాజేష్ చంద్ర,  బుధవారం పరిశీలించారు.
తొలుత ట్రాఫిక్ గణపతిని దర్శించుకున్న అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు అధికారులు, మున్సిపల్ చైర్‌పర్సన్, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లతో కలిసి ప్రత్యేక బస్సులో నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించారు. కామారెడ్డి ఓల్డ్ బస్టాండ్ – ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ముఖ్య ప్రాంతాల గుండా బాంబే క్లాత్, పాన్ చౌరస్తా, బడా మసీద్, రైల్వే ఫ్లైఓవర్, నిజాంసాగర్ చౌరస్తా, న్యూ బస్టాండ్ మీదిగా నిమజ్జన మార్గాన్ని పరిశీలిస్తూ, నిమజ్జన ముగింపు ప్రదేశమైన టేకిర్యాల్ చెరువు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వరకు రూట్‌లోని అన్నీ ప్రాంతాలను సందర్శించారు.
ఈ సందర్భంగా నిమజ్జన రూట్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, రహదారుల పరిస్థితి, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, బారికేడ్లు, అత్యవసర మార్గాలు, విగ్రహాల తరలింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూట్‌లో గుర్తించిన సమస్యలను నిమజ్జన కార్యక్రమానికి ముందే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ  సూచించారు.
జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్,  మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి తదితర అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన మార్గంలో భక్తులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ మరియు రహదారి సంబంధిత పనుల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు  చేస్తున్నామని తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు, భక్తులు మరియు ప్రజల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు మరియు వైద్య సహాయ బృందాలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా రెస్క్యూ వ్యవస్థను అందుబాటులో ఉంచాలని సూచించారు. నిమజ్జన రూట్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయడంతో పాటు, సీసీ కెమెరాలు మరియు డ్రోన్ల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ డీజేలకు స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుందామని జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. అధిక శబ్దంతో కూడిన డీజేల కారణంగా చిన్నపిల్లలు, విద్యార్థులు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అమలులో ఉన్న నిబంధనలు, ఆదేశాల మేరకు డీజేల వినియోగంపై నిషేధం అమల్లో ఉందని స్పష్టం చేశారు.
గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయ పద్ధతుల్లో, శాంతియుతంగా మరియు ఆనందోత్సాహాలతో నిర్వహించాలని, నిమజ్జన సమయంలో పోలీస్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సూచించే భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ కోరారు. నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ బి. నరహరి, కామారెడ్డి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి, మున్సిపల్ తదితర శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లు పాల్గొన్నారు.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • వినాయక నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని ప్రేమ్ నగర్, బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె పలు శాఖల అధికారుల తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు.  అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వినాయక నిమజ్జనానికి కావలసిన నీటి సౌకర్యం, స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు, అగ్ని మాపక శాఖ అధికారులు సేవలు అందించాలని, పారిశుధ్య పనులు చేయించాలని, క్రేన్లు అందుబాటులో పెట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రాచారి, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
    1
    వినాయక నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె
వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని ప్రేమ్ నగర్, బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె పలు శాఖల అధికారుల తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు.  ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు.  
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వినాయక నిమజ్జనానికి కావలసిన నీటి సౌకర్యం, స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు, అగ్ని మాపక శాఖ అధికారులు సేవలు అందించాలని, పారిశుధ్య పనులు చేయించాలని, క్రేన్లు అందుబాటులో పెట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రాచారి, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    40 min ago
  • రిమ్స్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన బోథ్ MLA అనిల్ జాదవ్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని బోథ్ MLA అనిల్ జాదవ్ బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులను కలిసి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఆదేశించారు.
    3
    రిమ్స్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన బోథ్ MLA అనిల్ జాదవ్
జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని బోథ్ MLA అనిల్ జాదవ్ బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులను కలిసి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఆదేశించారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • *​ (ప్రభుత్వం ముందు ఉంచిన ప్రధాన డిమాండ్లు):* *​2016 దివ్యాంగుల హక్కుల చట్టం పూర్తి అమలు* రాష్ట్రంలో దివ్యాంగుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. దీనికై ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) అధ్యక్షతన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలి. ​దివ్యాంగులందరికీ ఉచితంగా 'ఇంద్రమ్మ ఇళ్లు': సురక్షితమైన నివాసం మరియు ఆత్మగౌరవం కోసం ప్రతి దివ్యాంగుడికీ ఉచితంగా 'ఇంద్రమ్మ ఇల్లు' మంజూరు చేయాలి. ​పెన్షన్ల పెంపు: దివ్యాంగుల పెన్షన్‌ను ₹6,000కు, అలాగే తీవ్ర వైకల్యం కలిగిన వారికి ₹15,000కు తక్షణమే పెంచాలి. ​బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ: ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి. ​ఉచిత ప్రయాణ సౌకర్యం: ఆర్టీసీ బస్సులతో పాటు హెచ్‌ఎంఆర్ (HMR) మెట్రో రైళ్లలో కూడా దివ్యాంగులందరికీ ఉచిత పాస్ సౌకర్యం కల్పించాలి. ​స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు: స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, నామినేటెడ్ పదవుల్లో తగిన అవకాశం ఇవ్వాలి. ​స్వతంత్ర కార్యాలయాల ఏర్పాటు: జీవో 34 ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దివ్యాంగుల వ్యవహారాల కోసం ప్రత్యేక స్వతంత్ర కార్యాలయాలను ఏర్పాటు చేయాలి. ​ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం: దివ్యాంగ విద్యార్థులకు సరైన విద్య అందించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన (Special Education) ఉపాధ్యాయులను నియమించాలి. ​సదరమ్ (SADAREM) సేవల మార్పు: రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆర్థోపెడిక్ సదరన్ క్యాంపులను హైదరాబాద్‌కు మార్చి, దివ్యాంగులకు సేవలను మరింత చేరువ చేయాలి.
    3
    *​ (ప్రభుత్వం ముందు ఉంచిన ప్రధాన డిమాండ్లు):* 

*​2016 దివ్యాంగుల హక్కుల చట్టం పూర్తి అమలు*

రాష్ట్రంలో దివ్యాంగుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. దీనికై ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) అధ్యక్షతన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలి.
​దివ్యాంగులందరికీ ఉచితంగా 'ఇంద్రమ్మ ఇళ్లు': సురక్షితమైన నివాసం మరియు ఆత్మగౌరవం కోసం ప్రతి దివ్యాంగుడికీ ఉచితంగా 'ఇంద్రమ్మ ఇల్లు' మంజూరు చేయాలి.
​పెన్షన్ల పెంపు: దివ్యాంగుల పెన్షన్‌ను ₹6,000కు, అలాగే తీవ్ర వైకల్యం కలిగిన వారికి ₹15,000కు తక్షణమే పెంచాలి.
​బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ: ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి.
​ఉచిత ప్రయాణ సౌకర్యం: ఆర్టీసీ బస్సులతో పాటు హెచ్‌ఎంఆర్ (HMR) మెట్రో రైళ్లలో కూడా దివ్యాంగులందరికీ ఉచిత పాస్ సౌకర్యం కల్పించాలి.
​స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు: స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, నామినేటెడ్ పదవుల్లో తగిన అవకాశం ఇవ్వాలి.
​స్వతంత్ర కార్యాలయాల ఏర్పాటు: జీవో 34 ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దివ్యాంగుల వ్యవహారాల కోసం ప్రత్యేక స్వతంత్ర కార్యాలయాలను ఏర్పాటు చేయాలి.
​ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం: దివ్యాంగ విద్యార్థులకు సరైన విద్య అందించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన (Special Education) ఉపాధ్యాయులను నియమించాలి.
​సదరమ్ (SADAREM) సేవల మార్పు: రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆర్థోపెడిక్ సదరన్ క్యాంపులను హైదరాబాద్‌కు మార్చి, దివ్యాంగులకు సేవలను మరింత చేరువ చేయాలి.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • ముల్కలపేట–రాచర్ల మార్గంలో అప్రోచ్ రోడ్డుకు పగుళ్లు మరమ్మత్తులు చేపట్టాలని సూచన ముల్కలపేట–రాచర్ల గ్రామాల మధ్య మంగలి ఒర్రెపై నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న అప్రోచ్ రోడ్డులో పగుళ్లు ఏర్పడ్డాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తైన కొద్దికాలానికే రహదారిపై పగుళ్లు కనిపించడంతో స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజూ ద్విచక్ర వాహనాలు, ఆటోలు తదితర వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పగుళ్లకు మరమ్మతులు చేపట్టి రహదారిని సురక్షితంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    ముల్కలపేట–రాచర్ల మార్గంలో అప్రోచ్ రోడ్డుకు పగుళ్లు మరమ్మత్తులు చేపట్టాలని సూచన
ముల్కలపేట–రాచర్ల గ్రామాల మధ్య మంగలి ఒర్రెపై నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న అప్రోచ్ రోడ్డులో పగుళ్లు ఏర్పడ్డాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తైన కొద్దికాలానికే రహదారిపై పగుళ్లు కనిపించడంతో స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజూ ద్విచక్ర వాహనాలు, ఆటోలు తదితర వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పగుళ్లకు మరమ్మతులు చేపట్టి రహదారిని సురక్షితంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.
    user_M S SRIDHAR
    M S SRIDHAR
    Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.